అలీ జనసేన వైపు చూస్తున్నారా?

Publish Date:Sep 28, 2022

Advertisement

సినీ నటుడు, కమేడియన్ అలీ జనసేన వైపు చూస్తున్నారా? ఆయన వైసీపీతో విసిగిపోయారా? అసలీ ప్రశ్నలన్నీ ఉత్పన్నం కావడానికి ఆయన పేరుతో విడుదలైన ఒక ప్రకటనే కారణం. అసలు అలీ జనసేన పార్టీలో చేరుతానని కానీ, పార్టీ మారతానని కానీ ఎక్కడా ఎప్పుడూ అన్న సందర్భం లేదు. ఆ దిశగా ఎటువంటి ప్రచారం కూడా జరిగిన దాఖలాలు లేవు. అయినా హఠాత్తుగా ఆ అనుమానాలు కలిగేలా అలీ పేర ఒక ప్రకటన వెలువడింది. జగన్ మైనారిటీల కోసం ఎవరూ చేయనంతగా చేశారంటూ పొగడ్తల వర్షంతో వెలువడిన ఆ ప్రకటన అందరినీ విస్మయానికి గురి చేసింది. ఆ ప్రకటన నేపథ్యంలోనే అలీకి నామినేటెడ్ పోస్టు వ్యవహారం మళ్లీ తెరమీదకు వచ్చింది.

సినీ నటుడు అలీకి ఇక ఏదో ఒక నామినేటెడ్ పోస్టు ఖాయమని వైసీపీ వర్గాలు అంటున్నాయి.   అమరావతి నుంచి అలీ పేరుతో విడుదలైన ప్రకటనలో   తాను జనసేనలో చేరడం లేదనీ, మైనారిటీల అభ్యున్నతి కోసం ఏ ముఖ్యమంత్రీ చేయని విధంగా జగన్ చేశారంటూ పొగడ్తల వర్షం కురిపించారు. అందుకే జగన్ ను మరోసారి సీఎం చేయడానికి తన వంతు కృషి తాను చేస్తాననీ అలీ పేర విడుదలైన ఆ ప్రకటన సారాంశం. పదవులు ఆశించి తాను వైసీపీలో చేరలేదననీ, జగన్ పట్ల అభిమానంతో ఆయనను సీఎం చేయాలన్న లక్ష్యంతో పార్టీలో చేరాననీ కూడా అలీ పేర విడుదలైన ఆ ప్రకటన పేర్కొంది.

అంతా బానే ఉంది కానీ.. అసలు అలీ జనసేన తీర్ధం పుచ్చుకుంటున్నారన్న వార్తలు కానీ ప్రచారం కానీ ఇప్పటి వరకూ ఎక్కడా కనిపించలేదు. జనసేనాని నటించే ఓ సినిమాలో అలీ నటిస్తారన్న వార్త మాత్రం.. (అది నిజమో కాదో తెలియదు) బయటకు వచ్చింది. అది కూడా సినిమా వర్గాల నుంచి లీక్ రూపంలో బయటకు వచ్చినదే. జనసేనాని నటించే ఏ సినిమాలో అలీ నటిస్తున్నారన్న స్పష్టత కూడా లేదు. అది పక్కన పెడితే.. అలీ జనసేన పార్టీలో చేరతారని ఆయన స్వయంగా ఎక్కడా ప్రకటించలేదు. అసలు జనసేన ప్రస్తావనే ఇప్పటి వరకూ అలీ నోటి వెంట రాలేదు. అదేమీ లేకుండా అలీ పేరుతో.. ఒక ప్రకటన విడుదల కావడమే అన్ని వర్గాలలోనూ సందేహాలను రేకెత్తిస్తోంది.  వైసీపీ వర్గాలే ఆయన పేరుతో ఓ ప్రకటన విడుదల చేశాయా అన్న అనుమానాలూ వ్యక్తమౌతున్నాయి.

వాస్తవానికి అలీ గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో జగన్ పార్టీలో చేరిన సందర్భంలోనే ఆయన ఏదో ఒక స్థానం నుంచి అసెంబ్లీకి పోటీ చేయాలన్న తన కోరికను జగన్ కు తెలియ జేశారు. పార్టీలో చేరే వరకూ ఓకే అంటూ వచ్చిన జగన్ ఆ తరువాత హ్యాండిచ్చారు. అసెంబ్లీకి పోటీ చేసే అవకాశం రాకపోతేనేం..రాజ్యసభ పంపించడమో, కీలకమైన నామినేటెడ్ పోస్టు ఇవ్వడమో చేస్తామంటూ ఆశ చూపి ఇంత కాలం అలీని ఆశల పల్లకిలో ఊరేగించారు. ఆ మధ్యలో ఓ సారి అలీని రాజ్యసభకు పంపించేస్తున్నారంటూ వార్తలు, వదంతులూ షికారు చేశాయి. ఆ సమయంలో అలీ కూడా ఇక రాజ్యసభ సీటు గ్యారంటీ అన్న ఆనందంతో సతీసమేతంగా జగన్ దర్శనం చేసుకుని వచ్చారు. ఆ సందర్భంలో కూడా ఓ వారంలో గుడ్ న్యూస్ చెబుతానంటూ జగన్ అలీని ఊరించారు. ఆ సంగతి అలీయే స్వయంగా మీడియాతో కూడా చెప్పారు. అప్పటి నుంచీ గోడమీద రేపు అని రాసి చూసుకుంటున్నట్లుగా ఆ వారం కోసం అలీ ఎదురు చూస్తూనే ఉన్నారు. ఆ వారం ఇంకా రాలేదు. వస్తుందో రాదో కూడా తెలియదు. ఈ మధ్యలో అలీకి వక్ఫ్ బోర్డు చైర్మన్ పదవి అనీ, మరొకటనీ ప్రచారం జరిగినా అవేమీ జరగలేదు. ఈ నేపథ్యంలోనే అలీ జనసేనాని పవన్ కల్యాణ్ సినిమాలో నటిస్తున్నారంటూ వార్తలు వచ్చాయి. అందుకే వైసీపీలో ఈ ఖంగారు. ఈ ప్రకటన అని పరిశీలకులు విశ్లేషణలు చేస్తున్నారు.

వాస్తవానికి అలీ వైసీపీ మధ్య బలమైన బంధం ఏమీ లేదు. అలీ రాజకీయంగా చురుకుగా ఉన్న సందర్భం ఏనాడూ లేదు. ఆయన గత ఎన్నికలకు ముందు అన్ని పార్టీల మెట్లూ ఎక్కి పోటీ అవకాశం ఇస్తామన్న హామీని నమ్మే వైసీపీ తీర్ధం పుచ్చుకున్నారనడంలో సందేహం లేదు. తీరా పార్టీలో చేరిన తరువాత పోటీకి అవకాశం లేదు.. ఏదో ఒకటి చేస్తామన్న హామీతో గత్యంతరం లేక పార్టీలో కొనసాగారే తప్ప అలీ వైసీపీలో చురుకుగా వ్యవహరించిందీ లేదు. జగన్ కు నచ్చేలా, ఆయన మెప్పు పొందేలా ప్రత్యర్థులపై విమర్శలతో విరుచుకుపడిందీ లేదు. తన సినిమాలూ, తన షోలు చేసుకుంటూ.. పేరుకు పార్టీలో కొనసాగుతూ ఉన్నారంతే. అయినా వైసీపీ అలీ పార్టీ మారుతారేమోనని ముందుగానే ఊహించేసుకుని ఆయన పేర ప్రకటన విడుదల చేసేయడమే ఆ పార్టీలో ఖంగారు, ఎంతో కొంత జనాకర్షణ ఉన్న అలీ జారిపోతారన్న భయం కనిపిస్తోంది. అందుకే అలీ పేర జగన్ ను పొగడ్తలతో ముంచెత్తుతూ ప్రకటన వెలువడిందని పరిశీలకులు అంటున్నారు.

ఇప్పుడు ఇక ఇంత వరకూ వచ్చింది కనుక కంటి తుడుపులా ఏదో ఒక పోస్టు అలీకి ఇచ్చేసినా ఆశ్చర్యం లేదంటున్నారు. ఓ ఏడాదిన్నర కోసం నామమాత్రంగా ఓ నామినేటెడ్ పోస్టులో అలీని కూర్చోపెట్టేసి జగన్ మాట తప్పలేదు.. మడమ తిప్పలేదు అని అలీ చేతే అనిపించేయాలన్న ఆత్రం వైపీపీలో కనిపిస్తోందనడానికి అలీ పేరుతో విడుదలైన ప్రకటనే నిదర్శనమంటున్నారు.  

By
en-us Political News

  
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల అసెంబ్లీ వేదికగా మాజీ సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యుల భూ ఆక్రమణలంటూ చేసిన సంచలన వ్యాఖ్యలు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్‌పై గులాబీ పార్టీ  మండిపడింది. ప్రభుత్వ వైఫ్యాలను కప్పిపుచ్చుకునేందుకే కాంగ్రెస్ పెద్దలు ఇలాంటి నిరాధార ఆరోపణలు చేస్తున్నారని  ఎదురుదాడికి దిగింది.
మైగ్రేన్ తలనొప్పితో ఆసుపత్రికి వెళ్లిన బెక్కీ జోన్స్‌కు బ్రెయిన్ క్యాన్సర్ ఉందంటూ 11 ఏళ్ల పాటు కీమోథెరపీ ఇచ్చారు. కానీ చివరికి అసలు క్యాన్సరే లేదని తెలిసిన షాకింగ్ వివరాలు ఈ వెబ్ స్టోరీలో చదవండి.
పట్టభద్రుల ఎన్నికలకు ఓటర్ల జాబితా ప్రక్రియ షెడ్యూల్ విడుదల.. !
చాలా మంది 1973 నాటి భూమి పరిమితి చట్టం రద్దయిందని అనుకుంటున్నారు. కానీ అది అమలులోనే వుంది. ఉమ్మడి కుటుంబానికి మెట్ట భూమి 52 ఎకరాలు, కొన్ని ప్రత్యేక సందర్భాల్లో 54 ఎకరాలు ఉండవచ్చు. తరి భూమి (ఏడాదికి రెండు పంటలు పండేది) 27 ఎకరాలు వుండవచ్చు. అంతకంటే ఎక్కువగా ఉంటే దాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాల్సి వుంటుంది.
వారణాసి వేదికగా నెల రోజుల పాటు జరగనున్న  సేవా సంకల్ప అభియాన్ లో  తొలి రోజు గురువారం ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు పాల్గొన్నారు. అలాగే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సహా  పాటు పలువురు అగ్రనేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.  
మోడీకి  జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వారిలో లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, తెలుగుదేశం అధినేత, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేష్ తదితరులు  ఉన్నారు.  ప్రధాని నరేంద్ర మోదీజీకి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయన మంచి ఆరోగ్యంతో, దీర్ఘాయుష్షుతో ఉండాలని కోరుకుంటున్నానంటూ రాహుల్ గాంధీ తన సందేశంలో పేర్కొన్నారు.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు వన్‌సైడ్ విక్టరీ వచ్చేలా పార్టీ శ్రేణులు పనిచేయాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు.
వైసీపీ నుంచి బయటకు వచ్చి, ఆ పార్టీ ద్వారా వచ్చిన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి రాజకీయ సన్యాసం ప్రకటించిన విజయసాయి, ఇటీవల సొంత పార్టీ అంటూ మళ్లీ క్రియాశీల రాజకీయాలలోకి ప్రవేశించారు. 
బినెట్ నుంచి ఉద్వాసనకు గురైన కొండా సురేఖకు కేబినెట్ హోదాతో కీలక పదవిని అప్పగించే అవకాశాలున్నాయన్న ప్రచారం జరుగుతోంది.  ఈ విషయమై కొండా సురేఖకు పార్టీ హైకమాండ్ నుంచి స్పష్టమైన హామీ లభించినట్లు చెబుతున్నారు.
బీసీలపై కపట ప్రేమ ఎందుకు? కేసీఆర్‌ను నిలదీసిన పీసీసీ చీఫ్..!
మాజీ మంత్రి కొండా సురేఖకు మద్దతుగా అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో వరంగల్‌కు తరలివచ్చారు.
తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారిన కొండా సురేఖ ఉదంతంలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
G.D. Naidu, known as the “Edison of India,” was an Indian inventor, industrialist and pioneer of innovation. This article explores his remarkable life, curiosity, self-learning, experimentation and practical approach to technology, and the lessons his journey offers to Millennials, Gen Z and Gen Alpha.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.