ముక్కోణపు సిరీస్ ఫైనల్‌లో భారత్ - ఎ టీమ్

Publish Date:Jun 17, 2026

Advertisement

 

ముక్కోణపు సిరీస్‌లో భాగంగా శ్రీలంకలోని దంబుల్లా వేదికగా జరిగిన కీలక మ్యాచ్‌లో అఫ్గానిస్థాన్-ఎపై గెలిచిన భారత్-ఎ జట్టు ఫైనల్స్‌కు చేరుకుంది. 320 పరుగుల లక్ష్య ఛేదనలో అఫ్గాన్-ఎ జట్టు 36.5 ఓవర్లలో 218 పరుగులకు ఆలౌటైంది. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన భారత్-ఎ జట్టు 9 వికెట్లు కోల్పోయి 319 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఈ గెలుపుతో మెరుగైన నెట్ రన్ రేట్ (+0.797) సాధించిన టీమిండియా.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుని ఫైనల్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది.

భారత్ జట్టులో ప్రియాంశ్ ఆర్య(58), కుమార్ కుషాగ్రా(58), తిలక్ వర్మ(59) హాఫ్ సెంచరీలు చేశారు. వైభవ్ సూర్యవంశీ(38), రుతురాజ్ గైక్వాడ్(30), విప్రాజ్ నిగమ్(30) పర్వాలేదనిపించారు. సూర్యాంశ్(7), అనుకుల్ రాయ్(4), అన్షుల్ కాంబోజ్(0) విఫలమయ్యారు. అఫ్గాన్ బౌలర్లలో ఫరీదూన్ 2, అబ్దుల్లా 2, ఫర్మానుల్లా 2, జహీర్ ఖాన్ 1 వికెట్ పడగొట్టారు. అనంతరం 320 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన అఫ్గాన్ బ్యాటర్లు తడబడ్డారు. బహిర్ షా(57), ఫైసల్ షినోజాదా(46), ఇమ్రాన్ మిర్(32) రాణించారు. మిగతా బ్యాటర్లంతా విఫలమయ్యారు. భారత్-ఎ బౌలర్లలో నిశాంత్ సింధు 4 వికెట్లతో చెలరేగాడు. యశ్ ఠాకూర్ 2, అన్షుల్ కాంబోజ్, విప్రాజ్ నిగమ్, సూర్యాంశ్, అనుకుల్ రాయ్ తలొక వికెట్ పడగొట్టారు.

 


 

By
en-us Political News

  
ప్రజా ప్రభుత్వం సాధించిన విజయాలు ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు ప్రజా ప్రభుత్వ రెండేళ్ల పాలనపై ప్రోగెస్
ఉత్తరాఖండ్‌లోని ప్రముఖ పర్యాటక ప్రాంతం ముస్సోరీలో అనుమానాస్పద స్థితిలో మరణించిన తెలుగు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ పారుపూడి రాధాగాయత్రి కేసులో ఊహించని మలుపు చోటుచేసుకుంది.
తమిళనాడు రాష్ట్రంలో ఆదివారం నాడు ఒక భారీ పారిశ్రామిక దుర్ఘటన చోటుచేసుకుంది.
తెలంగాణలో ఆదివారం ఉదయం ఒక ఘోర అగ్నిప్రమాదం జరిగింది.
ఇంగ్లండ్ వన్డే సిరీస్‌కు భారత్‌ జట్టు ప్రకటన
ప్రస్తుత డిజిటల్ యుగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేదా ఏఐ అనేది కేవలం ఒక సాంకేతిక పరిజ్ఞానం
హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపడంతో పాటు నగర అభివృద్ధిని వేగవంతం చేసే లక్ష్యంతో ప్రభుత్వం చేపట్టిన ప్రతిష్ఠాత్మక రోడ్డు అభివృద్ధి ప్రాజెక్టు
బీజేపీ నా సీటు చోరీకి పాల్పడిందని కాంగ్రెస్ అభ్యర్థి మీనాక్షి నటరాజన్ అన్నారు.
నేను హోంమంత్రిని కాకపోవడం ఆ క్రిమినల్స్ అదృష్టం...
సమాజంలో నేరస్థులను కేవలం నేరస్థులుగానే చూడాలని, వారికి కులం లేదా మతం అనే ముసుగు
హైదరాబాద్‌లోని KBR పార్క్ సమీపంలో కొత్తగా అమల్లోకి వచ్చిన వన్‌వే ట్రాఫిక్ నిబంధనలు పలువురు వాహనదారులకు చుక్కలు చూపిస్తున్నాయి.
గాదె సాయికృష్ణ అదృశ్యం ఉదంతం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో పెను సంచలనంగా మారింది.
క్రికెట్ ప్రపంచంలో సరికొత్త చరిత్ర సృష్టించబడింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.