అమెరికా స్థావరాలపై ఇరాన్ భారీ దాడులు.!

Publish Date:Jul 30, 2026

Advertisement

మిడిల్ ఈస్ట్  రణరంగంగా మారింది. అమెరికా, ఇరాన్ దేశాల మధ్య వైరం  మధ్య ప్రాచ్యాన్ని యుద్ధ భూమిగా మార్చేసింది.   అమెరికాకు కీలక సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడింది.

బహ్రెయిన్‌లోని ప్రసిద్ధ షేక్ ఇసా వైమానిక స్థావరంలోని అమెరికా మౌలిక సదుపాయాలు, కీలక సైనిక ఆస్తులపై  ఐఆర్‌జీసీ డ్రోన్లతో భారీ స్థాయిలో దాడులకు పాల్పడింది.  ఈ  దాడుల్లో   అమెరికా దళాలకు   విద్యుత్ సరఫరా చేసే పవర్ జనరేటర్లు, వైమానిక సర్వీసులు,  నావిగేషన్ వ్యవస్థలు, ఎడ్మినిస్ట్రేషన్ కార్యాలయాలు ధ్వంసమయ్యాయి.  ఈ దాడితో పశ్చిమాసియాలో అమెరికా సైనిక కార్యకలాపాలు  స్తంభించిపోయే వాతావరణం ఏర్పడింది.

కాగా  బహ్రెయిన్‌కే పరిమితం కాకుండా, పొరుగున ఉన్న ఇతర దేశాల్లోని అమెరికా స్థావరాలపైనా ఇరాన్ ఏకకాలంలో దాడులకు పాల్పడింది. కువైట్‌లోని అలీ అల్ సేలం వైమానిక స్థావరం, జోర్డాన్‌లోని అల్-అజ్రక్ వైమానిక స్థావరాలపై కూడా ఇరాన్, డ్రోన్లు, క్షిపణులతో విరుచుకుపడింది. ఈ దాడులను స్వయంగా ఐఆర్‌జీసీ  ప్రకటించింది.  

బుధవారం (జులై 29) రాత్రి  ఇరాన్ సరిహద్దులోని  ప్రాంతాలపై అమెరికా జరిపిన  వైమానిక దాడులకు ప్రతీకారంగానే ఈ భారీ దాడులు చేసినట్లు ఇరాన్ ప్రకటించింది.  ప్రపంచ వాణిజ్యానికి నాడి లాంటి హర్మూజ్ జలసంధి గుండా వెళ్లే అంతర్జాతీయ వాణిజ్య నౌకలు,  ఇంధన ట్యాంకర్లకు ఇరాన్  ముప్పుగా మారిందంటూ,  అమెరికా గత కొంతకాలంగా ఈ ప్రాంతంలో ఇరాన్ స్థావరాలపై దాడులు చేస్తున్న సంగతి తెలిసిందే. అమెరికా దాడులకు ఇరాన్ కూడా అధునాతన క్షిపణులు,  ఆత్మాహుతి డ్రోన్ల   అమెరికా వైమానిక స్థావరాలపై నిరంతర దాడులకు పాల్పడుతూ దీటుగా బదులిస్తోంది.   

Iran drone attacks, Bahrain Kuwait, IRGC drone strike, Middle East war tensions

By
en-us Political News

  
Google DeepMind విడుదల చేసిన Gemini Robotics 2.0 సాంకేతికత, 92% విజయవంతమైన హోల్ బాడీ కంట్రోల్, అధునాతన సేఫ్టీ బెంచ్‌మార్క్స్ మరియు విప్లవాత్మక ఫీచర్లతో రోబోటిక్స్ రంగాన్ని ఎలా మార్చేస్తుందో పూర్తిగా తెలుసుకోండి.
టవర్లు లేకున్నా మీ మొబైల్‌కు డైరెక్ట్ సిగ్నల్స్ అందించేందుకు అమేజాన్ 5,105 ఉపగ్రహాలను ప్రయోగిస్తోంది. అమేజాన్ లియో D2D ప్రాజెక్ట్, గ్లోబల్‌స్టార్ డీల్ మరియు లాంచ్ టైమ్‌లైన్ పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
గత కొన్ని రోజులుగా ఆయన నాడీ వ్యవస్థను, మెదడు పనితీరును సాధారణ స్థితికి తెచ్చేందుకు శ్రమించినప్పటికీ ఫలితం లేకపోయింది.
గూగుల్ క్రోమ్ వినియోగదారులకు గుడ్‌న్యూస్! ఇకపై బ్రౌజర్‌ను అప్‌డేట్ చేయడానికి రీస్టార్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఏఐ సహాయంతో 1,072 బగ్స్‌ను సరిచేసి డైనమిక్ ప్యాచింగ్ సాంకేతికతను తీసుకొస్తున్న గూగుల్ విప్లవాత్మక అప్‌డేట్ వివరాలు ఇవే!
ఫ్లిప్‌కార్ట్ ఫ్రీడమ్ సేల్ ఆగస్టు 8న ప్రారంభం కానుంది. ఐఫోన్ 17, శాంసంగ్ గెలాక్సీ S25, 4K టీవీలపై భారీ ఆఫర్లు, ఎస్బీఐ కార్డ్‌పై 10% ఇన్‌స్టంట్ డిస్కౌంట్ మరియు ప్లస్ మెంబర్లకు ఆగస్టు 7 నుంచే ఎర్లీ యాక్సెస్ పూర్తి వివరాలు తెలుసుకోండి.
భారత స్టాక్ మార్కెట్లో విదేశీ పోర్ట్‌ఫోలియో పెట్టుబడిదారుల FPI కొనుగోళ్ల జోరు పెరిగింది. ఒకే రోజులో ₹8,831.1 కోట్ల రికార్డు పెట్టుబడులతో పాటు నిఫ్టీ, సెన్సెక్స్ విశ్లేషణ, ఐపీఓ పెట్టుబడులు మరియు మార్కెట్ ట్రెండ్ వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
MV ఎలక్ట్రోసిస్టమ్స్ IPO రోజువారీ GMP, సబ్‌స్క్రిప్షన్ స్టేటస్, షేరు ధర మరియు రైల్వే ప్రొపల్షన్ ఆర్డర్ బుక్ వివరాలను తెలుసుకోండి. మధురి కేలా మద్దతు ఉన్న ఈ ఐపీఓలో పెట్టుబడి పెట్టవచ్చా లేదా బ్రోకరేజ్ విశ్లేషణ ఇక్కడ చూడండి.
కామన్వెల్త్ గేమ్స్ 2026 డిస్కస్ త్రోలో కాంస్య పతకం సాధించిన తల్లి, పీహెచ్‌డీ స్కాలర్ సీమా కాళిరామ్నా స్ఫూర్తిదాయక కథ. 11 నెలల బాబును వదిలి సాధించిన ఈ చారిత్రాత్మక విజయం విశేషాలు చూడండి!
కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్ శుభారంభం! వెయిట్‌లిఫ్టింగ్ రికార్డుతో లవ్‌ప్రీత్ సింగ్ రజతం సాధించగా, డిస్కస్ త్రోలో సీమా కాలిరామ్నా కాంస్యం గెలుచుకున్నారు. నీరజ్ చోప్రా ఫైనల్ విశేషాలు ఇవే!
ఘటన జరిగిన సమయంలో భవనంలో పాతిక నుంచి ముఫ్ఫై మంది వరకూ ఉన్నట్లు తెలుస్తోంది. గత కొంతకాలంగా ఈ భవనంలో మరమ్మతు పనులు జరుగుతున్నాయి.
టీమిండియా సీనియర్ బ్యాటర్ అజింక్య రహానే అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించారు. విరాట్ కోహ్లీ, ఎంఎస్ ధోనీలకు కూడా సాధ్యంకాని అజేయ టెస్ట్ కెప్టెన్సీ రికార్డు, 36 ఆలౌట్ తర్వాత ఆస్ట్రేలియాలో సాధించిన చారిత్రాత్మక సిరీస్ విజయం మరియు రహానే కెరీర్ విశేషాల సమాచారం ఇక్కడ చూడండి.
పౌరుల వ్యక్తిగత డేటాను చోరీకి చైనా అనుబంధ సైబర్ ముఠాలు డార్క్ వెబ్ ఆధారిత కొనుగోళ్లు, అధునాతన హ్యాకింగ్ పద్ధతులను ఉపయోచించాయని ఆ నివేదిక వెల్లడించింది. సాధారణ ప్రజలకు అందుబాటులో లేని సమాచారాన్ని సైతం ఈ రకంగా హ్యాకింగ్ ద్వారా చైనా చోరీ చేయడం వెనుక భారీ కుట్ర, వ్యూహం ఉన్నాయని అమెరికా అనుమానం వ్యక్తం చేస్తున్నది.
ప్రపంచవ్యాప్తంగా మారుతున్న భౌగోళిక రాజకీయ పరిస్థితులు, పెరుగుతున్న సమర వాతావరణం నేపథ్యంలో భారత ప్రభుత్వం అత్యంత అప్రమత్తమైంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.