వర్షం సాక్షిగా ఐర్లాండ్ చేతిలో ఓడిన ఇంగ్లాండ్

Publish Date:Oct 26, 2022

Advertisement

మెల్బోర్న్ లో బుధవారం జరిగిన సూపర్ 12 విభాగం మ్యాచ్ లో ఇంగ్లండ్ తో తలపడిన ఐర్లాండ్  ఆట మొత్తం ఆధి పత్యం చెలాయించింది. ఐర్లాండ్ తమ ఇన్నింగ్స్ లో 157 పరుగులు చేసింది. బాల్బ్రీని రెచ్చిపోయాడు. చాలా కాలం తర్వాత ఐర్లాండ్ మంచి బ్యాటర్ పొందిందని ప్రశంసించారు. చాలాకాలం క్రితం బెంగుళూరులో భారత్ మీద ఐర్లాండ్ సూపర్ స్టార్ కెవిన్  ఒ బ్రెయిన్ అద్బుత ప్రదర్శన తర్వాత ఇన్నాళ్లకు ఇప్పుడు టీ2 ప్రపంచ కప్ లో బాల్బ్రీన్ రూపంలో మరో బ్రహ్మాండమైన బ్యాటర్ లభించాడు. అతను అత్యధికంగా 62 పరుగులు, చేసి జట్టు విజయాన్ని అందించాడు.  ఇంగ్లండ్ 5 వికెట్ల నష్టానికి 14.3 ఓవర్లలో 105 పరుగులే చేసింది. మలాన్ 35 పరుగులు చేశాడు. అయితే డి ఎల్ ఎస్ విధానంలో ఐర్లాండ్ ను విజేతగా ప్రకటించారు. 

వాస్తవానికి మ్యాచ్ చాలా భాగం ఐర్లాండ్ ధాటికి అంత పెద్ద ఇంగ్లండ్ ఒణికిందనాలి. జోష్ లిటిల్ కొత్త బంతితో స్వింగ్ చేస్తుంటే ఇంగ్లండ్ బ్యాటర్లు తమ మెల్బోర్న్పిచ్ మీదనే ఎదుర్కొనలేక భయపడ్డా రనాలి. అలాగే బెన్ స్టోక్స్ ను అరికట్టడంలో కొత్త కుర్రాడు ఫియాన్ హాండ్ అద్భుత బౌలింగ్ ప్రదర్శిం చాడు. మరో వంక లెగ్ స్పిన్నర్ గరెట్ డాలానీ ఇంగ్లండ్ రన్ రేట్ ను దెబ్బతీశాడు. అయితే మోయిన్ ఆలీ 15వ ఓవర్లో కొట్టిన సిక్స్ తో ఇంగ్లండ్ కి ఆశలు కలిగించాడు. అప్పటికి ఇంగ్లండ్ విజయానికి కేవలం 5 పరుగుల దూరంలో ఉన్నారు. అప్పుడే వర్షం పడి వారి ఆశలను దెబ్బతీసింది.  వర్షం తగ్గడం, రావడం.. ఈ దోబూచులాటల మధ్యలో స్టిర్లింగ్, క్రిస్ ఓక్స్ బాగా ఆడారు. 

కానీ లొర్కాన్ టకర్ స్పిన్నర్లనే కాదు పేసర్లను కూడా బాగా ఎదుర్కొగలనని నిరూపించాడు. అతను 27 బంతుల్లో 37 పరుగులు చేశాడు. 16వ ఓవర్ లో బాల్బ్రీనీ వెనుదిరిగే సమయానికి  ఐర్లాండ్ 3 వికెట్ల నష్టానికి 132 పరుగులు చేసింది.  ఆ తర్వాత 157 పరుగులకు ఇన్నింగ్స్ ముగించింది.  పదే పదే వర్షం అడ్డుపడి  ఆట ఫలితాన్ని డెక్ వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం ఐర్లాండ్ ను విజేతగా ప్రకటించారు. 

By
en-us Political News

  
దేశ రాజధాని దిల్లీలో కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) తలపెట్టిన నిరసన కార్యక్రమం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది.
భారతీయ రాజకీయ రంగంలో మరోసారి తీవ్ర ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.
దసరా పండుగ సెలవులు ప్రారంభం కావడంతో భాగ్యనగరంలో ప్రయాణికుల రద్దీ తారాస్థాయికి చేరింది.
దేశ రాజధాని న్యూఢిల్లీలో రాజకీయ వేడి తారాస్థాయికి చేరింది.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ప్రముఖ జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం లైంగిక వేధింపుల ఉదంతంలో కీలక పరిణామం చోటుచేసుకుంది.
పశ్చిమ బెంగాల్‌లోని నందిగ్రామ్‌ అసెంబ్లీ ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి హసిరాణి రథ్‌ భారీ విజయం సాధించారు.
ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఏవియేషన్ రంగానికి సంబంధించి అత్యంత కీలకమైన చారిత్రాత్మక పరిణామం చోటుచేసుకుంది.
ఈ ఏడాది నోబెల్ శాంతి బహుమతి ప్రకటన అంతర్జాతీయ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన గాదె సాయి కృష్ణ కస్టోడియల్‌ డెత్‌ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) కీలక ఛార్జిషీట్‌ను కోర్టుకు సమర్పించింది.
ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే అత్యున్నత పురస్కారాలలో ఒకటైన 2026 సంవత్సరపు నోబెల్ శాంతి బహుమతిని భారత సంతతికి చెందిన ప్రముఖ న్యాయకోవిదురాలు నవనీతం నవి పిళ్లై గెలుచుకున్నారు.
అర్ధరాత్రి వేళ రోడ్లపై పుట్టినరోజు వేడుకలు నిర్వహిస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ నగరవాసులకు విజ్ఞప్తి చేశారు.
చిన్న శ్రీనుకు విజయనగరం జిల్లా తెలుగుదేశం అధ్యక్ష బాధ్యతలను అప్పగించనున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే ఈ విషయంలో అధికారికంగా తెలుగుదేశం హై కమాండ్ నుంచి ఎటువంటి ప్రకటన కానీ, సంకేతం కానీ రాలేదు. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.