మాట్లాడకుండానే ఇతరులకు మీ తెలివి తేటలు నిరూపించాలంటే.. ఇలా చేయండి..!

Publish Date:Oct 28, 2024

Advertisement

 

ట్యాలెంట్ ఎవడి సొత్తు కాదు.. ఇది ఈ కాలంలో చాలా ఎక్కువగా ఉపయోగించే వాక్యం.  ట్యాలెంట్ చాలామందికి ఉంటుంది.  కానీ దీన్ని గుర్తించుకుని సరైన విధంగా సద్వినియోగం చేసుకునేవారు తక్కువేనని చెప్పాలి.  నాకేం వచ్చు అనుకునే వారు ఎక్కువ. నీకేం తెలుసు నువ్వు ఊరుకో అని కుటుంబం నుండి స్నేహితులు, కొలీగ్స్ వరకు చాలామంది అంటుంటారు. ఈ కారణంగా కాస్తో కూస్తూ తెలివి తేటలు ఉన్నా అవి బయట పడవు. అయితే  ట్యాలెంట్ ఉన్నా సరే.. కొందరు రాణించలేరు.. ముఖ్యంగా నాకు ట్యాలెంట్ ఉంది కానీ నేను వెనుకబడ్డాను అని వాపోయేవారు ఉంటారు. అలాంటి వారి కోసమే ఈ సమాచారం. మాట్లాడకుండా తెలివి తేటలు నిరూపించడం పెద్ద టాస్క్. కానీ కింది విషయాలు తెలుసుకుంటే మాట్లాడకుండా ప్రతిభను నిరూపించుకోవడం కష్టం కాదు అనిపిస్తుంది.

స్మార్ట్ వర్క్..

కష్టపడి పని చేయడం అనేది ఒక మనిషిని ఒక మెట్టు పైన నిలబెడుతుంది. అయితే నేటి కాలంలో కష్టపడటం అనే మాట కంటే ఎంత తెలివిగా వర్క్ చేస్తాం అనేదే ఎక్కువ పరిగణలోకి తీసుకుంటారు. అందుకే స్మార్ట్ వర్క్ ఈజ్ బెస్ట్ అంటున్నారు. అలాగని స్మార్ట్ వర్క్ అనేది ఎంపిక చేసుకునే ఒక మార్గం కాదు.. కానీ అది కొన్ని సందర్భాలలో అవసరం.  అవసరమైనప్పుడు స్మార్ట్ వర్క్ చేయడం వల్ల తెలివి తేటలను ప్రూవ్ చేసుకోవచ్చు.

ఎక్కువ మాట్లాడే వారు అంతే తెలివిగా పని చేయలేకపోవచ్చు. కానీ తక్కువ మాట్లాడే వారు  చేసే పని చాలా సైలెంట్ గా ఉన్న ప్రదేశంలో విస్పోటనం చెందినట్టే ఉంటుంది.  ఇది చాలామందిని ఆశ్చర్యానికి,  విస్మయానికి గురిచేస్తుంది. ఇలా చేయాలంటే కొన్ని పనులు చేయాలియ..

లక్ష్యాలు..


ఎప్పుడూ లక్ష్యాలు పెట్టుకుని పని చేయాలి.  ఏదో ఒక విధంగా అలా పని చేస్తూ పోవడం అనే కాన్సెప్ట్ వదిలి ఒక టార్గెట్ పెట్టుకోవాలి.  దీని వల్ల  చేయవలసిన పనుల మీద అవగాహన,  స్పష్టత పెరుగుతుంది.  అలాగే పనులను ఒకే టాస్క్ లో కాకుండా చిన్న చిన్న టార్గెట్లలో విభజించుకొని వాటిని పూర్తీ చేయాలి.  

టాస్క్..

ఒకేసారి రెండు పనులను డీల్ చేయడం వల్ల మానసికంగా అలసిపోతారు.  రెండు పనుల మీద పూర్తీ స్థాయి ఫోకస్ పెట్టలేరు.  ఒక వేళ పెట్టినా అది మీ ప్రతిభకు,  సామర్థ్యానికంటే తక్కువగానే ఉంటుంది. అందుకే స్మార్ట్ వర్క్ చేసే వారు ఒకసారి ఒక పని మీదనే దృష్టి పెడతారు. దాన్ని వీలైనంత తొందరగా,  పూర్తీ స్థాయిలో  పూర్తీ చేయగలరు. ఇది ప్రతిభను నిరూపించుకోవడానికి చాలామంచి మార్గం.

ప్లానింగ్..

రేపు ఏం చేయాలి అనే విషయాన్ని ముందు రోజే ప్లాన్ చేసుకోవాలి. కుదరకపోతే కనీసం ఉదయం లేచిన తరువాత అయినా ఆ రోజు చేయాల్సిన పనులను ప్లాన్ చేసుకోవాలి. దీని  వల్ల చాలా వరకు పనులను సరైన సమయానికి పూర్తీ చేయగలుగుతారు. దీని వల్ల సమయం సేవ్ అవుతుంది.  మానసికంగా ఒత్తిడి ఉండదు.


సమయం..

ప్లానింగ్ చేసుకున్నంత మాత్రాన టాస్క్ లు సులభంగా పూర్తీ కావు.  దీనికి సమయాన్ని మేనేజ్ చేసుకోవడం కూడా అంతే ముఖ్యం. సమయాన్ని సరైన విధంగా మెయింటైన్ చేసుకునే వారు ఫెయిల్ కావడం అంటూ ఉండదు.

పనులతో వ్యవహరించడం..

కొన్ని ముఖ్యమైన పనులు ఉంటాయి. మరికొన్ని సాధారణ పనులు ఉంటాయి.  ముఖ్యమైన పనులు పూర్తీ కావడంలో సాధారణ పనులు అడ్డంకి గా ఉంటాయి. ఇలాంటి సాధారణ పనులు,  అంతగా ప్రాముఖ్యత లేని పనులను ఇతరులకు అప్పగించడం వల్ల పూర్తీ స్థాయి ఏకాగ్రతను పని మీద ఉంచవచ్చు. ఇది పనిలో వందశాతం ఫలితం రాబట్టడంలో సహాయపడుతుంది.

నేర్చుకోవాలి..

నాకు అంతా తెలుసు అనే అహం మనిషిని అట్టడుగుకు తొక్కేస్తుంది.  పని చేస్తున్నప్పుడ ఏవైనా పొరపాట్లున్నా, ఇతరులు మీ పొరపాటును చెప్పినా నాకు తెలియదా ఏంటి అని వారిని నిందించవద్దు.. నాకే చెప్తావా అని కోప్పడవద్దు. వారు చెప్పిన విషయాన్ని ఆలోచించి అందులో నిజం ఉంటే దాన్ని సరిదిద్దుకోవాలి. దీని వల్ల ఆయా విషయాలను మరింత సమర్థవంతంగా నేర్చుకునే వెలుసుబాటు కలుగుతుంది.

విరామం..

స్మార్ట్ వర్క్ చేసేటప్పుడు వర్క్ మీద పోకస్ ఎక్కువ ఉండటానికి అప్పుడప్పుడు బ్రేక్ తీసుకోవాలి. ఇది తిరిగి పని మొదలు పెట్టినప్పుడు ఏకాగ్రతగా పని చేయడంలో సహాయపడుతుంది.


                                         *రూపశ్రీ.

By
en-us Political News

  
వేసవి కాలం రాగానే, చెమట నీళ్ళు కుమ్మరించినట్టు కారిపోతూ ఉంటుంది.  ఎంతమంచి బట్టలు వేసుకున్నా చెమట కారణంగా పాడైపోతూ ఉంటాయి.పైగా చెమట కారణంగా దుర్వాసన కూడా వస్తుంది. చెమట వాసన చాలా..
పుదీనా ఎంతో సువాసనగా, ఆహ్లాదాన్ని ఇచ్చే మొక్క.  ఎన్నో రకాల కూరల నుండి పచ్చళ్ల తయారీ  వరకు పుదీనాను  ఉపయోగిస్తారు.   ఇక వేసవి కాలంలో అయితే షర్బత్ నుండి నిమ్మరసం, ఆమ్ పన్నా, మసాలా మజ్జిగ ఇలా..
భారతదేశంలో ధనికుల కంటే పేదవారే ఎక్కువ.  పేదవారిలో కూడా చాలా పేదవారు,  ఒక మోస్తరు పేదవారు అని కూడా ఉంటారు. అయితే కాలం ఎంత గడిచినా జీవితాలలో ఏ మాత్రం మార్పు లేకుండా పేదవారిగానే ఉండిపోయే...
పిల్లలు జీవితంలోని ప్రతి దశలో  ఆత్మవిశ్వాసంతో, బాధ్యతాయుతంగా నిలబడాలని ప్రతి తల్లిదండ్రులు కలలు కంటారు. నేటికాలంలో మంచి పేరెంటింగ్ అంటే కేవలం మంచి విద్యను అందించడం లేదా..
వేసవికాలం అనగానే మండే ఎండలు గుర్తుకు వస్తాయి.  ప్రతి ఏడాది ఈ ఎండల ప్రభావం పెరుగుతూనే ఉంటోంది. ఈ కారణంగానే చాలామంది ఇళ్లలో ఏసీలు పెట్టించుకుంటారు.  అయితే ఏసీ పెట్టించుకునే అంత స్తోమత లేనివారు కనీసం కూలర్ అయినా...
వివాహం అనేది కేవలం ఇద్దరు వ్యక్తుల కలయిక మాత్రమే కాదు, రెండు కుటుంబాలు , రెండు విభిన్న మనస్తత్వాల కలయిక కూడా.  పెళ్లి తర్వాత ప్రతి జంట తమ సంబంధాన్ని మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నిస్తుంది..
నేటి కాలంలో ఫిట్‌నెస్‌పై అవగాహన పెరుగుతోంది. ముఖ్యంగా జిమ్ వెళ్లేవారు తమ ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు...
మీ జుట్టు మీ అందానికి ఒక కిరీటం వంటిది. కానీ నేటి ఒత్తిడితో కూడిన జీవనశైలి, కాలుష్యం మరియు రసాయనాల వాడకం వల్ల జుట్టు ఆరోగ్యం దెబ్బతింటోంది. మీ జుట్టును ఒత్తుగా, పొడవుగా మరియు ఆరోగ్యంగా ఎలా ఉంచుకోవాలో ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం...
ప్రేమించిన వారిని వదిలి వేరొకరిని పెళ్లి చేసుకుంటున్నారా? మీ జీవితం మరియు మీ భాగస్వామి భవిష్యత్తు కోసం ఈ విషయాలు తప్పక తెలుసుకోండి...
ఈ రోజుల్లో చాలా మంది ఎదుర్కొంటున్న అతి పెద్ద ఆరోగ్య సమస్య హార్మోన్ల అసమతుల్యత (Hormonal Imbalance). మనం ఎంత ప్రయత్నించినా బరువు తగ్గకపోవడం, ఎప్పుడూ అలసటగా అనిపించడం, మానసిక ఒత్తిడి.. ఇవన్నీ మీ హార్మోన్లు పంపే సంకేతాలు కావచ్చు...
పుట్టిన తర్వాత పిల్లలు పెద్దగా అయినా.. వారు చదువులు పూర్తయ్యి,  పెళ్ళి చేసుకుని, వారు కూడా పిల్లలను కన్నా సరే.. తల్లిదండ్రులకు మాత్రం తమ పిల్లలు ఎంతవాళ్లైనా ఇంకా చిన్న పిల్లలు గానే అనిపిస్తూ ఉంటుంది...
జీవితంలో విజయం సాధించాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. కానీ విజయం కొందరే సాధిస్తారు. దీనికి కారణాలు చాలా ఉంటాయి...
భారతీయుల ఇళ్లలో చాలా వరకు కరివేపాకు మొక్క పెంచుతూ ఉంటారు. ఇంటి బయట ఏ మాత్రం కాస్త స్థలం ఉన్నా సరే.. మొదటగా కరివేపాకు మొక్కనే పెంచుతూ ఉంటారు. కరివేపాకు మొక్క ఎదుగుదలకు కూడా భారతీయ...
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.