అమరావతే రాజధాని.. ఇదిగో ఇండికేషన్...

Publish Date:Feb 5, 2022

Advertisement

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆలోచనలు ఎలా ఉన్నా, కేంద్ర ప్రభుత్వం మాత్రం అమరావతే రాష్ట్ర ఏకైక రాజధాని అనే నిర్ణయానికి వచ్చిందా?  అంటే వచ్చిందనే సంకేతాలే కనిపిస్తున్నాయని  పరిశీలకులు అంటున్నారు. కొద్ది నెలల క్రితం కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా తిరుపతి పర్యటనకు వచ్చినప్పటి నుంచి చోటు చేసుకున్న పరిణామాలను గమనిస్తే కేంద్ర ప్రభుత్వం తెలుగు దేశం ప్రభుత్వ హయాంలో ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా శంఖుస్థాపన చేసిన, అమరావతిని ఏకైక రాజదానిగా అభివృద్ధి చేసే దిశగా అడుగులు వేస్తున్న  వైనం స్పష్టమవుతోందని అంటున్నారు. 

అమిత్ షా తమ పర్యటనలో భాగంగా రాష్ట్ర బీజేపీ నాయకులతో జరిపిన చర్చల్లో అప్పటికే ఉదృతంగా సాగుతున్న రాజధాని రైతుల ఆందోళనలో భాగంగా సాగుతున్న ‘న్యాయస్థానం నుంచి దేవ స్థానం’ మహా పాదయాత్రలో పార్టీ నాయకులు పాల్గొనాలని, ఆదేశించారు. వైఎపీ ప్రభుత్వం ప్రతిపాదించిన మూడు మూడు రాజధానుల ప్రతిపాదనకు వ్యతిరేకంగా అమరావతి రైతులు సాగిస్తున్న ఆందోళనకు మద్దతు ప్రకటించారు. ఆ తర్వాత కొద్ది రోజులకే రాష్ట్ర ప్రభుత్వం మూడు రాజదానుల బిల్లును ఉప సంహరించుకుంది. అయితే, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అదే సమయంలో బిల్లును ఉప సంహరించుకున్నా, తమ ప్రభుత్వం పరిపాలనా వికేంద్రీకరణకు కట్టుబడి ఉందని, మళ్ళీ మూడు రాజధానుల్ బిల్లును మరింత పటిష్టంగా తీసుకొస్తామని అన్నారు. అయితే, ఆ ప్రకటన చేసి ఇంచుమించుగా మూడు నెలలు అవుతున్నా, అలాంటి ప్రయత్నం ఏదీ జరుగున్నట్లు లేదని అధికార వర్గాల ద్వారా తెలుస్తోంది.
 
అదలా ఉంటే, ఇటీవల  రాజ్యసభలో ఏపీ రాజధానిపై క్లారిటీ ఇవ్వాలని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు అడిగిన ప్రశ్నకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ ఇచ్చిన    సమాధానంలో  కేంద్రం వద్ద  ఉన్న సమాచారం ప్రకారం ఏపీకి రాజధాని అమరావతే అని స్పష్టం చేశారు.
అదలా ఉండగా, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కు అమరావతే రాజధాని అని మరో స్పష్టమైన సంకేతం ఇచ్చింది.  అమరావతి పరిధిలో తుళ్లూరు-రాయపూడి మధ్య, మూడేళ్ళ క్రితం, చంద్రబాబు ప్రభుత్వ హయాంలో రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన భూమిలో శంఖుస్థాపన జరిగి, ఎన్నికలు, ప్రభుత్వ మార్పు కారణంగా నిర్మాణ పనులు నిలిచి పోయిన  నేషనల్ జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా కార్యాలయ నిర్మాణ పనులను కేంద్ర ప్రభుత్వం మూడు రోజుల క్రితం పునః ప్రారంభించింది. ఇందులో భాగంగా కార్యాలయం చుట్టూ ప్రహరి నిర్మాణ పనులు జరుగుతున్నాయి. రాజధానిలో నిర్మాణ పనులు ప్రారంభం కావడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల రాజధాని ఏదో ఖరారు చేస్తే ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయాన్ని నిర్మిస్తామని ఆర్బీఐ నుంచి ఏపీకి సమాచారం వచ్చింది. కేంద్రం అమరావతే రాజధాని స్పష్టత ఇవ్వడంతో ఇప్పుడు మిగిలిన కేంద్ర సంస్థలు కూడా నిర్మాణాలు ప్రారంభించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

మరో వంక రాష్ట్ర ప్రభుత్వం కూడా మడమ తిప్పారనే మాట రాకుండా, పరువు నిలుపుకునేందుకు ఇంకా మూడు రాజధానులు అంటోంది కానీ, మూడును మూట కట్టినట్లే కనిపిస్తోంది, అమరావతిలో రెండున్నర మూడేళ్ళ క్రితం ఆగిపోయిన ఎమ్మెల్యే క్వార్టర్ల నిర్మాణ పనులను ప్రభుత్వం పునః ప్రారంభించింది. అలాగే, రాజ్యసభలో అమరావతే ఏపీ  రాజధాని కేంద్రం స్పష్టం చేసిన నేపధ్యంలో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామ కృష్ణా రెడ్డిని, “అంతేగా, సాంకేతికంగా అమరావతే రాజధానిగా” అన్నారు. అఫ్కోర్స్, దానికి కొనసాగింపుగా, ప్రభుత్వం వికేంద్రీకరణకు కట్టుబడి ఉందని,పడికట్టు పదాలను చేర్చారనుకోండి అది వేరే విషయం. కాగా, ఈ పరిణామాలను గమనిస్తే, కేంద్ర ప్రభుత్వం జోక్యంతో, రాష్ట్ర ప్రభుత్వం కూడా మూడు రాజధానుల ముచ్చటను, కనీసం ప్రస్తుతానికి అయితే అటక ఎక్కించినట్లే, అంటున్నారు.

By
en-us Political News

  
ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.
చిన్న శ్రీనుకు విజయనగరం జిల్లా తెలుగుదేశం అధ్యక్ష బాధ్యతలను అప్పగించనున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే ఈ విషయంలో అధికారికంగా తెలుగుదేశం హై కమాండ్ నుంచి ఎటువంటి ప్రకటన కానీ, సంకేతం కానీ రాలేదు. 
బీజేపీ, తెలుగుదేశం పొత్తు విచ్చిన్నం చేయడంలో అప్పట్లో తాను సక్సెస్ అయ్యానని విజయసాయి రెడ్డి విస్పష్టంగా చెప్పడంతో.. అసలు నాడు ఈ రెండు పార్టీల పొత్త విచ్ఛిన్నం కావడానికి దారి తీసిన పరిస్థితులపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
నిన్నగాక మొన్న ఇదే మోడీ నాయకత్వంలోని ఎన్డీయే సర్కార్ కు వ్యతిరేకంగా పోరాడటానికి సిద్ధంగా ఉన్నానని ప్రకటించిన జగన్, ఇప్పుడు ఆదే మోడీ నాయకత్వాన్ని ప్రస్తుతిస్తూ ప్రశంసలు కురిపించడం ద్వంద్వ వైఖరి కాక మరేమిటని పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు.
. ఇక షర్మిల విజయ్ ను కలిసి తన కుమార్తె వివాహానికి హాజరు కావాల్సిందిగా కోరుతూ పెళ్లి శుభలేక అందించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందు కంటే కేంద్ర స్థాయిలో కాంగ్రెస్ తో పొత్తు విషయంలో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ కూడా కీలకంగా ఉంది. అలాగే తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వంలో కాంగ్రెస్ భాగస్వామి.  
లౌకిక స్వభావం కలిగిన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి మతపరమైన అంశాలను జొపపించడానికి విజయసాయి ప్రయత్నిస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇక తమ ప్రసంగాల్లో, మీడియా సమావేశాలలో విజయసాయిరెడ్డి ప్రస్తావిస్తున్న అంశాలు ఆ విశ్లేషణలకుబలం చేకూరుస్తున్నాయి.
ఇప్పటికే తనపై 45 ఎఫ్ఐఆర్ లు ఉన్నాయన్న ఆయన తన టార్గెట్ వంద ఎఫ్ఐఆర్ లు అని చెప్పారు. అంతే కాదు.. వాటిని తాను ప్రజల పక్షాన నిలబడినందుకు దక్కిన మెడల్స్ గా భావిస్తానన్నారు. రాహుల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి.
విపక్షాల నిరసనల నేపథ్యంలో   పోలీసులు ఢిల్లీలో విస్తృత బందోబస్తు ఏర్పాట్లు చేశారు.  పలు ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేయడంతో పాటు వేలాది మంది భద్రతా సిబ్బందిని మోహరించారు. ట్రాఫిక్ మళ్లింపులు కూడా చేపట్టారు. జంతర్ మంతర్, పార్లమెంట్ పరిసరాలు, ఎన్నికల సంఘం కార్యాలయం వైపు వెళ్లే మార్గాల్లో ప్రత్యేక నిఘా కొనసాగుతోంది. 
 ధనుష్‌ తన కొత్త రాజకీయ పార్టీ కోసం  తమిళగ ఎళుచ్చి కళగం అనే పేరును ఖరారు చేసినట్లు  ప్రచారం జరుగుతోంది. అలాగే.. ఈ పేరుతో ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం వద్ద పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా పూర్తయ్యిందని అంటున్నారు.
ఒక దశలో తన రిటైర్మెంట్ తరువాత టీడీపీలో చేరేందుకు కూడా తాను సిద్ధపడ్డాననీ, అవసరమైతే  ఎన్నికల బరిలో దిగడానికి కూడా రెడీ అయ్యాయనీ చెప్పిన ఏబీ వెంకటేశ్వరరావు, అ
బీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ప్రకాశ్ పాల్, ప్రముఖ దళిత నేత, మాజీ ఎంపీ విద్యాసాగర్ సోన్‌కర్, అలాగే అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రెండుసార్లు బాధ్యతలు నిర్వర్తించిన రాధాకాంత్ ఓఝా వంటి వారికి చోటు లభించింది.
జిల్లాలో పార్టీ పరిస్థితి వేగంగా దిగజారిపోతోంది. మజ్జి పార్టీని వీడటంతో జాగ్రత్త పడాల్సిన పార్టీ హైకమాండ్, అలాగే బొత్స సత్యనారాయణ చేతులెత్తేసినట్లు కనిపిస్తోంది. అంతే కాకుండా కూర్చున్న కొమ్మనే నరుక్కున్న చందంగా అసంతృప్తులను బుజ్జగించాల్సింది పోయి వారిపై సస్పెన్షన్ వేటు వేయడంతో జిల్లాలో పార్టీని జీరో నుంచి బిల్డ్ చేద్దామనుకుంటున్నారా? లేక జిల్లా పార్టీని వదిలేశారా అన్న అనుమానాలు పార్టీ శ్రేణుల నుంచే వస్తున్నాయి. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.