గేమ్స్ లో కొనసాగుతున్న భారత్ హవా
Publish Date:Jul 30, 2022
Advertisement
బర్మింగ్‌హామ్ వేదికగా జరుగుతున్న కామన్‌వెల్త్ క్రీడల్లో భారత్ బోణీ కొట్టింది. చాను రెండవ స్నాచ్ ప్రయత్నంలో 88కిలోల లిఫ్ట్‌తో తన కొత్త వ్యక్తిగత అత్యుత్తమమైన గేమ్స్ రికార్డును నెలకొల్పింది. మన దేశానికి తొలి మెడల్ ను మహారాష్ట్రకు చెందిన 21 ఏళ్ల వెయిట్ లిఫ్టర్ సంకేత్ మహదేవ్ సర్గర్ సాధించిపెట్టారు. 55 కేజీల వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో ఆయన రజత పతకం (సిల్వర్ మెడల్) కైవసం చేసుకున్నారు.ఈ పోటీల్లో స్వర్ణమే లక్ష్యంగా బరిలోకి దిగిన సంకేత్.. మొత్తం 248 కేజీల బరువును (స్నాచ్‌లో 113 కేజీలు, సీ ఎండ్ జేలో 135 కేజీలు) ఎత్తి తన లక్ష్యానికి (స్వర్ణం) కేవలం ఒక్క కిలో దూరంలో నిలిచి పోయాడు. కాగా, గురురాజా పూజారి, కెనడాకు చెందిన యూరి సిమర్డ్ మధ్య జరిగిన పోరులో గురురాజా క్లీన్ అండ్ జెర్క్ లో తన మూడవ ప్రయత్నంలో 151కిలోలు ఎత్తి, పురుషుల 61కిలోల ఫైనల్‌లో మొత్తం 269కిలోలతో పూర్తి చేయడంతో గురు రాజకు కాంస్య పతకం కైవసం చేసుకున్నాడు. ఘనాతో జరిగిన హాకీ మ్యాచ్‌లో భారత మహిళల జట్టు సంపూర్ణ ఆధిపత్యం సాధించి 5-0తో విజయం సాధించింది. అలాగే, 100 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్ స్విమ్మింగ్‌లో శ్రీహరి నటరాజ్ సెమీస్‌కు అర్హత సాధించాడు. ఇండియన్ బాక్సర్ శివ థాపా 63 కేజీల విభాగంలో పాకిస్థాన్ బాక్సర్ సులేమాన్ బలోచ్‌ను 5-0తో విజయం సాధించారు. మహిళల టీటీ జట్టు దక్షిణాఫ్రికాను 3-0తో ఓడించింది. మిక్స్‌డ్ టీం గ్రూప్-ఎ బ్యాడ్మింటన్ మ్యాచ్‌లో పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో పీవీ సింధు 3-0తో విజయం సాధించింది. కిడాంబి శ్రీకాంత్, మిక్స్‌డ్ డబుల్స్ జట్టు తమ మ్యాచ్‌లను గెలిచి ఇండియాను 2-0 ఆధిక్యంలో తీసుకెళ్లారు. పురుషుల మారథాన్ రేసులో భారత ఆటగాడు నితేంద్ర సింగ్ రావత్ 12వ స్థానంలో నిలిచాడు. 35 ఏళ్ల రావత్ 2 గంటల 19 నిమిషాల 22 సెకన్లలో ఉగాండాకు చెందిన విక్టర్ కిప్లాంగట్ (2:10:55)పై గెలిచాడు. కాగా స్క్వాష్ పోటీల్లో భారత క్రీడాకారిణి జోషన చినప్ప 11-8, 11-9, 12-10తో బార్బడోస్‌కు చెందిన మీగన్ బెస్ట్‌పై గెలుపొందిం ది. సౌరవ్ ఘోసల్ 11-4, 11-4, 11-6తో శ్రీలంకకు చెందిన షామిల్ వకీల్‌పై విజయం సాధించాడు. ఇక సైక్లింగ్ మహిళల స్ప్రింట్ క్వాలిఫైయర్‌లో భారతదేశానికి చెందిన మయూరి , పాల్ వరుసగా 20వ , 23వ స్థానాల్లో నిలిచారు. 1/8 ఫైనల్స్‌కు అర్హత సాధించిన టాప్ 16లో పూర్తి చేయడంలో విఫలమయ్యారు.
http://www.teluguone.com/news/content/indians-going-great-in-cwg-39-140929.html





