హేతుబ‌ద్దీక‌ర‌ణ‌పేర ఖాళీల భర్తీకి ఏపీ స‌ర్కార్ గండి

Publish Date:Jul 23, 2022

Advertisement

రాష్ట్రంలో ఉపాధ్యాయ పోస్టుల భ‌ర్తీకి గండి కొట్టేందుకు ఏపీ సర్కార్ హేతుబద్ధీకరణకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా జిల్లా యూనిట్‌గా తీసుకుని ఉపాధ్యాయులను ఉన్న‌చోట‌నే స‌ర్దుబాటు చేసే అవకాశం ఉంది.  అస‌లు మొత్తం ఉపాధ్యాయుల పోస్టుల ఖాళీల‌ను భ‌ర్తీ చేయ‌డానికి అనేక సాంకేతిక ఇబ్బందులున్నాయని చెబుతోంది.   కొన్నిచోట్ల ఎక్కువ‌మంది విద్యార్ధులు, మ‌రికొన్ని చోట్ల ఎక్కువ‌మంది ఉపాధ్యాయులు ఉండ‌డం వంటి కారణాల వల్ల బోధన   అన్ని ప్రాంతాల్లోనూ   స‌మానంగా జ‌ర‌గ‌డం లేదని చెబుతోంది. ఈ కారణం చెబుతూ ఖాళీల భర్తీ జోలికి వెళ్లకుండా  ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణ  నిర్వహించాలని ప్రభుత్వం గత కొంత కాలంగా ప్రయత్నిస్తోంది. 
 కరోనా వ‌ల్ల‌ గత రెండేళ్లుగా పాఠశాలలు సరిగ్గా నడవకపోవడంతో ఈ విషయాన్ని పక్కన పెట్టారు.  అయితే హేతుబద్ధీకరణ కు సంబంధించి అధికారులు ఇప్పటికే పూర్తి స్థాయి సమాచారాన్ని సేకరించి సిద్ధంగా ఉంచారు. అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఏయే పాఠ శాలల్లో ఎంత మంది విద్యార్థులున్నారు? విద్యార్థుల సంఖ్య ఆధారంగా ఎంత మంది ఉపాధ్యాయులను హేతుబద్ధీకరించాల్సి ఉం టుంది?  అన్న విషయంపై  నివేదికను సిద్ధం చేశారు.

ఉపాధ్యాయుల సీనియారిటీ ప్రకారం రేషనలైజేషన్‌లో స్థాన చలనం ఉంటుంది.  ఈ విద్యా సంవత్సరం పాఠశాలలు   రెగ్యులర్‌గా నడుస్తుండడంతోపాటు ఉపాధ్యాయ పోస్టుల ఖాళీలను భర్తీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే   ఖాళీలు భర్తీ చేయాలంటే ముందుగా హేతుబద్ధీకరణ జరగాలని ప్రభుత్వం చెబుతోంది. ఇందుకు సంబంధించి ఇప్పటికే అధికారులకు ఆదేశాలు జారీ చేసి నట్టు తెలిసింది. ఈ ఆదేశాలకు అనుగుణంగా త్వరలోనే రేషనలైజేషన్‌ షెడ్యూల్‌ను విడుదల చేసే అవకాశం ఉంది.

ఆయా జిల్లాల పరిధిలోనే ఈ షెడ్యూల్‌ను ప్రకటించనున్నారు.  అయితే రేషనలైజేషన్‌లో భాగంగా ఎక్కువ మంది టీచర్లకు స్థాన చలనం అనివార్యమౌతుందని చెబుతున్నారు.  మరోవైపు పాఠశాలల్లో విద్యార్థులకు సంబంధించిన ప్రగతిని నెల వారీగా నమోదు చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు డీఈవోలకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ ప్రగతి నివేదికలను ఆన్‌లైన్‌లో కూడా నమోదు చేయాల్సి ఉంటుంది. ఈ నివే దికల్లో ఒకవేళ విద్యార్థుల ప్రగతి తగ్గినట్టుగా స్పష్టమైతే.. సంబంధిత పాఠశాల టీచర్లు సమాధానం చెప్పాల్సి ఉంటుంది.

By
en-us Political News

  
తమిళనాడు రాజకీయాలు మరోసారి రసవత్తరంగా మారాయి.
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రేపు వెల్లడికానున్నాయి
రాష్ట్రంలో కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వచ్చే చాన్సే లేదన్నారు. ఈ సమావేశంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో బీఆర్ఎస్ బ‌లోపేతం, స‌భ్య‌త్వ న‌మోదు కార్య‌క్ర‌మం, క‌మిటీల నిర్మాణం లాంటి అంశాల‌పై నేతలతో చర్చించిన కేటీఆర్ . స్థానిక సంస్థల ఎన్నికల్లో మంచి విజయాలు నమోదు చేసిన పార్టీ నేతలను ఈ సందర్భంగా అభినందించారు.
కేటీఆర్ వ్యాఖ్యలపై కవిత చాలా ఘాటుగా స్పందించారు. బీఆర్ఎస్, తనను, తన రాజకీయ పార్టీనీ చాలా తేలికగాతీసుకుంటోందన్న కవిత.. ప్రాథమిక స్థాయిలో తన పార్టీని చాలా తేలికగా తీసుకుంటున్నందుకు ఆమె కేటీఆర్‌పై ఎదురుదాడి చేశారు. ఇటీవలే కేటీఆర్ బీఆర్ఎస్‌ను తిరిగి టీఆర్ఎస్‌గా మార్చడం గురించి మాట్లాడారనీ.. కానీ ఇప్పుడు ఈసీ తమ పార్టీకి ట్రేడ్‌మార్క్ టీఆర్ఎస్ పేరు ఇవ్వడాన్ని జీర్ణించుకోలేకే.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ దానిని తేలికగా తీసుకుంటున్నట్లు మాట్లాడుతున్నారన్నారు.
ఒకప్పుడు సోషల్ మీడియాలో లోకేష్‌ను ట్రోల్ చేయడమే పనిగా పెట్టుకున్న వైసీపీకి ఆయన తన పనితీరుతోనే సమాధానం చెప్పారు. 400 రోజులకు పైగా సాగిన యువగళం పాదయాత్ర లోకేష్‌ను ప్రజలకు చేరువ చేయడమే కాకుండా.. ఆయనలోని నాయకత్వ పటిమను బయటపెట్టింది. ఆ యాత్రలో ఆయన సేకరించిన ప్రజా సమస్యలే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సూపర్ సిక్స్ పథకాలకు పునాదిగా మారాయి.
కవిత తన కొత్త రాజకీయ ప్రస్థానంలో భాగంగా యువతతో విస్తృతంగా మమేకమవ్వాలని నిర్ణయించుకున్నారు.
అయితే ఆమె కొత్త రాజకీయ పార్టీ ప్రకటన.. ఏపీ రాజకీయాలలో కూడా సంచలనం సృష్టించింది. ఆమె పార్టీ ప్రకటన వైసీపీకి ఒకింత ఇబ్బందికరంగా మారగా, తెలుగుదేశం, జనసేన పార్టీల్లో జోష్ ను నింపింది. టీడీపీ-జనసేన కూటమికి కవిత కొత్త పార్టీ ఒక గొప్ప వ్యూహాత్మక అవకాశాన్ని అందించినట్లయిందని విశ్లేషకులు భావిస్తున్నారు.
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది.
ఎమ్మెల్యేల పనితీరును ప్రజల నుంచే తెలుసుకోవాలని చంద్రబాబు నిర్ణయించారు. మే 1 నుంచే ఆ ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. ప్రజల నుంచి వచ్చే స్పందన ఆధారంగా ఎమ్మెల్యేలు పనితీరు మార్చుకోవాల్సి ఉంటుందని చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.
స్ట్రాంగ్ రూమ్ వద్ద సిసిటివి దృశ్యాలను టీవీలో చూసినప్పుడు తనకు అనుమానం కలిగిందనీ.. అందుకే స్వయంగా తనిఖీ చేయడానికి వచ్చానని మమతా బెనర్జీ తెలిపారు. అక్కడ జరుగుతున్న పరిణామాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాణాలకు తెగించి అయినా సరే ప్రజా తీర్పును కాపాడుకుంటామన్న మమతా బెనర్జీ.. ఓట్ల లెక్కింపులో ఎలాంటి అవకతవకలు జరిగినా సహించేది లేదని హెచ్చరించారు.
తెలుగువన్ వాస్తవ వేదికలో ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాజకీయ పరిస్థితులపై విస్తృత చర్చ జరిగింది.
తెలంగాణ రాజకీయ యవనికపై మరో కొత్త పార్టీ అధికారికంగా అడుగుపెట్టింది.
మొత్తం 140 అసెంబ్లీ స్థానాలున్న కేరళలో, ఈ నెల 23న ఒకే విడతలో ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో అధికార పగ్గాలు అందుకోవాలంటే మ్యాజిక్ ఫిగర్ 71. బుధవారం వెలువడిన ఎగ్జిట్ పోల్స్ అన్నీ ముక్తకంఠంతో యూడీఎఫ్‌కే అధికారమని అంచనా వేశాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.