బాబు అరెస్టు అక్రమమేనా?.. సీఎస్ నేతృత్వంలో ఏజీ, సీఐడీ చీఫ్ గవర్నర్ తో భేటీ సంకేతమదేనా?

Publish Date:Oct 10, 2023

Advertisement

స్కిల్ కేసులో చంద్రబాబు అరెస్టు అక్రమమని జగన్ సర్కార్  అంగీకరించేసిందా? సుప్రీం కోర్టులో ఈ కేసుపై చంద్రబాబు దాఖలు చేసిన స్క్వాష్ పిటిషన్ పై మంగళవారం (అక్టోబర్ 10) జరిగిన విచారణలో ముకుల్ రోహత్గీ వాదనలు వీగిపోక తప్పదన్న భావనకు వచ్చిందా? అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

ఈ అనుమానాలు వ్యక్తం కావడానికి కారణమేమిటంటే.. ఇప్పటి దాకా స్కిల్ కేసులో చంద్రబాబు అరెస్టు విషయం ముందుగా గవర్నర్ దృష్టికి తీసుకెళ్లాల్సిన  అవసరం లేదనీ, ఆయన అనుమతి అక్కర్లేదనీ చెబుతూ వస్తున్న సర్కార్.. ఇప్పడు సుప్రీం కోర్టులో ఈ కేసు విచారణ శుక్రవారానికి వాయిదా పడిన తరువాత  హడావుడిగా ఈ కేసుకు సంబంధించిన వివరాలను ప్రభుత్వం తరఫున సీఎస్ జవహర్ రెడ్డి,  అడ్వొకేట్ జనరల్ శ్రీరామ్, సీఐడీ చీఫ్ సంజయ్ లు గవర్నర్ ను కలిసి వివరించారు. అంటే.. స్కిల్ కేసులో చంద్రబాబు అరెస్టు విషయంలో ముందుగా గవర్నర్ అనుమతి తీసుకోకపోవడం కరెక్ట్ కాదని పరోక్షంగా ప్రభుత్వం అంగీకరించేసినట్లేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

అలాగే సోమవారం వైసీపీ విస్తృత స్థాయి సమావేశంలో మాట్లాడుతూ.. జగన్ చంద్రబాబు అరెస్టు తనకు తెలిసి జరిగింది కాదనీ, స్కిల్ కేసు దర్యాప్తు చేస్తున్న సీఐడీ ఆ కేసు దర్యాప్తులో భాగంగా అరెస్టు చేసిందనీ చెప్పి చేతులు దులిపేసుకోవడానికి ప్రయత్నించారు. అంటే ఇప్పుడు  సుప్రీం కోర్టులో చంద్రబాబుకు అనుకూలంగా తీర్పు వస్తే ఏపీ సీఐడీ నిండా ఇరుక్కున్నట్లే అవుతుంది. ఈ నేపథ్యంలోనే  సుప్రీం కోర్టులో చంద్రబాబు క్వాష్ పిటిషన్ శుక్రవారానికి వాయిదా పడగానే.. సీఎస్ జవహర్ రెడ్డి ఆధ్వర్యంలో అడ్వొకేట్ జనరల్, సీఐడీ చీఫ్ గవర్నర్ ను కలిశారని చెబుతున్నారు. ముందునుంచీ చంద్రబాబు తరఫు న్యాయవాదుల బృందం చెబుతున్నట్లుగానే  ఈ కేసులో 17ఎ వర్తిస్తుందని ఈ రోజు సుప్రీం కోర్టులో జరిగిన విచారణ సందర్భంగా  సీనియర్ న్యాయవాది సాల్వే వాదనలపై న్యాయమూర్తులు సానుకూలంగా స్పందించినట్లు న్యాయనిపుణులు అభిప్రాయపడ్డారు.

అలాగే  ప్రభుత్వం తరఫున ముకుల్ రోహత్గీ వాదిస్తున్న సందర్భంగా న్యాయమూర్తులు నాలుగు కీలక ప్రశ్నలు సంధించారనీ, అవన్నీ కూడా 17ఏకు సంబంధించి ముకుల్ రోహత్గీ చేస్తున్న వాదనలపైనేననీ అంటున్నారు. ఇంతకీ ఆ ప్రశ్నలు ఏమిటంటే.. 
సుప్రీంకోర్టు ప్రశ్నలకు సరైన సమాధానం చెప్పని రోహత్గి 
1. 17A నేరానికి వర్తిస్తుందా? నిందితులకు వర్తిస్తుందా? 
2. 2018లో విచారణ ప్రారంభించినప్పుడు ఏం కనిపెట్టారు? 
3. అవినీతికి సంబంధిందిన సెక్షన్ అమలు కాకపోతే మిగతా సెక్షన్ల కింద ప్రత్యేక కోర్టు విచారించవచ్చా? 
4.  మిగతా సెక్షన్ల కింద పెట్టిన కేసులు చెల్లుతాయా? లేదా?  
అయితే ఈ నాలుగు ప్రశ్నలకూ ముకుల్ రోహత్గీ సరైన సమాధానం ఇవ్వకుండా  పాత వాదననే కొనసాగించారని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఏపీ  సీఎస్ జవహర్ రెడ్డి నేతృత్వంలో  అడ్వొకేట్ జనరల్ శ్రీరామ్, ఏసీ సీఐడీ చీఫ్ సంజయ్ గవర్నర్  అబ్దుల్ నజీర్ ను కలవడం అత్యంత  ప్రాధాన్యత సంతరించుకుంది. గవర్నర్ కు వీరు ముగ్గురూ స్కిల్ కేసు, చంద్రబాబు అరెస్టు, తదననంతర పరిణామాలను వివరించారని  తెలుస్తోంది. ఏది  ఏమైనా సుప్రీంలో చంద్రబాబు క్వాష్ పిటిషన్ విచారణ, 17ఏ సెక్షన్ పై పెద్ద ఎత్తున చర్చ  జరుగుతున్న సమయంలో ప్రభుత్వం గవర్నర్ ను  సంప్రదించడం కీలకంగా మారింది. అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.

By
en-us Political News

  
రాజకీయ నాయకులపై ప్రజలకు ఉండే అభిమానం ఒక్కోసారి అసాధారణ రీతిలో వ్యక్తమవుతుంది.
టాలీవుడ్ సినీ పరిశ్రమలో వరుస వెడ్డింగ్ బెల్స్ మోగుతున్నాయి. ఇప్పటికే పలువురు యంగ్ హీరోలు వైవాహిక జీవితంలోకి అడుగుపెడుతుండగా
దీపావళి పండగ అనగానే ప్రతి ఇంటా సంబరాలు, బాణసంచా చప్పుళ్లు సర్వసాధారణం.
వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
చెన్నై వేదికగా ఇటీవల వైఎస్ అనిల్ కుమార్ రెడ్డి కుమార్తె వివాహం ఎంతో వైభవంగా జరిగింది.
అప్పుడప్పుడే లోకాన్ని చూడటం మొదలుపెట్టింది. అమ్మా నాన్నల ఒడిలో గోరుముద్దలు తింటూ.. బుడిబుడి అడుగులు వేస్తూ ఆడుకోవాల్సిన వయసు.
తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 5) జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో  తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ పార్టీ చీరాల మునిసిపోల్స్ లో గట్టి పోటీ ఇచ్చింది. 25వ వార్డులో విజయం సాధించింది.  25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు. 
పోలింగ్ సరళి, వెలువడిన ఫలితాలు వైసీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అధికార తెలుగుదేశం కూటమి అరాచకాలు, అధికార దుర్వినియోగం తమ ఓటమికి కారణాలుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు.  ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత వైఎస్ జగన్ నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జగన్ చెప్పిందే చెప్పారు. 
ప్రతిరోజూ ఉదయం మనం ఎంతో ఆరోగ్యకరమని భావించి తాగే పాలు అసలు సిసలైనవేనా? లేక ప్రాణాల మీదకు తెచ్చే విషపూరిత కల్తీ పాలా? అనే ప్రశ్న ఇప్పుడు హైదరాబాద్‌ ప్రజలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది
హైదరాబాద్‌ నగరంలో నిత్యం రాకపోకలు సాగించే లక్షలాది మంది ప్రయాణికులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది
కాంగ్రెస్, కమ్మూనిస్టుల మద్దతుతో ఎన్నికల బరిలోకి దిగిన ఏబీవీకి ఘోర పరాజయం ఎదురైన సంగతి తెలిసిందే. కమ్యూనిస్టులకు అంతో ఇంతో పట్టున్న ప్రాంతాలలో కూడా ఆయనకు ఓట్లు రాలలేదు. ఇక కాంగ్రెస్ మద్దతు ఆయనకు ఎందుకూ కొరగాకుండా పోయింది. 
ఈ వేడుకలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కేటీఆర్,   విజయ్ ఒకే దగ్గర చేరి సరదాగా ముచ్చటించుకోవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.  
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.