ఇషాన్‌, శ్రేయాస్ బిగ్ హిట్‌.. రైనా ఫ‌ట్‌.. ఐపీఎల్ పోటుగాళ్లు..

Publish Date:Feb 12, 2022

Advertisement

డ్యాషింగ్ బ్యాట్స్‌మెన్ శ్రేయాస్ అయ్య‌ర్ ఏకంగా డ‌బుల్ సిక్స్ కొట్టేశాడు. ఐపీఎల్ యాక్ష‌న్‌లో భారీ మొత్తం సొంతం చేసుకున్నాడు. అయ్యర్‌‌‌ను కేకేఆర్ 12.25 కోట్ల ధ‌ర‌కు దక్కించుకుంది. గత సీజన్‌లో  7 కోట్లకు ఢిల్లీ క్యాపిటల్స్‌‌కు ఆడిన అయ్యర్‌.. ఈసారి కనీస ధర 2 కోట్లతో వేలానికి వ‌చ్చాడు. అయ్యర్ కోసం ఢిల్లీ, గుజరాత్‌, కోల్‌కతా పోటాపోటీగా పోటీ ప‌డ్డాయి. చివరకు 12.25 కోట్లకు కోల్‌కతా నైట్ రైడ‌ర్స్ శ్రేయాస్ అయ్య‌ర్‌ సొంతం చేసుకుంది. 

యంగ్ ప్లేయ‌ర్‌ ఇషాన్‌ కిషన్ ఐపీఎల్ వేలంలో రికార్డు ధర పలికాడు. ఇషాన్ కోసం గుజరాత్‌ టైటాన్స్‌, ముంబయి ఇండియన్స్ పోటీ పడగా.. మధ్యలో అనూహ్యంగా హైదరాబాద్‌ జట్టు పోటీలోకొచ్చింది. చివరికి  రూ. 15.25 కోట్లకు ముంబయి ఇండియన్స్ ఇషాన్ కిష‌న్‌ను దక్కించుకుంది. గతేడాది ఇతడి ధర రూ. 6.20 కోట్లు కాగా.. ఈసారి అత‌ని రేట్ డ‌బుల్ కావ‌డం ఆస‌క్తిక‌రం. 

ఇక‌, సౌతాఫ్రికా స్టార్‌ పేసర్‌ కగిసో రబడాను పంజాబ్ 9.25 కోట్లకు దక్కించుకుంది. గతేడాది ఢిల్లీ తరఫున బరిలోకి దిగిన రబాడ కోసం ఈసారి గుజరాత్‌ గట్టిగానే ప్రయత్నించింది. మ‌ధ్య‌లో పంజాబ్‌​ 9.25 కోట్లతో రబాడను ఎగ‌రేసుకుపోయింది. శిఖ‌ర్ ధావ‌న్‌ను సైతం పంజాబ్ జ‌ట్టు 8.25 కోట్ల‌కు కొనుక్కుంది. 

గతేడాది అత్యధిక వికెట్లు పడగొట్టి పర్పుల్‌ క్యాప్ అందుకున్న హర్షల్ పటేల్‌ను 10.75 కోట్లకు రాయల్ ఛాలెంజర్స్‌ బెంగళూరు జట్టు సొంతం చేసుకుంది. విండీస్ ఆల్‌ రౌండర్‌ జేసన్‌ హోల్డర్‌ను 8.75 కోట్లకు లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్‌ దక్కించుకుంది. షిమ్రోన్‌ హెట్‌ మయర్‌పై 8.50 కోట్లు, యువ ఆటగాడు దేవ్‌దత్ పడిక్కల్‌పై  7.75 కోట్లు వెచ్చించి రాజస్థాన్‌ రాయల్స్‌ జట్టు సొంతం చేసుకుంది. 

సీనియర్‌ ఆటగాడు అంబటి రాయుడుని తిరిగి దక్కించుకునేందుకు సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్లు పోటీ పడ్డాయి. చివరికి రూ.6.75 కోట్లు చెన్నై జట్టు సొంతం చేసుకుంది. గతేడాది ఇతడి ధర రూ.2.20 కోట్లు.

మరోవైపు తొలిసెట్‌లో రవిచంద్రన్‌ అశ్విన్‌, డేవిడ్‌ వార్నర్‌ తక్కువ ధర పలికారు. అశ్విన్‌ ఇదివరకు ఢిల్లీ తరఫున 7.60 కోట్లకు ఆడ‌గా.. ఈసారి రాజస్థాన్ 5 కోట్లకే కొనుగోలు చేసింది. ఇక‌, సన్‌రైజర్స్‌ మాజీ సారథి డేవిడ్‌ వార్నర్‌ సైతం మెగా వేలంలో తక్కువ ధరనే పలికాడు. వార్న‌ర్‌ను ఢిల్లీ క్యాపిటల్స్‌ 6.25 కోట్లకే దక్కించుకుంది. గతేడాది వరకు అతడు రూ.11 కోట్లు తీసుకున్నాడు. అటు.. సురేశ్‌రైనా, స్టీవ్‌ స్మిత్‌, డేవిడ్‌ మిల్లర్‌, షకీబ్‌ అల్ హసన్‌లను కొనుగోలు చేసేందుకు ఎవరూ ఆసక్తి చూపలేదు.   

--శ్రేయస్‌ అయ్యర్‌ 12.25 కోట్లు (కోల్‌కతా)
--హర్షల్‌ పటేల్‌ 10.75 కోట్లు (రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు
--రబాడ రూ.9.25 కోట్లు (పంజాబ్‌‌)
--జేసన్‌ హోల్డర్‌ రూ.8.75 కోట్లు (లఖ్‌నవూ  సూపర్‌ జెయింట్స్‌)
--షిమ్రోన్‌ హిట్‌మయర్ రూ. 8.50 కోట్లు (రాజస్థాన్‌ రాయల్స్‌)
--శిఖర్‌ ధావన్‌ రూ.8.25 కోట్లు (పంజాబ్‌)
--నితీశ్‌ రాణా రూ.8 కోట్లు  (కోల్‌కతా నైట్‌ రైడర్స్‌)
--ట్రెంట్‌ బౌల్ట్‌ రూ.8 కోట్లు (రాజస్థాన్‌‌)
--దేవ్‌దత్‌ పడిక్కల్‌  రూ.7.75 కోట్లు (రాజస్థాన్‌ రాయల్స్‌)
--కమిన్స్‌ రూ.7.25 కోట్లు (కోల్‌కతా‌)
--ఫా డుప్లెసిస్‌ రూ.7 కోట్లు (బెంగళూరు)
--క్వింటన్‌ డికాక్‌ రూ.6.75 కోట్లు (లఖ్‌నవూ)
--మహ్మద్‌ షమి రూ.6.25 కోట్లు (గుజరాత్‌)
--డేవిడ్‌ వార్నర్‌ రూ.6.25 కోట్లు (దిల్లీ)
--దీపక్‌ హుడా రూ.5.75 కోట్లు (లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్‌) 
--అశ్విన్‌ రూ.5 కోట్లు (రాజస్థాన్‌)
--మనీశ్‌ పాండే రూ.4.6 కోట్లు (లఖ్‌నవూ)
--డ్వేన్‌ బ్రావో రూ.4.40 కోట్లు (చెన్నై సూపర్‌ కింగ్స్‌)
--రాబిన్‌ ఉతప్ప రూ.2 కోట్లు (చెన్నై సూపర్‌ కింగ్స్‌)
--జేసన్‌ రాయ్‌ రూ. 2 కోట్లు  (గుజరాత్ టైటాన్స్‌)

మొద‌టి సెట్లో అమ్ముడుపోని ఆటగాళ్లు.. 
--సురేశ్ రైనా
--స్టీవ్‌ స్మిత్‌
--డేవిడ్ మిల్లర్‌
--షకీబ్‌ అల్ హసన్‌  
 

By
en-us Political News

  
విజయవాడలో ప్రతిష్ఠాత్మక రామోజీ ఎక్స్‌లెన్స్ అవార్డుల ప్రదానోత్సవం ఘనంగా నిర్వహించారు.
ఆన్‌లైన్ పరిచయం.. చాటింగ్‌తో స్నేహం.. వీడియో కాల్స్‌తో నమ్మకం.. ఆ తర్వాత ఇంటికి ఆహ్వానం. అంతా సజావుగా సాగుతున్నట్లే కనిపిస్తుంది. కానీ ఆ పరిచయాల వెనుక ఉన్నది స్నేహం కాదు
హైదరాబాద్ వేదికగా ఇటీవల జరిగిన భారత్ సమ్మిట్‌ 2026లో చోటుచేసుకున్న పరిణామాలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి.
సినిమాను తలపించిన నగల దొంగతనం..పట్టించిన పచ్చబొట్టు.!
హైదరాబాద్ నగరవాసులకు, ముఖ్యంగా బిర్యానీ ప్రియులకు భారీ షాక్ తగిలింది.
ప్రియుడి హత్యకు 19 ఏళ్ల యువతి సుపారీ.. షాకింగ్ ట్విస్ట్.!
దీపావళి పండుగను కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడపడానికి స్వస్థలానికి వచ్చిన ఓ యువతికి మృత్యువు అనూహ్య రీతిలో ఎదురైంది.
హిందూ ధర్మంలో అత్యంత పవిత్రమైనదిగా భావించే కార్తీక మాసం ప్రారంభం కావడంతో తెలుగు రాష్ట్రాల్లోని శైవక్షేత్రాలన్నీ ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి.
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మరో విషాద ఛాయలు అలుముకున్నాయి.
తెలంగాణ కాంగ్రెస్ రాజకీయ వర్గాల్లో గత కొంతకాలంగా నెలకొన్న ఉత్కంఠకు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) అధికారికంగా తెరదించింది.
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.
తీపి పదార్థమనుకుని నోట్లో పెట్టుకున్నాడు.. చివరకు విగతజీవిగా మారాడు!
డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్న గిగ్ వర్కర్ల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.