Publish Date:Jul 19, 2023
సినీ నటులు జీవిత, రాజశేఖర్ దంపతులకు షాక్ తగిలింది. గతంలో వారు చిరంజీవి బ్లడ్ బ్యాంక్ పై చేసిన ఆరోపణల కేసులో వారికి ఏడాది పాటు జైలు శిక్ష విధిస్తూ నాంపల్లి కోర్టు తీర్పు ఇచ్చింది.
రక్తం అందక ఎవరూ ప్రాణాలు పోగొట్టుకోకూడదన్న ఉద్దేశంతో చిరంజీవి తన పేరుతో బ్లడ్ బ్యాంక్ స్థాపించారు. అయితే ఆ బ్లడ్ బ్యాంక్ పై 2011 లో జీవిత, రాజశేఖర్ దంపతులు సంచలన వ్యాఖ్యలు చేశారు. బ్లడ్ బ్యాంక్ పేరుతో దాతల నుంచి ఉచితంగా సేకరించిన రక్తాన్ని మార్కెట్ లో అమ్ముకుంటున్నారని ఆరోపించారు.
అప్పట్లో ఈ వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే రేపాయి. ఈ వివాదాస్పద వ్యాఖ్యలపై అల్లు అరవింద్ అప్పట్లో కోర్టుని ఆశ్రయించారు. చిరంజీవి పేరుతో జరుగుతున్న సేవా కార్యక్రమాలపై అసత్య ప్రచారాలు చేస్తున్నారంటూ పరువునష్టం దావా వేశారు. సుదీర్ఘ విచారణ అనంతరం నాంపల్లిలోని 17వ అడిషనల్ చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ మంగళవారం నాడు తీర్పు వెల్లడించింది. జీవిత, రాజశేఖర్ దంపతులకు రూ.5000 జరిమానాతో పాటు ఏడాది శిక్ష జైలు శిక్ష విధించింది. జరిమానా చెల్లించడంతో వారికి పైకోర్టుకి వెళ్లే అవకాశం కల్పిస్తూ బెయిల్ మంజూరు చేసింది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/imprisonment-to-jivita-rajasekhar-25-158569.html
హైదరాబాద్ నగరంలో మరో దారుణ ఘటన వెలుగు చూసింది.
గాంధీ జయంతి సందర్భంగా హైదరాబాద్‌లోని చారిత్రాత్మక బాపూఘాట్ వద్ద జాతిపిత మహాత్మా గాంధీకి రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నివాళులు అర్పించింది.
కనీస ధర రూ.30కి పెంపునకు సిఫార్సు.!
వెబ్‌సిరీస్ ల్లో ఎక్కువగా బ్యాంకులు, బంగారు దుకాణాల్లో దోపిడీలకు సంబంధించిన వీడియోలే చూసేవాడు.. ఆ తర్వాత తనకున్న ఆర్మీ అనుభవాన్ని ఉపయోగించుకోని సికింద్రాబాద్ మద్రాస్ రెజిమెంట్‌ను ఎంచుకున్నాడు.
ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) వ్యవహారశైలిని నిరసిస్తూ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద తలపెట్టిన ఆందోళన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది.
హైదరాబాద్ నగరవాసుల ప్రయాణ కష్టాలకు చెక్ పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక నిర్ణయం తీసుకుంది.
కొత్త కారు కొనుక్కోవాలని ఎన్నో రోజులుగా కలలు కంటారు.. ఆ కల నెరవేరిన రోజు ఆ ఆనందమే వేరు! ఎంతో ఇష్టపడి కొత్త బీఎండబ్ల్యూ కారు కొనుగోలు చేసిన ఓ వ్యక్తి..
తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త వాతావరణం నెలకొంది.
మహారాష్ట్రలోని ప్రఖ్యాత హిందూ హృదయసమ్రాట్ బాలాసాహెబ్ థాకరే మహారాష్ట్ర సమృద్ధి మహామార్గ్‌పై జరిగిన ఒక ఘోర రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది.
దుబాయ్ నుంచి టెల్ అవీవ్‌కు బయలుదేరిన ఫ్లైదుబాయ్ విమానంలో భారత సంతతి కెప్టెన్‌పై జరిగిన కత్తిదాడి అంతర్జాతీయంగా తీవ్ర కలకలం రేపుతోంది.
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.
జాతిపిత మహాత్మా గాంధీ 157వ జయంతి వేడుకలను దేశవ్యాప్తంగా అత్యంత భక్తిశ్రద్ధలతో, ఘనంగా నిర్వహిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో డీఎస్సీ 2.0 నోటిఫికేషన్ విడుదలకు కసరత్తు వేగవంతమైంది.