గిఫ్ట్ ప్యాక్ కు ఐ ప్యాక్ దాసోహం!

Publish Date:Apr 3, 2023

Advertisement

పేనుకు పెత్తనం ఇస్తే ... తలంతా గొరిగేసిందని సామెత. ఇప్పుడు ఇండియన్ పొలిటికల్‌ యాక్షన్‌ కమిటీ (ఐ-ప్యాక్‌) వ్యవహారం కూడా అలాగే వుంది. నిజానికి  ఐ ప్యాక్ గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. ఎన్నికల వ్యూహకర్త  ప్రశాంత్ కిశోర్  తెలిస్తే ఐ-ప్యాక్ తెలిసినట్లే. 2019 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో  వైసీపీని గెలిపించడంలో ఐ  ప్యాక్ కీలక భూమిక పోషించిందని అంటారు. నిజానిజాలు ఎలా ఉన్నపటికీ, అప్పటికీ ఇప్పటికీ కూడా ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మంచీ చెడు అన్నిటికీ  ఐ  ప్యాక్ సర్వేలు, సలహాల మీదనే ఆధారపడతారనేది జగమెరిగిన సత్యం.

ప్రశాంత్ కిశోర్  ఐ  ప్యాక్ నుంచి బయటకు వచ్చి ప్రత్యక్ష రాజకీయాలలో అడుగు పెట్టే దిశగా అడుగులు వేస్తున్నా, ఆయన బృందం మాత్రం 2024 ఎన్నికల్లో  వైసీపీని  మరోమారు గెలిపించే లక్ష్యంతో  జగన్ రెడ్డి మహారాజ పోషణలో సర్వేలు చేస్తోంది. వ్యూహాలు రచిస్తోంది. రాష్ట్రంలోని మొత్తం 175 నియోజక వర్గాల్లో ఐ  ప్యాక్ బృందాలు పనిచేస్తున్నాయి. ప్రతి నియోజక వర్గంలో పార్టీ పరిస్థితి, సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్న చోట్ల వారి విజయావకాశాలు, మార్పులు చేర్పులు, ఇతర నియోజక వర్గాల్లో పార్టీ విజయావకాశాలపై విభిన్న కోణాల్లో సర్వేలు నిర్వహించి ఎప్పటికప్పుడు జగన్ రెడ్డికి అందచేస్తున్నాయి. ఈ నివేదికల ఆధారంగానే ముఖ్యమంత్రి నిర్ణయాలు తీసుకుంటారని, ఐ  ప్యాక్ సర్వే నివేదికల ఆధారంగానే జగన్ రెడ్డి టికెట్ కు టిక్  పెడతారని అందరికీ తెలిసి పోయింది.

దీంతో ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో ఐ ప్యాక్‌ కీలకంగా మారింది. అధికార వైసీపీలో ఆ టీమ్‌ పాత్ర కూడా అంతే కీలకంగా ఉంది. అయితే ఇక్కడే అసలు కథ మొదలైంది. నిజానికి, ఐ  ప్యాక్ సభ్యులకు   చాలా సిన్సియర్  గా సీరియస్  నిజాయతీగా  పనిచేస్తారనే పేరుంది. అయితే  ఏడడుగులు కలిసి నడిస్తే, వారు వీరవుతారు అన్నట్లు, నియోజక వర్గాల్లో వైసీపీ ఎమ్మెల్యేలు,నాయకులతో కలిసి పనిచేయడం వల్లనో ఏమో, ఐ – ప్యాక్ టీమ్ లో కొందరు అమ్యామ్యాలకు అలవాడు పడినట్లు తెలుస్తోంది.

వైసీపీ ఎమ్మెల్యేల ప్రలోభాలకు లోబడి, నివేదికలను తారు మరు చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముడుపుల మూటల ‘బరువు’ను బట్టి అభ్యర్ధుల బలాన్ని ఎక్కువచేసి  చూపుతున్నారని, అంటున్నారు. ఉదాహరణకు నెల్లూరు జిల్లాకు చెందిన ఒక ముఖ్యనేత  ఖాయంగా ఓడిపోతరాని ఐ ప్యాక్ సర్వేలో  స్పష్టంగా తేలింది. అయితే, సదరు ఎమ్మెల్యే ఐ  ప్యాక్ కు ఇచ్చిన క్యాష్ గిఫ్ట్ ప్యాక్ బరువుతో నివేదిక మారిపోయిందని అంటున్నారు. ఖాయంగా ఓడి పోయే సిట్టింగ్ ఖాయంగా గెలిచే ఎమ్మెల్యేల జాబితాలో చేరిపోయారని అంటున్నారు. 

ఇది ఒక ఉదహరణ మాత్రమే, చాలా వరకు జిల్లాలో వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేల్లో ఐ-ప్యాక్‌ సర్వే సభ్యుల తప్పుడు నివేదికల వల్ల అనేక ఇబ్బందులను ఎదుర్కోవలసి వస్తుందన్న ఆందోళన కూడా కనిపిస్తోందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. రాష్ట్రంలోని ఉమ్మడి 13 జిల్లాల పరిధిలో దాదాపు 8 జిల్లాల్లో ఇదే తరహాలో చేయి తడిపిన వారికి అనుకూలంగా నివేదికలను తయారు చేసి అధిష్టానానికి పంపుతున్నట్లు తెలుస్తోంది. కొంతమంది జిల్లా సభ్యులు ఇచ్చిన తప్పుడు సర్వేలతో ఐ-ప్యాక్‌ రాష్ట్ర ప్రతినిధులు అవే నివేదికలను ప్రభుత్వ పెద్దలకు అందజేస్తున్నారు. అనేక సందర్భాల్లో ఆ నివేదికల ఆధారంగానే చర్యలు తీసుకుంటుండడంతో కొన్ని జిల్లాల్లో పార్టీ బలహీన పడుతున్నదన్న విమర్శలు కూడా పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి

అలాగే కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో తమ వారికి టికెట్ తెచ్చుకునేందుకు కొందరు పెద్దలు ఐ  ప్యాక్ను ‘మ్యానేజి’  చేస్తునట్లు తెలుస్తోంది. ఆయా నియోజకవర్గాల్లో సర్వేకు ఆదేశించిన సందర్భంలో కొన్ని ప్రాంతాలకు చెందిన సభ్యులు పెద్ద ఎత్తున ముడుపులు తీసుకుని పార్టీకి విధేయుడుగా పనిచేస్తున్న మంత్రులు, ఎమ్మెల్యేలను సైతం బలహీనులుగా చిత్రీకరించి నివేదికలను తయారు చేస్తున్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. అయితే ముఖ్యమంత్రి జగన్ రెడ్డి మాత్రం ఐ ప్యాక్ నివేదికలను బైబిల్ కంటే పవిత్ర పత్రంగా భావిస్తున్నారని, పార్టీలోని కొందరు వాపోతున్నారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి వాస్తవాన్ని గుర్తించి దిద్దుబాటు చర్యలు తెసుకోక పొతే, చేజేతులా ఓటమిని కొని తెచ్చుకున్నట్లే అవుతుందని, పార్టీ పెద్దలు అంటున్నారు.

By
en-us Political News

  
హైదరాబాద్ మహానగరంలో వినాయక చవితి నవరాత్రి వేడుకలు అత్యంత వైభవంగా ముగిశాయి.
దేశవ్యాప్తంగా ఎంతో అత్యాధునిక సౌకర్యాలు, అత్యున్నత భద్రతా ప్రమాణాలతో ప్రయాణాలకు మారుపేరుగా నిలిచిన వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ రైలులో అకస్మాత్తుగా చోటుచేసుకున్న ఒక ఘటన కలకలం రేపింది.
ప్యారడైజ్‌ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.. కానీ థియేటర్‌లో సినిమా చూసే ఆడియన్స్‌కు మరో సర్‌ప్రైజ్‌ సిద్ధమైంది.
వివిధ రాష్ట్రాలకు కొత్త ఇన్‌ఛార్జీలను ప్రకటించిన కాషాయ పార్టీ..!
బెంగళూరులోని కుమ్రం భీం కాదండోయ్ పరప్పన అగ్రహార సెంట్రల్ జైలులో ఉంటూ తీవ్ర మానసిక క్షోభ అనుభవిస్తున్న కన్నడ నటుడు దర్శన్ కేసులోని ప్రధాన నిందితురాలు పవిత్రా గౌడ కోర్టులో చేసిన వ్యాఖ్యలు
అక్టోబరా, నవంబరా, లేదా తరువాతా అన్న ఉత్కంఠకు తెరదించుతూ మంత్రి నారా లోకేష్ వచ్చే నెలలోనే అంటే అక్టోబర్ లోనే స్థానిక సమరం ఉంటుందన్న స్పష్టత ఇచ్చారు.
వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గమైన పులివెందుల పరిధిలోని లింగాల మండలం నుంచి  జెడ్పీటీసీ స్థానానికి పోటీ చేయాల్సిందిగా  వైఎస్ సునీతను లోకేష్ కోరినట్లు  ప్రచారం జరుగుతోంది. కేవలం పోటీ చేయడమే కాకుండా, ఆ ఎన్నికలో విజయం సాధిస్తే..  జిల్లా పరిషత్ చైర్ పర్సన్ పదవి  కట్టబెడతామని స్పష్టమైన హామీ ఇచ్చినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది.
భారతీయ చలనచిత్ర పరిశ్రమ అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవం గుజరాత్‌లోని ఏక్తా నగర్‌లో అత్యంత వైభవంగా జరిగింది.
యువనేత లోకేష్ రాప్తాడు రావడం పార్టీ కేడర్‌కు పండుగ రోజు.
తన కుమార్తె వివాహాన్ని అడ్డుపెట్టుకుని జగన్ తో సయోధ్య కోసం తెరవెనుక ప్రయత్నాలు చేస్తున్నారంటూ తనపై వచ్చిన ఆరోపణలను ఆమె నిర్ద్వంద్వంగా ఖండించారు.  
సినిమా రంగంలో సరికొత్త చరిత్ర సృష్టిస్తూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది.
ప్రముఖ సినీనటి రాధ తన కుటుంబ సభ్యులపై చెన్నై పోలీసులను ఆశ్రయించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.