హైదరాబాద్‌లో లేడీ గ్యాంగ్... సాఫ్ట్‌గా వచ్చి కోట్లు కొట్టేస్తారు...
Publish Date:Jun 3, 2017
Advertisement
వాళ్లను చూస్తే పోలీసులకు కూడా అనుమానం రాదు... చూడ్డానికి సాఫ్ట్‌వేర్ ఎంప్లాయిస్‌లా ఉంటారు... స్టార్ హోటళ్లలోనే బస చేస్తారు... కాస్ట్లీ కారుల్లోనే ప్రయాణిస్తారు..... హాలీవుడ్ సినిమా మాదిరిగా దోపిడీ చేసి మళ్లీ ఫ్లైట్‌లో ఈజీగా చెక్కేస్తారు.... చోరీ సొత్తును దేశాలు దాటించి సొమ్ము చేసుకుంటారు... వీళ్లంతా కాస్ట్‌లీ దొంగలు... దేశవ్యాప్తంగా ఎన్నో దొంగతనాలు చేశారు.... కానీ ఎవరికీ దొరకలేదు.... ఈసారి హైదరాబాద్‌పై కన్నేశారు. భారీ స్కెచ్చే వేశారు. అనుకున్నట్లు టార్గెట్ రీచ్ అయ్యారు... దేశవ్యాప్తంగా ఎన్నో చోరీలు చేసిన ఈ ఇంటర్నేషనల్ గ్యాంగ్ ఈసారి హైదరాబాద్‌ను ఎంచుకుంది.... అనుకున్నట్లే రెండు నెలల క్రితం స్టార్ హోటల్‌లో దిగారు. హైదరాబాద్‌లో ఎక్కడ దోపిడీ చేయాలని ప్లాన్ చేసుకున్నారు. కొన్ని ప్రాంతాల్లో రెక్కీ కూడా నిర్వహించారు. ఎంత వెదికినా అనువైన స్పాట్ దొరకలేదు. కొంచెం లేటైనా భారీ టార్గెట్ కొట్టాలనుకున్నారు. అనుకున్నట్లే ఏప్రిల్ 8న బంగారం వ్యాపారం అభిషేక్ అగర్వాల్.... కూకట్‌పల్లిలో ఈ గ్యాంగ్ కంటబడ్డాడు. గోల్డ్ షాపులకు బంగారం విక్రయిస్తుండగా చూశారు. అదేరోజు హాలీవుడ్ థ్రిల్లర్ సినిమాను తలపించేలా చోరీ చేసి ఎస్కేప్ అవ్వాలని పథక రచన చేశారు. అయితే ఆరోజు వీలుకాకపోవడంతో 8రోజులు ఆగి... ఏప్రిల్ 16న తమ స్కెచ్ అమలు చేసింది గ్యాంగ్. అగర్వాల్ ఇంటి దగ్గర బయల్దేరినప్పటి నుంచి వెంబడించాడు. అనువైన ప్రాంతాన్ని ఎంచుకుని అగర్వాల్ కారుకు పంక్చర్ చేసి తమ ప్లాన్ అమలు చేశారు. ఇదేమీ గమనించని అగర్వాల్.... కారులో వెళ్తుండగా... వెనుక నుంచి ఫాలో అవుతోన్న ముఠా.... మీ కారు పంక్చర్ అయ్యిందంటూ ఓవర్ టేక్ చేస్తూ చెప్పారు. వెంటనే అగర్వాల్ కారు ఆపి చూడగా.... టైర్లో గాలి లేదని గమనించి.... టైరు మార్చే పనిలో పడ్డాడు. అదే సమయంలో ఓ మహిళను రంగంలోకి దింపిన గ్యాంగ్.... అగర్వాల్ దృష్టిమరల్చి కారులో ఉన్న బంగారు నగల బ్యాగ్‌ను తీసుకుని ఉడాయించింది. అయితే టైరు మార్చుకుని వచ్చేసరికి నగల బ్యాగ్ లేకపోవడంతో.... అగర్వాల్ పోలీసులకు సమాచారమిచ్చాడు. మొత్తం మూడున్నర కిలోల గోల్డ్ చోరీకి గురైందని, దాని విలువ కోటిన్నర ఉంటుందని ఫిర్యాదు చేశాడు. కేసును ఛాలెంజ్‌గా తీసుకున్న పోలీసులు ఇంటర్నేషనల్ గ్యాంగ్ ఆటకట్టించారు. టెక్నికల్ పాయింట్స్, సీసీ కెమెరాల ఆధారంగా నిందితులను పట్టుకున్నారు. ఎవరికీ అనుమానం రాకుండా కారును ఐదుగురు డ్రైవ్ చేసినా.... పోలీసుల నుంచి తప్పించుకోలేకపోయారు. ఇక వీరు ఉపయోగించిన కారును.... OLXలో కొనుగోలు చేసి, నకిలీ పాస్‌పోర్ట్ జిరాక్స్ ఇచ్చినట్లు దర్యాప్తులో తేలింది. నిందితులు వాడిన మొబైల్ నెంబర్లను కూడా పోలీసులు కనిపెట్టారు. సెల్ నెంబర్ల ఆధారంగా దర్యాప్తు చేయగా.... ఢిల్లీలో ఫేక్ సిమ్స్‌ను 2వేల రూపాయలకు కొనుగోలు చేసినట్లు గుర్తించారు. ముఠాలోని వారంతా విదేశీయులే. మొత్తం 8మంది నిందితుల్లో నలుగురిని పట్టుకోగా.... మరో నలుగురు పరారీలో ఉన్నారని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ శాండిల్యా తెలిపారు. అయితే నిందితుల నుంచి ఎక్కువ బంగారాన్ని రికవరీ చేయలేకపోయామని సీపీ వెల్లడించారు.
http://www.teluguone.com/news/content/international-lady-gang-45-75308.html





