బహ్రెయిన్ లోని అమెజాన్ డేటా సెంటర్ పై ఇరాన్ దాడి.!

Publish Date:Jul 21, 2026

Advertisement

పశ్చిమాసియా ఉద్రిక్తతలు పీక్స్ కు చేరాయి.  అమెరికా, ఇరాన్ మధ్య రగులుతున్న  ప్రతీకార దాడులు గల్ఫ్ రీజియన్ ను అగ్నిగోళంలా మార్చేశాయి.    అమెరికా చేపట్టిన వైమానిక దాడులకు    ఇరాన్ ప్రతిదాడులతో  పశ్చిమాసియా వ్యాప్తంగా భీతావహ పరిస్థితులు నెలకొన్నాయి. 

తాజాగా ఇరాన్‌ రివల్యూషనరీ గార్డ్స్ జార్డన్ భూభాగంలో ఉన్న అమెరికన్ మిలిటరీ స్థావరాలను   లక్ష్యంగా చేసుకుని విరుచుకుపడ్డారు.  నాసర్ 2 అనే పేరుతో చేపట్టిన ఈ రహస్య సైనిక ఆపరేషన్ ద్వారా శత్రు స్థావరాలపై బాంబుల వర్షం కురిపించాయి. ఈ   మెరుపు దాడి ఫలితంగా అక్కడ పనిచేస్తున్న అత్యాధునిక రాడార్ నియంత్రణ వ్యవస్థలతో పాటు విమాన నిల్వ కేంద్రాలలో సిద్ధంగా ఉన్న ఎఫ్ 15 పోరాట విమానాలుధ్వంసమైనట్లు సమాచారం. ముఖ్యంగా రుక్బాన్ సరిహద్దు ప్రాంతంలో నెలకొల్పిన ప్రధాన అమెరికన్ సైనిక ప్రాంగణంపై జరిగిన క్షిపణి దాడుల ధాటికి పలువురు అమెరికా సైనిక సిబ్బంది ప్రాణాలు కోల్పోయారని ఇరాన్ ప్రకటించింది. 

అలాగే బహ్రెయిన్‌లోని దిగ్గజ సంస్థ అయిన  అమెజాన్   ప్రధాన డేటా సెంటర్‌ను కూడా ధ్వంసం చేసినట్లు ఇరాన్  ప్రకటించింది. తమ దేశ పౌర వసతులపై అమెరికా దళాలు జరిపిన దాడులకు తగిన రీతిలో జవాబు చెప్పడానికే ఈ సాంకేతిక కేంద్రాన్ని లక్ష్యంగా చేసుకున్నట్లు పేర్కొంది.   అయితే ఈ ఆరోపణలు, క్షిపణి దాడి ఘటనను అమెజాన్ కానీ,  బహ్రెయిన్  ప్రభుత్వం కానీ  ధ్రువీకరించలేదు. 

మరోవైపు కువైట్ లో కూడా ఇరాన్ బలగాలు  ఆపరేషన్ లైట్నింగ్   ప్రత్యేక దాడి చేశాయి.  ఈ దాడిలో కువైట్‌లోని  అమెరికన్ మిలిటరీ క్యాంపులైన అరిఫ్జాన్, అహ్మద్ అల్-జాబర్ ఎయిర్ బేస్‌లలో ఏర్పాటు చేసిన ఎయిర్ డిఫెన్స్ కవచాలు, కమ్యూనికేషన్ టవర్లు,  రాకెట్ లాంచర్ వ్యవస్థలను ధ్వంసం అయినట్లు సమాచారం. ఇంకా అలీ అల్-సలేమ్ ఎయిర్ బేస్‌లోని రీపర్ డ్రోన్ నిల్వ కేంద్రంపై జరిపిన దాడిలో అనేక అధునాతన నిఘా , దాడి డ్రోన్లు ధ్వంసమైనట్లు సమాచారం. 

 ఈ నేపథ్యంలోనే.. ఇరాన్ అమెరికాతో పూర్తి స్థాయి యుద్ధం ఆరంభమైందని ప్రకటించింది. మిడిల్ ఈస్ట్ నుంచి  అమెరికా తన దళాలను, మిలిటరీ సామాగ్రిని పూర్తిగా ఉపసంహరించుకునే వరకూ తమ ప్రతిదాడులు కొనసాగుతాయని స్పష్టం చేసింది.  

US Iran War, Gulf Conflict Escalation, Amazon Data Center Attack Bahrain, Jordan US Military Base Strike, Middle East Tension

By
en-us Political News

  
పెళ్లయిన కేవలం రెండు వారాల్లోనే అమెరికాలోని మాసాచుసెట్స్‌లో హైదరాబాద్‌కు చెందిన 27 ఏళ్ల ఇంజనీర్ జాబీర్ హుస్సేన్ నిద్రలోనే కన్నుమూశారు. ఉదయం తల్లితో మాట్లాడిన కొద్ది గంటలకే చోటుచేసుకున్న ఈ విషాద సంఘటన వివరాలు, కుటుంబ సభ్యుల ఆవేదన మరియు పార్థివదేహం రప్పించేందుకు చేస్తున్న ప్రయత్నాలపై పూర్తి కథనం.
నల్లమలలో సోదాలు.. కౌకూర్‌, యాప్రాల్‌, అచ్చంపేటలో ఆయుధాల కోసం గాలింపు..!
హైదరాబాద్ గచ్చిబౌలి అంజయ్యనగర్‌లోని హరిహర మెన్ హాస్టల్‌లో దారుణ హత్య చోటుచేసుకుంది. తోటి పనివాడు ప్రమోద్ జరిపిన కత్తిపోట్లకు కుక్ శశిధర్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలిస్తున్నారు.
ఢిల్లీ ఎర్రకోట బాంబు పేలుడు కేసులో ఎన్ఐఏ సంచలన చార్జ్‌షీట్ దాఖలు చేసింది. 11 మంది ప్రాణాలు తీసిన ఈ ఘటన వెనుక లాల్ మందిర్ దాడి కుట్ర, మూత్రం నుంచి బాంబు తయారీ, 12 సార్లు రెక్కీ నిర్వహించిన విస్తుపోయే వివరాలు వెలుగులోకి వచ్చాయి.
అమెరికాలోని పెన్సిల్వేనియా ల్యాంకాస్టర్ కౌంటీలో ఎఫ్రాతా పోలీసులు చేపట్టిన కీలక అరెస్ట్ వివరాలు. క్రైమ్‌వాచ్ నిఘా మరియు తాజా క్రైమ్ అప్‌డేట్స్ కోసం చదవండి.
ఒడిశా కోరాపుట్ పరిధిలోని బాలిపేట సేవాశ్రమం హాస్టల్‌లో 9వ తరగతి విద్యార్థి సీయారా తాడింగిపై సహవిద్యార్థి తీవ్రంగా దాడి చేశాడు. మత్తు పదార్థాల ప్రభావంతోనే ఈ దాడి జరిగిందని, ర్యాగింగ్ అనుమానాలు ఉన్నాయని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
ఆయుధాలు చోరీ అయ్యాయి అంటూ సీన్ క్రియేట్ చేసిన ఇంటి దొంగలు..!
లండన్ వీసాలు, ఉద్యోగాల పేరిట మోసాల ఆరోపణలతో యూట్యూబర్ నందూస్ వరల్డ్ నందనను విజయవాడ పోలీసులు 4 గంటల పాటు విచారించారు. బిగ్ బాస్ తెలుగు 10 ఎంట్రీ ప్రచారం, రూ. 15 లక్షల ఫిర్యాదు మరియు పోలీసులకు ఆమె ఇచ్చిన షాకింగ్ స్టేట్‌మెంట్ పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
సంగారెడ్డి జిల్లా కంది మండలంలో అక్రమ ఇసుక దందాపై మైనింగ్, రెవెన్యూ, పోలీస్ అధికారులు సంయుక్త దాడులు నిర్వహించారు. ఎర్ధనూర్ సర్వే నెంబర్ 134లోని నక్క వాగు పరివాహక ప్రాంతంలో ఉన్న 6 ఇసుక ఫిల్టర్లను ధ్వంసం చేశారు. వాల్టా చట్టం ఉల్లంఘిస్తే క్రిమినల్ కేసులు పెడతామని అధికారులు హెచ్చరించారు.
లండన్ ఉద్యోగాలు, వీసా రెన్యువల్స్ పేరిట రూ.15 లక్షల మోసానికి పాల్పడిన ఆరోపణలపై నందూస్ వరల్డ్ యూట్యూబర్ నందనను శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఇబ్రహీంపట్నం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు వివరాలు మరియు సీఐ సుబ్రహ్మణ్యం అందించిన పూర్తి సమాచారం ఇక్కడ చదవండి!
ఉత్తరప్రదేశ్ ఝాన్సీలోని పహుజ్ డ్యామ్ వద్ద సోషల్ మీడియా రీల్ కోసం 30 అడుగుల ఎత్తు నుంచి నీటిలోకి దూకిన యువకుడి రెండు కాళ్లు విరిగిపోయాయి. వైరల్ స్టంట్ వికటించిన పూర్తి వివరాలు మరియు వీడియో కథనం ఇక్కడ చదవండి.
సోషల్ మీడియాలో ఓ మహిళా ప్రజాప్రతినిధిని ఉద్దేశించి అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన ఆర్మ్డ్ రిజర్వ్ పోలీస్ కానిస్టేబుల్‌పై సైబరాబాద్ సీపీ డా. ఎం. రమేష్ సస్పెన్షన్ వేటు వేశారు.
కృష్ణాష్టమి 2026 సందర్భంగా భారతదేశంలో తప్పక సందర్శించాల్సిన మథుర, బృందావనం, ద్వారక, గురువాయూర్ మరియు పూరీ జగన్నాథ ఆలయాల విశేషాలు మరియు ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను ఇక్కడ తెలుసుకోండి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.