నటుడు అలీకి నామినేటెడ్ పోస్టు ఫిక్సేనా? ఎంద చాట!

Publish Date:Sep 2, 2022

Advertisement

గత ఎన్నికలలో తనకు అండగా నిలిచిన నటులకు జగన్ ఏదో ఒక ప్రయోజనం చేకూరుస్తానని అధికారంలోకి వచ్చిన ఈ మూడేళ్లుగా ఊరిస్తూనే ఉన్నారు. ముఖ్యంగా ప్రముఖ కమేడియన్ అలీ విషయంలో అయితే ఆయనను ఏకంగా రాజ్యసభకు పంపిస్తానని నమ్మించారు.

సినీ పరిశ్రమతో టికెట్ల వివాదం సందర్భంగా జగన్ అలీని ప్రత్యేకంగా పిలిపించుకుని మరీ చర్చించారు.  ఆ సందర్భంగా కూడా త్వరలో పిలుపు వస్తుంది, గుడ్ న్యూస్ వింటారు అని మళ్లీ ఊరించారు. ఆ తరువాత షరా మామూలే! పిలుపూ లేదు, మంచి కబురూ లేదు. అయితే గత ఎన్నికలలో వైసీపీ తరఫున పని చేసిన నటులలో కమేడియన్ పృధ్వీరాజ్ కు మాత్రమే పదవి దక్కింది. అయితే అది మూడు నాళ్ల ముచ్చటగానే మిగిలిపోయింది.

ఏదో వివాదంలో ఇరుక్కున్న పృధ్విని పదవి నుంచి తొలగించి, ఆ తరువాత పట్టించుకోవడమే మానేశారు జగన్. ఇక జగన్ కు అనుకూలంగా గత ఎన్నికలలో పని చేసిన నటులు   మోహన్ బాబు, అలీ, పోసాని కృష్ణమురళీలకు సదవుల సంగతి దేవుడెరుగు ఇంత వరకూ పార్టీలో సరైన గుర్తింపే  దక్కలేదు,  దీంతో మోహన్ బాబు బహిరంగంగా ప్రకటించకపోయినా వైసీపీకి దూరమైనట్లు స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. తన విద్యాసంస్థల ఆధ్వర్యంలో నిర్మించిన ఆలయ ప్రారంభోత్సవానికి విపక్ష నేత చంద్రబాబును ఆహ్వానించారు. ఇందు కోసం తన కుమార్తె మంచు లక్ష్మితో కలిసి చంద్రబాబు నివాసానికి వెళ్లారు. తాను  తెలుగుదేశం పార్టీకి చేరువ అవుతున్నట్లు సంకేతాలు ఇచ్చారు.

ఇక అలీ, పోసానిల విషయానికి వస్తే వారు జగన్ కరుణా కటాక్షా వీక్షణాల కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు.  జగన్ మాత్రం అదిగో ఇదిగో అంటూ మూడేళ్లు గడిపేశారు. దీంతో జగన్ పార్టీకి మద్దతుగా నిలవడం వల్ల ప్రయోజనం లేదని సినీ పరిశ్రమ మొత్తం భావిస్తున్నది.  ముఖ్యంగా అలీ, పోసాని కృష్ణ మురళీ ఇటీవలి కాలంలో వైసీపీతో అంటీముట్టనట్టు వ్యవహరిస్తున్నారు. అలీ అయితే ఒకటి రెండు సందర్భాలలో తనకు పదవి విషయంలో నిర్ణయం తీసుకోవలసింది జగనే అని నిష్ఠూరంగా చెప్పారు కూడా.

ముఖ్యంగా ఈ మూడేళ్ల కాలంలో అలీకి పదవి విషయంలో భారీ ప్రచారం జరిగింది. వక్ఫ్ బోర్డు చైర్మన్ అని ఒక సారీ, రాజ్యసభ సభ్యత్వం అని మరోసారీ బాగా ప్రచారం జరిగింది. అలీకి స్వయంగా జగన్ నుంచి పిలుపు కూడా వచ్చింది. అయితే పదవి మాత్రం రాలేదు. ఇక ఇప్పుడు రాష్ట్రంలో ఎలక్షన్ ఫీవర్ మొదలైపోయిన తరువాత, జగన్ ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకతక గూడుకట్టుకుందన్న ప్రచారాల నేపథ్యంలో మళ్లీ సినీ గ్లామర్ అవసరమని జగన్ భావిస్తున్న తరుణంగా మళ్లీ అలీకి పదవి ఇవ్వనున్నారంటూ ప్రచారం జోరందుకుంది.  

అలీకి ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుడిగా నియమించనున్నట్టు వార్తలు ప్రచారంలో ఉన్నాయి. అయితే ఈ ప్రచారం పట్ల అలీ పెద్ద సంతోషంగా లేరని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. అలీ అంత కంటే పెద్ద పదవిని ఆశిస్తున్నారనీ, ఇంత కాలం జగన్ ఆ విషయమే చెబుతూ వచ్చారనిఅంటున్నారు. రాజ్యసభకు అవకాశం ఇప్పుడు లేదు కనుక దానితో సమానమైన హోదా ఉండే పదవిని అలీ ఆశిస్తున్నట్లు చెబుతున్నారు.   ఇక పోసానికి కూడా ఏదో ఒక నామినేటెడ్ పోస్టు ఖాయమని వైసీపీ శ్రేణులు అంటున్నాయి.  

By
en-us Political News

  
భారత రాజకీయాల్లో ఇప్పుడు పార్లమెంట్ సీట్ల పునర్విభజన (డీలిమిటేషన్), మహిళా రిజర్వేషన్ బిల్లుల చుట్టూ తీవ్రమైన ఉత్కంఠ నెలకొంది.
తెలంగాణ రాజకీయాల్లో మరోసారి కాంగ్రెస్ అంతర్గత వ్యవహారాలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
వైసిపి సీనియర్ నాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డి.. రాజ్యసభ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి చొక్కా పట్టుకుని దాడి చేసి కొట్టారని.. ఇదే విషయాన్ని ఇటీవల విజయసాయి ఓ బహిరంగ లేఖ ద్వారా వెల్లడించిన విషయాన్ని కన్ ఫర్మ్ చేశారు.
ఇండియా కూటమి తరఫున రాహుల్ గాంధీనే ప్రధానమంత్రి అభ్యర్థి అని కుండబద్దలు కొట్టారు. ఆ విషయాన్నే తమిళనాడు కాంగ్రెస్ శాసనసభాపక్ష  నాయకురాలు తారాహై కత్‌బర్ట్  మరింత క్లారిటీ ఇస్తూ.. విజయ్ ప్రధాని అవుతారంటూ కొందరు ప్రచారం చేయడం కేవలం టీవీకే శ్రేణుల ఉత్సాహం వల్ల జరుగుతున్న ప్రచారమే తప్ప, అది ఆ పార్టీ అధికారిక వైఖరి కాదన్నారు.
రాజకీయ క్షేత్రంలో ముందస్తు ఊహాగానాలు, భవిష్యత్ ఎన్నికల అంచనాలు ఎప్పుడూ ఆసక్తికరంగానే సాగుతుంటాయి. ఈ నేపథ్యంలో సపోజ్ ఫర్ సపోజ్  ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే పరిస్థితి ఎలా ఉంటుందన్న చర్చ జోరందుకుంది. రానున్న  రాజకీయ సమీకరణాలపై   చర్చోపచర్చలు మొదలయ్యాయి.
కొండా సురేఖపై వేటు తప్పదనీ, ఆమెకు క్యాబినెట్ నుంచి ఉద్వాసన తప్పదన్న ప్రచారం జోరుగా సాధింది. ఒక దశలో రేవంత్ కేబినెట్ లోకి సురేఖ స్థానంలో మరో ఫైర్ బ్రాండ్ నాయకురాలు విజయశాంతిని తీసుకోనున్నట్లు కూడా వార్తలు వినిపించాయి. 
 ప్రభుత్వ మద్దతుతో జరిగే ఏకగ్రీవ ఎన్నికలు ఉంటాయన్న ఆయన రాజకీయ పార్టీ కోణంలో ఏకగ్రీవాలు ఉండకూడదని జగన్ అన్నారంటూ బొత్స  వివరణపై వైసీపీ నేతలు పెదవి విరుస్తున్నారు.
బహదూర్‌పురా నియోజకవర్గ ఎమ్మెల్యే మహ్మద్ ముబీన్‌ను రాజేంద్రనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌గా ఆల్ ఇండియా మజ్లిస్-ఎ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (AIMIM) నియమించింది.
ఇండియా టుడే-సి ఓటర్ సర్వే అంచనాల ప్రకారం.. మొత్తం 25 లోక్‌సభ స్థానాలు ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి  20 పార్లమెంట్ స్థానాలను దక్కించుకుంటుంది.
 దువ్వాడ కుటుంబ వ్యవహారం రచ్చకెక్కి పార్టీ ప్రతిష్ఠ మసకబారే పరిస్థితి రావడంతో వైసీపీ అధినేత జగన్ తప్పని సరిపరిస్థితుల్లో  దువ్వాడ శ్రీనివాస్ పై సస్పెన్షన్ వేటు వేశారు.   అయితే పేరుకే సస్పెన్షన్ తప్ప ఆయన ఇప్పటికీ వైసీపీ ఎమ్మెల్సీగానే చెలామణి అవుతున్నారు.
తెలుగుదేశం కూటమి సునాయాసంగా 20 స్థానాలను కైవసం చేసుకుంటుంది.   2024 ఎన్నికల ఫలితాలు పునరావృతమౌతాయిని ఇండియా టుడే సర్వే పేర్కొంది.
సొంత పార్టీ శాసనమండలి సభ్యుడిపై  మహిళల పట్ల అసభ్యకర ప్రవర్తన మరియు వేధింపుల ఆరోపణలు వెల్లువెత్తడంతో, ఎమ్మెల్సీ రహమత్ బేగ్‌పై వేటు వేశారు.
మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్  రాజకీయ సన్యాసం స్వీకరించబోతున్నారా? అంటే ఔనన్న సమాధానమే వస్తున్నది.   ప్రత్యర్థులపై విమర్శలతో విరుచుకుపడే అనిల్ కుమార్ యాదవ్, తాజాగా చేసిన వ్యాఖ్యలను బట్టి రాజకీయవర్గాలలో ఆయన పొలిటికల్ రిటైర్మెంట్ ప్రకటించబోతున్నారా అన్న చర్చ జోరందుకుంది.  
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.