దావోస్ లో జగన్ బృందం మాటల కోటలు.. దరి చేరని పారిశ్రామిక వేత్తలు!

Publish Date:May 23, 2022

Advertisement

దావోస్ లో జగన్ తనకు అలవాటైన అబద్ధాల ప్రచారాన్ని మరో లెవెల్ కు తీసుకు వెళుతున్నారు. వాస్తవానికి దావోస్ లో ఏపీ ఉనికిని గుర్తించేందుకు కూడా పారిశ్రామిక వేత్తలు ముందుకు రాని పరిస్థితి ఉంది. కానీ ఏపీలో లాగే దావోస్ లో కూడా జగన్ అబద్ధాల తెర వెనుక గడిపేస్తున్నారు. దావోస్ లో ఏపీ వైపు చూసిన పారిశ్రామిక వేత్తలే లేరంటే అతిశయోక్తి కాదు. అసలు దావోస్ కు జగన్ పర్యటన పెట్టుబడుల కోసం కాదనీ, వేరే వ్యక్తిగతమైన వ్యవహారాలు చక్కబెట్టుకునేందుకు విదేశీ పర్యటన కోసమే దావోస్ ను ఒక సాకుగా చూపారనీ తొలి నుంచీ విమర్శలు వస్తునే ఉన్నాయి. అందుకు తగ్గట్టుగానే ఆయన దావోస్ చేరుకోవడానికి ముందు లండన్ లో ల్యాండ్ కావడం ఆ విమర్శలకు బలం చేకూర్చింది. అలాగే జగన్ దావోస్ కు బయలుదేరడానికి చాలా రోజుల ముందుగానే ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి  గుడివాడ అమర్నాథ్ కుండ బద్దలు కొట్టేశారు. జగన్ దావోస్ ఆర్థిక సదస్సులో పాల్గొన్నంత మాత్రాన పెట్టుబడులు వచ్చి పడిపోతాయన్న భ్రమలు వద్దని ఆయన ఎలాంటి మొహమాటం లేకుండా చెప్పేశారు.

అయితే దావోస్ లో జగన్, ఆయన వెంట వెళ్లిన బృందం మాత్రం ఏపీకి  అక్కడ పారిశ్రామిక వేత్తలు బ్రహ్మరథం పట్టేస్తున్నారన్నట్టు బిల్డప్ ఇవ్వడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇంతకీ దావోస్ లో  జగన్ బృందంతో చర్చలు జరిపిన కంపెనీ ఏదయ్యా అంటే.. మూడు రాజధానుల మాటకు జగన్ కు వంత పాడిన బోస్టన్ కన్సెల్టింగ్ గ్రూప్ (బీసీజీ). ఈ బీసీజీ గ్రూప్ కొత్తదేం కాదు. ఏపీలో ఆ గ్రూప్ తన తీరుతో ఎంతగా భ్రష్టుపట్టిందో అందరికీ తెలిసిందే. మూడు రాజధానుల కోసం జగన్ నియమించుకున్నది ఆ గ్రూప్ నే. ఆ గ్రూపు నివేదిక ఇవ్వడానికి ముందే.. జగన్ నోటి వెంట మూడు రాజధానుల నిర్ణయం వెలువడింది. ఆ తరువాత తీరిగ్గా బీసీజీ గ్రూపు జగన్ చెప్పిన మాటలను చిలకలా వల్లె వేసింది. బీసీజీ గ్రూపు మూడు రాజధానులకు అనుకూలంగా ఇచ్చిన నివేదికపై చాలా మంది కోర్టుకు వెళ్లారు. మరింత మంది పోలీసు స్టేషన్ లో కేసులు పెట్టారు.

ఇప్పుడు దావోస్ లో ఆ సంస్థ చైర్మనే పాత పరిచయంతో జగన్ తో భేటీ అయ్యారు. మూడు రాజధానులకు అనుకూలంగా నివేదిక ఇచ్చినట్లుగానే... ఇక్కడ కూడా జగన్ ఏం కావాలో అదే మాట్లాడారు.  ఏపీ ప్రభుత్వ పారిశ్రామిక విధానం భవిష్యత్ లో రాష్ట్రంలో పెట్టుబడులు వెల్లువెత్తడానికి దోహదపడుతుందన్నది బీసీజీ గ్రూప్ చైర్మన్ ప్రసంగ సారాంశం. ఇక దావోస్ లో ఏర్పాటు చేసిన ఏపీ పెవిలియన్ ను డబ్ల్యూఈఎఫ్ వ్యవస్థాపకుడు క్లాజ్ ష్వాప్ మాత్రమే. అలాగే ఆదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ కూడా జగన్ తో భేటీ అయ్యారు.

 వీరి మధ్య పెట్టుబడుల అంశం కాకుండా గౌతమ్ అదానీ భార్యకు జగన్ ఇవ్వచూపిన రాజ్యసభ టికెట్ ను నిరాకరించడంపైనే చర్చ జరిగిందన్నది వైసీపీ వర్గాల కథకం. వీరు కాకుండా జగన్ కేసి కానీ, ఏపీ వైపు కానీ చూసిన పారిశ్రామిక వేత్త లేరు. అయినా జగన్ బృందం జగన్ దావోస్ పర్యటనను ఆహా, ఓహోలతో పొగిడేస్తూ లేని సీన్ ఉందని నమ్మించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.

By
en-us Political News

  
భీమిలి అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్తగా (ఇన్ చార్జ్) బొత్స అనూషను ఆ పార్టీ అధినేత జగన్ నియమించారు. ఈ మేరకు   పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి  ఉత్తర్వులు వెలువడ్డాయి. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆదేశాల మేరకే ఈ నియామకం జరిగినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.  
స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో జగన్ విదేశీ పర్యటన పెట్టుకోవడాన్ని ప్రస్తావిస్తూ రాజకీయ పరిశీలకులు షర్మిల కుమార్తె వివాహానికి హాజరు కాకుండా తప్పించేకునేందుకే జగన్ ఈ నిర్ణయం తీసుకుని ఉండొచ్చంటూ విశ్లేషిస్తున్నారు.  ఈ నేపథ్యంలోనే షర్మిల తన అన్న నివాసానికి వెళ్లి వివాహ ఆహ్వానపత్రిక అందిస్తారా? అందిస్తే జగన్ ఆ వివాహానికి హాజరౌతారా? అన్న అనుమానాలు పరిశీలకులలో వ్యక్తమౌతున్నాయి.
విదేశీ పర్యటనలో ఉన్నంతకాలం  అందుబాటులో ఉండే కాంటాక్ట్ ఫోన్ నంబరుతో పాటు అధికారిక ఈ-మెయిల్ అడ్రస్ కూడా సీబీఐ అధికారులకు కచ్చితంగా అందించాలి. ఇక విదేశీ పర్యటన ముగిసిన వెంటనే   కోర్టు విచారణ ప్రక్రియకు హాజరు కావాలని కోర్టు ఆదేశించింది.
చీఫ్ జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్, జస్టిస్ జి.ఎం. మొహిద్దీన్ కూడిన ధర్మాసనం స్పీకర్ తీర్పును పక్కనపెట్టి దానం నాగేందర్ అనర్హతను ఖాయం చేసింది. 
విజయవాడ ఏసీబీ కోర్టు న్యాయాధికారి సమక్షంలో శుక్రవారం దాదాపు ఐదుగంటల పాటు  సత్యప్రసాద్‌ తన వాంగ్మూలాన్ని నమోదు చేయించారు. ఈ ప్రక్రియలో పలువురు న్యాయవాదులు, ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అధికారులు   పాల్గొన్నారు. ప్రభుత్వంలో ఉన్నప్పుడు కీలక బాధ్యతలు నిర్వర్తించిన సత్యప్రసాద్, ఈ అక్రమ వసూళ్ల తంతు ఎలా సాగిందో సవివరంగా న్యాయమూర్తి ఎదుట చెప్పారు.
దానం నాగేందర్ అధికారికంగా బీఆర్‌ఎస్‌ పార్టీకి రాజీనామా చేయకుండానే కాంగ్రెస్‌ గూటికి చేరారని, అంతేకాకుండా కాంగ్రెస్‌ పార్టీ తరఫున సికింద్రాబాద్‌ లోక్‌సభ స్థానానికి అభ్యర్థిగా  పోటీ చేశారని హైకోర్టు దృష్టికి తెచ్చారు. పార్టీ ఫిరాయింపులకు ఇవి  బలమైన సాక్ష్యాధారాలని వారు పేర్కొన్నారు.
మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తూ ప్రవేశపెట్టిన పథకాలు దేశంలో విప్లవాత్మక మార్పులు తెచ్చాయన్న చంద్రబాబు , భారతదేశాన్ని గ్లోబల్ లీడర్‌గా నిలపడంలో ప్రధాని మోదీ దార్శనికత  కీలకమని చంద్రబాబు అన్నారు.
తాజాగా తృణమూల్ లోని మమతా వర్గం, రితబ్రత వర్గాలకు చెందిన కీలక నాయకులు  ఢిల్లీలో  భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) ఫుల్ బెంచ్ ఎదుట హాజరై తమ వాదనలను బలంగా వినిపించారు. ఇరువర్గాలు కూడా ఈసీఐ విచారణ ముగిసిన తర్వాత తమ వాదనలకే అనుకూలంగా తుది తీర్పు వస్తుందని ధీమా వ్యక్తం చేయడం రాజకీయ వర్గాల్లో ఈ వ్యవహారంపై మరింత  ఆసక్తిని రేకెత్తించింది. 
ఒకనాడు ప్రత్యర్థుల విమర్శల దాడులను చిటికెలో   చిత్తు చేసే నేర్పు ఉన్న నేతగా నిలిచిన హరీష్ రావు.. ఇప్పుడు ఆత్మరక్షణలో పడినట్లు కనిపిస్తున్నదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
ఉపాధ్యాయ పోస్టుల భర్తీ ప్రక్రియలో అవకతవకలు జరిగాయంటూ వైసీపీ ఆరోపణలు గుప్పిస్తోంది. అధికారంలో ఉన్న తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న పద్ధతులను ప్రశ్నిస్తూ, సోషల్ మీడియా,  మీడియా సమావేశాల ద్వారా విమర్శలు గుప్పిస్తోంది. డీఎస్సీ నియామకాల్లో పారదర్శకత లోపించిందని, అభ్యర్థుల మార్కులు  పరిశీలనా ప్రక్రియలో గందరగోళం నెలకొందని ఆరోపిస్తున్నది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల అసెంబ్లీ వేదికగా మాజీ సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యుల భూ ఆక్రమణలంటూ చేసిన సంచలన వ్యాఖ్యలు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్‌పై గులాబీ పార్టీ  మండిపడింది. ప్రభుత్వ వైఫ్యాలను కప్పిపుచ్చుకునేందుకే కాంగ్రెస్ పెద్దలు ఇలాంటి నిరాధార ఆరోపణలు చేస్తున్నారని  ఎదురుదాడికి దిగింది.
మైగ్రేన్ తలనొప్పితో ఆసుపత్రికి వెళ్లిన బెక్కీ జోన్స్‌కు బ్రెయిన్ క్యాన్సర్ ఉందంటూ 11 ఏళ్ల పాటు కీమోథెరపీ ఇచ్చారు. కానీ చివరికి అసలు క్యాన్సరే లేదని తెలిసిన షాకింగ్ వివరాలు ఈ వెబ్ స్టోరీలో చదవండి.
పట్టభద్రుల ఎన్నికలకు ఓటర్ల జాబితా ప్రక్రియ షెడ్యూల్ విడుదల.. !
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.