చంద్రబాబు వర్సెస్ లోకేష్!.. స్ఫూర్తిదాయ పోటీ!

Publish Date:May 2, 2026

Advertisement

ఆంధ్రప్రదేశ్ రాజకీయ యవనికపై ఒక అరుదైన, ఆసక్తికరమైన, స్ఫూర్తిదాయకమైన పోటీ నెలకొంది.  రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు,  విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ మధ్య జరుగుతున్న ఈ పోటీ  రాష్ట్ర ప్రగతి,  బాధ్యతల నిర్వహణ  ఒకరిని మించి మరొకరు అన్న చందంగా సాగుతోంది. ఇరువురిలోనూ రాష్ట్ర ప్రయోజనాలు, ప్రజా క్షేమం, సంక్షేమం కోసం పని చేయాలన్న పట్టుదల అంకిత భావం కనిపిస్తోంది.  ముఖ్యమంత్రిగా చంద్రబాబు   రాష్ట్రాన్ని ఆర్థికంగా, పారిశ్రామికంగా గాడిన పెట్టేందుకు అహర్నిశలు శ్రమిస్తుంటే, కుమారుడు లోకేష్ విద్యాశాఖ మంత్రిగా విద్యావ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేస్తూ తనదైన ముద్ర వేస్తున్నారు. ఈ తండ్రీకొడుకుల పనితీరు ప్రస్తుత రాజకీయాల్లో సరికొత్త స్ఫూర్తిని నింపుతోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

మేడే సందర్భంగా కృష్ణా జిల్లా పమిడిముక్కల గ్రామంలో నిర్వహించిన  పేదల సేవ  సభలో చంద్రబాబు నాయుడు తనదైన శైలిలో అధికారులతో ముఖాముఖి నిర్వహించారు. సాధారణంగా సభల్లో రాజకీయ ప్రసంగాలు ఉంటాయి, కానీ చంద్రబాబు మాత్రం అధికారులను వేదికపైనే పనుల పురోగతి గురించి అడిగి తెలుసుకున్నారు. ఎవరినీ కించపరచకుండానే, బాధ్యతను గుర్తు చేస్తూ పనులు ఎప్పటిలోగా పూర్తవుతాయో ప్రజల ముందే వివరణ కోరారు. ప్రభుత్వ యంత్రాంగం కేవలం ఆదేశాలను పాటించడమే కాకుండా..  ఫలితాలను సాధించడంలో చిత్తశుద్ధి ప్రదర్శించాలని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు.

ముఖ్యంగా అధికారుల పనితీరుపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తనకు తానతందాన అనే వాళ్లు అవసరం లేదనీ, ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చే వారే కావాలని కుండబద్దలు కొట్టేశారు.   మరోవైపు నారా లోకేశ్ కూడా తన బాధ్యతల్లో ఏమాత్రం తగ్గడం లేదు. గత ప్రభుత్వం హయాంలో భ్రష్టుపట్టిన విద్యావ్యవస్థను సంస్కరించేందుకు ఆయన తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. పదో తరగతి ఫలితాల్లో సాధించిన ప్రగతి దీనికి నిదర్శనంగా నిలుస్తోంది.

తండ్రి రాష్ట్రాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేసేందుకు క్వాంటం కంప్యూటింగ్ వంటి అత్యాధునిక అంశాలపై దృష్టి పెడితే, లోకేశ్ ఐటి రంగాన్ని పరుగులు పెట్టించడంతో పాటు గూగుల్-ఏఐ వంటి సంస్థలతో కలిసి పనిచేసే దిశగా అడుగులు వేస్తున్నారు. ఒకరిది విజన్ అయితే, మరొకరిది ఎగ్జిక్యూషన్ అన్నట్లుగా వీరిద్దరి మధ్యా సమన్వయంతో కూడిన పోటీ తీవ్రంగా సాగుతోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   చంద్రబాబు, లోకేశ్ ఇద్దరూ గ్రౌండ్ రియాలిటీని గమనిస్తూ తప్పులను సరిదిద్దుకునేందుకు ప్రాధాన్యత ఇస్తున్నారు. లోకేశ్ ఇటీవల టిడిపి జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టినప్పుడు కూడా సీనియర్ నేతల పట్ల ఆయన చూపిన వినయం, గౌరవం అందరినీ ఆకట్టుకుంది.  అందరినీ ఆకట్టుకుంది.

పార్టీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరిని  తాతా అని సంబోధిస్తూ ఆయన పాదాలకు నమస్కరించడం ద్వారా.. తాను ఎదిగిన కొద్దీ ఒదిగి ఉంటానని లోకేష్ చాటారని పరిశీలకులు విశ్లేషి స్తున్నారు.   నాయకత్వం అంటే కేవలం ఆజ్ఞలు జారీ చేయడం మాత్రమే కాదు.. అనుభవాన్ని గౌరవిం చడం బాధ్యతాయుతంగా వ్యవహరించడం అని చంద్రబాబు, లోకేష్ నిరూపిస్తున్నారని అంటున్నారు.  వ్యక్తిగత ప్రతిష్టల కంటే ప్రజా సంక్షేమమే పరమావధిగా వీరి మధ్య సాగుతున్న పోటీ రాష్ట్ర ప్రయోజనాల కోసమేనని అంటున్నారు.  

By
en-us Political News

  
రిజర్వేషన్లు, నియోజకవర్గాల పునర్విభజన వంటి అంశాలపై కాంగ్రెస్, బీజేపీ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. అటు బీఆర్ఎస్, ఇటు బీజేపీ.. రెండూ కూడా రైతుల కష్టాలను ప్రధాన అస్త్రంగా చేసుకుని రేవంత్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నాయి. ఐదు రాష్ట్రాల ఎన్నిక‌ల ఫ‌లితాల త‌ర్వాత మార‌నున్న రాజ‌కీయ స‌మీక‌ర‌ణాల‌ను బ‌ట్టి తెలంగాణలో ఈ రాజకీయ వేడి మరింత రాజుకునే అవకాశం క‌నిపిస్తోంది.
లోకేష్‌తో పాటు ఇటీవల ప్రకటించిన 252 మందితో కూడిన జాతీయ, రాష్ట్ర స్థాయి నూతన కార్యవర్గం కూడా ఈ కార్యక్రమంలో ప్రమాణ స్వీకారం చేసింది. కీలక నేతలందరూ పార్టీ పట్ల తమ విధేయతను ప్రకటిస్తూ బాధ్యతలు స్వీకరించారు.
వైసీపీకి చెందిన పలువురు ఎమ్మెల్సీలు ఆ పార్టీని వీడి టీడీపీ, జనసేన, బీజేపీల్లో చేరారు. వీరిలో కొందరు తమ సభ్యత్వాలకు రాజీనామాలు చేశారు. అయితే, నిబంధనల ప్రకారం రాజీనామాలు సమర్పించినా.. చైర్మన్ వాటిని ఆమోదించకుండా పెండింగ్‌లో పెడుతున్నారని ఎమ్మెల్సీలు ఆరోపిస్తున్నారు. ఇటీవలే ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ సమర్పించిన రాజీనామాను సరైన ఫార్మాట్‌లో లేదని, సహేతుక కారణాలు చూపలేదని పేర్కొంటూ చైర్మన్ తిరస్కరించడం రాజకీయంగా దుమారం రేపింది.
ఉద్యమ నేత కుమార్తె అన్న ఇమేజ్‌కు తగ్గట్లుగానే తెలంగాణ పాలిటిక్స్‌లో ఆమె ఫైటర్‌లా తన పాత్ర పోషించేందుకు సిద్ధమయ్యారు.
ఈ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు. ప్రోటోకాల్ విషయంలో గానీ, ఫ్లెక్సీల విషయంలో గానీ బహిరంగంగా ఘర్షణలకు దిగడం పార్టీ ప్రతిష్టను దెబ్బతీస్తుందనీ.. ఏదైనా సమస్య ఉంటే పార్టీ పెద్దల దృష్టికి తీసుకురావాలి తప్ప రోడ్డెక్కడం సరికాదని వర్మను గట్టిగా మందలించారు.అంతే కాకుండా పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్‌ను భవిష్యత్ లోఇలాంటివి పునరావృతం కాకుండా వర్మకు తగిన సూచనలు చేయాలని ఆదేశించారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ రాజకీయ నాయకుడు నాదెండ్ల భాస్కరరావు (90) కన్నుమూశారు.
నేను చావ‌ను కొ*కా! అని కేసీఆర్ అన్న‌ది బూత‌నుకోవాలా? అయితే ఇప్ప‌టి వ‌ర‌కూ కేసీఆర్, రేవంత్ ఇలాంటి బూతులు ఎన్ని వాడారు?
గతంలో 1976లో ఇందిరా గాంధీ హయాంలో.. ఆ తర్వాత 2001లో వాజ్‌పేయి ప్రభుత్వ సమయంలో ఈ ప్రక్రియను వాయిదా వేస్తూ వచ్చారు. అయితే, 2026 గడువు సమీపిస్తుండటంతో ఈసారి డీలిమిటేషన్ జరగడం ఖాయంగా కనిపిస్తోంది. దీనిని కేవలం ఉత్తరాది రాష్ట్రాల ప్రయోజనాల కోసమే చేస్తున్న కుట్రగా చూడలేమనీ, ఇది దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న రాజ్యాంగ డెడ్ లైన్ అని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
చదువుల కల్పవల్లి ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి.
గత ఎన్నికల ఫలితాలు, జిల్లా వారీగా జనాభా గణాంకాలు, ఓటర్ల జాబితాను నిశితంగా పరిశీలిస్తే, ఈ ముస్లిం వీటో అనే వాదనలో అతిశయోక్తి ఎక్కువగా ఉందనే విషయం విస్పష్టంగా తెలుస్తుంది.
కార్య‌క‌ర్త‌లను, వారి అవ‌స్థ‌ల‌ను ద‌గ్గ‌రి నుంచి ప‌రిశీలించిన లోకేష్.. వారికంటూ ఒక జీతం ఉండాలని మొద‌ట‌ కోరుకున్నారు. అది త‌ర్వాతి రోజుల్లో జ‌న్మ‌భూమి క‌మిటీల‌కు ప్రేర‌ణ‌గా మారింది. అంతే కాదు.. వాలంటీర్ వ్య‌వ‌స్థ‌కూ ఇదే స్ఫూర్తి. క‌నీసం వారికి బీమా సౌక‌ర్యం ఉండాల‌ని కోరుకున్నారాయ‌న‌. దీన్ని వ‌ర్క‌వుట్ చేయ‌గ‌లిగారు. పార్టీ కేడ‌ర్ కి లైఫ్ ఇన్ స్యూరెన్స్ చేసిన తొలి పార్టీ తెలుగుదేశం అయితే, అందుకు కార‌కుడు లోకేష్.
దేశంలో ఎన్నికల ప్రక్రియ అనగానే కేవలం ఓటింగ్, ఫలితాలే గుర్తొస్తాయి.
పార్టీ కార్యకర్తలపై నమోదైన కేసుల విషయంలో ఆయన నేరుగా రంగంలోకి దిగి వారికి భరోసా కల్పించారు. కార్యకర్తల సంక్షేమం కోసం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయడం ద్వారా, పార్టీ అంటే కేవలం ఎన్నికల యంత్రాంగం మాత్రమే కాదు, ఒక కుటుంబం అనే భావనను ఆయన పాదుకొల్పారు. ఈ నేపథ్యంలోనే ఆయనకు వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు ఇవ్వడం సరైన నిర్ణయమని పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.