Publish Date:Jun 24, 2025
ఇరాన్ - ఇజ్రాయెల్ మధ్య యుద్దం మళ్లీ మొదటికి వచ్చింది. రెండు దేశాల మధ్య కాల్పుల విరమణ అమల్లోకి వచ్చిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటన చేసిన గంటలలోపే సీన్ రివర్స్ అయింది. ఇరాన్ - ఇజ్రాయెల్ ఇరు దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించిన కాసేటికే మళ్లీ.. కాల్పులకు సై అంటూ దిగడం.. ఆ రకంగా ప్రకటనలు చేయడం కలకలం రేపుతోంది.. కాల్పుల విరమణ ఒప్పందం అనంతరం ఇరాన్ దాడులకు దిగింది. ఇజ్రాయెల్ లోని పలు నగరాలపై ఇరాన్ క్షిపణి దాడులకు పాల్పడిందని ఇజ్రాయెల్ ఆరోపించింది. ఇరాన్ కాల్పుల విరమణ ఉల్లంఘనకు పాల్పడిందని ఇజ్రాయెల్ ప్రభుత్వం ఆరోపించింది. దీంతో ఇరాన్‌పై మరిన్ని భీకరదాడులు చేస్తామని ఇజ్రాయెల్ రక్షణశాఖ ప్రకటించింది.
బీర్‌షెవాలోని ఓ బిల్డింగ్ మిస్సైల్ దాడిలో కుప్పకూలింది. 9 మంది ఇజ్రాయెల్ పౌరులు చనిపోయారు. దీనికి ప్రతీకారం తీర్చుకుంటామని ఇజ్రాయెల్ ప్రకటించింది. ఇరాన్ దాడిలో బీర్‌షెవాలో మూడు భవనాలు ధ్వంసమయ్యాయయని ప్రకటించింది. దీంతో ఇజ్రాయెల్‌లో హైఅలర్ట్ ప్రకటించారు. ప్రజలు బంకర్లలోకి వెళ్లాలని సూచించారు. ఇరాన్‌లో అధికార మార్పిడి జరిగే వరకు దాడులు చేస్తామని ప్రకటించారు. ఇరాన్ కాల్పుల విరమణ ఉల్లంఘించిందన్న ఇజ్రాయెల్.. ఇరాన్‌పై భీకరదాడులు చేయాలని IDFకు ఆదేశాలివ్వడం సంచలనంగా మారింది. అయితే ఇజ్రాయెల్ ఆరోపణలను ఇరాన్ తీవ్రంగా ఖండిచింది. తాము కాల్పుల విరమణ ఉల్లంఘనకు పాల్పడలేదని స్పష్టం చేసింది.
కాల్పుల విరమణ అమల్లోకి వచ్చిన తరువాత ఎలాంటి దాడులు చేయలేదని వివరణ ఇచ్చింది. ఇజ్రాయెల్‌పై తమకు నమ్మకం లేదని ఇరాన్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రకటించింది. అయితే.. కాల్పుల విరమణను ఆమోదిస్తున్నామని.. శత్రువుపై తమకు అస్సలు నమ్మకం లేదని ఇరాన్ చెప్పింది. తమ వేళ్లు ఇప్పటికీ ట్రిగ్గర్‌పైనే ఉన్నాయని.. చూస్తూ ఊరుకోమంటూ హెచ్చరించింది. ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ‘కాల్పుల విరమణ ఉల్లంఘనలకు’ ప్రతిస్పందనగా.. ఇరాన్ పై దాడులు చేయాలని ఆదేశించిన తర్వాత ఇరాన్ ఈ ప్రకటన చేసింది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/iran-39-200585.html
రిలే దీక్షకు మద్దతుగా గ్రామానికి చేరుకోవాలని ప్రయత్నించిన బీఆర్ఎస్ నేతలు, కార్య కర్తలను పోలీసులు మార్గ మధ్యలోనే నిలిపివేస్తూ వెనక్కి పంపించేశారు. దీంతో పరిగి పరిసర ప్రాంతాల్లో ఉద్రిక్తత నెలకొంది.
ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ చారిత్రాత్మక విజయం సిద్ధించిన రోజిదని పేర్కొన్నారు. అమరావతి రైతుల త్యాగాలకు దక్కిన న్యాయమన్నారు. అమరావతి ఇప్పుడు కేవలం నగరం కాదు, మన ఆత్మగౌరవానికి ప్రతీక అని బాలకృష్ణ పేర్కొన్నారు.
జములమడుగులో ఊహించిన దానికంటే అత్యధికంగా అభివృద్ధి పనులు కొనసాగిస్తున్నామని వివరించారు. వైసిపి అధ్యక్షుడు పులివెందుల ఎమ్మెల్యే జగన్ రెడ్డి వైఖరిని తూర్పారబట్టారు.. ప్రజలను కన్ఫ్యూజ్ చేసి మేలు పొందాలని ప్రయత్నిస్తున్నారంటూ జగన్ పై విమర్శలు కురిపించారు. పకృతిలో పంచభూతాల కూడా తన అధీనంలోనే ఉన్నాయని చెప్పుకునే పెను భూతంగా ఆయన జగన్ రెడ్డిని అబివర్ణించారు.
ఈ కీలక పరిణామం నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా ముఖ్యమంత్రి స్పందిస్తూ.. ఐదు కోట్ల ఆంధ్రుల చిరకాల కోరిక నేడు నెరవేరిందని పేర్కొన్నారు. అమరావతి చట్టానికి ఆమోదం తెలిపి రాష్ట్ర భవిష్యత్తుకు భరోసానిచ్చిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఏపీ ప్రజల తరఫున ఆయన ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు.
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ చట్ట సవరణకు ఆమోదముద్ర వేయడంతో, కేంద్ర న్యాయశాఖ తుది నోటిఫికేషన్‌ను జారీ చేసింది. ఈ పరిణామంతో అమరావతికి పూర్తిస్థాయిలో చట్టబద్ధత లభించినట్లయింది.
అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ప్రతిపక్ష భారతీయ జనతా పార్టీ మధ్య పోరు హోరాహోరీగా సాగే అవకాశం ఉంది, దీని ఫలితాన్ని అనేక నిర్మాణాత్మక మరియు రాజకీయ అంశాలు ప్రభావితం చేస్తున్నాయి.
కాపు రిజర్వేషన్ ఉద్యమ నేతగా ముద్రగడ పద్మనాభం తన చోటుకు ఎసరు వస్తున్నదా అన్న అనుమానంతో.. ఆ కాపు నేత తానేనని చాటుకోవడానికి తన వంతు ప్రయత్నాలు మొదలెట్టేశారంటున్నారు. నేను సైతం అంటూ ఆయన రంగంలోకి దిగినట్లు వైసీపీ వర్గీయులే అంతర్గత సంభాషణల్లో చెప్పుకుంటున్నారు. ఇందుకు తార్కానాలు కూడా చూపుతున్నారు.
ఉభయ సభలలో ఆమోదం పొందిన ఆ బిల్లు ఇప్పుడు దేశ ప్రథమ పౌరురాలు, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వద్దకు చేరింది. ఇక ఆమె సంతకం పెట్టడానూ ఈ బిల్లు చట్టంగా మారుతుంది. ఆమె నేడో, రేపో ఈ బిల్లుపై సంతకం చేయడం ఖాయమని అంటున్నారు.
తమిళనాడులో 2026 ఎన్నికలు హోరాహోరీగా సాగే పోరుగా రూపుదిద్దుకుంటున్నాయి, ఇందులో స్పష్టమైన విజేత ఎవరూ లేరు. స్వల్ప ఓట్ల మార్పులు సీట్ల ఫలితాలపై నిర్ణయాత్మక ప్రభావాన్ని చూపవచ్చు.
రాజకీయం అంటే కేవలం అధికారంలో ఉండటం మాత్రమే కాదని, ప్రజాభిప్రాయాన్ని గౌరవిస్తూ ముందుకు సాగాలని వైసీపీకి హితవు పలుకుతున్నట్లుగా మాట్లాడుతూనే.. ఆ పార్టీకి కర్తవ్యబోధ చేశారు.
బిజెపికి 1951లో శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ స్థాపించిన భారతీయ జనసంఘ్‌తో పునాదులు పడ్డాయి. అక్కడి నుంచి ఈ పార్టీ అంచలంచలుగా ఎదిగి నేడీ స్థితికి చేరుకుంది. గతంలో వాజ్ పేయి ఈ పార్టీకి అధికార వాసన రుచి చూపడంతో.. ఇప్పుడు వరుసగా మూడు పర్యాయాల పాటు అధికారం చేజిక్కించుకుని.. ప్రస్తుతం అప్రతిహాత జైత్ర యాత్ర చేస్తోంది.
చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక పోలవరం జిల్లా చింతూరు, ఎన్టీఆర్ జిల్లా జి.కొండూరు, ఇబ్రహీంపట్నం మండలాల్లో ఎండలు మండిపోతాయి. వడగాలుల ప్రభావం కూడా తీవ్రంగా ఉంటుంది.
రాఘవ్ చద్దా, ఆమ్ ఆద్మీ పార్టీ మధ్య తలెత్తిన అంతర్గత విభేదాలు ఇప్పుడు బహిరంగ యుద్ధంగా మారాయి.