Publish Date:Apr 21, 2025
తిరుమలలోని శారదా పీఠానికి తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు నోటీసులు జారీ చేశారు. గోగర్భం తీర్థం వద్ద శారదాపీఠం భవనాన్ని 15 రోజులలోగా ఖాళీ చేయాలని ఆ నోటీసులలో పేర్కొన్నారు.
Publish Date:Apr 21, 2025
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం లాంగ్ వీకేండ్ కారణంగా గత నాలుగు రోజులుగా తిరుమలకు భక్తులు పోటెత్తారు. అయితే సోమవారం (ఏప్రిల్ 21) తిరుమలలో భక్తుల రద్దీ స్వల్పంగా తగ్గింది.
Publish Date:Apr 20, 2025
కర్ణాటక మాజీ డీజీపీ ఓం ప్రకాశ్(68) ఆదివానం (ఏప్రిల్ 20) దారుణ హత్యకు గురయ్యారు. బెంగళూరులోని తన నివాసంలోనే హత్యకు గురయ్యారు. ఈ హత్య చేసినది ఆయన భార్యేనని పోలీసులు అనుమానిఃస్తున్నారు.
Publish Date:Apr 20, 2025
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబును కేంద్ర మంత్రి పెమ్మసాని నిలువెత్తు నిఘంటువుగా అభివర్ణించారు. .
చంద్రబాబు జన్మదినం సందర్భంగా ఆయన ప్రసంగాలతో కూడిన పుస్తకం ఆవిష్కరణ కార్యక్రమం ఏపీ అసెంబ్లీ హాల్ లో ఆదివారం (ఏప్రిల్ 20)జరిగింది.
Publish Date:Apr 20, 2025
తెలుగుదేశం అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి 75వ జన్మదినం సందర్భంగా తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు, మాజీ మంత్రి. బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారకరామారావు కూడా చంద్రబాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.
Publish Date:Apr 20, 2025
Publish Date:Apr 20, 2025
ఆంధ్రప్రదేశ్ మునిసిపల్ శాఖ మంత్రి నారాయణ రెండు రోజుల గుజరాత్ పర్యటనలో బిజీబిజీగా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణంలో భాగంగా ఇతర రాష్ట్రాలలో దేశంలోని ఇతర రాష్ట్రాల్లో అధ్యయనం చేస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగానే నారాయణ బృందం గుజరాత్ వెళ్లింది.
Publish Date:Apr 20, 2025
ఈ నెల 23న హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో రేపటి నుంచి మద్యం దుకాణాలు మూతపడనున్నాయి. హైదరాబాద్, సికింద్రాబాద్‌లోని వైన్స్ షాపులు ఈ నెల 21 సాయంత్రం 4 గంటల నుంచి బుధవారం సాయంత్రం 6 గంటల వరకు మూసివేయాలని పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. పోలీసుల ఆదేశాలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు వైన్ షాపు అనుమతులు రద్దు చేస్తామని ఇప్పటికే హైదరాబాద్ సీపీతో పాటు ఎక్సైజ్ శాఖ అధికారులు ప్రకటించారు.
Publish Date:Apr 20, 2025
సీఎం చంద్రబాబు చంద్రబాబు 75వ పుట్టిన రోజు సందర్భంగా అమరావతి అసెంబ్లీ కమిటీ హాల్‌లో రెండు పుస్తకాలను రఘురామకృష్ణరాజు, కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు ఆవిష్కరించారు. చంద్రబాబు తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో చేసిన ప్రసంగాలకు సంబంధించి, రెండు పుస్తకాలను జయప్రద ఫౌండేషన్ ప్రచురించింది. పుస్తకాలను టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు టీడీ జనార్ధన్, సీనియర్ పాత్రికేయులు, రచయిత విక్రమ్ పూల రూపొందించారు. ‘స్వర్ణాంధ్రప్రదేశ్ సారథి నారా చంద్రబాబు నాయుడు అసెంబ్లీ ప్రసంగాలు’ పేరుతో రెండు సంపుటాలు ప్రచురించారు.
Publish Date:Apr 20, 2025
ఏపీ సీఎం చంద్రబాబు పుట్టిన రోజు సందర్భంగా తిరుమల శ్రీవారి భక్తులకు అన్నప్రసాదం కోసం భాష్యం విద్యా సంస్థల అధినేత భాష్యం రామకృష్ణ రూ.44 లక్షల విరాళం అందించారు. దీంతో ఈ రోజు తిరుమలలోని తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, అదనపు ఈవో వెంకయ్య చౌదరి దాతతో కలిసి అన్న ప్రసాద కేంద్రంలో భక్తులకు స్వయంగా వడ్డించారు. అన్న ప్రసాదాల రుచి, నాణ్యతపై నెల్లూరు, గుంటూరు, హైదరాబాద్, కర్నూలుకు చెందిన కొందరు భక్తుల నుంచి బీఆర్ నాయుడు అభిప్రాయాలు తెలుసుకున్నారు.
Publish Date:Apr 20, 2025
కాంగ్రెస్ పాలనపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చేరిగారు. తెలంగాణ భవన్‌లో రాజేంద్ర నగర్ ఇంచార్జ్ పటోళ్ల కార్తీక్ రెడ్డి అధ్యక్షతన బీఆర్ఎస్ పార్టీలో అత్తాపూర్ డివిజన్ నుండి శ్రీరామ్ రెడ్డి, పలు పార్టీల నేతలు చేరారు. వారందరికి కేటీఆర్ గులాబీ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్బంగా మాజీ మంత్రి మాట్లాడుతు కాంగ్రెస్ ఇచ్చిన మోసపూరిత హామీలకు తెలంగాణ ప్రజలు టెంప్ట్ అయి ఆ పార్టీకి అవకాశం ఇచ్చారని.. ఫలితంగా తినే అన్నంలో మట్టిపోసుకున్నారని విమర్శించారు. కాంగ్రెస్,బీజేపీ పార్టీలు ఎన్ని కథలు చెప్పినా ఓటర్ హైదరాబాద్ ప్రజలు వారి మాటలను నమ్మలేదన్నారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదని మంచి చేస్తే ఎవరైనా అభినందిస్తారని.. గతంలో వైఎస్సార్, చంద్రబాబు నాయుడు చేసిన మంచి పనులను, వారిని గుర్తుచేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
Publish Date:Apr 20, 2025
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబు బర్త్ డే సెలబ్రేషన్స్ తెలుగు రాష్ట్రాల్లో టీడీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు ఘనంగా నిర్వహిస్తున్నారు. పార్టీ కార్యాలయాల్లో కేక్ కట్ చేసి సంబరాలు చేసుకుంటున్నారు. మరోవైపు ఆలయాల్లో నేతలు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు చంద్రబాబు పుట్టిన రోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. 75 కిలోల కేక్ కట్ చేసి వేడుకలు చేసుకున్నారు.
Publish Date:Apr 20, 2025
నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. టీజీఆర్‌టీసీలో ఖాళీగా ఉన్న పోస్టులను త్వరలోనే భర్తీ చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. అతి త్వరలోనే 3,038 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేస్తామన్నారు.