ఎగుమతుల్లో రికార్డు వృద్ధి.. దిగుమతుల భారంతో వాణిజ్య లోటు.!
Publish Date:Aug 14, 2026
Advertisement
అంతర్జాతీయ వ్యాపార రంగంలో పెను సవాళ్లు, యుద్ధ వాతావరణం, ప్రపంచ దేశాలలో ఆర్థిక మందగమనం నెలకొన్న పరిస్థితుల్లో కూడా ఇండియన్ ఎకానమీ పటిష్ఠంగా నిలిచింది. అనూహ్యంగా పురోగమించింది. జూలై నెలలో భారత వస్తు ఎగుమతులు భారీ వృద్ధి నమోదు చేసి రికార్డు సృష్టిం చాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా అంతర్జాతీయ మార్కెట్లో ఇండియ్ ఉత్పత్తులకు డిమాండ్ పెరిగింది. దీంతో ఎగుమతులు పుంజుకున్నాయి. కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం జూలై నెలలో ఇండియా దాదాపు 44.24 బిలియన్ డాలర్లు అంటే ఇండియన్ కరెన్సీలో 4.22 లక్షల కోట్ల రూపాయల విలువైన వస్తువులను ఎగుమతి చేసింది. ఇది గత ఏడాదితో పోలిస్తే 19.63 శాతం ఎక్కువ. ఈ ప్రగతి దేశీయ ఉత్పత్తి రంగానికి, ఆర్థిక వ్యవస్థ బలానికి నిలువెత్తు నిదర్శనం. పెట్రోలియం ఉత్పత్తుల ఎగుమతులు అంతర్జాతీయ విపణిలో గణనీయమైన ప్రభావాన్ని చూపాయి. దేశీయ రిఫైనరీల నుంచి విదేశాలకు పంపిన శుద్ధి చేసిన చమురు ఉత్పత్తుల విలువ 7 బిలియన్ డాలర్లకు చేరుకుంది. అంటే దాదాపు 67.64 శాతం వృద్ధి. అలాగే.. ఎలక్ట్రానిక్ పరికరాలు, ఇంజనీరింగ్ వస్తువులు విదేశీ విపణిలో సత్తా చాటాయి. ఎలక్ట్రానిక్స్ రంగానికి సంబంధించిన ఎగుమతులు 57.4 శాతం మేర పెరిగి 6 బిలియన్ డాలర్లకు చేరగా, ఇంజనీరింగ్ వస్తువుల ఎగుమతులు 12.24 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. ఇక ఆక్వా, సముద్ర ఉత్పత్తుల ఎగుమతులలో కూడా గణనీయ పురోగతి కనిపించింది. ఇదంతా బాణే ఉన్నా ఓకే నాణేనికి రెండు కోణాలున్నట్లే ఒ వైపు ఎగుమతుల వృద్ధి గణనీయంగా ఉన్నప్పటికీ.. వాణిజ్య లోటు భారీగా పెరిగిందిద. ఎగుమతుల కంటే దిగుమతుల భారం గణనీయంగా పెరగడమే ఇందుకు ప్రధాన కారణగా బిజినెస్ ఎనలిస్లులు చెబుతున్నారు. జూలై నెలలో భారత్ చేసిన మొత్తం దిగుమతుల విలువ 17.52 శాతం పెరిగి 76.22 బిలియన్ డాలర్లకు భారత కరెన్సీలో 7.27 లక్షల కోట్ల రూపాయలకు చేరుకుంది. ఫలితంగాఇండియా ఎగుమతుల విలువ కంటే.. దిగుమతుల విలులే ఎక్కువగా ఉండటం వల్ల ట్రేడ్ డెఫిషిట్ అంటే వాణిజ్యలోటు భారీగా పెరిగింది. నికర వాణిజ్య లోటు 31.98 బిలియన్ డాలర్లకు అంటే.. 3.05 లక్షల కోట్ల రూపాయలకు ఎగబాకింది. ఇది గత ఆరు నెలల కాలంలోనే అత్యంత గరిష్ట స్థాయి వాణిజ్య లోటు కావడం గమనార్హం. ఈ రేంజ్ లో దిగుమతుల భారం పెరగడానికి ముడిచమురు కొనుగోళ్లు ప్రధాన కారణం. ఇండియా మొత్తం దిగుమతుల్లో 24 శాతం క్క చమురు రంగానిదే. జూలై నెలలో ముడిచమురు దిగుమతులు 17.64 శాతం పెరిగి 18.31 బిలియన్ డాలర్లకు చేరాయి. ప్రపంచ వ్యాప్తంగా ఇంధన ధరల ప్రతికూల ప్రభావం, దేశీయంగా ఇంధన వినియోగం పెరగడమే ఇందుకు కారణం. ఇంధనంతో పాటు విదేశాల నుంచి భారీ యంత్రాలు, ఎలక్ట్రానిక్ విడిభాగాలు, వ్యవసాయానికి అవసరమైన ఎరువుల దిగుమతులు కూడా భారీగా పెరగడం వాణిజ్య లోటు ఈ స్థాయికి పెరగడానికి కారణమైంది. ఇక పసిడి, వెండి దిగుమతుల విషయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న వ్యూహాత్మక నిర్ణయాలు సానుకూల ఫలితాలనిచ్చాయి. విదేశీ మారక నిల్వలను కాపాడుకోవడానికి కేంద్ర ప్రభుత్వం బంగారం, వెండిపై దిగుమతి సుంకాన్ని గతంలో ఉన్న 6 శాతం నుంచి 15 శాతానికి సవరించింది. ఈ పన్ను పెంపు ఫలితంగా బంగారం దిగుమతుల వృద్ధి 4.77 శాతానికి పరిమితమై 4.18 బిలియన్ డాలర్లుగా నమోదైంది. ఇక వెండి దిగుమతులైతే ఏకంగా 66.1 శాతం పడిపోయి 171.68 మిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. ఈ నిర్ణయం విదేశీ మారక ద్రవ్యం అనవసరంగా బయటకు వెళ్లకుండా అడ్డుకట్ట వేయడానికి దోహదమయ్యింది. గ్లోబల్ మార్కెట్ల పరంగా భారత్ తీసుకున్న వ్యూహాత్మక రవాణా మార్గాలు వ్యాపారానికి బాగా కలసివచ్చాయి. ఎర్రసముద్రం, పశ్చిమాసియా ప్రాంతంలో చోటుచేసుకున్న రాజకీయ విపత్తులు, సైనిక ఉద్రిక్తతల కారణంగా గతంలో ఇండియా ఎగుమతులకు విఘాతం కలిగింది. అయితే.. అంతర్జాతీయంగా సాంప్రదాయ ఓడరేవులపై ఆధారపడకుండా ఇండియన్ ఎక్స్ పోర్టర్లు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకున్నారు. దుబాయ్‌లోని జెబెల్ అలీ పోర్టుకు ప్రత్యామ్నాయంగా ఒమన్, యూఏఈలలోని ఫుజైరా, ఖోర్ ఫక్కన్ వంటి కొత్త పోర్టుల ద్వారా సరుకుల ఎగుమతి సక్సెస్ అయ్యింది. దీని ఫలితంగా పశ్చిమాసియాకు ఇండియన్ ఎక్స్ పోర్టులు 8.62 శాతం పెరిగాయి. ఇవి 5.7 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. అలాగే అమెరికాకు ఎగుమతులు 12.85 శాతం పెరిగి 9.02 బిలియన్ డాలర్లకు, చైనాకు ఎగుమతులు 64.57 శాతం పెరిగి 2.20 బిలియన్ డాలర్లకు చేరాయి. దీనిని బట్టి ఇండిచా.. వేగంగా అంతర్జాతీయ తయారీ కేంద్రంగా రూపాంతరం చెందుతోందని తేటతెల్లమౌతోంది. మేక్ ఇన్ ఇండియా ప్రోత్సాహకాలు, ప్రభుత్వం అందిస్తున్న రాయితీలు దేశీయంగా నాణ్యమైన ఉత్పత్తుల తయారీకి తోడ్పడుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా భారతీయ ఉత్పత్తులకు పెరుగుతున్న ఆదరణ మన ఆర్థిక వ్యవస్థ పురోగతికి శుభసూచకంగా నిలుస్తోంది. అయితే విదేశీ ముడిచమురు మరియు పరికరాలపై మన ఆధారపడటం తగ్గనంత వరకు వాణిజ్య లోటు ముప్పు పొంచి ఉంటుంది. వాణిజ్య లోటు నిరంతరం పెరుగుతూ పోతే దేశ విదేశీ మారక నిల్వలపై ఒత్తిడి ఏర్పడి, అంతర్జాతీయమార్కెట్లో రూపాయి విలువ బలహీనపడే ముప్పు ఉంది. రూపాయి విలువ పడిపోవడం వల్ల దిగుమతి చేసుకునే నిత్యవసర వస్తువులు, ఇంధన ధరలు మరింత పెరిగి ద్రవ్యోల్బణ భారం పెరుగుతుంది. ఈ కారణంగా రానున్న రోజుల్లో కేవలం వస్తువుల ఎగుమతులను పెంచడమే కాకుండా, దిగుమతులను తగ్గించే దిశగా కేంద్ర ప్రభుత్వం మరిన్ని సంస్కరణలు చేపట్టాల్సి ఉంది. ముఖ్యంగా పునరుత్పాదక ఇంధన రంగాన్ని ప్రోత్సహించడం, ముడిచమురు దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడం, దేశీయంగానే విడిభాగాల తయారీని విస్తరించడం వంటి చర్యలు చేపడితేభారత వాణిజ్య రంగం దృఢంగా మారుతుందని ఆర్థిక నిపుణులు అంటున్నారు. India Exports July, Trade Deficit India, Petroleum Exports, Commerce Ministry Data, Indian Economy News
http://www.teluguone.com/news/content/india-exports-july-36-228944.html





