విదేశీ సాయం వద్దన్న కేంద్రం.. మండిపడుతున్న కేరళ
Publish Date:Aug 23, 2018
Advertisement
భారీ వర్షాలు, వరదలతో నష్టపోయిన కేరళను ఆదుకోవడానికి విదేశాలు కూడా ముందుకొస్తున్నాయి.. ఇప్పటికే యూఏఈ 700 కోట్లు, ఖతర్ 35 కోట్లు ప్రకటించాయి.. అయితే ఈ సాయాన్ని అంగీకరించబోమని కేంద్ర విదేశాంగ శాఖ స్పష్టం చేసింది.. ప్రస్తుతం అనుసరిస్తున్న విధానాల ప్రకారం విదేశీ సాయాన్ని అంగీకరించబోమని ఆ శాఖ అధికారి ప్రతినిధి రవీష్ కుమార్ తెలిపారు.. భారతదేశ వనరులతోనే కేరళను ఆదుకుంటామన్నారు.. అయితే కేంద్రం తీరుపట్ల కేరళ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. తాము తక్షణ సాయంగా అడిగిన రెండువేల కోట్లకు బదులు 600 కోట్లు ఇచ్చిందని అసలే కేంద్రం మీద కేరళ అసంతృప్తిగా ఉంది.. దీనికితోడు విదేశీ సాయం కూడా అంగీకరించమని కేంద్రం చెప్పడంతో, ఆ మొత్తాన్ని కూడా కేంద్రమే ఇవ్వాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి.. అసలు విదేశీ సాయం తీసుకోకూడదని ఏ చట్టంలో ఉంది? అని పలువురు ప్రశ్నిస్తున్నారు.. మరోవైపు ఇదే విషయంపై స్పందించిన కేరళ సీఎం పినరయి విజయన్.. 2016 జాతీయ విపత్తు నిర్వహణ విధానంలో విపత్తులు సంభవించినప్పుడు విదేశీ సాయం తీసుకోవచ్చని ఉన్న విషయాన్ని గుర్తుచేశారు.. అలాగే కేరళ ఆర్థిక మంత్రి థామస్ ఇసాక్ కూడా ఇదే విషయాన్ని చెప్పారు.. జాతీయ విపత్తు నిర్వహణ విధానం తొమ్మిదో చాప్టర్ లో విపత్తులు సంభవించినప్పుడు స్వచ్చందంగా విదేశాలు సాయం చేయడానికి వస్తే తీసుకోవచ్చని ఉన్న విషయాన్ని గుర్తు చేసారు.. మరి కేంద్రం మనస్సు మార్చుకొని విదేశీ సాయానికి సరే అంటుందో లేక ఇలాగే విమర్శలు మూట కట్టుకుంటుందో చూడాలి.
http://www.teluguone.com/news/content/india-not-accepting-overseas-aid-for-kerala-39-83229.html





