వలసల భారతం!

Publish Date:Jan 13, 2023

Advertisement

ఏటా లక్షలాది మంది భారతీయులు  విదేశాలకు వలస వెళ్లిపోతుండటం అత్యంత ఆందోళన కలిగిస్తున్న అంశం.  స్వదేశంలో కన్నా విదేశాల్లో స్థిరపడడానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్న భారతీయుల సంఖ్య ఏటా పెరిగిపోతుండటానికి కారణమేమిటన్న దానిపై ఇటీవల ఇండోర్ లో జరిగిన భారతీయ ప్రవాసీ దివస్ లో చర్చ జరిగింది.  తాజా గణాంక వివరాల ప్రకారం, ప్రస్తుతం కోటీ 80 లక్షల మంది భారతీయులు విదేశాల్లో నివసిస్తున్నారు.

ఇంత పెద్ద సంఖ్యోలో విదేశాలకు వెళ్లిన జనాభా ఉన్న దేశం ప్రపంచంలో భారత్ మాత్రమే. ఎందుకు ఇంత పెద్ద ఎత్తున వలసలు పోతున్నారన్న దానిపైనే   భారతీయ ప్రవాసీ దివస్‌లో  ఆందోళన వ్యక్తమైంది. భారతీయుల్లో అత్యధిక సంఖ్యా కులు విదేశాల్లో తమ భవితవ్యాన్ని, తమ అదృష్టాన్ని వెతుక్కోవడానికి దారి తీస్తున్న కారణాలపై కూడా చర్చ జరిగింది.  భారత్‌ తర్వాత అంత పెద్ద సంఖ్యలో వలసలు పోతున్న జనాభా కలిగిన దేశం మెక్సికో మాత్రమే. అయితే అక్కడి వారు ఎక్కువగా వలస వేళ్లేది అమెరికాకు మాత్రమే. అదే ఇండియన్స్ విషయానికి వస్తే.. వీరు దేశం విడిచి వెళ్లడానికి డెస్టినేషన్ ఒక్క అమెరికా మాత్రమే కాదు.. ప్రపంచంలోని ఏ దేశానికైనా సరే వెళ్లడానికి ఇసుమంతైనా సందేహించకుండా వెళ్లిపోతున్నారు.

 ఒక్క గల్ఫ్ దేశాలలోనే దాదాపు 80 లక్సల మంది భారతీయులు ఉద్యోగమో, వృత్తో, వ్యాపారమో చేసుకుంటగూ జీవనం గడుపుతున్నారు.  అలాగూ అమెరికా, ఇంగ్లండ్‌ ఆస్ట్రేలియా, కెనడా, న్యూజిలాండ్ దేశాలకు వలస వెళ్లిన వారి సంఖ్యా లక్షల్లోనే ఉంటుంది. వీరంతా స్వదేశీ పాస్ పోర్టు స్థానంలో వీరు నివసిస్తున్న దేశం పాస్ పోర్టు కోసం ప్రయత్నాలు చేసి సాధిస్తున్నారు.  తూర్పు ఆఫ్రికా, కరిబ్బియన్‌, మలేషియా, ఫిజి దేశాల్లో కూడా భారతీయులు స్థిర నివాసాలు ఏర్పరచుకున్నారు.  వీరంతా వలస పాలకుల కాలంలోనే భారతదేశం వదిలి ఇక్కడకు కార్మికులుగా చేరుకుని స్థిరపడ్డారు. విదేశాలకు వలస వెళ్లి స్థిరపడిన భారతీయుల్లో కార్మికులూ ఉన్నారు. అధికారులు ఉన్నారు. యజమానులు ఉన్నారు.

సంపన్నులూ, పేదవారూ కూడా ఉన్నారు.  అయితే, వీళ్ల భవిష్యత్తు ఎలా ఉండబోతోందన్నదే మిలియన్ డాలర్ల ప్రశ్న. ఆయా దేశాలలో  సమస్యలు ఉత్పన్నమైనప్పుడు అక్కడి వారి దృష్టి పడేది ప్రధానంగా ప్రవాసులపైనే.   విశేషమేమిటంటే, చాలా దేశాల్లో భారతీయులు ఘన విజయాలు సాధిస్తున్నారు. ఇక అమెరికాలో అయితే, ఇతర దేశాల సంతతికి చెందినవారిలో భారతీయులే సంపన్న వర్గంగా రికార్డులకెక్కింది. ఇంగ్లండ్‌ పోర్చుగల్‌, ఐర్లాండ మారిషస్‌ ప్రధాన మంత్రులు, గుయానా, సూరినామ్‌, ఇండొనీషియా అ ధ్యక్షులు భారతీయ సంతతికి చెందినవారే. మొత్తం మీద నాలుగు ఖండాల్లోని దేశాలలో భారతీయులే అగ్రస్థానంలో ఉన్నారు. అమెరికా ఉపాధ్యక్షురాలు కూడా భారతీయ సంతతికి చెందిన వ్యక్తే.  అనేక దేశాల్లో అత్యంత పట్టు, పలుకుబడి కలిగిన వర్గంగా రూపాంతరం చెందిన భారతీయులు భారత్‌కు, ఇతర దేశాలకు మధ్య భౌగోళికంగానే కాక, రాజ కీయంగా, ఆర్థికంగా కూడా ఓ బలమైన వారధిగా పనిచేయడం కద్దు.  ఇలా ఎన్నిసానుకూలతలు ఉన్నా అందే ఆందోళన కర విషయాలు కూడా ఉన్నాయి.

 ప్రతి ఏటా కనీసం లక్షమంది భారతీయులు తమ భారతీయ పౌరసత్వాన్ని వదులుకుంటున్నారు. 2022లో మొదటి పది నెలల కాలంలోనే ఈ సంఖ్య లక్షా 83 వేలు దాటింది. హెన్లీ అండ్‌ పార్ట్నర్స్‌ అనే ప్రసిద్ధ కన్సల్టెన్సీ సంస్థ అందజేసిన వివరాల ప్రకారం, గత ఏడాది సుమారు 8,000 మంది భారతీయ కుబేరులు భారతదేశ పౌరస త్వానికి స్వస్తి పలికారు. అంతేకాదు, సంపన్న భారతీయుల్లో ఎక్కువ మంది విదేశాల్లో పెట్టుబడులు పెట్టడం జరుగుతోంది. భారత దేశ ఆర్థిక వ్యవస్థ మీద విశ్వాసం సడలిపోవడమే ఇందుకు ముఖ్యంకారణంగా చెబుతున్నారు.  దేశంలో రాజకీయ పరిస్థితులు, ఆర్ధిక విధానాలు కారణంగానే తాము దేశం విడిచి వెళ్లడానికి కారణమని కూడా అత్యధికులు చెబుతున్నారు. 

By
en-us Political News

  
గతంలో రాష్ట్ర రాజకీయాలలో  కొండా సురేఖ కేటీఆర్ పై చేసిన వ్యక్తిగత విమర్శలు  దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ వ్యాఖ్యలకు బేషరతుగా క్షమాపణ చెప్పిన కొండా సురేఖ వాటిని ఉపసంహరించుకున్నారు.   గతంలో కేటీఆర్ పై తాను చేసిన అనుచిత వ్యాఖ్యలను  పూర్తిగా వెనక్కి తీసుకుంటున్నట్లు సోషల్ మీడియా వేదికగా  పేర్కొన్నారు. 
తెలంగాణ రాజకీయాలలో ఏ పార్టీతోనూ పొత్తు లేదు లేదంటూనే జనసేనతో పొత్తుకు తహతహలాడుతోంది. తెలంగాణలో స్వంతంగానే బరిలోకి దిగుతామని కుండబద్దలు కొట్టిన బీజేపీ ఇప్పుడు జనసేనతో అంతర్గత పొత్తు కుదుర్చుకుందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. 
నియోజకవర్గంలో రాబోయే మున్సిపల్ చైర్మన్ ఎన్నికలను తెలుగుదేశం కూటమి గెలుచుకుంటుందన్న ధీమా వ్యక్తం చేశారు. వైసీపీకి పులివెందుల ఇంకెంత మాత్రం కంచుకోట కాదని విస్పష్టంగా పేర్కొన్నారు.  దశాబ్దాలుగా తిరుగులేని ఆధిపత్యం చెలాయిస్తున్న పులివెందులలో కూటమి నేతలు నేరుగా సవాళ్లు విసురుతుండటం పులివెందులలో మసకబారిన వైసీపీ ప్రతిష్ఠకు, పలుకుబడికి నిదర్శనంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 
అయితే, ప్రస్తుతం సిద్ధమవుతున్న చార్జ్‌షీట్‌ను మరింత పటిష్టంగా రూపొందించేందుకు ఉన్నతాధికారులు ఢిల్లీలోని ప్రముఖ సుప్రీంకోర్టు న్యాయవాదులతో సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది. సాంకేతిక సాక్ష్యాలు, బాధితుల వాంగ్మూలాల ఆధారంగా ఈ అదనపు చార్జిషీట్ ను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.
విపత్కర సమయంలో తెలుగు రాష్ట్రాల ఐక్యత.. ఏపీకి సాయం.!
హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని శ్రీ కృష్ణ సదర్ సమ్మేళనం ఉత్సవ కమిటీ ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిశారు.
ఒక్కోసారి చిన్న ప్రయత్నం కూడా ఊహించని విధంగా జీవితాన్ని మార్చేస్తుందనడానికి నిదర్శనంగా నిలిచింది ఒక ఉదంతం.
ఆంధ్రప్రదేశ్‌ను వణికించిన అర్నబ్ తుఫాను ప్రభావంతో పంటలు, ఇళ్లు, రహదారులు, విద్యుత్ వ్యవస్థలకు నష్టం వాటిల్లింది.
ప్రకృతి వైపరీత్యాలు సంభవించిన క్లిష్ట పరిస్థితుల్లోనూ ఏ మాత్రం వెనకడుగు వేయకుండా, ప్రాణాలను సైతం లెక్కచేయకుండా విద్యుత్ శాఖ సిబ్బంది సేవలందిస్తున్న తీరు ఎంతో స్ఫూర్తిదాయకమని
స్థానిక  సన్నాహాలపై తెలుగుదేశం కూటమికి చెందిన దాదాపు 45 వేల మంది ముఖ్య నేతలు, ప్రజాప్రతినిధులు,  కార్యకర్తలతో  సీఎం చంద్రబాబు ఈ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన వైసీపీపై చంద్ర నిప్పులు చెరిగారు.
కేరళలోని కొచ్చిలో సంచలనం సృష్టించిన మెర్సిడెస్ బెంజ్ కారు ప్రమాదం కేసు పోలీసు శాఖలో కలకలం రేపుతోంది.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది.
మహా న‌గ‌రం హైద‌రాబాద్‌లో ఎట్టి పరిస్థితుల్లోనూ తాగు నీటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.