Publish Date:Dec 21, 2024
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఆదివారం (డిసెంబర్ 22) ఉదయం శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో 14 కంపార్ట్ మెంట్లు పూర్తిగా నిండిపోయాయి.
Publish Date:Dec 21, 2024
వైసీపీ ప్రభుత్వం హయాంలో జరిగిన అవినీతి అక్రమాలు అన్నీఇన్నీకావు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత వైసీపీ నేతల అవినీతి భాగోతాలు గుట్టలు గుట్టలుగా వెలుగులోకి వస్తున్నాయి. ముఖ్యంగా ప్రజలు పన్నుల రూపంలో ప్రభుత్వానికి చెల్లించిన సొమ్మును జగన్ మోహన్ రెడ్డి అప్పనంగా తన అనుచర గణానికి, సోషల్ మీడియా వేదికగా ప్రతిపక్ష నేతలను బూతులు తిట్టిన వారికి జీతాల రూపంలో ఇచ్చేశారు.
Publish Date:Dec 21, 2024
ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. బంపర్ మెజార్టీతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఏపీలో అభివృద్ధే లక్ష్యంగా దూసుకెళ్తోంది. కేంద్రం సహకారంతో రాష్ట్రాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి పథంలో నడిపించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారు. ఇదే క్రమంలో గడిచిన ఐదేళ్ల కాలంలో అరాచక పాలన సాగించిన వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డికి వరుసగా షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయి. జగన్ వెంట ఉంటే తమకు రాజకీయ భవిష్యత్ ఉండదని భావించిన వైసీపీ కీలక నేతలు ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్నారు.
Publish Date:Dec 21, 2024
సంధ్య థియేటర్ ఘటనలో సినీ హీరో అల్లు అర్జున్ ను అసెంబ్లీలో రేవంత్ రెడ్డి అగ్రహం చేసిన కొద్దిసేపట్లో మంత్రి కోమటిరెడ్డి కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ ను పరామర్శించారు.
Publish Date:Dec 21, 2024
సినీ హీరో అల్లు అర్జున్ వల్లే సంధ్య థియేటర్ ఘటనలో తల్లి రేవతి చనిపోయిందని, కొడుకు కొనఊపిరితో కొట్టు మిట్టాడుతున్నాడని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు
Publish Date:Dec 20, 2024
భారత పార్లమెంట్ లో హోం శాఖ మంత్రి అమిత్ షా అంబేడ్కర్ పై చేసిన వ్యాఖ్యలు దేశంలో మంటలు రేపాయి. దేశ వ్యాప్తంగా నిరసనలు హోరెత్తుతున్నాయి. భారత రాజ్యాంగ నిర్మాణంలో కీలక పాత్ర పోషించిన అంబేద్కర్ ను అవమానించేందుకు బీజేపీ సాహసించడమంటే.. భవిష్యత్ లో భారత రాజ్యాంగాన్ని పక్కనబెట్టి వారి సొంత రాజ్యాంగాన్ని అమలు చేసేందుకు రెడీ అయిపోయిందనడానికి సంకేతమేనన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాంగ్రెస్ వాదులంతా బిజెపి ఆలోచనలు, విధానాలను తీవ్రంగా వ్యతిరేస్తున్నారు.
Publish Date:Dec 20, 2024
తిరుమలలో భక్తుల రద్దీ స్వల్పంగా తగ్గింది. శనివారం(డిసెంబర్ 21) ఉదయం శ్రీవారి దర్శనం కోసం క్యూ కాంప్లెక్స్ లో వేచి ఉండాల్సిన అవసరం లేకుండా నేరుగా శ్రీవారి దర్శనానికి భక్తులను అనుమతిస్తున్నారు.
Publish Date:Dec 20, 2024
మాజీ మంత్రి కేటీఆర్ కు ఈ ఫార్ములా కార్ రేసు కేసు విషయంలో న్యాయపరమైన చిక్కులు తప్పవన్న భావన పరిశీలకులలో వ్యక్తం అవుతోంది. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతినకుండా ఉండటం కోసం, పెట్టుబడుల ఆకర్షణ కోసమే ఫార్ములా ఈ కార్ రేస్ నిర్వాహకులకు సొమ్ము ఇవ్వాల్సి వచ్చిందన్న కేటీఆర్ వివరణ న్యాయ పరీక్షకు నిలబడే అవకాశాలు అంతంత మాత్రమేనని అంటున్నారు.
Publish Date:Dec 20, 2024
ఫార్ముల-ఈ కార్ రేసు విషయంలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌కు వరుస షాకులు తగులుతున్నాయి. ఏసీబీ కేసు విషయంలో కోర్టు నుంచి వారం రోజుల ఉపశమనం లభించిందని ఊపిరి పీల్చుకునేలోగానే ఇదే విషయంపై ఈడీ కేసు నమోదు చేసి షాక్ ఇచ్చింది.
Publish Date:Dec 20, 2024
సంధ్యా థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటనకు సంబంధించి నటుడు అల్లు అర్జున్ పై జాతీయ మానవహక్కుల సంఘానికి ఫిర్యాదు అందింది. ఇప్పటికే ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేశారు. పుష్ప-2 ప్రీమియర్స్‌కు నటీనటులను ఎవరినీ రావొద్దని చెప్పాలని తాము సంధ్యా థియేటర్ యాజమాన్యానికి ముందుగానే సమాచారం ఇచ్చామని పోలీసులు తెలిపారు. ఘటన జరిగినప్పటి నుంచి స్పందించని సంధ్య థియేటర్ యాజమాన్యం.. అల్లు అర్జున్ అరెస్ట్ అయిన నేపథ్యంలో.. బందోబస్తు చేయాలంటూ పోలీసులను కోరుతూ రాసిన లేఖను విడుదల చేసింది.
Publish Date:Dec 20, 2024
అధికారమే పరమావధిగా రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చిన వైకాపా అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జన్మ దినోత్సం డిసెంబర్ 21. ఆయనపై పలు కేసులు, అవినీతిపరుడంటూ ఆరోపణలు రావడంతో ప్రజలు ఇంటికి పంపించి వేశారు. గెలిచిన ఎమ్మెల్యేలను పార్టీ ఫిరాయింపులకు ప్రోత్సహించిన ధీశాలి వైఎస్ జగన్. ప్రజా సంకల్ప యాత్రతో అకారణంగా జనంతో మమేకమైన నేతగా పేరు మూటగట్టుకున్నారు.
Publish Date:Dec 20, 2024
మరి అల్లర్ల విషయంలో వినిపిస్తున్న హెచ్చరికలు
ముందస్తు ప్రణాళికతో బీఆర్ ఎస్ పార్టీ చేస్తున్నవేనా..
ప్రజలు అప్పుడొకలా ఇప్పుడొకలా రియాక్ట్ అవడం అంటూ జరిగితే మాత్రం రేవంత్ సర్కార్ పాలనపై కొంత విముఖత మొదలైందని భావించవచ్చా..అదే జరిగితే
ఇదంతా దేనికి సంకేతం అనుకోవచ్చు..చూద్దాం..
Publish Date:Dec 20, 2024
ఇండియన్ నేషనల్ లోక్ దళ్ అధినేత
హర్యానా మాజీ ముఖ్యమంత్రి ఓం ప్రకాశ్ చౌతాలా కన్నుమూశారు. హర్యానా రాష్రానికి ఐదు సార్లు సీఎంగా సేవలందించిన నాయకుడు ఓం ప్రకాశ్ చౌతాలా శుక్రవారం (డిసెంబర్ 20) మధ్యాహ్నం కార్డియాక్ అరెస్ట్ తో తుదిశ్వాస విడిచారు.