విద్వేషం పెంచడమే కమలం రాజకీయమా?

Publish Date:Oct 8, 2022

Advertisement

ప్రజలలో విద్వేషాలను రెచ్చగొట్టడమే తమ రాజకీయం అన్నంతగా తెగిస్తోంది కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ. రాష్ట్రాలలో కూడా తమ అధికారాన్ని విస్తరించుకోవడానికి అదే మార్గం అన్న విశ్వాసంతో ముందుకు కదులుతున్నచందంగా ఉంది ఆ పార్టీ తీసుకుంటున్న నిర్ణయాలు చూస్తుంటే.

తెలంగాణలో ఎలాగైనా సరే పాగా వేయాలి, అధికారాన్ని అందుకోవాలన్న లక్ష్యంతో గత కొంత కాలంగా దూకుడుగా వ్యవహరిస్తున్న బీజేపీ ఇప్పుడు రజాకార్ల పేర సరికొత్త రాజకీయానికి తెరలేపుతోంది. నాటి రజాకార్ల అరాచకత్వాన్నిఇప్పటి ప్రజలకు కళ్లకు కట్టినట్లు చూపిస్తామంటూ సినిమాల నిర్మాణానికి రెడీ అవుతోంది. ఇప్పటికే బీజేపీ తెలంగాణ అధ్యక్షుడుబండి సంజయ్ పర్యవేక్షణలో  రజాకార్ అనే  పేరుతో ఒక సినిమా నిర్మాణంలో ఉందని చెబుతున్నారు.

ఇక కాశ్మీర్ ఫైల్స్ లా రజాకార్ ఫైల్స్ అనే సినిమా కోసం దర్శక దిగ్గజం రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ కథ రెడీ చేశారని చెబుతున్నారు. ఆ కథను స్వయంగా మోడీ విని ఓకే చేశారని కూడా అంటున్నారు. ముందుగా విజయేంద్ర ప్రసాద్ కు కేవలం ఐదు నిముషాల సమయం కేటాయించి అప్పాయింట్ మెంట్ ఇచ్చిన మోడీ.. కథ వింటూ దాదాపు అరగంట  వరకూ ఆ అప్పాయింట్ మెంట్ సమయాన్నిపొడిగించారని కూడా బీజేపీ శ్రేణులు అంటున్నాయి.  ఆ తరువాతే అమిత్ షా మోడీ సూచనల మేరకు తన హైదరాబాద్ పర్యటనలో నటుడు జూనియర్ ఎన్టీఆర్ తో భేటీ అయ్యారని కూడా బీజేపీ వర్గాలు చెబుతున్నాయి.

అప్పట్లో  ఇరువురి భేటీ తెలుగు రాష్ట్రాలలో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఆ    భేటీపై పలు రకాల ఊహాగానాలు పైతం వెల్లువెత్తాయి. జూనియర్ ఎన్టీఆర్ ను అమిత్ షా బీజేపీలోకి ఆహ్వానించారనీ, తెలంగాణ తెలుగుదేశం బాధ్యతలు చేపట్టాల్సిందిగా కోరారనీ.. ఇలా పలు రకాల  వాదనలు తెరపైకి వచ్చాయి.   అయితే ఎన్టీఆర్ తో భేటీపై అమిత్ షా ఒక ట్వీట్ చేస్తూ ఓ అద్భుత నటుడితో భేటీ ఎంతో సంతృప్తి నిచ్చిందని పేర్కొన్నారు.   బీజేపీ సీనియర్లు అయితే ఆర్ఆర్ఆర్ సినిమాలో ఎన్టీఆర్ నటనకు ఫిదా అయిన అమిత్ షా తన తెలంగాణ పర్యటనలో ఆయనతో భేటీ కావాలని భావించారని, అందుకే ఆయన ఎన్టీఆర్ ను ప్రత్యేకంగా ఆహ్వానించి మరీ భేటీ అయ్యారనీ చెప్పారు. అయితే అవన్నీ వాస్తవం కాదనీ,  మోడీ ఆదేశాల మేరకు రజాకార్ ఫైల్స్ సినిమాలో నటించేందుకు ఎన్టీఆర్ ను ఒప్పించేందుకే అమిత్ షా ఆయనతో సమావేశమయ్యారని అప్పట్లోనే పరిశీలకులు పేర్కొన్నారు.

తరువాత తరువాత రజాకార్ ఫైల్స్ సినిమాపై చర్చించేందుకే అమిత్ షా జూనియర్ ఎన్టీఆర్ తో భేటీ అయ్యారని రాజకీయ వర్గాలు ధృవీకరించాయి. రజాకార్ ఫైల్స్ సినిమా తెలంగాణలో బీజేపీ పలుకుబడి పెంచుతుందని బీజేపీ అగ్రనాయకత్వం భావిస్తోందని అంటున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ పోషించిన కొమురం భీం పాత్రకు సర్వత్రా ప్రశంసలు వచ్చిన సంగతి తెలిసిందే. అటువంటి జూనియర్ ఎన్టీఆర్ రాజాకార్ ఫైల్స్ సినిమాలో నటిస్తే కాశ్మీర్ ఫైల్స్ ను మించి ప్రజలను ఆకట్టుకుంటుందని బీజేపీ అగ్రనాయకత్వం భావిస్తున్నట్లు చెబుతున్నారు.

విజయేంద్ర ప్రసాద్ రజాకార్ ఫైల్స్ ను సినిమాతో ఆపేయకుండా వెబ్ సిరీస్ కూడా తీయాలన్న భావనతో ఉన్నారనీ, రెంటిలోనూ జూనియర్ ఎన్టీఆరే ముఖ్యపాత్ర పోషించే అవకాశం ఉందని  అప్పట్లో రాజకీయ, సినీ వర్గాలలో బాగా వినిపించింది. అయితే అటు బీజేపీ కానీ, ఇటు ఎన్టీఆర్ కానీ ఈ విషయాన్ని ధృవీకరించలేదు.  ఇప్పుడు మళ్లీ నటీనటుల ప్రస్తావన లేకపోయినా రజాకార్ ఫైల్స్ సినిమాను సాధ్యమైనంత త్వరగా సెట్స్ మీదకు తీసుకురావడానికి ప్రయత్నాలు ముమ్మరమయ్యాయని బీజేపీ వర్గాలే చెబుతున్నాయి.  

By
en-us Political News

  
సోషల్ మీడియాలో విపరీతంగా ఫాలోవర్స్, వ్యూయర్స్ సంపాదించాలనే పిచ్చి నేడు ఎంతోమంది యువతను తప్పుదారి పట్టిస్తోంది.
సొంత మేనకోడలు నిశ్చితార్థానికి వైఎస్ జగన్ హాజరుకాకపోవడంపై రాజకీయవర్గాలలోనే కాదు.. సామాన్య జనంలో కూడా చర్చ జరుగుతోంది. గతంలో షర్మిల కుమారుడు రాజారెడ్డి వివాహ నిశ్చితార్థానికి జగన్ దంపతులు హాజరైన సంగతిని పలువురు ఇప్పుడు గుర్తు చేస్తున్నారు.
దేశవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పింఛనుదారులకు కేంద్ర ప్రభుత్వం ఒక ముఖ్యమైన ఊరటనిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.
స్నేహితులే కదా అని నమ్మాడు.. వాళ్లు ఫోన్ చేసి పిలిస్తే ఏదో మాట్లాడుకుందామని ఇంటి నుంచి బయటకు వచ్చాడు. కానీ అదే అతడి చివరి అడుగైంది.
భారతదేశంలో కోట్లాది మంది నిత్యం వినియోగిస్తున్న డిజిటల్ చెల్లింపుల వ్యవస్థలో కీలక పరిణామం చోటుచేసుకుంది.
హైదరాబాద్‌లోని ప్రముఖ ఐటీ కారిడార్‌ అయిన మాదాపూర్‌లో ఇటీవల వెలుగుచూసిన ఓయో హోటల్ యువతి అనుమానాస్పద మృతి ఉదంతం అత్యంత నాటకీయ పరిణామాల మధ్య కొత్తలుపులు తెరుస్తోంది.
హైదరాబాద్ మహానగరంలో వినాయక చవితి నవరాత్రి వేడుకలు అత్యంత వైభవంగా ముగిశాయి.
దేశవ్యాప్తంగా ఎంతో అత్యాధునిక సౌకర్యాలు, అత్యున్నత భద్రతా ప్రమాణాలతో ప్రయాణాలకు మారుపేరుగా నిలిచిన వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ రైలులో అకస్మాత్తుగా చోటుచేసుకున్న ఒక ఘటన కలకలం రేపింది.
ప్యారడైజ్‌ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.. కానీ థియేటర్‌లో సినిమా చూసే ఆడియన్స్‌కు మరో సర్‌ప్రైజ్‌ సిద్ధమైంది.
వివిధ రాష్ట్రాలకు కొత్త ఇన్‌ఛార్జీలను ప్రకటించిన కాషాయ పార్టీ..!
బెంగళూరులోని కుమ్రం భీం కాదండోయ్ పరప్పన అగ్రహార సెంట్రల్ జైలులో ఉంటూ తీవ్ర మానసిక క్షోభ అనుభవిస్తున్న కన్నడ నటుడు దర్శన్ కేసులోని ప్రధాన నిందితురాలు పవిత్రా గౌడ కోర్టులో చేసిన వ్యాఖ్యలు
అక్టోబరా, నవంబరా, లేదా తరువాతా అన్న ఉత్కంఠకు తెరదించుతూ మంత్రి నారా లోకేష్ వచ్చే నెలలోనే అంటే అక్టోబర్ లోనే స్థానిక సమరం ఉంటుందన్న స్పష్టత ఇచ్చారు.
వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గమైన పులివెందుల పరిధిలోని లింగాల మండలం నుంచి  జెడ్పీటీసీ స్థానానికి పోటీ చేయాల్సిందిగా  వైఎస్ సునీతను లోకేష్ కోరినట్లు  ప్రచారం జరుగుతోంది. కేవలం పోటీ చేయడమే కాకుండా, ఆ ఎన్నికలో విజయం సాధిస్తే..  జిల్లా పరిషత్ చైర్ పర్సన్ పదవి  కట్టబెడతామని స్పష్టమైన హామీ ఇచ్చినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.