Publish Date:Oct 31, 2023
స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ మంజూరైంది. ఆయన నాలుగు వారాలు మధ్యంతర బెయిలు మంజూరు చేస్తూ హైకోర్టు న్యాయమూర్తి ఉత్తర్వులు జారీ చేశారు. స్కిల్ కేసులో చంద్రబాబు దాఖలు చేసుకున్న మధ్యంతర బెయిలు పిటిషన్ పై సోమవారం (అక్టోబర్ 30) వాదనలు ముగియగా న్యాయమూర్తి తీర్పు మంగళవారానికి రిజర్వ చేసిన సంగతి తెలిసిందే. చంద్రబాబు ఆరోగ్యం రిత్యా బెయిలు మంజూరు చేసినట్లు చెబుతున్నారు.
చంద్రబాబుకు నాలుగు వారాల మధ్యంతర బెయిలు రావడంతో ఆయన ఈ రోజు సాయంత్రానికి రాజమహేంద్రవరం జైలు నుంచి బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే ఆయనను నేరుగా ఆసుపత్రికి తరలిస్తారా? లేదా అన్న విషయంలో స్పష్టత రావాల్సి ఉంది. తీర్పు కాపీ బయటకు వచ్చిన తరువాతే ఆ విషయంపై స్పష్టత వస్తుంది. ఇలా ఉండగా నిన్న హైకోర్టులో మధ్యంతర బెయిలుపై వాదనల తరువాత కోర్టు ఆయనకు బెయిలు మంజూరు చేస్తుందన్న విషయంలో వైసీపీ సర్కార్ కు అనుమానం వచ్చినట్లు భావించాల్సి ఉంటుంది.
ఎందుకంటే.. ఆయనను సాధ్యమైనంత ఎక్కువ కాలం జైలులో ఉంచాలన్న లక్ష్యంతో ఉన్న వైసీపీ లక్ష్యం మేరకు ఏపీ సీఐడీ చంద్రబాబును ఏ3గా పేర్కొంటో మరో కేసును రెడీ చేసింది. మద్యం కంపెనీలకు అక్రమంగా అనుమతులిచ్చారంటూ మరో కేసు నమోదు చేసింది. ఇప్పటికే స్కిల్ కేసుతో పాటు ఫైబర్ గ్రిడ్, ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులు నమోదు చేసిన జగన్ సర్కార్ ఇప్పుడు మద్యం కంపెనీలకు అక్రమంగా అనుమతులు ఇచ్చారంటూ మరో కేసు పెట్టింది. ఇలా బాబు పై ఒకదాని వెనుక మరొక కేసులు వేసుకుంటూ వైసీపీ ప్రభుత్వం చంద్రబాబుపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/intrium-bail-to-babu-in-skill-case-39-164277.html
నిన్నటి వరకూ జగన్ కు పెట్టని కోటలా నిలిచిన పులివెందులలో ఇప్పుడు తెలుగుదేశం జెండా ఘనంగా ఎగురుతోంది. సుదీర్ఘకాలంగా వైసీపీకి తిరుగులేని కంచుకోటగా ఉన్ పులివెందుల పరిధిలో తెలుగుదేశం పార్టీ తన ఉనికిని బలంగా చాటుకుంటోంది.
వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 5) జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ పార్టీ చీరాల మునిసిపోల్స్ లో గట్టి పోటీ ఇచ్చింది. 25వ వార్డులో విజయం సాధించింది. 25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు.
పోలింగ్ సరళి, వెలువడిన ఫలితాలు వైసీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అధికార తెలుగుదేశం కూటమి అరాచకాలు, అధికార దుర్వినియోగం తమ ఓటమికి కారణాలుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు. ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత వైఎస్ జగన్ నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జగన్ చెప్పిందే చెప్పారు.
కాంగ్రెస్, కమ్మూనిస్టుల మద్దతుతో ఎన్నికల బరిలోకి దిగిన ఏబీవీకి ఘోర పరాజయం ఎదురైన సంగతి తెలిసిందే. కమ్యూనిస్టులకు అంతో ఇంతో పట్టున్న ప్రాంతాలలో కూడా ఆయనకు ఓట్లు రాలలేదు. ఇక కాంగ్రెస్ మద్దతు ఆయనకు ఎందుకూ కొరగాకుండా పోయింది.
ఈ వేడుకలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కేటీఆర్, విజయ్ ఒకే దగ్గర చేరి సరదాగా ముచ్చటించుకోవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసే నాటికి రాష్ట్ర వ్యాప్తంగా 77 జడ్పీటీసీలు, 2051 ఎంపీటీసీలు ఏకగ్రీవమైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. ఇక మిగిలిన స్థానాలకు పోటీ పడుతున్న 21 వేల 012 మంది అభ్యర్థుల భవితవ్యం తేల్చేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు.
వైసీపీపై అధికార కూటమి ఒత్తిడి, అక్రమాలు ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో ప్రజలు వైసీపీకి వ్యతిరేకంగా ఉన్నారని పరోక్షంగా వ్యాఖ్యానించి, ప్రజా క్షేత్రంలో వైసీపీ బలహీనంగా ఉందని చెప్పకనే చెప్పారు. గతంలో తాము అధికారంలో ఉన్నప్పుడు వ్యవహరించిన తీరు కారణంగానే నేడు వైసీపీకి ఈ గతి పట్టిందంటూ అంబటి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
పాడిందే పాటరా అన్న సామెత చందంగా ఉంది జగన్ తీరు. ఆంధ్రప్రదేశ్లో మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తీవ్ర నిరాశను మిగిల్చాయి. గతంలో 2024 సార్వత్రిక ఎన్నికల ఓటమి తర్వాత ఏ విధంగానైతే ఈవీఎంలు, ఎన్నికల సంఘాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి తప్పుపట్టారో, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల ఫలితాల విషయంలోనూ అదే పాతరాగాన్ని అందుకున్నారు.
2024 ఎన్నికలలో విశాఖ జనం జగన్ విశాఖ రాజధాని ప్రతిపాదనను తిరస్కరించారు. ఇప్పుడు జగన్ మావిగన్ ప్రతిపాదనను మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు జనం ఓటుతో తోసి రాజన్నారు.