జగన్ సర్కార్ ను నడిపిస్తున్న ఆ అదృశ్య శక్తి?

Publish Date:Oct 10, 2023

Advertisement

ఏ రాష్ట్రంలో అయినా ప్రభుత్వం అంటే ఎన్నో శాఖలు.. మరెన్నో కార్పొరేషన్లు.. అన్నిటికీ ప్రత్యేకమైన విధి విధానాలు ఉంటాయి. అన్నీ కలిస్తేనే ప్రభుత్వం అవుతుంది. అదేంటో ఏపీలో మాత్రం అన్నిటికీ ఒక్కరే కనిపిస్తారు. పథకం ఏదైనా.. శాఖ ఏదైనా.. నిధులు ఎన్నైనా సీఎం జగన్ మోహన్ రెడ్డి ఒక్కరే కనిపిస్తారు. ఏ శాఖకి మంత్రి ఎవరైనా అన్నిటి గురించి సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఒక్కరే కనిపిస్తారు. కానీ, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్న ప్రకారం అసలు ఏపీ ప్రభుత్వాన్ని నడిపిస్తుంది జగన్ మోహన్ రెడ్డి కాదని.. ఓ అదృశ్య శక్తి నడిపిస్తోంది. ఇప్పటికిప్పుడు ఈ చర్చ రావడానికి జగన్ మోహన్ రెడ్డి తాజా వ్యాఖ్యలే కారణం. కేవలం చర్చతో ఆగిపోకుండా ఏమో జగన్ సర్కార్ ను నడిపిస్తున్న అదృశ్య శక్తి ఉందన్నదే నిజమని జనం నమ్ముతున్నారు కూడా. ఇంతకీ జగన్ ఏమన్నారంటే.. 

తాజాగా విజయవాడలో జరిగిన వైసీపీ విస్తృత స్థాయి సమావేశంలో సీఎం జగన్ మోహన్ రెడ్డి తన ప్రసంగంలో అవినీతి, అక్రమాలు, మోసాలు, కుట్రల గురించి మాట్లాడారు. అక్కడితో ఊరుకోకుండా  అసలు రాజకీయం అంటే ఏమిటి అనే దానికి ఆయన నిర్వచనం చెప్పేశారు. అయితే జగన్ నిర్వచనం పై నెటిజన్లు ఓ స్థాయిలో సెటైర్లు గుప్పిస్తున్నారు. అది వేరే సంగతి. కానీ వైసీపీ విస్తృత స్థాయి సమావేశంలో చంద్రబాబు అరెస్టు అంశాన్నిప్రస్తావించిన జగన్ ఆయన అరెస్టుతో తనకు ఎలాంటి సంబంధం లేదని జగన్ చెప్పారు. ఆ సందర్భంగా ఆయన మాట్లాడిన మాటలే జగన్ సర్కార్ ను నడిపిస్తున్న అదృశ్య శక్తి ఏదైనా ఉందా అన్న అనుమానాలు వ్యక్తం కావడానికి కారణమయ్యాయి.   ఈ సభలో జగన్ చంద్రబాబు అరెస్టు క్రెడిట్ బీజేపీకి  ఇద్దామని అనుకున్నారో లేకపోతే చంద్రబాబు అరెస్టు వెనుక ఉన్నది బీజేపీ అని చెప్పాలనుకున్నారో స్పష్టత లేదు కానీ,  చంద్రబాబు అరెస్టుకు తాను ఎంత మాత్రం కారణం కాదని మాత్రం చెప్పుకున్నారు.   కేంద్రంలో ఉన్న బీజేపీ యే చంద్రబాబు అరెస్టు వెనుక ఉన్నదని చెప్పడానికి ప్రయత్నించారు.   కేంద్రం ఐటీ నోటీసు ఇచ్చిందని, సీఐడీ అరెస్ట్ చేసిందని జగన్ తనకు మాత్రమే సాధ్యమైన లాజిక్ తో మాట్లాడారు. 

కానీ, అసలు కేంద్రం ఐటీ నోటీసులకూ, సీఐడీ అరెస్టుకు సంబంధం ఏమిటో చెప్పలేదు. కానీ కేంద్రంలో బీజేపీ ఉందని.. అందులో సగం మంది టీడీపీ వాళ్లేనని కూడా అన్నారు.  అలాగే తాను లండన్‌లో ఉన్నపుడు చంద్రబాబును పోలీసులు అరెస్టు చేశారని, ఆ ఆరెస్ట్‌తోనూ తనకు ఎలాంటి సంబంధం లేదని పేర్కొన్నారు. అసలు లండన్ లో ఉన్న తనకు చంద్రబాబు అరెస్ట్ గురించి తెలియనే తెలియదని చెప్పుకొచ్చారు. దీంతోనే ఇప్పుడు అసలు రాష్ట్రంలో పాలనపైనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చంద్రబాబు అరెస్ట్ పై జగన్ చేసిన వ్యాఖ్యల అంశంపై బీజేపీ కార్యదర్శి సత్యకుమార్ స్పందించారు. తనకు తెలియకుండానే ప్రతిపక్ష నాయకుడి అరెస్ట్ జరిగిందని జగన్ అంటున్నారంటే రాష్ట్రంలో పాలన ఎటువంటి దయనీయ పరిస్థితుల్లో ఉన్నదో తెలుస్తోందని విమర్శలు గుప్పిస్తూ ట్వీట్లు చేస్తున్నారు. దీంతో సీఎంకు తెలియకుండానే చంద్రబాబు అరెస్ట్ జరిగిందంటే రాష్ట్రాన్ని జగన్ పాలిస్తున్నారా? లేక ఆయన పేరుతో మరెవరైనా పాలిస్తున్నారా అన్న అనుమానాలు కలుగుతున్నాయి..

చంద్రబాబు అరెస్ట్ గురించి జగన్ కు తెలియకపోతే మరి సీఐడీకి ఆదేశాలిస్తున్న ఆ అదృశ్య శక్తి ఎవరు? అన్న చర్చ ప్రజలతో పాటు ప్రభుత్వ వర్గాలలో కూడా వినిపిస్తున్నది. అయితే, నిజానికి జగన్ సీఎంగా ఉన్నా.. అన్ని శాఖలకు మంత్రులు ఉన్నా అన్నీ నడిపించేది ఒక్కరే.. ఆయనే సజ్జల  అన్నది అందరికీ తెలిసిందే. ఇప్పుడు బీజేపీ కార్యదర్శి సత్యకుమార్ లేవనెత్తిన అనుమానాలు కూడా ఇవే. చంద్రబాబు అరెస్టు ఒక్కటే కాదు అసలు ప్రభుత్వం ఏం చేయాలన్నది.. ఏ మంత్రి ఎప్పుడు మీడియా ముందుకొచ్చి ఎవరిని విమర్శించాలన్నది అన్నీ ఆయనే డిసైడ్ చేస్తారని, పథకాల నుండి అప్పుల వరకూ అన్నీ ఆయన చేతుల మీదుగానే నడుస్తాయన్న ఆరోపణలు ఉన్నాయి. ఇటు వైసీపీని అటు ఏపీ ప్రభుత్వాన్ని  ఆయనే నడిపిస్తున్నారని.. పార్టీ సమావేశాల నుండి ప్రభుత్వ పాలసీల వరకూ అన్నీ సజ్జల పర్యవేక్షణలోనే జరుగుతాయని పార్టీ శ్రేణులే చెబుతున్నాయి.  ఇంకా చెప్పాలంటే జగన్.. సంతకానికి, ఇచ్చిన స్క్రిప్ట్ చదవడానికి మాత్రమే రబ్బర్ స్టాంప్ మాదిరి పనిచేస్తున్నారన్న అభిప్రాయం కూడా వ్యక్తం అవుతోంది.

By
en-us Political News

  
సాధారణంగా వైసీపీ ఎకో సిస్టమ్ ఎలా ఉంటుందంటే.. ఎవరైనా సరే  ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని , ఆయన పాలనా విధానాలను పొగిడితే వెంటనే ఆ పొగిడిన వారిపై విమర్శలు గుప్పించేస్తుంది. ఇందుకు గతంలో చాలా చాలా ఉదాహరణలు ఉన్నాయి.
పులివెందుల మునిసిపోల్ రణరంగంగా మారే అవకాశం ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని పోలీసులూ అప్రమత్తమయ్యారు. ఎలాంటి హింసాత్మక ఘటనలకూ తావులేకుండా భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. అవసరమైతే  ఇటు తెలుగుదేశం కూటమి, అటు వైసీపీకి చెందిన ముఖ్య నేతలను హౌస్ అరెస్టు చేసేందుకైనా వెనుకాడబోమని పోలీసులు విస్పష్ట హెచ్చరికలు జారీ చేశారు.
గతంలో రాష్ట్ర రాజకీయాలలో  కొండా సురేఖ కేటీఆర్ పై చేసిన వ్యక్తిగత విమర్శలు  దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ వ్యాఖ్యలకు బేషరతుగా క్షమాపణ చెప్పిన కొండా సురేఖ వాటిని ఉపసంహరించుకున్నారు.   గతంలో కేటీఆర్ పై తాను చేసిన అనుచిత వ్యాఖ్యలను  పూర్తిగా వెనక్కి తీసుకుంటున్నట్లు సోషల్ మీడియా వేదికగా  పేర్కొన్నారు. 
తెలంగాణ రాజకీయాలలో ఏ పార్టీతోనూ పొత్తు లేదు లేదంటూనే జనసేనతో పొత్తుకు తహతహలాడుతోంది. తెలంగాణలో స్వంతంగానే బరిలోకి దిగుతామని కుండబద్దలు కొట్టిన బీజేపీ ఇప్పుడు జనసేనతో అంతర్గత పొత్తు కుదుర్చుకుందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. 
నియోజకవర్గంలో రాబోయే మున్సిపల్ చైర్మన్ ఎన్నికలను తెలుగుదేశం కూటమి గెలుచుకుంటుందన్న ధీమా వ్యక్తం చేశారు. వైసీపీకి పులివెందుల ఇంకెంత మాత్రం కంచుకోట కాదని విస్పష్టంగా పేర్కొన్నారు.  దశాబ్దాలుగా తిరుగులేని ఆధిపత్యం చెలాయిస్తున్న పులివెందులలో కూటమి నేతలు నేరుగా సవాళ్లు విసురుతుండటం పులివెందులలో మసకబారిన వైసీపీ ప్రతిష్ఠకు, పలుకుబడికి నిదర్శనంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 
అయితే, ప్రస్తుతం సిద్ధమవుతున్న చార్జ్‌షీట్‌ను మరింత పటిష్టంగా రూపొందించేందుకు ఉన్నతాధికారులు ఢిల్లీలోని ప్రముఖ సుప్రీంకోర్టు న్యాయవాదులతో సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది. సాంకేతిక సాక్ష్యాలు, బాధితుల వాంగ్మూలాల ఆధారంగా ఈ అదనపు చార్జిషీట్ ను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.
స్థానిక  సన్నాహాలపై తెలుగుదేశం కూటమికి చెందిన దాదాపు 45 వేల మంది ముఖ్య నేతలు, ప్రజాప్రతినిధులు,  కార్యకర్తలతో  సీఎం చంద్రబాబు ఈ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన వైసీపీపై చంద్ర నిప్పులు చెరిగారు.
కర్ణాటక ఎమ్మెల్సీ ఎన్నికల్లో 4-0తో ఎన్డీఏ క్లీన్ స్వీప్.!
జగన్‌ తాను మళ్లీ  అధికారంలోకి వస్తానంటూ జగన్ 2.o అంటూ చేసిన వ్యాఖ్యలకు పవన్ కల్యాణ్ మేం 10x చూపిస్తామంటూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.  తెలుగుదేశం కూటమి ప్రభుత్వ విధానాలను విమర్శిస్తూ జగన్ చేసిన హెచ్చరికలకు పవన్ కల్యాణ్  దీటుగా ఇచ్చిన స్ట్రాంగ్ కౌంటర్ పొలిటికల్ సర్కిల్స్ లోనూ, సోషల్ మీడియాలోనూ కూడా పెద్ద ఎత్తున చర్చకు తెరలేపింది.  
పులివెందుల నియోజకవర్గ పరిధిలో కూటమి అభ్యర్థులు స్పష్టమైన ఆధిపత్యాన్ని ప్రదర్శించారు. దశాబ్దాల కాలంగా ఎలాంటి ప్రతిఘటన లేకుండా ఏకపక్షంగా జగన్ కు పట్టుఉన్న నియోజకవర్గం పులివెందుల. అటువంటి పులివెందులలో ఎంపీటీసి జడ్పీటీసి స్థానాలను టీడీపీ  ఏకగ్రీవంగా కైవసం చేసుకుంది.
2019 ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన తర్వాత   శైలిని ఒకింత మార్చుకున్నారు. 2024 ఎన్నికల ముందు వరకూ ఆయన పార్టీ నేతలు నోటి దురుసు ప్రదర్శించడాన్ని ప్రోత్సహించారు కానీ, స్వయంగా తాను ఒకింత సహనం చూపారు. అంత మాత్రాన రాజకీయ విలువలతో మృదు విమర్శలు చేశారని కాదు కానీ, అధికారంలోకి రావడానికి ముందున్నంత దూకుడు లేదని చెప్పాల్సి ఉంటుంది.
వైయస్ జగన్ ఇలాకాలో టీడీపీ 40 ఏళ్ళ చరిత్రను తిరగాసింది.
రాజకీయ కక్షలను పక్కనపెట్టి, రాష్ట్రాభివృద్ధి, స్థానిక స్వపరిపాలన బలపడే దిశగా అన్ని పార్టీలు అడుగులు వేయాలి. ప్రజాస్వామ్య విలువలను కాపాడుకుంటూ, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పారదర్శకమైన ఎన్నికలను నిర్వహించడమే ఏ ప్రభుత్వానికైనా, వ్యవస్థకైనా అసలైన పరీక్షగా నిలుస్తుంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.