ఫ్యూచర్ ప్రైమ్ మినిస్టర్.. కాబోయే శ్రీమతి ఎవరో?

Publish Date:Dec 29, 2022

Advertisement

తెలుగు సినిమా హీరోలలో ‘ద మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఎవరంటే, ఎవరికైనా వెంటనే గుర్తుకొచ్చే పేరు ... బాహుబలి ప్రభాస్.. అలాగే, రాజకీయాల్లో  ‘దమోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్   అనగానే గుర్తు కొచ్చేది  కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ.  నిజమే, ప్రధాని మోడీ (పెళ్ళైన బ్రహ్మచారి), యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ఒరిస్సా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్, ఇలా రాజకీయ ప్రముఖులలో పెళ్లి కాని ప్రసాదులు  ఇంకా కొందరున్నారు. అయినా కూడా  ‘ఎలిజిబుల్ బ్యాచిలర్’ఎవరంటే మాత్రం రాహుల్ గాంధీ పేరే ముందుగా వినిపిస్తుంది. 

 మిగిలిన వారందరికీ పెళ్లీడు దాటిపోయిందని కావచ్చును సోషల్ మీడియాలో రాహుల్ పెళ్లి వార్తలు వైరల్ అయినంతగా ఇతర పెళ్ళి కాని రాజకీయ ప్రముఖుల పెళ్లి వార్తలు వైరల్ అయినా దాఖలాలు లేవు. అలాగని రాహుల్ గాంధీ బాలా కుమారుడా అంటే కాదు. ఆయన ఈ మధ్యనే హాఫ్ సెంచరీ మార్క్ క్రాస్ చేశారు. ఫిఫ్టీ ప్లస్ క్లబ్ లో చేరిపోయారు.  అంతేకాదు, భారత్ జోడో యాత్రలో మేకప్ లేకపోవడం వల్లనో ఏమో, నెరిసిన గడ్డం, ముడతలు పడిన ముఖంతో రాహుల్ గాంధిలో వార్ధక్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోందని సోషల్ మీడియాలో ఆయన కొత్త రూపం  గురించిన పరస్పర విరుద్ధ వ్యాఖ్యలు, వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. ఆయన అభిమానులు పెరిగిన గడ్డంతో రాహుల్ గాంధీ రావీద్రనాథ్ టాగోర్ లా ఉన్నారని మెచ్చుకుంటే, గిట్ట్టని వాళ్ళు  సద్దాం హుస్సేన్ లా ఉన్నారని కడుపు మంట తీర్చుకున్నారు. 

సరే అదెలా ఉన్నా, ఎవరు ఏమన్నా, రాహుల్ గాంధీ అంటే అమ్మాయిల్లో ఇంకా  క్రేజుంది, రాహుల్ పేరుతో వైబ్రేషన్స్ ఫీలయ్యే అమ్మాయిలున్నారు. భారత్ జోడో యాత్రలో ఆయనతో కలిసి నడిచేందుకు, ఆయనతో సేల్ఫీలు దిగేందుకు  అమ్మాయిలు, సెలబ్రిటీలు కూడా పోటీ పడ్డారు. అందుకే ఆయన ఇంకా, ఎలిజిబుల్ బ్యాచిలర్స్ జాబితాలో ఫస్ట్ ప్లేస్ లో ఉన్నారు. అలాగే, రాహుల్ గాంధీ కూడా మన ప్రభాస్ లానే పెళ్లి చేసుకోను .. ఆజన్మ బ్రహ్మచారిగా ఉండి పోతాను, అని ఆఫీషియల్ ప్రకటన ఏదీ చేయలేదు. సోలో లైఫే సో.. బెటరు  అని పాడ లేదు.

అందుకే, రాహుల్ పెళ్లి  గురించి అప్పుడప్పుడు... హాట్ హాట్ వదంతులు షికారు చేస్తూనే ఉన్నాయి. అయితే, ఇంతవరకు రాహుల్ గాంధీ ఎప్పడూ పెళ్లి  వదంతుల మీద స్పందించలేదు. అలాగే విదేశాల్లో పబ్బుల్లో, క్లబ్బుల్లో అమ్మాయిలతో ఉన్న ఫోటోలు, వీడియోలు వైరల్ అయినా ఆయన అంతగా పట్టించుకోలేదు. ప్రత్యర్ధి పార్టీలు శీల పరీక్ష పెట్టినా, ఆయన్ని డిఫెండ్ చేసే బాధ్యత కాంగ్రెస్ వాచాస్పతులు ( అధికార ప్రతినిధులు) ఇతర నాయకులు తీసుకున్నారే కానీ, రాహుల్ జీ ఎప్పడు కూడా తనను తాను డిఫెండ్ చేసుకునే ప్రయత్నం చేయలేదు. కానీ తాజాగా, సరదాగానే అయినా, మీడియా అడిగిన పెళ్లి ప్రశ్నకు రాహుల్ సరదాగా సమాధానమిచ్చారు.

 తనకు  కాబోయే భార్య గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకు కాబోయే భార్యకు తన  నానమ్మ ఇందిరమ్మకున్న లక్షణాలు, తల్లి సోనియా గాంధీలోని  సుగుణాలు... ఉండాలని మనసులోని మాటను బయట పెట్టారు. అలాగే, తనకు కాబోయే భార్య ఆ ఇద్దరిలోని మంచి లక్షణాలను కలబోసిన బొమ్మలా ఉంటే మరీ మంచిదని అన్నారు. ఇదంతా సరదగా సాగిన సంభాషనే  అయినా, రాహుల్ గాంధీని ఇష్టపడే అమ్మాయిల్లో ఆ లక్షణాలు ఉన్నవారు ఎవరైనా ఉంటే ...అదృష్టాన్ని పరీక్షించుకోవచ్చునేమో ... ఫ్యూచర్ ప్రైమ్ మినిస్టర్ కాబోయే శ్రీమతి  .. ఎవరో  ఆ అదృష్టవతురాలు.. 
( ఇది కేవలం సరదా కోసం మాత్రమే ..ఎవరూ సీరియస్’ గా తీసుకోవద్దని మనవి)

By
en-us Political News

  
రాజకీయ నాయకులపై ప్రజలకు ఉండే అభిమానం ఒక్కోసారి అసాధారణ రీతిలో వ్యక్తమవుతుంది.
టాలీవుడ్ సినీ పరిశ్రమలో వరుస వెడ్డింగ్ బెల్స్ మోగుతున్నాయి. ఇప్పటికే పలువురు యంగ్ హీరోలు వైవాహిక జీవితంలోకి అడుగుపెడుతుండగా
దీపావళి పండగ అనగానే ప్రతి ఇంటా సంబరాలు, బాణసంచా చప్పుళ్లు సర్వసాధారణం.
వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
చెన్నై వేదికగా ఇటీవల వైఎస్ అనిల్ కుమార్ రెడ్డి కుమార్తె వివాహం ఎంతో వైభవంగా జరిగింది.
అప్పుడప్పుడే లోకాన్ని చూడటం మొదలుపెట్టింది. అమ్మా నాన్నల ఒడిలో గోరుముద్దలు తింటూ.. బుడిబుడి అడుగులు వేస్తూ ఆడుకోవాల్సిన వయసు.
తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 5) జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో  తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ పార్టీ చీరాల మునిసిపోల్స్ లో గట్టి పోటీ ఇచ్చింది. 25వ వార్డులో విజయం సాధించింది.  25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు. 
పోలింగ్ సరళి, వెలువడిన ఫలితాలు వైసీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అధికార తెలుగుదేశం కూటమి అరాచకాలు, అధికార దుర్వినియోగం తమ ఓటమికి కారణాలుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు.  ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత వైఎస్ జగన్ నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జగన్ చెప్పిందే చెప్పారు. 
ప్రతిరోజూ ఉదయం మనం ఎంతో ఆరోగ్యకరమని భావించి తాగే పాలు అసలు సిసలైనవేనా? లేక ప్రాణాల మీదకు తెచ్చే విషపూరిత కల్తీ పాలా? అనే ప్రశ్న ఇప్పుడు హైదరాబాద్‌ ప్రజలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది
హైదరాబాద్‌ నగరంలో నిత్యం రాకపోకలు సాగించే లక్షలాది మంది ప్రయాణికులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది
కాంగ్రెస్, కమ్మూనిస్టుల మద్దతుతో ఎన్నికల బరిలోకి దిగిన ఏబీవీకి ఘోర పరాజయం ఎదురైన సంగతి తెలిసిందే. కమ్యూనిస్టులకు అంతో ఇంతో పట్టున్న ప్రాంతాలలో కూడా ఆయనకు ఓట్లు రాలలేదు. ఇక కాంగ్రెస్ మద్దతు ఆయనకు ఎందుకూ కొరగాకుండా పోయింది. 
ఈ వేడుకలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కేటీఆర్,   విజయ్ ఒకే దగ్గర చేరి సరదాగా ముచ్చటించుకోవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.  
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.