మద్యం కుంభకోణం దర్యాప్తు వేగాన్ని అడ్డుకుంటున్నది అదృశ్య శక్తులా; చీకటి ఒప్పందాలా?
Publish Date:Jan 30, 2026
Advertisement
తెలుగువన్ వాస్తవ వేదిక పదో సంచికలో తెలుగువన్ ఎండి కంఠంనేని రవిశంకర్, జమీన్ రైతు సంపాదకుడు డోలేంద్ర ప్రసాద్ ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణంలో నిందితుల నిగ్గు తేల్చడంలో జరుగుతున్న జాప్యంపై చర్చించారు. అధికారంలో ఉన్న తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఆ కేసు లోతుల్లోకి వెళ్లకుండా ఎందుకు తాత్సారం చేస్తున్నదని నిలదీశారు. దేశంలోనే అతి పెద్ద అవినీతి కుంభకోణంగా ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణాన్ని డోలేంద్ర ప్రసాద్ అభివర్ణించగా, ప్రజల ధనం, ఆరోగ్యంతో ఆటలాడిన ఈ కుంభకోణంలో నేరస్తులను చట్టం ముందు నిలబెట్టడంలో విఫలమవ్వడం కంటే దారుణం మరొకటి ఉండదని, అధిక ధరలకు చౌకబారు మద్యం అమ్మారనీ కంఠంనేని రవిశంకర్ అన్నారు. దాదాపు 1 లక్ష కోట్ల రూపాయల నగదు లావాదేవీలతో కూడిన భారీ స్కామ్ దర్యాప్తు జగన్ తాడేపల్లి ప్యాలెస్ గుమ్మం వద్దకు వెళ్లకుండా ఎందుకు ఆగిపోయిందని, ఎవరు ఆపుతున్నారనీ డోలేంద్ర ప్రసాద్ ప్రశ్నించారు. దేశమంతా డిజిటల్ ట్రాన్సాక్షన్ ను ప్రాథాన్యత ఇస్తుంటే, జగన్ హయాంలో ప్రభుత్వం మద్యం విక్రయాలను నగదు ద్వారా మాత్రమే జరపడం ద్వారా పెద్ద ఎత్తున జీఎస్టీ ఎగవేత కూడా జరిగిందని ఆరోపించారు.
ఇప్పుడు ఈ మద్యం కుంభకోణం కేసును సిట్ కేవలం మూడు వేల కోట్ల రూపాయల ముడుపులపై మాత్రమే దర్యాప్తు చేస్తున్నదన్న డోలేంద్ర ప్రసాద్ ఆ ముడుపుల సొమ్మును న్నికల ఖర్చులు, ఇతర అవసరాలకు తరలించారన్నారు. అన్నిటికీ మించి చౌకబారు మద్యాన్ని (ఛీప్ లిక్కర్) అధిక ధరలకు విక్రయించి ప్రజారోగ్యంపై విషం చిమ్మారనీ.. దీని వల్ల ఎందరో పేదలు ప్రాణాలు కోల్పోయారనీ, మరెంతో మంది అనారోగ్యం పాలయ్యారనీ పేర్కొన్నారు. జగన్ హయాంలో నాణ్యత లేని మద్యాన్ని విక్రయించారన్న విషయాన్ని రఘురామకృష్ణం రాజు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వంటి వారు అంతర్జాతీయ ల్యాబ్ టెస్ట్ ల ద్వారా ఆధారాలతో రుజువు చేశారని వివరించారు.
మద్యం స్కామ్ గత ఎన్నికల్లో కూటమి విజయంలో కీలక పాత్ర పోషించిందన్నారు. మద్యం కుంభకోణం కారణంగానే జగన్ మోహన్ రెడ్డి ఓట్ బ్యాంక్ అయిన పేద వర్గాల ప్రజలు వైసీపీకి వ్యతిరేకంగా కసితో ఓటేశారన్నారు. అటువంటిది ప్రస్తుత తెలుగుదేశం కూటమి ప్రభుత్వం మద్యం కుంభకోణం కేసులో సూత్రధారులను పట్టుకోవడంలో ఎందుకు తాత్సారం చేస్తున్నదని నిలదీశారు. ఇందుకు కారణం అదృశ్య శక్తులా, రహస్య ఒప్పందాలా అన్న సందేహాన్ని వ్యక్తం చేశారు.
ఈ సంచిక వాస్తవ వేదిక పూర్తి పాఠాన్ని తెలుగువన్ యూట్యూబ్ చానెల్ లో ఈ లింక్ లో వీక్షించండి
రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు, రాష్ట్రంలో ఇరిగేషన్ సదుపాయాలను మెరుగుపరిచేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా పూర్తవుతుండటంతో, ఇరిగేషన్ రంగంపై మాట్లాడటానికి ప్రతిపక్షానికి ఎలాంటి అవకాశాలు లేకుండా పోయాయని ఆయన కుండబద్దలు కొట్టారు.
జలయజ్ణం పేరుతో వైఎస్ చేసింది ధనయజ్ణమని విక్రమ్ పూల అన్నారు. ప్రాజెక్టుల అంచనా వ్యయం పెరగడం, ప్రాంతీయ సమతుల్యత లోపించడం, హెడ్ వర్క్స్ కంటే ముందుగా కాలువల తవ్వకం వంటి వాటికే వైఎస్ జలయజ్ణం పరిమితమైందని విక్రమ్ పూల వివరించారు.
కాంగ్రెస్ హైకమాండ్ మీనాక్షీ నటరాజన్ పై వేటు వేయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. రాహుల్ గాంధీ నేతృత్వంలోని జాతీయ నాయకత్వం రాష్ట్రంలో కాంగ్రెస్ వ్వవహారాలను చక్కదిద్దేందుకు భూపేష్ బగెల్ సమర్ధంగా పని చేయగలరని భావించి ఆ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.
తాను పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాననీ, వచ్చే ఎన్నికలలో పోటీ చేయననీ ఆయన చేసిన ప్రకటన పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. తెలుగుదేశం ఆవిర్భావం నుంచీ కూడా ప్రజా ప్రతినిథిగా, పొలిటికల్ లీడర్ గా సేవలందించిన అయ్యన్న పాత్రుడు హఠాత్తుగా రాజకీయాలకు రిటైర్మెంట్ అంటూ చేసిన ప్రకటన రాజకీయవర్గాలలో సంచలనం సృష్టించింది.
2019 ఎన్నికలలో వైసీపీ విజయంలో అప్పటి జగన్ పాదయాత్ర కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. అయితే అప్పట్లో.. జగన్ వాగ్దానాలపై ప్రజలలో నమ్మకం ఉండేది. ప్రజలతో ఆయన మమేకమయ్యేవారు.
రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అధికార రేసులో లేకపోయినప్పటికీ.. రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తూనే ఉంది. అందుకే రాష్ట్రంలో రాజకీయ వేడ రగిలిన ప్రతి సందర్భంలోనూ తెలుగుదేశం ప్రస్థావన వస్తూనే ఉంటుంది.
తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు ఆమె చూపు బీఆర్ఎస్ వైపు మళ్లిందా అన్న అనుమానాలకు తావిచ్చింది. కేబినెట్ నుంచి తనకు ఉద్వాసన పలికిన తరువాత మీడియాకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్న కొండా సురేఖ.. తాజాగా బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై ప్రశంసల వర్షం కురిపించారు.
పిడిక్కీ బియ్యానికీ ఒకే మంత్రం అన్నట్లుగా ఆమె తన బర్త్ రఫ్ కూ తెలుగుదేశం పార్టీకీ ముడి పెట్టారు. సీఎం రేవంత్ రెడ్డిది తెలుగుదేశం రక్తం కనుకనే తనకు కేబినెట్ నుంచి బర్త్ రఫ్ చేశారంటూ మీడియా సమావేశంలో కొండా సురేఖ చేసి కామెంట్స్ రాజకీయవర్గాలలో సంచలనంగా మారాయి.
ఈ ప్రాజెక్టుల నిర్మాణంలో తమ పాత్రే కీలకమని పేర్కొంటూ వైసీపీ క్రెడిట్ వార్ కు తెరతీసింది. సోషల్ మీడియా వేదికగా వైసీపీ వారు పోలవరం ప్రాజెక్టును దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి కలల ప్రాజెక్ట్‌గా అభివర్ణిస్తూ పోస్టులు షేర్ చేస్తోంది.
కోమటిరెడ్డి కుటుంబానికి నల్గొండ జిల్లాలో గట్టి పట్టు ఉంది. ఈ నేపథ్యంలో తాను కేవలం మంత్రి పదవిని మాత్రమే ఆశించే నాయకుడిని కాననీ.. వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లే నాయకుడిననీ ఆయన అంటున్నారు.
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.