ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్

Publish Date:May 9, 2023

Advertisement

పాకిస్థాన్ తెహరీక్ -ఎ-ఇన్సాఫ్ అంటే పాకిస్థాన్ న్యాయపోరాటం అని అర్ధం. ఇలాంటి పేరుతో రాజకీయ పార్టీ పెట్టి ప్రధాని పదవిని అధిష్టించిన ఇమ్రాన్ ఖాన్  ను అక్కడి ప్రభుత్వం  రేంజర్లు అరెస్టు చేశారు.  అనేక కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇమ్రాన్ ఖాన్ కు న్యాయస్థానం షరతులతో కూడిన బెయిలు మంజూరు చేసింది.  ఆ పనిలో ఇస్లామాబాద్ హైకోర్టుకు బయో మెట్రిక్ గుర్తింపును పరిశీలించుకోవడానికి వచ్చిన మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ను పాకిస్థానీ రేంజర్లు అదుపులోనికి తీసుకున్నారు.

ప్రధాని పదవి లోనుం స్వంత పార్టీ నేతలే  ఇమ్రాన్ ఖాన్ ను పదవీచ్యుతుడిని చేశారు.  అపంతనం వందకు పైగా కేసులను ఇమ్రాన్ ఖాన్ ఎదుర్కోవలసి వచ్చింది.  పాకిస్థాన్ జాతీయ జవాబుదారీ సంస్థ ఆరోపణలను ఎదుర్కొంటున్న ఇమ్రాన్ ఖాన్ న్యాయస్థానాల చుట్టూ తిరుగుతున్నారు. గత ఏడాది ఏప్రియల్ లో అవిశ్వాస తీర్మానంతో ప్రధాని పదవిని ఇమ్రాన్ ఖాన్ వదలాల్సి వచ్చింది.  రష్యా , చైనా, ఆప్ఘనిస్థాన్ లపై ఇమ్రాన్ ఖాన్ అనుసరించిన విదేశాంగ విధానాల కారణంగా అవిశ్వాస పరీక్ష ఎదుర్కోవలసి వచ్చింది.  

ఈ విధానాలు నచ్చని అమెరికా తనపై కక్ష కట్టిందని ఇమ్రాన్ ఖాన్ వర్గం అప్పట్లో ఆరోపణలు చేసింది. రేంజర్లుగా అనుమానిస్తున్న గుర్తు తెలియని వ్యక్తులు మారణాయుధాలు ధరించి ఇమ్రాన్ ఖాన్ ను అపహరించారని పీటీఐ అధికార ప్రతినిథి ఫహాద్ చౌదరి ఆరోపించారు.

ఇమ్రాన్ ఖాన్ ను వెంటనే కోర్టులో హాజరు పారచాల్సిందిగా ఇంటీరియర్ సెక్రటరీని, ఐజీ పోలీసులను ఆదేశించాలని ఇస్లామాబాద్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని ఫహాద్ కోరారు. 2003లో ప్రజాస్వామిక దేశంగా అవతరించిన పాకిస్థాన్ అంతకు ముందు ఐదున్నర దశాబ్దాల పైనిక పాలన వాసనలను ఇంకా మరచిపోకపోవడం విషాదం. 

By
en-us Political News

  
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై అనుచిత, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో అరెస్టయిన ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు నాంపల్లి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది
టీడీపీ కేంద్ర కార్యాలయంలో రెండో రోజు నిర్వహిస్తున్న లీడర్‌షిప్ కాంక్లేవ్‌లో పొలిటికల్ కమ్యూనికేషన్ అండ్ పబ్లిక్ ఓరియంటేషన్ అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ మాట్లాడారు.
అసలాయన రాజకీయ పార్టీ ఏర్పాటు ఉద్దేశమేంటో? లక్ష్యమేంటో ఆయనకైనా స్పష్టత ఉందా అనిపించేలా ఆయన మీడియా సమావేశం సాగింది.  
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన  విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.  మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ ఆబ్సెన్స్ లో రేవంత్  తన కేబినెట్ పునర్వ్యవస్థాకరణ విషయంలో మరింత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలుంటాయని పరిశీలకులు అంటున్నారు.  పార్టీలో, ప్రభుత్వంలో అసంతృప్తికి చెక్ పెట్టి, తన నిర్ణయాలను అమలు చేయడానికి రేవంత్ కు ఇది అనువైన సమయంగా రాజకీయవర్గాలు చెబుతున్నాయి.
2014 నుంచి ఆంధ్రప్రదేశ్ లో రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్యే అధికారం మారుతూ వస్తోంది. వైపీపీ, తెలుగుదేశం మధ్య ద్విముఖ పోరే నెలకొని ఉంది. ఈ పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి కొత్త పార్టీ  రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలలో మార్పు తీసుకువచ్చే అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి. 
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు.  తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు.  తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో  కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది.  కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు.   గతంలో ఏపీలో బీజేపీ  మద్దతు  వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ  వాస్తవాన్ని సీఎం  చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్   బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు. 
రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు, రాష్ట్రంలో ఇరిగేషన్ సదుపాయాలను మెరుగుపరిచేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా పూర్తవుతుండటంతో, ఇరిగేషన్ రంగంపై మాట్లాడటానికి ప్రతిపక్షానికి ఎలాంటి అవకాశాలు లేకుండా పోయాయని ఆయన కుండబద్దలు కొట్టారు. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.