సీబీఐ అటు నుంచి నరుక్కొస్తోందా?!

Publish Date:Jul 25, 2022

Advertisement

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు రాష్ట్ర వ్యాప్తంగానే కాదు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ కేసు దర్యాప్తులో తిరిగినన్ని, తిరుగుతున్నన్ని మలుపులు గతంలో ఏ కేసులోనూ జరిగి ఉండక పోవచ్చు. 2019 ఎన్నికలకు ముందు ఈ హత్య జరిగింది.

తన సొంత ఇంట్లో వివేకా హత్యకు గురయ్యారు. అప్పుడు తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి. వివేకా అన్న కొడుకు వైఎస్ జగన్ విపక్ష నేత. వివేకా మరణించారన్న వార్త బయటకు రాగానే ఆయన గుండె పోటుతో మరణించారంటూ జగన్, ఆయన అనుచరులు విజయసాయి తదితరులంతా ఒకరి తరువాత ఒకరు ప్రకటనలు గుప్పించేశారు. గంటల వ్యవధిలోనే వివేకా గుండె పోటుతో మరణించలేదు... ఆయన హత్యకు గురయ్యారన్నది వెల్లడైంది. అంతే జగన్ తదితరులందరి స్వరం మారిపోయింది. చంద్రబాబు, లోకేష్ ల హస్తం ఈ హత్య వెనుక ఉందంటూ విమర్శలు గుప్పించి.. ఎన్నికలలో సానుభూతి పవనాల కోసం తమ వంతు ప్రయత్నం చేసేశారు. ఆయన హత్యపై సీబీఐ విచారణకు స్వయంగా జగన్ డిమాండ్ చేశారు.

సరే ఆ తరువాత జగన్ ఎన్నికలలో విజయం సాధించారు. ముఖ్యమంత్రి అయ్యారు. ఆ తరువాత తన సొంత బాబాయ్ వివేకా హత్య కేసు విచారణను నీరుగార్చే ప్రయత్నాలు ప్రారంభించారు. బాబాయ్ హత్యపై సీబీఐ విచారణకు డిమాండ్ చేసిన ఆయనే అధికారంలోకి వచ్చాకా సీబీఐ విచారణ అవసరం లేదని అన్నారు. అయితే వివేకా కుమార్తె డాక్టర్ సునీతా రెడ్డి మాత్రం తన తండ్రి హత్య కేసులో  సీబీఐ విచారణ కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు. కోర్టు అందుకు అంగీకరించి కేసును సీబీఐకి అప్పగించింది. అయితే ఏపీలో సీబీఐ అయినా, అంత కంటే గోప్ప సంస్థైనా సరే చేయగలిగేదీ ఏదీ ఉండదని జగన్ సర్కార్ హయాంలో నిర్ద్వంద్వంగా రుజువైపోయింది.

కేసు దర్యాపు వేగంగా జరుగుతున్న సమయంలో సీబీఐకి బెదరింపులు వచ్చాయి. సీబీఐ అధికారులపైనే ప్రైవేటు కేసులు దాఖలయ్యాయి. వీటన్నిటి వెనుకా ఉన్నది వివేకా హత్య విచారణ సజావుగా సాగకుండా ఆపే యత్నమే. దీంతో గత కొంత కాలంగా సీబీఐ ఈ హత్య కేసు విషయంలో సైలెంటైపోయింది. అంతకు ముందు ఈ హత్య కేసులో అరెస్టయిన ఎవన్ ముద్దాయి ఎర్రగంగిరెడ్డి బెయిలు  రద్దు చేయాలంటూ సీబీఐ దాఖలు చేసిన పిటిషన్ ను హైకోర్టు కొట్టేసింది. అప్పటికే వివేకా హత్య కేసులో అనేక ఒత్తిళ్లను ఎదుర్కొంటున్న సీబీఐ విచారణ విషయంలో హఠాత్తుగా మౌనం వహించింది.

ఈ క్రమంలోనే ఈ కేసులో  కొందరు సాక్షులు అనుమానాస్పద స్థితిలో మరణించారు. ఈ పరిస్థితుల్లో గత కొంత కాలంగా మౌనంగా ఉన్న సీబీఐ హఠాత్తుగా ఎర్ర గంగిరెడ్డి బెయిలు రద్దు కోరుతూ సుప్రీంను ఆశ్రయించింది. ఎర్రగంగిరెడ్డి బెయిలుపై ఉంటే సాక్షులను బెదరించే, ప్రభావితం చేసే అవకాశాలున్నాయని ఆ పిటిషన్ లో పేర్కొంది. దీంతో ఇక వివేకా హత్య కేసు విచారణ వేగవంతం య్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కేసు విచారణలో ఎర్రగంగిరెడ్డి బెయిలు పిటిషన్ పై సుప్రీం నిర్ణయం అత్యంత కీలకం కానున్నద. 

By
en-us Political News

  
 ధనుష్‌ తన కొత్త రాజకీయ పార్టీ కోసం  తమిళగ ఎళుచ్చి కళగం అనే పేరును ఖరారు చేసినట్లు  ప్రచారం జరుగుతోంది. అలాగే.. ఈ పేరుతో ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం వద్ద పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా పూర్తయ్యిందని అంటున్నారు.
ఒక దశలో తన రిటైర్మెంట్ తరువాత టీడీపీలో చేరేందుకు కూడా తాను సిద్ధపడ్డాననీ, అవసరమైతే  ఎన్నికల బరిలో దిగడానికి కూడా రెడీ అయ్యాయనీ చెప్పిన ఏబీ వెంకటేశ్వరరావు, అ
బీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ప్రకాశ్ పాల్, ప్రముఖ దళిత నేత, మాజీ ఎంపీ విద్యాసాగర్ సోన్‌కర్, అలాగే అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రెండుసార్లు బాధ్యతలు నిర్వర్తించిన రాధాకాంత్ ఓఝా వంటి వారికి చోటు లభించింది.
జిల్లాలో పార్టీ పరిస్థితి వేగంగా దిగజారిపోతోంది. మజ్జి పార్టీని వీడటంతో జాగ్రత్త పడాల్సిన పార్టీ హైకమాండ్, అలాగే బొత్స సత్యనారాయణ చేతులెత్తేసినట్లు కనిపిస్తోంది. అంతే కాకుండా కూర్చున్న కొమ్మనే నరుక్కున్న చందంగా అసంతృప్తులను బుజ్జగించాల్సింది పోయి వారిపై సస్పెన్షన్ వేటు వేయడంతో జిల్లాలో పార్టీని జీరో నుంచి బిల్డ్ చేద్దామనుకుంటున్నారా? లేక జిల్లా పార్టీని వదిలేశారా అన్న అనుమానాలు పార్టీ శ్రేణుల నుంచే వస్తున్నాయి. 
ఆంధ్రప్రదేశ్ రాజకీయ రంగంలో ప్రతి క్షణం ఒక కొత్త మలుపు తిరుగుతోంది.
పొలిటికల్ సర్కిల్స్ లో గట్టిగా వ్యక్తం అవుతున్న అభిప్రాయం ఏమిటంటే.. మీడియా సమావేశాలలో జగన్ మాట్లాడే విధానం కంటే విజయసాయి రెడ్డి మాట్లాడే విధానం చాలా చాలా బెటర్ అని. 
అయితే ఆయన  తాజాగా   నిర్వహించిన కార్యకర్తల సమావేశం మాత్రం భిన్నంగా జరిగింది. ఆ సమావేశంలో ఆయన మాట్లాడిన మాటలు,  వ్యక్తం చేసిన అసహనం వైసీపీవర్గాలలో  కలకలం రేపింది. 
జనసేన, బీజేపీ నాయకులు ప్రభుత్వ కార్యక్రమాల్లో పెద్దగా భాగస్వాములు కావడం లేదు.  ప్రతి నెలా పెన్షన్ల పంపిణీలో టీడీపీ నేతలు, కార్యకర్తలు చురుకుగా పాల్గొంటుంటే.. జనసేన, బీజేపీ నాయకుల భాగస్వామ్యం నామమాత్రంగా ఉంటోందనీ, ఇది కూటమి పార్టీల మధ్య సమన్వయ లోపం ఉందా అన్న అనుమానాలను కలిగిస్తోందనీ సర్వేలో వెల్లడైన జనాభిప్రాయం. 
ఈ ప్రధాన పార్టీల వ్యూహాలకు తోడుగా మరికొన్ని రాజకీయ  పార్టీలో కూడా తమ ఉనికిని బలంగా చాటేందుకు ఖైరతాబాద్ ఉప ఎన్నిక బరిలోకి దిగడానికి సిద్ధమౌతున్నాయి. కల్వకుంట్ల కవిత నేతకూడా రంగంలోకి దిగుతుండటంతో పోటీ ఊహించని మలుపు తిరుగుతోంది.  
గత కొన్నేళ్లుగా  చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పలు సందర్భాల్లో ఒకే వేదికను పంచుకుంటూ వచ్చారు.  ముఖ్యమైన ప్రజా వేడుకల్లో వీరిద్దరూ కలసి పాల్గొనడం ఆనవాయితీగా మారింది. అయితే గత కొద్ది నెలలుగా ఇరువురూ ఒకే వేదికపై కనిపించడం లేదు. 
 విదేశీ పర్యటన ముగించుకుని ఇప్పటికే రాష్ట్రానికి తిరిగి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు,  తన విధుల్లోకి నిమగ్నమయ్యారు. నేరుగా నెల్లూరు జిల్లాకు చేరుకుని  పల్లె పండుగ కార్యక్రమంలో ఆయన ఉత్సాహంగా పాల్గొన్నారు.
రామాయణం ప్రకారం లంకకు బయలుదేరే ముందు శ్రీరాముడు స్వయంగా మహాదేవుడిని పూజించాడని, ఈ చారిత్రక, పౌరాణిక విషయాలపై  అవగాహన లేని రేవంత్ వంటి వారు ఇటువంటి కువిమర్శలు చేస్తున్నారని బీజేపీ నేతలు మండిపడుతున్నారు.
ప్రాథమిక దశలో ఈ మరణాన్ని సాధారణ గుండెపోటుగా చిత్రీకరించే ప్రయత్నాలు జరగడం, ఆ తర్వాత హత్యగా తేలింది.  వైఎస్ హత్య వెనుక కొన్ని పెద్ద తలకాయల  ప్రయోజనాలు దాగున్నాయని వైఎస్ వివేకా కుమార్తె బహిరంగంగానే ఆరోపించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.