Publish Date:Jul 30, 2022
బర్మింగ్‌హామ్ వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ క్రీడల్లో భారత్ బోణీ కొట్టింది. చాను రెండవ స్నాచ్ ప్రయత్నంలో 88కిలోల లిఫ్ట్‌తో తన కొత్త వ్యక్తిగత అత్యుత్తమమైన గేమ్స్ రికార్డును నెలకొల్పింది. మన దేశానికి తొలి మెడల్ ను మహారాష్ట్రకు చెందిన 21 ఏళ్ల వెయిట్ లిఫ్టర్ సంకేత్ మహదేవ్ సర్గర్ సాధించిపెట్టారు. 55 కేజీల వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో ఆయన రజత పతకం (సిల్వర్ మెడల్) కైవసం చేసుకున్నారు.ఈ పోటీల్లో స్వర్ణమే లక్ష్యంగా బరిలోకి దిగిన సంకేత్.. మొత్తం 248 కేజీల బరువును (స్నాచ్‌లో 113 కేజీలు, సీ ఎండ్ జేలో 135 కేజీలు) ఎత్తి తన లక్ష్యానికి (స్వర్ణం) కేవలం ఒక్క కిలో దూరంలో నిలిచి పోయాడు. కాగా, గురురాజా పూజారి, కెనడాకు చెందిన యూరి సిమర్డ్ మధ్య జరిగిన పోరులో గురురాజా క్లీన్ అండ్ జెర్క్ లో తన మూడవ ప్రయత్నంలో 151కిలోలు ఎత్తి, పురుషుల 61కిలోల ఫైనల్లో మొత్తం 269కిలోలతో పూర్తి చేయడంతో గురు రాజకు కాంస్య పతకం కైవసం చేసుకున్నాడు.
ఘనాతో జరిగిన హాకీ మ్యాచ్‌లో భారత మహిళల జట్టు సంపూర్ణ ఆధిపత్యం సాధించి 5-0తో విజయం సాధించింది. అలాగే, 100 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్ స్విమ్మింగ్‌లో శ్రీహరి నటరాజ్ సెమీస్‌కు అర్హత సాధించాడు. ఇండియన్ బాక్సర్ శివ థాపా 63 కేజీల విభాగంలో పాకిస్థాన్ బాక్సర్ సులేమాన్ బలోచ్‌ను 5-0తో విజయం సాధించారు. మహిళల టీటీ జట్టు దక్షిణాఫ్రికాను 3-0తో ఓడించింది.
మిక్స్డ్ టీం గ్రూప్-ఎ బ్యాడ్మింటన్ మ్యాచ్‌లో పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో పీవీ సింధు 3-0తో విజయం సాధించింది. కిడాంబి శ్రీకాంత్, మిక్స్డ్ డబుల్స్ జట్టు తమ మ్యాచ్‌లను గెలిచి ఇండియాను 2-0 ఆధిక్యంలో తీసుకెళ్లారు. పురుషుల మారథాన్ రేసులో భారత ఆటగాడు నితేంద్ర సింగ్ రావత్ 12వ స్థానంలో నిలిచాడు. 35 ఏళ్ల రావత్ 2 గంటల 19 నిమిషాల 22 సెకన్లలో ఉగాండాకు చెందిన విక్టర్ కిప్లాంగట్ (2:10:55)పై గెలిచాడు. కాగా స్క్వాష్ పోటీల్లో భారత క్రీడాకారిణి జోషన చినప్ప 11-8, 11-9, 12-10తో బార్బడోస్‌కు చెందిన మీగన్ బెస్ట్‌పై గెలుపొందిం ది. సౌరవ్ ఘోసల్ 11-4, 11-4, 11-6తో శ్రీలంకకు చెందిన షామిల్ వకీల్‌పై విజయం సాధించాడు. ఇక సైక్లింగ్ మహిళల స్ప్రింట్ క్వాలిఫైయర్‌లో భారతదేశానికి చెందిన మయూరి , పాల్ వరుసగా 20వ , 23వ స్థానాల్లో నిలిచారు. 1/8 ఫైనల్స్‌కు అర్హత సాధించిన టాప్ 16లో పూర్తి చేయడంలో విఫలమయ్యారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/indians-going-great-in-cwg-39-140929.html
నిన్నటి వరకూ జగన్ కు పెట్టని కోటలా నిలిచిన పులివెందులలో ఇప్పుడు తెలుగుదేశం జెండా ఘనంగా ఎగురుతోంది. సుదీర్ఘకాలంగా వైసీపీకి తిరుగులేని కంచుకోటగా ఉన్ పులివెందుల పరిధిలో తెలుగుదేశం పార్టీ తన ఉనికిని బలంగా చాటుకుంటోంది.
వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 5) జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ పార్టీ చీరాల మునిసిపోల్స్ లో గట్టి పోటీ ఇచ్చింది. 25వ వార్డులో విజయం సాధించింది. 25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు.
పోలింగ్ సరళి, వెలువడిన ఫలితాలు వైసీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అధికార తెలుగుదేశం కూటమి అరాచకాలు, అధికార దుర్వినియోగం తమ ఓటమికి కారణాలుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు. ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత వైఎస్ జగన్ నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జగన్ చెప్పిందే చెప్పారు.
కాంగ్రెస్, కమ్మూనిస్టుల మద్దతుతో ఎన్నికల బరిలోకి దిగిన ఏబీవీకి ఘోర పరాజయం ఎదురైన సంగతి తెలిసిందే. కమ్యూనిస్టులకు అంతో ఇంతో పట్టున్న ప్రాంతాలలో కూడా ఆయనకు ఓట్లు రాలలేదు. ఇక కాంగ్రెస్ మద్దతు ఆయనకు ఎందుకూ కొరగాకుండా పోయింది.
ఈ వేడుకలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కేటీఆర్, విజయ్ ఒకే దగ్గర చేరి సరదాగా ముచ్చటించుకోవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసే నాటికి రాష్ట్ర వ్యాప్తంగా 77 జడ్పీటీసీలు, 2051 ఎంపీటీసీలు ఏకగ్రీవమైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. ఇక మిగిలిన స్థానాలకు పోటీ పడుతున్న 21 వేల 012 మంది అభ్యర్థుల భవితవ్యం తేల్చేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు.
వైసీపీపై అధికార కూటమి ఒత్తిడి, అక్రమాలు ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో ప్రజలు వైసీపీకి వ్యతిరేకంగా ఉన్నారని పరోక్షంగా వ్యాఖ్యానించి, ప్రజా క్షేత్రంలో వైసీపీ బలహీనంగా ఉందని చెప్పకనే చెప్పారు. గతంలో తాము అధికారంలో ఉన్నప్పుడు వ్యవహరించిన తీరు కారణంగానే నేడు వైసీపీకి ఈ గతి పట్టిందంటూ అంబటి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
పాడిందే పాటరా అన్న సామెత చందంగా ఉంది జగన్ తీరు. ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తీవ్ర నిరాశను మిగిల్చాయి. గతంలో 2024 సార్వత్రిక ఎన్నికల ఓటమి తర్వాత ఏ విధంగానైతే ఈవీఎంలు, ఎన్నికల సంఘాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి తప్పుపట్టారో, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల ఫలితాల విషయంలోనూ అదే పాతరాగాన్ని అందుకున్నారు.
2024 ఎన్నికలలో విశాఖ జనం జగన్ విశాఖ రాజధాని ప్రతిపాదనను తిరస్కరించారు. ఇప్పుడు జగన్ మావిగన్ ప్రతిపాదనను మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు జనం ఓటుతో తోసి రాజన్నారు.