Publish Date:Feb 12, 2025
ఇంగ్లాండ్ తో మూడు వన్డేల సిరీస్ ను టీమ్ ఇండియా క్లీన్ స్వీప్ చేసింది. ఇంగ్లాండ్ లో మూడు వన్డేల సిరీస్ లో భాగంగా అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న చివరి మూడో వన్డేలో టీమ్ ఇండియా బ్యాటర్ శుభమన్ గిల్ సెంచరీ కొట్టాడు. 13 ఫోర్లు 2 సిక్సర్లతో 95 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేశారు. వన్డేల్లో గిల్ కు ఇది ఏడో సెంచరీ. చివరకు 102 బంతుల్లో 14 ఫోర్లు, 3 సిక్సర్లతో 112 పరుగులు చేసిన శుబమన్ గిల్ రషీద్ బౌలింగ్ లో క్లీన్ బౌల్డయ్యాడు. టాస్ గెలిచి ఇంగ్లాండ్ తొలుత ఫీల్డింగ్ ఎంచుకోవడంతో తొలుత బ్యాటింగ్ చేపట్టిన భారత్ కు మంచి ఆరంభం ఏమీ దక్కలేదు. రెండో వన్డేలో అద్భుత సెంచరీతో రాణించిన స్కిప్పర్ రోహిత్ శర్మ ఈ సారి మాత్రం తక్కువ స్కోరుకే పెవిలియన్ బాట పట్టాడు. కేవలం ఒకే ఒక్క పరుగు చేసిన రోహిత్ శర్మ వుడ్ బౌలింగ్ లో వికెట్ కీపర్ కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యారు. వన్ డౌన్ లో బ్యాటింగ్ కు వచ్చిన విరాట్ కోహ్లీ సాధికారికంగా ఆడుతూ స్కోరు బోర్డును పరుగెలెత్తించారు.
ఒక వైపు శుభమన్ గిల్, మరో వైపు కోహ్లీ ఇంగ్లాండ్ బౌలర్లను ఓ ఆటాడుకున్నారు. ఈ క్రమంలో 55 బంతుల్లో 7 ఫోర్లు 1 సిక్సర్ తో 52 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ రషీద్ బౌలింగ్ లో వికెట్ కీపర్ కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. సాధికారికంగా ఆడిన కోహ్లీని చూస్తే ఈ వన్డేలో కోహ్లీ తన ఖాతాలో సెంచరీ వేసుకోవడం ఖాయమనిపించింది. అయితే ఒక అద్భుత బంతికి కోహ్లీ ఔటయ్యాడు. ఆ తరువాత కోహ్లీ స్థానంలో వచ్చిన శ్రేయస్ అయ్యర్ ఆరంభం నుంచే ఫోర్లతో విరుచుకుపడి తన ఉద్దేశాన్ని చాటాడు. శ్రేయస్ అయ్యర్ 64 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్లతో రషీద్ బౌలింగ్ లో వికెట్ కీపర్ కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఇక ఆ తరువాత వచ్చిన హార్దిక్ పాండ్యా కూడా వేగంగా పరుగులు చేసే క్రమంలో 9 బంతుల్లో 2 సిక్సర్లతో 18 పరుగులు చేసి రషీద్ బౌలింగ్ లోనే క్లీన్ బౌల్డయ్యాడు. ఆ తరువాత 12 బంతుల్లో 2 ఫోర్లతో 13 పరుగులు చేసిన అక్షర్ పటేల్ రూట్ బౌలింగ్ లో బేంటన్ కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. తరువాత 29 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్సర్ తో 40 పరుగులు చేసిన కేఎల్ రాహుల్ మహమూద్ బౌలింగ్ లో లెగ్ బిఫోర్ వికెట్ గా వెనుదిరిగాడు.
ఆ తరువాత పది బంతుల్లో ఇక ఫోర్ ఇక సిక్స్ తో 13 పరుగులు చేసి ఔటయ్యాడు. ఆ తరువాత వాషింగ్టన్ సుందర్ 14 బంతుల్లో 14 పరుగులు చేసి ఔటయ్యాడు. చివరి వికెట్ గా కులదీప్ ఔటయ్యాడు. దీంతో టీమ్ ఇండియా నిర్ణీత 50 ఓవర్లలో 356 పరుగులు చేసి ఆలౌట్ అయ్యింది. దీంతో 357 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ చేపట్టిన ఇంగ్లాండ్ ఏ దశలోనూ లక్ష్య సాధన దిశగా సాగలేదు. ఇంగ్లండ్ 34.2 ఓవర్లలో 214 పరుగులకు ఆలౌట్ అయింది. అర్షదీప్ సింగ్ 2, హర్షిత్ రాణా 2, అక్షర్ పటేల్ 2, హార్దిక్ పాండ్యా 2, వాషింగ్టన్ సుందర్ 1, కుల్దీప్ యాదవ్ 1 వికెట్ తీసి ఇంగ్లండ్ ను కుప్పకూల్చారు. దీంతో మూడు వన్డేల సిరీస్ ను టీమ్ ఇండియా 3-0తో క్లీన్ స్వీప్ చేసింది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/india-clean-sweep-one-day-series-with-england-39-192796.html
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ ఆబ్సెన్స్ లో రేవంత్ తన కేబినెట్ పునర్వ్యవస్థాకరణ విషయంలో మరింత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలుంటాయని పరిశీలకులు అంటున్నారు. పార్టీలో, ప్రభుత్వంలో అసంతృప్తికి చెక్ పెట్టి, తన నిర్ణయాలను అమలు చేయడానికి రేవంత్ కు ఇది అనువైన సమయంగా రాజకీయవర్గాలు చెబుతున్నాయి.
2014 నుంచి ఆంధ్రప్రదేశ్ లో రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్యే అధికారం మారుతూ వస్తోంది. వైపీపీ, తెలుగుదేశం మధ్య ద్విముఖ పోరే నెలకొని ఉంది. ఈ పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి కొత్త పార్టీ రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలలో మార్పు తీసుకువచ్చే అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి.
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు. తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు. గతంలో ఏపీలో బీజేపీ మద్దతు వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ వాస్తవాన్ని సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు.
రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు, రాష్ట్రంలో ఇరిగేషన్ సదుపాయాలను మెరుగుపరిచేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా పూర్తవుతుండటంతో, ఇరిగేషన్ రంగంపై మాట్లాడటానికి ప్రతిపక్షానికి ఎలాంటి అవకాశాలు లేకుండా పోయాయని ఆయన కుండబద్దలు కొట్టారు.
జలయజ్ణం పేరుతో వైఎస్ చేసింది ధనయజ్ణమని విక్రమ్ పూల అన్నారు. ప్రాజెక్టుల అంచనా వ్యయం పెరగడం, ప్రాంతీయ సమతుల్యత లోపించడం, హెడ్ వర్క్స్ కంటే ముందుగా కాలువల తవ్వకం వంటి వాటికే వైఎస్ జలయజ్ణం పరిమితమైందని విక్రమ్ పూల వివరించారు.
కాంగ్రెస్ హైకమాండ్ మీనాక్షీ నటరాజన్ పై వేటు వేయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. రాహుల్ గాంధీ నేతృత్వంలోని జాతీయ నాయకత్వం రాష్ట్రంలో కాంగ్రెస్ వ్వవహారాలను చక్కదిద్దేందుకు భూపేష్ బగెల్ సమర్ధంగా పని చేయగలరని భావించి ఆ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.
తాను పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాననీ, వచ్చే ఎన్నికలలో పోటీ చేయననీ ఆయన చేసిన ప్రకటన పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. తెలుగుదేశం ఆవిర్భావం నుంచీ కూడా ప్రజా ప్రతినిథిగా, పొలిటికల్ లీడర్ గా సేవలందించిన అయ్యన్న పాత్రుడు హఠాత్తుగా రాజకీయాలకు రిటైర్మెంట్ అంటూ చేసిన ప్రకటన రాజకీయవర్గాలలో సంచలనం సృష్టించింది.