ఆ ఊర్లో చేసే వృత్తే ఆ ఊరి పేరుగా మారింది...

Publish Date:Oct 17, 2019

Advertisement

 

ఆ ఊర్లో అందరిదీ ఒకటే వృత్తి ముసలి వాళ్ళ నుంచి నేటి యువతరం వరకు ఆ వృత్తే వారికి జీవనోపాధి. డిగ్రీలు, పీజీలు చదివిన వాళ్లు కూడా తాత ముత్తాతల నుంచి వచ్చిన పనినే వారసత్వంగా స్వీకరిస్తున్నారు. ఇప్పుడు వాళ్ళ వృత్తే ఆ ఊరి పేరైంది, సంగారెడ్డి జిల్లా ఎల్లంపల్లి గ్రామంలోని జనాభా ఆరు వందలు. ఇక్కడి నివాసాలు నూట యాభై కానీ, అందరూ చేసే పని మాత్రం ఒక్కటే అదే భవన నిర్మాణాల పని. ఇల్లు, కార్యాలయం, గోడౌన్, ఫ్యాక్టరీ ఇలా ఏది కట్టాలన్నా ఇక్కడ ఆయా రంగాలకు సంబంధించిన కార్మికులు, మేస్త్రీలు ఎల్లంపల్లిలో దొరుకుతారు. సుతారి, ప్లంబర్, కార్పెంటర్, ఎలక్ట్రీషియన్, టైల్స్, సెంట్రింగ్ ఇలా అన్ని రకాల వర్కర్ లు మేస్త్రీలకు పెట్టింది పేరు ఈ ఊరు.

ఎల్లంపల్లిలో అన్ని కుటుంబాలు ఒకే వృత్తి నేర్చుకోవడం వల్ల చాలా మంది ఎల్లంపల్లిని మేస్త్రీల పల్లి అని కూడా పిలుస్తారు. ఏ సీజన్ లోనైనా తమ ఉపాధికి ఇబ్బంది ఉండదంటారు గ్రామస్తులు. ఇంట్లో నలుగురుంటే కనీసం ఒక్కరైనా భవన నిర్మాణ పని చేస్తారు, ఉన్నత చదువులు చదివిన యువకులు కూడా తాతలు తండ్రుల నుంచి వచ్చిన వృత్తినే కొనసాగిస్తున్నారు. కొందరు ఉద్యోగాల కోసం హైదరాబాద్ కు వలస వెళ్తే మరికొందరు సమయాన్ని వృథా చేయకుండా వ్యవసాయం లేదంటే భవన నిర్మాణ పనులకు వెళుతున్నారు, మహిళలు ఇవే పనులకు వెళుతున్నారు. భవన నిర్మాణ పనులకు ఎల్లంపల్లి ఫేమస్, మెదక్, సంగారెడ్డి, కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాలకు వెళ్లి ఇక్కడి వాళ్లు పని చేస్తారు.

బయట ప్రాంతాలకు వెళ్లడం ఇబ్బందిగా మారడం వల్ల సమీప ప్రాంతాల్లోనే పనులు చూసుకుంటున్నారు. మొదట్నుంచీ శ్రమను నమ్ముకుని బతుకుతున్న తమకు ఆశించిన మేర సంపాదన ఉండటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం చేసే సివిల్ పనులను తమకిస్తే బయటకు వెళ్లి బతకాల్సిన అవసరం ఉండదంటున్నారు గ్రామస్తులు. చదువుకున్న యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలను చూపించాలని కోరుతున్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా వృత్తి నైపుణ్యాన్ని పెంచే శిక్షణ దిశగా పాలకులు చొరవ చూపాలని కోరుతున్నారు. భవన నిర్మాణ పనులనే నమ్ముకొని ఉన్న చాలా మందికి వయోభారం వల్ల కుటుంబాన్ని పోషించడం సమస్యగా మారిందంటున్నారు. ప్రభుత్వం ఇతర ఉపాధి అవకాశాలు చూపించాలని కోరుతున్నారు మేస్త్రీల పల్లి గ్రామస్థులు.

By
en-us Political News

  
 ప్రజాస్వామ్యంలో ఎన్నికలకు ప్రక్రియ చాలా కీలకంగా ఉంది. ఎన్నికల్లో ప్రతి ఒక్కరు ఓటు వేయాలని, ఇది అందరూ హక్కుగా చెబుతూ ఉంటారు. ప్రత్యేకించి ఓట్లు వేయడం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరుతూ ఉంటారు.‌ అయితే ఎవరు ఎంత చెప్పినా.. కొందరు మాత్రం అస్సలు మారరు. గడప దాటరు. ఓటు వేయరు. ఏం జరిగినా మనకెందుకులే అని కూర్చొంటారు. అలాంటి వారిలో హైదరాబాదీలు కూడా ఉన్నారు.
కుప్పం మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం అధినేత నారాచంద్రబాబునాయుడు ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గం. ఇక్కడ ఆయన వరుసగా విజయం సాధిస్తూ వస్తున్నారు. ఆ ఒరవడిని బద్దలు కొడతామంటూ ఇంత కాలం వైసీపీ ప్రగల్భాలు పలికింది.
పుణ్యక్షేత్ర సమీపంలో కూడా వైసీపీ నేతలు పాపపు పనులు మానుకోవడం లేదు. తిరుపతిలోని పోలింగ్ కేంద్రాల దగ్గర వైసీపీ నాయకులు దౌర్జన్యాలు కొనసాగిస్తున్నారు.
జిల్లాల వారీగా ఏపీ పోలింగ్ శాతం 3 గంటలకు....
వైసీపీలో ఫైర్ బ్రాండ్ లీడర్ రోజా.. నగరి నియోజకవర్గంలో హ్యాట్రిక్ కొట్టాలన్న లక్ష్యంతో ఎన్నికల బరిలోకి దిగారు. కానీ సోమవారం పోలింగ్ ప్రారంభం కాగానే ఆమె కాడె వదిలేశారు. మధ్యాహ్నం అయ్యేసరికి నేరుగా కాకపోయినా ఆమె తన ఓటమిని మీడియా ముందు అంగీకరించేశారు.
కుప్పంలో వైసీపీ తరఫున పోటీ చేస్తున్న భరత్ అనవసరపు ఆత్రం ప్రదర్శిస్తూ హడావిడి చేస్తున్నారు. కుప్పం నియోజకవర్గం రామకుప్పం మండలంలోని పలు కేంద్రాల్లో వైకాపా గూండాలు పోలింగ్ కేంద్రాల్లోకి వెళ్ళి తెలుగుదేశం పోలింగ్ ఏజెంట్లను బెదిరిస్తున్నారు.
సినీ హాస్యనటుడు బ్రహ్మానందం ఓటు హక్కును వినియోగించుకున్నారు. హైదరాబాద్‌లోని ఎఫ్ఎన్సీసీలో ఓటు వేశారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులు ఆయనను పలకరించారు. ఓటర్లకు ఏం చెబుతారు?
తెలంగాణలో పోలింగ్ ఈ సారి పుంజుకుందనే చెప్పాలి. సార్వ్రతిక ఎన్నికల్లో భాగంగా తెలంగాణలోని 17 లోక్ సభ నియోజకవర్గాలలో పోలింగ్ కొనసాగుతోంది. మధ్యాహ్నం 3 గంటల వరకూ 52.32 శాతం పోలింగ్ నమోదు అయ్యింది.
3 గంటలకు ఏపీలో 55.49 శాతం పోలింగ్
 ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ విశాఖలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం మీడియాకు తన వేలిపై ఉన్న సిరా గుర్తును చూపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తాను ఓటు వేశానని, అందరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. ఇంట్లో కూర్చోకుండా పోలింగ్ బూత్ లకు రావాలని అన్నారు. యువత, చదువుకున్న వాళ్లు పెద్ద సంఖ్యలో ఓట్లు వేస్తున్నారని... ఇది శుభ పరిణామని చెప్పారు. 
deputy cm mallu cast vote, khammam, madhira, weapon,
బీజీపీ, కాంగ్రెస్‌, బీఆర్ఎస్ మూడు పార్టీలు కూడా ఈ ఎన్నిక‌ల్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. పోలింగ్ సరళిని గమనిస్తున్న ఈ మూడు పార్టీలు తమ విజయావకాశాల పైన అంచనాలు వేస్తున్నాయి. మూడు పార్టీల నేతలు పోలింగ్ సరళి పైన క్షేత్ర స్థాయి సమాచారం సేకరిస్తున్నారు. ఎక్కడ ఎవరికి అనుకూలంగా ఉందనే అంశం పైన ఆరా తీస్తున్నారు.
ఎక్కడ చూసినా వైసీపీ మూకలు దౌర్జన్యాలు, దాడులకు పాల్పడుతున్నారు. గెలుపు ఆశలు వదిలేసుకున్న వైసీపీ హింసాకాండతో పోలింగ్ సజావుగా సాగకుండా అడ్డుకోవడమే లక్ష్యంగా బరి తెగించేస్తోంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.