మాట్లాడకుండానే ఇతరులకు మీ తెలివి తేటలు నిరూపించాలంటే.. ఇలా చేయండి..!
Publish Date:Oct 28, 2024
Advertisement
ట్యాలెంట్ ఎవడి సొత్తు కాదు.. ఇది ఈ కాలంలో చాలా ఎక్కువగా ఉపయోగించే వాక్యం. ట్యాలెంట్ చాలామందికి ఉంటుంది. కానీ దీన్ని గుర్తించుకుని సరైన విధంగా సద్వినియోగం చేసుకునేవారు తక్కువేనని చెప్పాలి. నాకేం వచ్చు అనుకునే వారు ఎక్కువ. నీకేం తెలుసు నువ్వు ఊరుకో అని కుటుంబం నుండి స్నేహితులు, కొలీగ్స్ వరకు చాలామంది అంటుంటారు. ఈ కారణంగా కాస్తో కూస్తూ తెలివి తేటలు ఉన్నా అవి బయట పడవు. అయితే ట్యాలెంట్ ఉన్నా సరే.. కొందరు రాణించలేరు.. ముఖ్యంగా నాకు ట్యాలెంట్ ఉంది కానీ నేను వెనుకబడ్డాను అని వాపోయేవారు ఉంటారు. అలాంటి వారి కోసమే ఈ సమాచారం. మాట్లాడకుండా తెలివి తేటలు నిరూపించడం పెద్ద టాస్క్. కానీ కింది విషయాలు తెలుసుకుంటే మాట్లాడకుండా ప్రతిభను నిరూపించుకోవడం కష్టం కాదు అనిపిస్తుంది. స్మార్ట్ వర్క్.. కష్టపడి పని చేయడం అనేది ఒక మనిషిని ఒక మెట్టు పైన నిలబెడుతుంది. అయితే నేటి కాలంలో కష్టపడటం అనే మాట కంటే ఎంత తెలివిగా వర్క్ చేస్తాం అనేదే ఎక్కువ పరిగణలోకి తీసుకుంటారు. అందుకే స్మార్ట్ వర్క్ ఈజ్ బెస్ట్ అంటున్నారు. అలాగని స్మార్ట్ వర్క్ అనేది ఎంపిక చేసుకునే ఒక మార్గం కాదు.. కానీ అది కొన్ని సందర్భాలలో అవసరం. అవసరమైనప్పుడు స్మార్ట్ వర్క్ చేయడం వల్ల తెలివి తేటలను ప్రూవ్ చేసుకోవచ్చు. ఎక్కువ మాట్లాడే వారు అంతే తెలివిగా పని చేయలేకపోవచ్చు. కానీ తక్కువ మాట్లాడే వారు చేసే పని చాలా సైలెంట్ గా ఉన్న ప్రదేశంలో విస్పోటనం చెందినట్టే ఉంటుంది. ఇది చాలామందిని ఆశ్చర్యానికి, విస్మయానికి గురిచేస్తుంది. ఇలా చేయాలంటే కొన్ని పనులు చేయాలియ.. లక్ష్యాలు.. టాస్క్.. ఒకేసారి రెండు పనులను డీల్ చేయడం వల్ల మానసికంగా అలసిపోతారు. రెండు పనుల మీద పూర్తీ స్థాయి ఫోకస్ పెట్టలేరు. ఒక వేళ పెట్టినా అది మీ ప్రతిభకు, సామర్థ్యానికంటే తక్కువగానే ఉంటుంది. అందుకే స్మార్ట్ వర్క్ చేసే వారు ఒకసారి ఒక పని మీదనే దృష్టి పెడతారు. దాన్ని వీలైనంత తొందరగా, పూర్తీ స్థాయిలో పూర్తీ చేయగలరు. ఇది ప్రతిభను నిరూపించుకోవడానికి చాలామంచి మార్గం. ప్లానింగ్.. రేపు ఏం చేయాలి అనే విషయాన్ని ముందు రోజే ప్లాన్ చేసుకోవాలి. కుదరకపోతే కనీసం ఉదయం లేచిన తరువాత అయినా ఆ రోజు చేయాల్సిన పనులను ప్లాన్ చేసుకోవాలి. దీని వల్ల చాలా వరకు పనులను సరైన సమయానికి పూర్తీ చేయగలుగుతారు. దీని వల్ల సమయం సేవ్ అవుతుంది. మానసికంగా ఒత్తిడి ఉండదు. ప్లానింగ్ చేసుకున్నంత మాత్రాన టాస్క్ లు సులభంగా పూర్తీ కావు. దీనికి సమయాన్ని మేనేజ్ చేసుకోవడం కూడా అంతే ముఖ్యం. సమయాన్ని సరైన విధంగా మెయింటైన్ చేసుకునే వారు ఫెయిల్ కావడం అంటూ ఉండదు. పనులతో వ్యవహరించడం.. కొన్ని ముఖ్యమైన పనులు ఉంటాయి. మరికొన్ని సాధారణ పనులు ఉంటాయి. ముఖ్యమైన పనులు పూర్తీ కావడంలో సాధారణ పనులు అడ్డంకి గా ఉంటాయి. ఇలాంటి సాధారణ పనులు, అంతగా ప్రాముఖ్యత లేని పనులను ఇతరులకు అప్పగించడం వల్ల పూర్తీ స్థాయి ఏకాగ్రతను పని మీద ఉంచవచ్చు. ఇది పనిలో వందశాతం ఫలితం రాబట్టడంలో సహాయపడుతుంది. నేర్చుకోవాలి.. నాకు అంతా తెలుసు అనే అహం మనిషిని అట్టడుగుకు తొక్కేస్తుంది. పని చేస్తున్నప్పుడ ఏవైనా పొరపాట్లున్నా, ఇతరులు మీ పొరపాటును చెప్పినా నాకు తెలియదా ఏంటి అని వారిని నిందించవద్దు.. నాకే చెప్తావా అని కోప్పడవద్దు. వారు చెప్పిన విషయాన్ని ఆలోచించి అందులో నిజం ఉంటే దాన్ని సరిదిద్దుకోవాలి. దీని వల్ల ఆయా విషయాలను మరింత సమర్థవంతంగా నేర్చుకునే వెలుసుబాటు కలుగుతుంది. విరామం.. స్మార్ట్ వర్క్ చేసేటప్పుడు వర్క్ మీద పోకస్ ఎక్కువ ఉండటానికి అప్పుడప్పుడు బ్రేక్ తీసుకోవాలి. ఇది తిరిగి పని మొదలు పెట్టినప్పుడు ఏకాగ్రతగా పని చేయడంలో సహాయపడుతుంది.
ఎప్పుడూ లక్ష్యాలు పెట్టుకుని పని చేయాలి. ఏదో ఒక విధంగా అలా పని చేస్తూ పోవడం అనే కాన్సెప్ట్ వదిలి ఒక టార్గెట్ పెట్టుకోవాలి. దీని వల్ల చేయవలసిన పనుల మీద అవగాహన, స్పష్టత పెరుగుతుంది. అలాగే పనులను ఒకే టాస్క్ లో కాకుండా చిన్న చిన్న టార్గెట్లలో విభజించుకొని వాటిని పూర్తీ చేయాలి.
సమయం..
*రూపశ్రీ.
http://www.teluguone.com/news/content/if-you-want-to-prove-your-intelligence-to-others-without-speaking-35-187507.html