ఐదో టెస్టులో భారత్ అద్భుత విజయం.. సిరీస్ సమం
Publish Date:Aug 4, 2025
Advertisement
ఇంగ్లాండ్ తో ఐదు టెస్టుల సిరీస్ లో భాగంగా ఒవల్ లో జరిగిన ఐదో టెస్టులో భారత్ 6 పరుగుల తేడాతో అద్భుత విజయాన్ని అందుకుంది. దీంతో సిరీస్ ను 2-2తో సమం చేసుకుంది. అత్యంత ఉత్కంఠ భరితంగా సాగిన ఐదో టెస్టులో హైదరాబాద్ కుర్రోడు సిరాజ్ అద్భుతంగా రాణించి భారత్ కు అసాధ్యమనుకున్న విజయాన్ని అందించాడు. 374 పరుగల విజయలక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ బ్యాటింగ్ ప్రారంభించిన ఇంగ్లాండ్ ఒక దశలో సునాయాసంగా విజయం సాధిస్తుందనిపించింది. అయితే ఇండియన్ పేసర్లు మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ కృష్ణలు ఇంగ్లాండ్ కు కళ్లెం వేశారు. మహ్మద్ సిరాజ్ 5 వికెట్లు, ప్రసిద్ధ కృష్ణ నాలుగు వికెట్లు పగడొట్టి ఇంగ్లాండ్ విజయాన్ని అడ్డుకున్నారు. ఇంగ్లాండ్ 367 పరుగులకు ఆలౌట్ అయ్యింది. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి ఆరు వికెట్ల నష్టానికి 339 పరుగులతో ఉన్న ఇంగ్లాండ్.. చివరి రోజు నాలుగు వికెట్లు చేతిలో ఉండగా 35 పరుగులు చేస్తే చాలు అన్న స్థితిలో చివరి రోజు ఆట మొదలైంది. అయితే ఎక్కడా పట్టు వదలని టీమ్ ఇండియా చివరి నాలుగు వికెట్లను 29 పరుగులకే కూల్చేసింది.
http://www.teluguone.com/news/content/india-won-the-5th-test-by-six-runs-39-203467.html





