Publish Date:Apr 28, 2026
ఇరాక్ రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. గత కొంతకాలంగా సాగుతున్న రాజకీయ ప్రతిష్ఠంభనకు తెరదించుతూ ఆ దేశ నూతన అధ్యక్షుడు నిజార్ అమేదీ కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రముఖ వ్యాపారవేత్త, బ్యాంకర్ అయిన 40 ఏళ్ల అలీ అల్ జైదీని ఇరాక్ ప్రధాన మంత్రిగా నామినేట్ చేశారు. అమెరికా నుంచి వచ్చిన తీవ్ర ఒత్తిడి నేపథ్యంలోనే అధ్యక్షుడు ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టమౌతోంది.
ముందుగా ఇరాక్ పార్లమెంటరీ కూటమి కోఆర్డినేషన్ ఫ్రేమ్‌వర్క్ మాజీ ప్రధాని నూరి అల్ మాలికిని ఆ పదవిలో కూర్చోబెట్టాలని భావించింది. అయితే, మాలికికి ఇరాన్‌తో ఉన్న సన్నిహిత సంబంధాల దృష్ట్యా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ దీనిని తీవ్రంగా వ్యతిరేకించారు. ఒకవేళ ఇరాన్ అనుకూల నేతను ప్రధానిని చేస్తే.. ఇరాక్‌కు అందిస్తున్న అన్ని రకాల ఆర్థిక, సైనిక సహకారాలను నిలిపివేస్తామని ట్రంప్ హెచ్చరించారు. దీంతో అగ్రరాజ్యం ఆగ్రహానికి గురికావడం ఇష్టం లేక ఇరాక్ అగ్రనేతలు దిగివచ్చారు.
అలీ అల్ జైదీకి రాజకీయాల్లో ఎటువంటి పూర్వ అనుభవం లేదు. ఇరాక్ చరిత్రలో అత్యంత పిన్న వయస్కుడైన ప్రధానిగా ఆయన రికార్డు సృష్టించనున్నారు. వృత్తిరీత్యా బ్యాంకర్, సక్సెస్ఫుల్ బిజినెస్మెన్ అయిన జైదీకి ఒక టీవీ ఛానెల్ కూడా ఉంది. ఎటువంటి వివాదాలు లేని వ్యక్తిగా పేరున్న జైదీని ఎంపిక చేయడం ద్వారా అటు అమెరికాను, ఇటు దేశీయ అవసరాలను సమతుల్యం చేయవచ్చని అధ్యక్షుడు అమేదీ భావిస్తున్నట్లు కనిపిస్తోంది.
రాజ్యాంగ నిబంధనల ప్రకారం, అలీ అల్ జైదీకి తన మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసుకోవడానికి 30 రోజుల గడువు ఉంది. అయితే ఆయన బాధ్యతలు చేపట్టగానే అనేక సవాళ్లు ఎదురుకానున్నాయి. ముఖ్యంగా ఇరాక్‌లో క్రియాశీలకంగా ఉన్న ఇరాన్ మద్దతు గల గ్రూపులను అదుపు చేయాలని వాషింగ్టన్ డిమాండ్ చేస్తోంది. దీనిని జైదీ ఏ విధంగా డీల్ చేస్తారనేది చూడాల్సి ఉంది.
మరోవైపు, దేశ ఆర్థిక పరిస్థితి కూడా ఆందోళనకరంగా ఉంది. హార్మూజ్ జలసంధిలో ఏర్పడిన ఉద్రిక్తతల వల్ల చమురు ఎగుమతులు దెబ్బతిని ఆదాయం పడిపోయింది. చమురుపైనే 90 శాతం ఆధారపడిన ఇరాక్ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడం జైదీకి అగ్నిపరీక్షే అని చెప్పాలి. గల్ఫ్ దేశాలతో సంబంధాలను పునరుద్ధరిస్తూనే, అగ్రరాజ్యాల మధ్య సమతుల్యతను కాపాడుకుంటూ ఆయన దేశాన్ని ఎలా ముందుకు నడిపిస్తారన్నది ప్రశ్నార్థకమే.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/iraq-bows-to-pressure-from-us-president-trump-36-218482.html
పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు పట్టణంలో పురాతన రామాలయ పునర్నిర్మాణ పనులు ఘనంగా ప్రారంభమయ్యాయి.
ప్రముఖ సినీ నటుడు, నిర్మాత బండ్ల గణేశ్ కుమార్తె జనని నిశ్చితార్థ వేడుక ఆదివారం ఉదయం హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది.
కరీంనగర్ నగరంలో ఆదివారం మధ్యాహ్నం సంచలనాత్మక దోపిడీ ఘటన చోటుచేసుకుంది.
దేశ రాజధాని ఢిల్లీలో పెను విషాదం చోటుచేసుకుంది.
హైదరాబాద్ నగరంలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది.
ఎస్.కె.జిలానీ తన కుమారుడు ఫైసల్‌తో కలిసి బైక్‌పై ఎల్బీ నగర్ వైపు వెళ్తుండగా.. . గాయత్రినగర్ వద్దకు రాగానే వెనుక నుంచి వేగంగా వచ్చిన ఓ కారు వీరి వాహనాన్ని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఫైసల్‌కు గాయాలయ్యాయి. కారు డ్రైవర్‌ను నిలదీసేందుకు జిలానీ కారుకు అడ్డంగా వెళ్లారు. అయితే డ్రైవర్ కారు ఆపకుండా ముందుకు పోనివ్వడంతో జిలానీ కారు బానెట్‌పై పడి దాన్ని గట్టిగా పట్టుకున్నారు.
ఈ మ్యాచ్‌లో తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ముంబై ఇండియన్స్‌కు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి కేవలం 159 పరుగులు మాత్రమే చేయగలిగింది. ముంబై బ్యాటర్లలో నమన్ ధిర్ 57 పరుగులతో రాణించాడు. మిగిలిన వారు ఆశించిన స్థాయిలో రాణించలేకపోయారు. ముఖ్యంగా కెప్టెన్ హార్దిక్ పాండ్యా 23 బంతుల్లో కేవలం 18 పరుగులు మాత్రమే చేసి నెమ్మదిగా ఆడటం జట్టు స్కోరుపై ప్రభావం చూపింది.
వియత్నాం యుద్ధం తర్వాత అమెరికాలో ఏర్పడిన అసంతృప్తి కారణంగా 1973లో ఈ చట్టాన్ని తీసుకొచ్చారు. అప్పట్లో అధ్యక్షుడు కాంగ్రెస్‌ను పక్కనబెట్టి ఏక పక్షంగా యుద్ధాన్ని కొనసాగించడం ప్రజాస్వామ్య వ్యవస్థపై ప్రశ్నలు లేవనెత్తింది. అందుకే భవిష్యత్తులో అలాంటి పరిస్థితులు రాకుండా నియంత్రణలు అవసరమని భావించి ఈ చట్టాన్ని అమల్లోకి తెచ్చారు.
అసలే నష్టాల్లో కూరుకుపోయిన స్పిరిట్ ఎయిర్‌లైన్స్ యుద్దం కారణంగా ఇంధన ధరలు రెట్టింపు అవ్వడంతో.. ఇక సర్వీసులు నడపలేమని చేతులెత్తేసింది. త్వరలో అన్ని కార్యకలాపాలకూ ఫుల్ స్టాప్ పెడతామని ప్రకటించింది. తమ ప్రయాణికులు ఎయిర్‌పోర్టులకు వెళ్లవద్దని సూచించింది
నారాయణ్‌పూర్ జిల్లాకు ఆనుకుని ఉన్న ఛోటేబేతియా పోలీస్ స్టేషన్ పరిధిలోని అటవీ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఛత్తీస్‌గఢ్‌ని మార్చి 31న సాయుధ మావోయిస్టులు లేని రాష్ట్రంగా ప్రకటించారు. సాయుధ మావోలు లేని రాష్ట్రంగా ప్రకటించిన తర్వాత రాష్ట్రంలో జరిగిన తొలి పేలుడు ఇదే కావడం గమనార్హం.
సీఎం చంద్రబాబుకు పవన్ కల్యాణ్, ఆయన భార్య అనా కొణిదెల సాదరంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పవన్ ఆరోగ్య పరిస్థితిని చంద్రబాబు అడిగి తెలుసుకున్నారు.
లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వినియోగం వ్యవహారంలో సూత్రధారిగా ఏకసభ్య కమిషన్ తేల్చిన ఈవో ధర్మారెడ్డి వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబానికి అత్యంత సన్నిహితుడిగా గుర్తింపు పొందారు.
గత కొద్ది కాలంగా మంత్రి లోకేష్ నేతృత్వంలో విద్యాశాఖ పలు విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది. కొద్దిరోజుల క్రితమే ఏపీ ప్రభుత్వ పాఠశాలలకు చెందిన విద్యార్థుల బృందం ఢిల్లీ పర్యటనకు వెళ్లి.. అక్కడి సైన్స్ సెంటర్లు, ప్రముఖ విద్యా సంస్థలను సందర్శించి వచ్చిన సంగతి తెలిసిందే. పుస్తకాల్లోని జ్ఞానానికి తోడుగా విద్యార్థులకు వాస్తవిక ప్రపంచంపై అవగాహన కల్పించేందుకు ఆ యాత్ర ఎంతో దోహదపడింది. ఇప్పుడు ఉపాధ్యాయులను కూడా విదేశాలకు పంపడం ద్వారా అటు విద్యార్థులకు, ఇటు ఉపాధ్యాయులకు ఇద్దరికీ సమానమైన ప్రాధాన్యత ఇస్తున్నట్లు స్పష్టమవుతోంది.