ఇరాన్ గగనతలంలో ఒకే రోజు అమెరికాకు చెందిన రెండు యుద్ధ విమానాలు కూలిపోయిన ఘటనపై అగ్రరాజ్యాధినేత డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. ప్రస్తుతం తాము యుద్ధంలో ఉన్నామన్న ఆయన యుద్ధంలో యుద్ధ విమానాలకు నష్టం జరగడం అన్నది సర్వసాధారణమని పేర్కొన్నాడు. ఈ విమానాలు కూలిపోయిన సంఘటనలు శాంతి చర్చలకు ఎలాంటి ఆటంకం కాబోవని ట్రంప్ అన్నారు. గల్ఫ్ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నప్పటికీ.. ఇరాన్‌తో జరగాల్సిన దౌత్యపరమైన చర్చలకు ఎలాంటి ఆటంకం ఉండదన్నారు.
మధ్యప్రాచ్యంలో శుక్రవారం (ఏప్రిల్ 3) ఒకేరోజు రెండు అమెరికా యుద్ధ విమానాలను ఇరాన్ కూల్చివేయడం అంతర్జాతీయం కలకలం రేపింది. ఇరాన్ యుద్ధ సామర్ధ్యంపై ప్రపంచ దేశాలు అబ్బురపడుతున్నాయి. అమెరికా అంచనాలు ఘోరంగా దెబ్బతిన్నాయని అంటున్నాయి. ఇక పోతే ఇరాన్ దూకుడుతో అగ్రరాజ్యం డిఫెన్స్ లో పడింది. పదే పదే శాంతి చర్చల జపం చేస్తున్నది. ఇరాన్ నిర్ద్వంద్వంగా నో అంటున్నప్పటికీ బాబ్బాబు కాల్పుల విరమణ ఒప్పందానికి రండి అంటూ బతిమలాడుకుంటున్నట్లుగా అమెరికా తీరు ఉందని యుద్ధ నిపుణులు సైతం విశ్లేషిస్తున్నారు. తొలుత అమెరికాకు చెందిన ఎఫ్-15ఈ స్ట్రైక్ ఈగిల్ అనే అత్యాధునిక యుద్ధ విమానాన్ని ఇరాన్ కూల్చివేసింది. ఈ విమానంలో ని ఇద్దరు సిబ్బందిలో ఒకరిని సహాయక బృందాలు కాపాడాయి. రెండో పైలట్ కోసం గాలింపు జరుగుతోంది.
అతడిని ప్రాణాలతో పట్టుకుని అప్పగిస్తే భారీ నజరానా ఇస్తామని ఇరాన్ ప్రకటించింది. ఈ సంఘటన జరిగిన కొద్ది సేపటికే ఇరాన్ మరో అమెరికా యుద్ధ విమానాన్ని కూడా కూల్చివేసింది. అయితే అమెరికా మాత్రం రెండో యుద్ధ విమానం కూలిపోవడానికి సాంకేతిక లోపం కారణమంటున్నది. రెండో విమానం కూలిపోయిన ఘటనలో ఆ విమాన సిబ్బంది పరిస్థితి ఏమిటన్నది కూడా తెలియరాలేదు. కాగా ఒకే రోజు రెండు అమెరికా విమానాలను ఇరాన్ కూల్చివేయడంతో యుద్ధ తీవ్రత మరింత పెరిగినట్లైంది. ఈ విమానాల కూల్చివేతకు ప్రతిగా అమెరికా ఏ విధంగా ముందుకు సాగుతుంది, అమెరికా దుడులకు ఇరాన్ ఎలా బదులిస్తుందన్న విషయంపై సర్వత్రా ఉత్కంఘ నెలకొంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/iran-strikes-down-two-american-warflights-36-216651.html
మొదటి దశలో ఆలయం చుట్టూ పటిష్టమైన ప్రాకారం, సుదూర ప్రాంతాల నుండి సైతం భక్తులను ఆకర్షించే విధంగా ఏడు అంతస్తుల మహా రాజగోపురం, భక్తుల సౌకర్యార్థం ఆర్జిత సేవా మండపం, అద్దాల మండపంతో పాటు వాహన, రథ మండపాలను నిర్మించనున్నారు.
దర్యాప్తులో సంబంధిత కాలంలో ఆయనకు వివిధ వనరుల ద్వారా సుమారు 1.60 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందనీ, అదే కాలంలో 71.58 లక్షల రూపాయల మేర ఖర్చులు జరిగినట్లు అధికారులు నిర్ధారించారు. ఈ లెక్కల ప్రకారం ఆయన వద్ద చట్టబద్ధంగా ఉండాల్సింది 88.42 లక్షల రూపాయలు మాత్రమేనని ఏసీబీ ఎఫ్ఐఆర్ లో పేర్కొంది.
విద్యా రంగం పట్ల ప్రభుత్వం అవలంబిస్తున్న నిర్లక్ష్య వైఖరిని గర్హించారు. దీర్ఘ కాలంగా అపరిష్కృతంగా ఉన్న విద్యార్థుల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శలు గుప్పించారు. కాగా ఈ సందర్భంగా పలు డిమాండ్లను విద్యార్థి సంఘాల నాయకులు ప్రభుత్వం ముందు ఉంచారు.
జింబాబ్వే పర్యటన కోసం ప్రకటించిన భారత టీ20 జట్టు ఎంపిక వివాదాస్పదంగా మారింది. ఐపీఎల్‌లో 501 పరుగులు చేసిన ఆర్సీబీ స్టార్ రజత్ పాటిదార్‌ను పక్కనపెట్టి, ఒక్క వికెట్ తీయని మయాంక్ యాదవ్‌కు చోటు ఇవ్వడంపై సోషల్ మీడియాలో అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
వైజాగ్‌లో కాగ్నిజెంట్ ఐటీ సెజ్ ఏర్పాటుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్. మధురవాడ, రుషికొండ, ఎండాడ ప్రాంతాల్లో భారీగా పెరుగుతున్న ఇళ్ల అద్దెలు మరియు కొత్త ఐటీ ఉద్యోగాల పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు అమరావతి, తిరుపతి ఆర్థిక ప్రాంతాల మాస్టర్ ప్లాన్ కోసం 6 నెలల డెడ్‌లైన్ విధించారు. స్వర్ణ ఆంధ్ర 2047 లక్ష్యాలు, వైజాగ్ బే సిటీ ప్రాజెక్ట్ విశేషాలు మరియు రాయలసీమ హార్టికల్చర్ విప్లవంపై పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
బెంగళూరు కెంపెగౌడ విమానాశ్రయానికి వెళ్లే వారికి ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి. హెబ్బాల్ నుంచి ఎయిర్‌పోర్ట్ వరకు రూ.35 కోట్లతో నిర్మించనున్న సిగ్నల్ రహిత కారిడార్, సదాహళ్లి అండర్‌పాస్ పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
వ్యవస్థీకృత దుష్ప్రచారం చేసే వారిపై చర్యలు తీసుకునే క్రమంలో.. రాజ్యాంగం కల్పించిన భావవ్యక్తీకరణ స్వేచ్ఛకు, ప్రజాస్వామ్య చర్చలకు, చట్టబద్ధమైన విమర్శలకు ఎలాంటి భంగం కలగకుండా పోలీసులు వ్యవహరించాలని స్పష్టం చేశారు.
ఇరాన్ అంతు చూస్తామంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఫినిష్ ది జాబ్ అంటూ ఓవల్ ఆఫీస్ నుండి ట్రంప్ చేసిన వ్యాఖ్యలు, టెహ్రాన్‌లో వ్యక్తమవుతున్న ప్రతీకార జ్వాలల వెనుక ఉన్న అసలు కారణాలు మరియు పూర్తి వివరాలు ఈ వెబ్ స్టోరీలో చూడండి.
బజాజ్ ఆటో సంస్థ ప్రకటించిన రూ. 5,633 కోట్ల మెగా బైబ్యాక్ ఆఫర్ నేటితో ముగియనుంది. ఒక్కో షేరును రూ. 12,000 చొప్పున 20% ప్రీమియం ధరతో కొనుగోలు చేస్తున్న కంపెనీ. అర్హత వివరాలు, ముగింపు గడువు మరియు నిపుణుల సూచనలు ఇక్కడ చదవండి.
ఆత్మహత్యకు ప్రేరేపించడంతో పాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టం కింద కృష్ణలంక పోలీసులు నాగరాజుపై కేసు నమోదు చేశారు.
ఇన్కమ్ టాక్స్ సెక్షన్ 143(3) కింద స్క్రూటినీ నోటీసు వచ్చిందా? ఆందోళన పడకుండా ఆన్‌లైన్‌లో DIN నంబర్ వెరిఫై చేసుకునే విధానం, నోటీసును నిర్లక్ష్యం చేస్తే పడే 50% నుండి 200% భారీ జరిమానాలు మరియు e Proceeding ద్వారా సురక్షితంగా స్పందించే పూర్తి వివరాలు ఈ వెబ్ స్టోరీలో చూడండి.