టీడీపీ కూట‌మిలో పెత్త‌న‌మంతా మోదీదే

Publish Date:Mar 10, 2024

Advertisement

బీజేపీతో టీడీపీ-జ‌న‌సేన పొత్తులు ఖ‌రారైన నేప‌థ్యంలో ఇక ఎన్నిక‌ల ప్ర‌చార స‌భ‌ల‌పై దృష్టి పెట్టారు. ప్ర‌ధానంగా న‌రేంద్ర మోడీని ఏపీకి తీసుకురావ‌డం ద్వారా.. ప్ర‌జ‌ల‌ను పొత్తుల పార్టీవైపు న‌డిపించేందుకు అవ‌కాశం ఉంటుంద‌నే అంచ‌నాలు వేసుకున్నారు. ఈ క్ర‌మంలో మూడు పార్టీల ఉమ్మడి కార్యాచరణలో భాగంగా ఈ నెల 17న లేదా 18న భారీ బహిరంగ సభను టీడీపీ-జనసేన నిర్వహించబోతోంది. ఈ సభకు ప్రధాని నరేంద్ర మోడీనే ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌గా నిల‌వ‌నున్నారు.
వైసీపీని ఓడించేందుకు, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా ఉండేందుకు కూటమిగా ఏర్ప‌డ‌డ‌మే కాదు గెలిపించే బాధ్య‌త కూడా మోడీ పైనే పెట్టింది టీడీపీ కూట‌మి. ఇప్పుడు టీడీపీ, జనసేన, బీజేపీ  ఉమ్మడిగా ప్రజల ముందుకు వెళ్తుండడంతో రాష్ట్రానికి సంబంధించిన అంశాలను ప్రస్తావించాల్సి ఉంది. ఆ బాధ్యతను ప్రధాని మోదీకే అప్పగించారు. రాష్ట్రానికి సంబంధించి ఒకటి రెండు కీలక ప్రకటనల్ని మోదీతో  చేయించడం ద్వారా కూటమిపై విశ్వాసం కలుగుతుందనేది ఆ పార్టీల ప్లాన్. ఈ నెల 17న చిలకలూరిపేటలో టీడీపీ, జనసేన ఉమ్మడిగా బహిరంగసభకు ప్లాన్ వేశాయి. అయితే ఇప్పుడు మోదీ కూడా వస్తుండడంతో సభను చిలకలూరిపేటలో నిర్వహిస్తారా.. లేకుంటే మరో ప్రాంతాన్ని ఎంచుకుంటారా అనేది తేలాల్సి ఉంది. మొత్తానికి ఆ సభలో రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలను మోదీ వెల్లడిస్తారని సమాచారం.
బీజేపీ పొత్తుకు ఓకే చెప్పింది. దీంతో టీడీపీ, జనసేన ఫుల్ హ్యాపీ. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల విషయంలో కేంద్రంలో ఉన్న బీజేపీ అంత గొప్పగా చేయలేదనే విమర్శలు ఉన్నాయి. అమరావతి రాజధానికి మోదీ శంకుస్థాపన చేశారు. కానీ జగన్ దాన్ని కాదని మూడు రాజధానులను తెరపైకి తెచ్చారు. అయినా మోదీ ప్రభుత్వం అడ్డుకోలేకపోయింది. మరోవైపు విభజనచట్టం ప్రకారం రాష్ట్రానికి రావాల్సిన వాటిలో ఇంతవరకూ వాటాలు తేల్చలేదు. పోలవరం పూర్తి కాలేదు. రైల్వే జోన్ సాకారం కాలేదు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ మెడపైన వేలాడుతోంది. ఇలా అనేక అంశాలపై బీజేపీ స్పందించాల్సిన అవసరం ఏర్పడింది.
ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి కలిసి పోటీ చేసేందుకు సిద్ధమయ్యాయి. సీట్ల సర్దుబాటు కూడా పూర్తయింది. 145 అసెంబ్లీ, 17 పార్లమెంటు స్థానాల్లో టీడీపీ పోటీ చేయనుండగా జనసేన, బీజేపీ కలిసి 30 అసెంబ్లీ, 8 లోక్ సభ స్థానాల్లో బరిలోకి దిగుతున్నారు. 
ప్ర‌ధాని ఏపీకి వ‌స్తే.. ఎలాంటి హామీలు ఇస్తారు? అనేది ఆస‌క్తిగా మారింది. రాష్ట్రానికి మేలు జరిగేలా కొన్ని కీలక ప్రకటనలు చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయని టీడీపీ నేత‌లు అంచ‌నా వేస్తున్నారు. ఆ ప్రకటనలు ఓటర్లను కట్టిపడేసేలా.. మరో కూటమికే ఓట్లు పడేలా ఉంటాయని కూట‌మి చెబుతోంది.
ఇప్పుడు అధికారంలో ఉన్న వైసీపీ గురించి.. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురించి ఏమేం మాట్లాడుతారో అనేదానిపై కూడా పార్టీల‌కు, రాజ‌కీయాల‌కు అతీతంగా సర్వత్రా చ‌ర్చ సాగుతోంది.

By
en-us Political News

  
రాజకీయాల్లో విజయం అనేది కేవలం నాయకుల ఉపన్యాసాల వల్ల మాత్రమే సాధ్యం కాదు. అధికారం, రాజకీయ వేధింపులు, ఆంక్షలు ఎన్ని ఎదురైనా వెరవక
అయోధ్య శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ పరిధిలో దాదాపు రూ. 7.5 కోట్ల విరాళాల దుర్వినియోగం జరిగిందనే ఆరోపణలపై పార్లమెంట్‌ ద్వారం వద్ద స్వతంత్ర ఎంపీ పప్పు యాదవ్ కాషాయ వస్త్రాలు ధరించి, పూజారి వేషంలో ఒక పెద్ద హుండీతో కూర్చుని సేకరించిన విరాళాలను జేబులో వేసుకుంటూ వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు.
నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనే విశాఖను గ్లోబల్ ఐటీ, ఇండస్ట్రియల్ హబ్‌గా మార్చాలనే ఆలోచనతో ఈ భోగాపురం ప్రాజెక్టుకు చంద్రబాబు బీజం వేశారనీ, అయితే.. కాలక్రమంలో ప్రభుత్వాలు మారాయి, ప్రాజెక్టు ప్రతిపాదనలు మడతపడ్డాయన్నారు.
సిదిరి అప్పలరాజు కుమారుడు బైక్ నిర్లక్ష్యంగా నడిపి ఒకరి మృతికి కారణమయ్యారన్న కేసు దర్యాప్తులో వెలుగు చూసిన అంశాల మేరకు ఇందులో ఎలాంటి రాజకీయ కుట్రలు లేవు. సీదిరి అప్పలరాజు చేసిన అతే.. ఆయనను చట్టపరంగా ఇబ్బందుల్లోకి నెట్టింది.
ఎప్పుడో ఓ సారి జైల్లో ఉన్న నేతకు పరామర్శ పేరుతో బయటకు వచ్చే సందర్భాలలో కూడా సదరు నేతను పరామర్శించడం కంటే.. బల ప్రదర్శనకు, తనకు జనం మద్దతు ఉందని నిరూపించుకునే ప్రదర్శనలకే ప్రాధాన్యత ఇస్తున్నారు. ఆయన అలా బయటకు వచ్చిన ప్రతి సారీ అభాసుపాలౌతూనే ఉన్నారు.
ఢిల్లీ వీధుల్లో రగిలిన ఆగ్రహ జ్వాలలు, పోలీసుల లాఠీఛార్జీలు, కన్నీటి ధారలు, నిర్బంధాలను సైతం లెక్కచేయక హక్కుల కోసం వీధిపోరాటానికి దిగిన యువత ఆక్రందనలు
రైతులు ఎట్టి పరిస్థితుల్లోనూ తమ అమూల్యమైన భూములను ఇవ్వద్దు, భోగాపురం విమానాశ్రయాన్ని అందరం కలిసి అడ్డుకుందాం" అంటూ జగన్ ఇచ్చిన పిలుపుల ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతూ భోగాపురం విషయంలో జగన్ ద్వంద్వ వైఖరిని ఎండగడుతున్నాయి.
తెలుగుదేశం కూమిటికి ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే.. చంద్రబాబు నాయకత్వంలో కూటమి సర్కార్ సంక్షేమ, అభివృద్ధిని సమాంతరంగా పరుగులు పెట్టిస్తున్నప్పటికీ ఆ స్థాయిలో ప్రజాదరణ పెరగడం అటుంచి.. క్షేత్రస్థాయిలో కూటమి పాలన పట్ల ఒకింత అసంతృప్తి పె రిగిందని సర్వే స్పష్టం చేయడమే.
మొత్తంగా విద్యార్థులు, యువతఉద్యమం.. ఒక స్పష్టమైన సందేశాన్ని అయితేనిస్సందేహంగా ఇచ్చింది. అన్యాయాన్ని ప్రశ్నించడంలో, హక్కుల కోసం పోరాడటంలో , న్యాయం కోసం నినదించడంలో వెనకడుగు వేసే ప్రశ్నేలేదని చాటింది.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కర్నూలు జిల్లా ఆదోని పట్టణ, మండల టీడీపీ నేతలు పని చేయాలని
నీట్ పేపర్ లీక్ ఆందోళనలతో దిల్లీ వీధులను ఊపేసిన బొద్దింకలు ఇప్పుడు దేశ రాజధాని జంతర్ మంతర్ వద్ద రైతు నాయకుడు రాకేష్ తికాయత్‌ను కలిసి సంఘీభావం ప్రకటించాయి.
మాజీ మంత్రి జోగి రమేష్ తనపై చేస్తున్న ఆరోపణలనుఖండించిన వసంత వెంకట కృష్ణ ప్రసాద్.. జోగి రమేష్ కు ఎటువంటి క్రెడిబులిటీ లేదనీ, అతను ఏదోదో మాట్లాడతారనీ, అవన్నీ పట్టించుకోవలసిన అవసరం లేదని చెప్పారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర పరిపాలన వ్యవహారాల్లో తీరిక లేకుండా ఉండటంతో, ఆయన సొంత నియోజకవర్గమైన కుప్పం సమగ్ర అభివృద్ధి బాధ్యతలను భువనేశ్వరి దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. గత రెండేళ్లుగా నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నప్పటికీ, ఇప్పటి వరకూ భువనేశ్వరి రాజకీయాలు మాట్లాడిన సందర్భం లేదు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.