వీధిపోరాటాల స్థాయికి తెలంగాణ బీజేపీలో అంతర్గత పోరు!.. కొత్త అధ్యక్షుడి ఎంపిక అంత వీజీ కాదు

Publish Date:Nov 20, 2024

Advertisement

దక్షిణాదిలో పాగా వేయాలన్న ఆకాంక్ష నరవేర్చుకోవడానికి బీజేపీ అగ్రనాయకత్వం తెలంగాణను తన రాజకీయ ప్రయోగశాలగా మార్చేసింది. రాష్ట్రంలో కమలం పార్టీకి ఏదో మేరకు బలం ఉండటం.. అర్బన్ ప్రాంతాలలో నాయకత్వం బలంగా ఉండటంతో 2023 అసెంబ్లీ ఎన్నికలలో రాష్ట్రంలో అధికారంలోకి రావడం దాదాపు ఖాయమన్న నిర్ణయానికి వచ్చేసిన కమలనాథులు పార్టీని మరింత పటిష్ఠం చేసే దిశగా వడివడిగా అడుగులు వేశారు. అయితే ఆ అడుగులన్నీ తప్పుటడుగులుగా ఆ ఎన్నికల ఫలితాలు తేల్చేశాయి. 

తెలంగాణలో బీజేపీ బలోపేతం అవుతోందని ఆ పార్టీ నేతలు ఎంత గట్టిగా చెప్పుకుంటున్నా.. వర్గ పోరు కారణంగా రాష్ట్రంలో బీజేపీ పురోగతి రెండడుగులు ముందుకు మూడడుగులు వెనక్కు అన్న చందంగానే తయారైంది. అందుకు ముఖ్యంగా పార్టీ బలోపేతం పేరిట బీజేపీ అగ్రనాయకత్వం ఇతర పార్టీల నుంచి వేరువేరు రాజకీయ కారణాలతో వచ్చే వారికి తలుపులు బార్లా తెరిచేయడమే.  దీంతో  పార్టీలో కొత్త, పాత నేతల మధ్య విభేదాలు వీధి పోరాటాల స్థాయికి చేరుకున్నాయి. దీంతో తెలంగాణలో  బీజేపీ ప్రయోగం పూర్తిగా విఫలమైంది. ఇరత పార్టీల నేతలు, తొలి నుంచీ పార్టీలోనే ఉన్న వారి మధ్య పంచాయతీలు తీర్చ లేక అధిష్ఠానం రాష్ట్రంలో పార్టీ పటిష్ఠత అన్న విషయాన్నే వదిలేసినట్లుగా కనిపిస్తోంది. 

గత ఎన్నికల సముదాయంలో ఇంటి పోరును సరిదిద్దేందుకు అప్పటికి బీజేపీ తెలంగాణ అధ్యక్షుడిగా ఉన్న బండి సంజయ్ ను మార్చి పార్టీ రాష్ట్ర పగ్గాలను కిషన్ రెడ్డికి అప్పగించి చేతులు కాల్చుకుంది. ఆ ఎన్నికలలో అధికారం చేపట్టాలని కలలుగన్న పార్టీ కేవలం మూడో స్థానానికి పరిమితమైంది. 
ఇప్పుడు సార్వత్రిక ఎన్నికలు పూర్తై ఐదు నెలలు గడిచినా కూడా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్థానంలో మరో అధ్యక్షుడిని నియమించాలని అధిష్ఠానం ఎంత ప్రయత్నిస్తున్నా.. అందరికీ ఆమోదయోగ్యమైన నేతను ఎంపిక చేయడంలో విఫలమౌతోంది. కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా బిజీగా ఉంటూ, రాష్ట్ర వ్యవహారాలను మేనేజ్ చేయడం కష్టం అనీ, రాష్ట్ర పార్టీకి కొత్త అధ్యక్షుడిని నియమిస్తామనీ బీజేపీ హైకమాండ్ చెప్పిన మాట ఇప్పటికీ ఆచరణలోకి రాకపోవడానికి పార్టీలో అంతర్గత విభేదాలే కారణం.

పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి రేసులో   ఈటల రాజేందర్ ఉన్నా ఆయనకు ఆ పదవి రాకుండా బండి సంజయ్ అడ్డం పడు తున్నారని బీజేపీ శ్రేణులే అంటున్నాయి. ఈటల రాజేందర్ కు రాష్ట్ర పార్టీ పగ్గాలు అప్పగించడాన్ని ఒక్క బండి సంజ య్ మాత్రమే కాదు.. బీజేపీలోని కోర్ హిందూవాదులు, ఏబీవీపీ, ఆర్ఎస్ఎస్, వీహెచ్ పీ లాంటి సంస్థలు కూడా గట్టిగా వ్యతిరేకిస్తున్నాయి. గతంలో బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నారు. గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు ముందు   బీజేపీ హైకమాండ్ అనూహ్యంగా బండి సంజయ్ కు పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తప్పించడానికి కారణం ఈటల రాజేందర్ అన్న ఆరోపణలు ఉన్నాయి.  ఇదే విషయాన్ని బండి సంజయ్ సహా తొలి నుంచీ బీజేపీలో ఉన్న నేతలు నమ్ముతున్నారు.  బండి అభిమానులు,   బీజేపీ కార్యకర్తలు, రాష్ట్రంలోని హిందూ వాదులు కూడా ఈటల కారణంగానే బండిని పార్టీ హైకమాండ్ పార్టీ అధ్యక్ష పదవి నుంచి తప్పించిందని భావిస్తున్నాయి. అప్పట్లో బండి వారసుడు ఈటలే అన్న వార్తలు కూడా గట్టిగా వినిపించినా బీజేపీ అధిష్ఠానం మధ్యే మార్గంగా కిషన్ రెడ్డికి పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించింది.

దీంతో ఇప్పుడు ఈటలకు పార్టీ అధ్యక్ష పదవి రాకుండా బండి సంజయ్  సంజయ్  అడ్డంపడుతున్నట్టు తెలుస్తోంది. ఈటలకు రివెంజ్ గిఫ్ట్ ఇచ్చేందుకు బండి శత విధాలుగా ప్రయత్నిస్తున్నారని పార్టీ వర్గాలే అంటున్నాయి. ఈ ఇరువురి మధ్యా సయోధ్య కుదిర్చి ఈటలకు పదవి కట్టబెట్టడం ఎలా అని హైకమాండ్ తల పట్టుకుంటోంది.  పరిస్థితి కరవమంటే కప్పకు కోపం... వదల మంటే పాముకు కోసం అన్నట్లుగా మారింది. ఈటలకు పదవి ఇస్తే బండి నొచ్చుకుంటాడు.. ఆయనతో పాటు కార్యకర్తలూ కాడె వదిలేస్తారు.  ఈటలను పక్కన పెడతామంటే ఆయన బీజేపీనే వదిలేస్తారని పార్టీ హైకమాండ్ భయపడుతోంది.  ఎందుకంటే ఈటల సామాజికంగా, ఆర్థికంగా బలమైన నేత.. ఆయన అలిగి పార్టీ మారితే ఒక్కడిగా కాకుండా కొందరు తన వర్గం ఎమ్మెల్యేలనూ కూడా తన వెంట తీసుకుపోయే అవకాశం ఉంది. అలా ఈటల తన వర్గంతో కాంగ్రెస్ గూటికి చేరితే రాష్ట్రంలో బీజేపీ పరిస్థితి మళ్లీ మొదటికి వస్తుంది. ఆ భయం తోనే పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి విషయంలో   బీజేపీ హైకమాండ్  ఎటూ తేల్చుకోలేక పోతోంది. 

 పోనీ మధ్యే మార్గంగా ఈటల రాజేందర్ ను కాదని మరొకరికి అప్పగిద్దామంటే అక్కడా పోటీయే. ఎంపీ రఘునందనరావు, డీకే అరుణ వంటి వలస నేతలూ రేసులో ఉన్నామంటూ గట్టిగా చెబుతున్నారు. వారు చాలరన్నట్లు మరో ఎంపీ అర్వింద్ కుమార్, అలాగే మాజీ ఎమ్మెల్సీ ఎన్ రామచంద్రరావు పోటీ పడుతున్నారు. వీరిలో ఎవరికి పార్టీ రాష్ట్ర అధ్యక్ష పగ్గాలు కట్టబెట్టినా మిగిలిన వారు అలకపాన్పు ఎక్కడం తధ్యం. తెలంగాణలో బీజేపీ అగ్రనాయకత్వం చేసిన ప్రయోగాల కారణంగా రాష్ట్ర పార్టీపై హైకమాండ్ పూర్తిగా పట్టు కోల్పోయింది. కనీసం పార్టీ అధ్యక్షుడిని కూడా ఎంపిక చేయలేని నిస్సహాయ స్థితిలో మిగిలిపోయింది. ఈ పరిస్థితుల్లో వచ్చే అసెంబ్లీ ఎన్నికల వరకూ పార్టీ కొత్త అధ్యక్షుడి ఎంపిక, నియామకం పెండింగులోనే ఉన్నా ఆశ్చర్యం లేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

By
en-us Political News

  
పశ్చిమబెంగాల్‌లో మూడున్నర దశాబ్దాల ఏళ్ల సీపీఎం పాలనకు బ్రేక్ వేసి 2011లో అధికార పగ్గాలు చేపట్టిన తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్టీ.. 2026 వరకు వరుస విజయాలతో ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఆమె 15 ఏళ్ల ఆధిపత్యానికి ఎన్డీఏ తెర దించింది. మమతా సైతం కాంగ్రెస్‌లో కేంద్రమంత్రిగా, పలు కీలక పదవులు నిర్వహించి, తర్వాత సొంత కుంపటి పెట్టుకున్న నాయకురాలే కావడం గమనార్హం.
ప్రజా సమస్యలపై స్పష్టమైన అజెండాతో ఎన్నికల బరిలోకి దిగిన విజయ్‌ను తమిళ ప్రజలు ఆదరించడం శుభపరిణామమన్నారు.
తన పార్టీ స్థాపించిన నాటి నుండి నేటి వరకు ఆయన సాగించిన ప్రయాణం ఒక అద్భుతమైన రాజకీయ థ్రిల్లర్‌ను తలపిస్తుంది. ఎన్నికల ప్రచార సమయంలో విజయ్ అనేక ఆటంకాలను ఎదుర్కొన్నారు. ప్రత్యర్థి పార్టీల నుండి వచ్చిన తీవ్ర విమర్శలు, అధికార యంత్రాంగం విధించిన ఆంక్షలు ఆయనను ఉక్కిరిబిక్కిరి చేశాయి. వ్యక్తిగత జీవితంపై జరిగిన దుష్ప్రచారం విజయ్ ఇమేజ్‌ను దెబ్బతీస్తుందని అందరూ భావించారు.
తమిళనాడులో టీవీకే పార్టీ విజయాన్నిస్వాగతిస్తూ.. వైసీపీ సోషల్ మీడియా వేదికగా సంబరాలు మొదలు పెట్టింది. విజయ్ సాధించిన ఈ అద్భుత విజయం వెనుక వైసీపీ అధినేత జగన్ సహకారం ఉందంటూ వైసీపీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా గతంలో ఒక వివాహ వేడుకలో వైఎస్ జగన్, విజయ్ ఇద్దరూ కలిసి దిగిన ఒక ఫోటోను ఇప్పుడు వైసీపీ నెట్టింట వైరల్ చేస్తోంది.
ఈ ఎన్నికల ఫలితాల్లో విజయ్ టవీకే పార్టీ స్పష్టమైన ఆధిక్యత కనబరిచింది. ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు, కూటమి పక్షాల మధ్య సరైన సమన్వయం లేకపోవడం కూడా ఈ ఓటమికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి.
1982లో తెలుగువారి ఆత్మగౌరవం నినాదంతో తెలుగుదేశం పార్టీని స్థాపించిన ఎన్టీఆర్, కేవలం 9 నెలల కాలంలోనే రాష్ట్రమంతటా పర్యటించి ప్రభంజనం సృష్టించారు. 1983 ఎన్నికల్లో కాంగ్రెస్ వంటి బలమైన పార్టీని మట్టికరిపించి, తొలి ప్రయత్నంలోనే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించి రికార్డ్ సృష్టించారు.
భారత రాజకీయ యవనికపై భారతీయ జనతా పార్టీ తన ఉనికిని మరింత శక్తివంతం చేస్తోంది.
చారిత్రాత్మక విజయం ఖాయమని తేలడంతో.. విజయం అభిమానుల సంబరాలు మిన్నంటాయి. అయితే.. ఈ నేపథ్యంలో సినీ నటి త్రిష పేరు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.
ఈ నియోజకవర్గం నుంచిఎన్డీయూ కూటమి అభ్యర్థి మల్లాడి కృష్ణారావు విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి గొల్లపల్లి అశోక్ పై నాలుగువేల ఐదు వందల ఓట్ల పైచిలుకు మెజారిటీతో గెలుపొందారు.
ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే కూటమి సాధించిన ఘన విజయంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు.
తట్టంచావడి నియోజకవర్గం నుంచి ఆయన భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఆయన పోటీ చేసిన మరో స్థానమైన మంగళంలోనూ భారీ ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీకి అధికారం దూరమైనట్టే. ఈసారి కూడా అధికారాన్ని దక్కించుకుంటామని గట్టిగా చెప్పిన మమత.. బెంగాల్ ప్రజలు ఈసారి మార్పు కోరుకున్న నేపథ్యంలో.. ఓటమి మూటగట్టుకోక తప్పలేదు. రాష్ట్రవ్యాప్త ట్రెండ్స్ గమనిస్తే, బీజేపీ మెజారిటీ మార్కు వైపు వేగంగా దూసుకుపోతోంది. 294 స్థానాలున్న బెంగాల్ అసెంబ్లీలో మేజిక్ ఫిగర్ 148 కాగా, బీజేపీ 177 స్థానాల్లో స్పష్టమైన ఆధిక్యతతో ఉంది.
హంగ్ పరిస్థితి ఏర్పడితే డీఎంకే, ఏఐడీఎంకేలకు మద్దతు ఇస్తారన్న పరిశీలకుల అంచనాలను తమిళనాడు ప్రజలు తల్లకిందులు చేశారు. విజయ్ కింగ్ మేకర్ కాదు.. కింగే అని విస్పష్ట తీర్పు ఇచ్చారు. తమిళనాడు ఎన్నికలఫలితాల సరళిని బట్టి చూస్తే.. విజయ్ టీవీకే పార్టీ వందకు పైగా సీట్లలో విజయం సాధించడం ఖాయంగా కనిపిస్తోంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.