జలాస్త్రమే.. బ్రహ్మాస్త్రం

Publish Date:Apr 25, 2025

Advertisement

పాక్ పని అవుట్ !

భారత,పాకిస్థాన్ దేశాల మధ్య ఎప్పుడో 1960లో కుదిరిన సింధూ జలాల ఒప్పందానికి చాలా చరిత్ర వుంది. నిజానికి ఉభయ దేశాల మధ్య యుద్దాలు, ఉద్రిక్తలు , సరిహద్దు ఘర్షణలు వంటి అనేక ఆటు పోట్లను ఎదుర్కుని ఇంతవరకూ సజీవంగా నిలిచిన ఒప్పందం ఏదైనా ఉందంటే  అది 1960లో కుదిరిన సింధూ జలాల ఒప్పందం ఒక్కటే. అయితే ఇప్పడు ఆ  పవిత్ర  బంధం కూడా పుటుక్కుమంది. పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాద ముష్కరులు, జమ్మూకశ్మీర్‌లో అత్యంత హేయమైన ఉగ్ర దాడికి పాల్పడి 26 మంది పర్యాటకులను పొట్టన పెట్టుకున్న నేపథ్యంలో మన దేశం సింధూ జలాల ఒప్పందానికి  చెల్లు చీటి రాసింది. నిజానికి గతంలోనూ అనేక సందర్భాలలో సింధూ జలాల ఒప్పందాన్ని రద్దు చేయాలనే డిమాండ్ వుంది.
నిజానికి దేశాల మధ్యనే కాదు, రాష్ట్రాల మధ్య కుదిరిన నదీ జలాల ఒప్పందాలు నిత్య కలహాలకు కారణం అవుతున్న తీరును చూస్తున్నాం. ఎక్కడి దాకానో ఎందుకు, నిన్న మొన్నటి వరకు కలిసున్న ఉభయ తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా గోదావరీ జలాల పంపకాలకు సంబంధించిన ఒప్పందాల  ఉల్లంఘనలు, ట్రిబ్యునల్ తీర్పులు, అనేకం ఉన్నాయి. రైతులు, రాజకీయ పార్టీలు కత్తులు దూసుకున్న సందర్భాలూ  ఉన్నాయి.  
అలాగే..  ఇంకా అనేక ఇరుగు పొరుగు రాష్ట్రాల మధ్య కూడా జల జగడాలు సాగుతున్నాయి. అయితే.. భారత ,పాకిస్థాన్ దేశాల మధ్య కుదిరిన సింధూ జలాల ఒప్పందం ఒక చారిత్రిక ఒప్పందంగా చరిత్రలో మిగిలి పోయింది. ప్రపంచంలోనే అత్యంత విజయవంతమైన నదీ జలాల పంపిణీ ఒప్పందాలలో ఒకటిగా  నిలిచింది. 
చరిత్రలోకి వెళితే.. 1960లో ప్రపంచ బ్యాంక్‌ మధ్యవర్తిత్వంతో భారత్‌-పాక్‌ ఈ ఒప్పందం పై సంతకాలు చేసాయి. ఈ ఒప్పందం ప్రకారం ఆరు నదుల నీటిని ఇరుదేశాలు పంచుకొన్నాయి. దీని కింద సింధూ, జీలమ్‌, చీనాబ్‌ నదుల నీరు పాకిస్థాన్‌కు దక్కింది. ఇవి కాకుండా బియాస్‌, సట్లెజ్‌ జలాలు కూడా వెడుతుంటాయి. ఇక మన దేశం భూభాగంలో ప్రవహించే నదీ జలాలను  ప్రవహించే నీటిని మనం వాడుకోవచ్చును. కానీ, జల విద్యుత్ ఉత్పత్తికి మాత్రమే వాడుకుని..  మళ్ళీ పాక్ కు వదిలేయాలే కానీ..  ఆ నీటిని నీటిని సాగు, తాగు ప్రయోజనాలకు వాడుకోరాదు. 
నిజానికి ఎగువన ఉన్న దేశంగా మనం ప్రాజెక్టులు కట్టుకుని, నీటిని నిల్వ చేసుకున్నా.. మళ్ళించి మన అవసరాలకు వాడుకున్నా..  పాకిస్థాన్ గొంతు తడవదు. పంట పొలాలు నీరు  అందదు.  పాకిస్థాన్ నీటి అవసరాలకు 80 శాతం వరకూ  ఈ ఒప్పంద పరిధిలో అందుతున్న నీరే  ఆధారం. ఒక్క ముక్కలో చెప్పుకోవాలంటే..  సింధూ జలాల ఒప్పందమే పాకిస్థాన్  ను బతికిస్తున్నది. ఆదే  ఆ దేశానికి జీవాధారం, జీవనాధారం. పాకిస్థాన్ నీటి సరఫరా అత్యధికంగా ఈ నదుల పైనే ఆధారపడింది. 
ఆ దేశంలో 23.7 కోట్ల మంది ప్రజల తాగునీటి అవసరాలకు ఈ జలాలను వాడతారు. కరాచీ, లాహోర్‌, ముల్తాన్‌ నగరాలు నేరుగా ఈ నదుల నీటినే ప్రజలకు అందిస్తున్నాయి. పాక్‌ వ్యవసాయానికి వాడే నీటిలో  80శాతం ఈ ఒప్పందం కింద లభించేదే.  16 లక్షల హెక్టార్లు సాగవుతుంటాయి. ఆ దేశ జీడీపీలో 23 శాతం వ్యవసాయం నుంచే లభిస్తుంది. ఇక గ్రామీణ ప్రాంతాల్లో 68 శాతం ప్రజలు దీనిపైనే ఆధారపడ్డారు.
సింధూ బేసిన్‌ నుంచి పాక్‌కు 154.3 మిలియన్ ఎకరాల అడుగుల (ఎమ్‌ఏఎఫ్‌) నీటిని ఏటా సరఫరా చేస్తోంది. ఆ దేశ ఆహార భద్రతకు ఇది చాలా కీలకం. పాకిస్థాన్‌ ఇప్పటికే తీవ్రమైన నీటి కరవులో ఉంది. ఆ దేశ ఇరిగేషన్‌ మేనేజ్‌మెంట్‌ అధ్వాన స్థితికి చేరింది. భూగర్భజలాలు పడిపోతున్నాయి. 
పాకిస్థాన్‌ విద్యుత్ కు కీలకమైన మంగల డ్యామ్‌ను జీలమ్‌ నదిపై నిర్మించారు.  ఏటా ఆ దేశ విద్యుత్తు ఉత్పత్తిలో 8 శాతం ఇక్కడి నుంచే జరుగుతుంది. ఇక సింధూ నదిపై నిర్మించిన తర్బెల డ్యామ్‌ పాక్‌ వినియోగంలో 16 శాతానికి సమానమైన విద్యుత్ ను ఉత్పత్తి చేస్తుంది. తాజాగా సింధూ జలాల ఒప్పందంతో పాక్‌లో 24శాతం జల విద్యుత్ పై ప్రతికూల ప్రభావం పడనుంది. పాకిస్థాన్‌ జీడీపీలో 25శాతం ఈ నదుల నుంచే లభిస్తోందంటే.. భారత నిర్ణయం ఆ దేశాన్ని భవిష్యత్తులో ఎలా ప్రభావితం చేయనుందో అర్థం చేసుకోవచ్చును. 
అయితే మన దేశం ఒప్పందం నిలిపివేసినా.. పాకిస్థాన్ పై తక్షణ ప్రభావం పెద్దగా ఉండదని..  గతంలో సింధూజలాల కమిషనర్‌గా పనిచేసిన ప్రదీప్‌కుమార్‌ సక్సెనా  వంటి నిపుణులు అంటున్నారు.
అవును. మన దేశం తీసుకున్న కఠిన  నిర్ణయం ప్రభావం  పాక్‌పై తక్షణమే పడకపోవచ్చు. నీటి ప్రవాహాన్ని వెంటనే ఆపడం సాంకేతికంగా సాధ్యం కాదు. సింధూ జలాలను నిల్వ చేయడానికి.. మళ్లించడానికి తగిన వసతులు లేవు.  అయిత డ్యాముల నిర్మాణానికి ఇంతవరకు ఉన్న అవరోధాలు   ఈ నిర్ణయంతో తొలిగి పోతాయి. కానీ..  తక్షణం నిర్మాణాలు చేపట్టినా, అవి పూర్తయ్యే సరికి ఎంత కాలం పడుతుందో చెప్పలేమని నిపుణులు అంటున్నారు. 

అలాగే..  ప్రస్తుత ఉద్రిక్తలు కొంత సర్డుమణిగిన  తర్వాత,  ప్రపంచ బ్యాంకు,  లేదా ఎ అమెరికానో పట్టుకుని ఒప్పందాన్ని పునరుద్దరించుకో వచ్చనే ఆలోచనతో పాక్ నేతలు ఉన్నారని అంటున్నారు. మరోవంక భారత ప్రభుత్వం దీన్నొక అవకాశంగా తీసుకుని, పాకిస్థాన్  ఉగ్ర చర్యలకు జలాస్త్రంతో సమాధానం చెప్పాలని కృత నిశ్చయంతో ఉందని అంటున్నారు.

By
en-us Political News

  
ఆంధ్రప్రదేశ్ రాజకీయ రంగంలో ప్రతి క్షణం ఒక కొత్త మలుపు తిరుగుతోంది.
పొలిటికల్ సర్కిల్స్ లో గట్టిగా వ్యక్తం అవుతున్న అభిప్రాయం ఏమిటంటే.. మీడియా సమావేశాలలో జగన్ మాట్లాడే విధానం కంటే విజయసాయి రెడ్డి మాట్లాడే విధానం చాలా చాలా బెటర్ అని. 
అయితే ఆయన  తాజాగా   నిర్వహించిన కార్యకర్తల సమావేశం మాత్రం భిన్నంగా జరిగింది. ఆ సమావేశంలో ఆయన మాట్లాడిన మాటలు,  వ్యక్తం చేసిన అసహనం వైసీపీవర్గాలలో  కలకలం రేపింది. 
జనసేన, బీజేపీ నాయకులు ప్రభుత్వ కార్యక్రమాల్లో పెద్దగా భాగస్వాములు కావడం లేదు.  ప్రతి నెలా పెన్షన్ల పంపిణీలో టీడీపీ నేతలు, కార్యకర్తలు చురుకుగా పాల్గొంటుంటే.. జనసేన, బీజేపీ నాయకుల భాగస్వామ్యం నామమాత్రంగా ఉంటోందనీ, ఇది కూటమి పార్టీల మధ్య సమన్వయ లోపం ఉందా అన్న అనుమానాలను కలిగిస్తోందనీ సర్వేలో వెల్లడైన జనాభిప్రాయం. 
ఈ ప్రధాన పార్టీల వ్యూహాలకు తోడుగా మరికొన్ని రాజకీయ  పార్టీలో కూడా తమ ఉనికిని బలంగా చాటేందుకు ఖైరతాబాద్ ఉప ఎన్నిక బరిలోకి దిగడానికి సిద్ధమౌతున్నాయి. కల్వకుంట్ల కవిత నేతకూడా రంగంలోకి దిగుతుండటంతో పోటీ ఊహించని మలుపు తిరుగుతోంది.  
గత కొన్నేళ్లుగా  చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పలు సందర్భాల్లో ఒకే వేదికను పంచుకుంటూ వచ్చారు.  ముఖ్యమైన ప్రజా వేడుకల్లో వీరిద్దరూ కలసి పాల్గొనడం ఆనవాయితీగా మారింది. అయితే గత కొద్ది నెలలుగా ఇరువురూ ఒకే వేదికపై కనిపించడం లేదు. 
 విదేశీ పర్యటన ముగించుకుని ఇప్పటికే రాష్ట్రానికి తిరిగి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు,  తన విధుల్లోకి నిమగ్నమయ్యారు. నేరుగా నెల్లూరు జిల్లాకు చేరుకుని  పల్లె పండుగ కార్యక్రమంలో ఆయన ఉత్సాహంగా పాల్గొన్నారు.
రామాయణం ప్రకారం లంకకు బయలుదేరే ముందు శ్రీరాముడు స్వయంగా మహాదేవుడిని పూజించాడని, ఈ చారిత్రక, పౌరాణిక విషయాలపై  అవగాహన లేని రేవంత్ వంటి వారు ఇటువంటి కువిమర్శలు చేస్తున్నారని బీజేపీ నేతలు మండిపడుతున్నారు.
ప్రాథమిక దశలో ఈ మరణాన్ని సాధారణ గుండెపోటుగా చిత్రీకరించే ప్రయత్నాలు జరగడం, ఆ తర్వాత హత్యగా తేలింది.  వైఎస్ హత్య వెనుక కొన్ని పెద్ద తలకాయల  ప్రయోజనాలు దాగున్నాయని వైఎస్ వివేకా కుమార్తె బహిరంగంగానే ఆరోపించారు.
బీఆర్ఎస్   బయటకు వచ్చిన తర్వాత కల్వకుంట్ల కవిత   తెలంగాణ రక్షణ పేన పేరుతో  కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. భౌగోళిక తెలంగాణ సిద్ధించినప్పటికీ ప్రజలు ఆశించిన ఆశయాలు నెరవేరలేదని.. సామాజిక తెలంగాణ సాధన ద్వారా మాత్రమే ప్రత్యేక రాష్ట్ర సాకారానికి సార్థకత లభిస్తుందని కవిత పదేపదే చెబుతున్నారు.
స్థానిక ప్రజా సమస్యలను తనదైన శైలిలో పరిష్కరిస్తూ జనాల గుండెల్లో కొలువయ్యారు. అన్నిటికీ మించి మంగళగిరిలో నెలకొన్న అతి కీలకమైన, ప్రధానమైన   గృహ నిర్మాణ హక్కుల (హౌసింగ్ డాక్యుమెంటేషన్) పత్రాల సమస్యకు దశలవారీగా శాశ్వతంగా పరిష్కరిస్తున్నారు.
సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామాకు డిమాండ్..!
ఒకవైపు ఎన్నికల్లో భారీగా అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూనే, మరోవైపు అదే ఎన్నికల్లో ప్రతిపక్షాలు పాల్గొనడం వల్ల ఆ తప్పులకూ, లోపాలకు చట్టబద్ధత కల్పించినట్లవుతోందన్న ఆయన ఎన్నికలను బహిష్కరించాలని పిలుపునిచ్చారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.