కొండా దంపతులను చంద్రబాబు ఆహ్వానించారా? టీడీపీలో చేరిక ఎలా ఆగింది?
Publish Date:Oct 13, 2021
Advertisement
తెలంగాణ రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ లీడర్ అంటే మొదటగా గుర్తుకు వచ్చేది వరంగల్ జిల్లాకు చెందిన కొండా దంపతులే. రాయలసీమ మాదిరి ఫ్యాక్షన్ రాజకీయాలు చేశారనే టాక్ వీళ్లపై ఉంది. వరంగల్ జిల్లాలో ఎర్రబెల్లి దయాకర్ రావు, కొండా దంపతుల మధ్య వార్ దాదాపు రెండు దశాబ్దాలుగా సాగుతోంది. కొండా దంపతులు కాంగ్రెస్ లో హవా చూపించగా.. ఎర్రబెల్లి టీడీపీలో కీలక నేతగా వరంగల్ జిల్లా రాజకీయాలను శాసించారు. దివంగత సీఎం వైఎస్సార్ కు కొండా దంపతులు ప్రధాన అనుచరులుగా వ్యవహరించగా... చంద్రబాబు కోటరీలో ఎర్రబెల్లి ముఖ్యుడిగా కొనసాగారు. కొండా- ఎర్రబెల్లి మధ్య సాగిన ఆధిపత్య పోరుతో వరంగల్ జిల్లా రాజకీయాలు సంచలనంగా ఉండేవి. హత్యా రాజాకీయాలతో ఉద్రిక్తతంగా ఉండేవి. 1995 నుంచి 2003 వరకు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జిల్లాలో ఎర్రబెల్లి పూర్తి పట్టు సాధించారు. ఆ సమయంలో కొండా దంపతులను అప్పటి ప్రభుత్వం టార్గెట్ చేసిందనే ఆరోపణలు ఉన్నాయి. కొండా మురళీని ఎన్ కౌంటర్ చేయాలని చూశారని.. అప్పటి ప్రతిపక్ష నేత వైఎస్సార్ కొండాకు మద్దతుగా నిలవడంతో ఆయన సేఫ్ అయ్యారనే టాక్ ఉంది. అందుకే వైఎస్సార్ కు కొండా దంపతులు ప్రధాన అనుచరులుగా ఉండిపోయారని, వైఎస్సార్ చనిపోయాకా జగన్ కోసం మంత్రి పదవిని కూడా వదులుకున్నారని అంటారు. అయితే చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కొండా దంపతులు తీవ్ర కష్టాలు ఎదుర్కొన్నారని టాక్ ఉండగా... కొండా సురేఖ మాత్రం ఈ విషయానికి సంబంధించి సంచలన వ్యాఖ్యలు చేశారు.వరంగల్ జిల్లా గీసుకొండ మండలం వంచనగిరి బొడ్రాయి ప్రతిష్టాపనలో పాల్గొన్న కొండా సురేఖ ఎర్రబెల్లిపై సంచలన ఆరోపణలు చేశారు. ‘తన భర్త మురళిని అంతం చేసేందుకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కుట్రలు చేస్తున్నారని’ ఆరోపించారు. అందుకే ఎర్రబెల్లి టీఆర్ఎస్ లో చేరారని ఆమె ఆరోపించారు. తాము టీఆర్ఎస్ లో చేరిన తర్వాతే ఎర్రబెల్లి కూడా పార్టీలో చేరి రాజకీయాలు చేశాడని మండిపడ్డారు. ఒక తండ్రికే పుట్టానని.. టీడీపీని విడిచిపెట్టనని ఎర్రబెల్లి నాడు శపథాలు చేసి ఆ తర్వాత టీఆర్ఎస్ లో ఎందుకు చేరాడని కొండా సురేఖ ప్రశ్నించారు.ఎంత మంది తండ్రులకు పుట్టుంటే టీఆర్ఎస్ లో చేరారో చెప్పాలని సురేఖ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తాము కూడా టీడీపీలో చేరాలని అనుకున్నామని.. చంద్రబాబు ఆహ్వానించారని.. కానీ ఆ పార్టీలో ఎర్రబెల్లి ఉండడంతోనే చేరలేదని సంచలన విషయాలు చెప్పుకొచ్చారు కొండా సురేఖ.
http://www.teluguone.com/news/content/is--chandrababu-invite-konda-family-to-tdp-39-124472.html





