విడదల రజిని వైజాగ్ కి వెళ్లి ఉంటే..?

Publish Date:Apr 19, 2025

Advertisement

ఒక ఐడియా మాత్రమే కాదు..  ఒక పొరపాటు కూడా జీవితాన్ని మార్చేస్తుంది. ఇప్పుడు ఓటమిపాలైన వైసీపీ  నాయకుల్లో ఈ పరిస్థితి చాలా మందిలో కనిపిస్తోంది.  జగన్మోహన్ రెడ్డితో పాటు ఫ్యాన్ పార్టీని నమ్ముకున్న చాలామంది నాయకులు ఇప్పుడు  కష్టాలు అనుభవిస్తున్నారు. అలాంటి వారిలో పేరు చెప్తేనే ప్రజలందరికీ తెలిసే మాజీ మంత్రి విడదల రజిని ఒకరు.

ఏపీలో అతి తక్కువ కాలంలోనే అత్యంత ప్రాచుర్యం పొందిన నేతలలో విడదల రజినీ కూడా ఒకరు.  తెలుగుదేశంతో మొదలైన విడదల రజని  రాజకీయ ప్రస్థానం వైసీపీలో ఉచ్ఛ స్థితికి చేరుకుంది. వాస్తవానికి ఆమెకు పార్టీలో అత్యధిక శాతం మంది వ్యతిరేకులే. అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి,  సజ్జల రామకృష్ణారెడ్డి మినహాయిస్తే ఇతర కోటరీ ఎప్పుడు విడదల రజనికి సహకరించ లేదు. చిలకలూరిపేట ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో కూడా అప్పటి ఎంపీ కృష్ణదేవరాయలతో విభేదాలు కొనసాగాయి అలాగే మర్రి రాజశేఖర్ తదితరులు కూడా ఆమెకు సొంత పార్టీలోనే సమస్యగా ఉండేవారు. చిలకలూరిపేట ఎమ్మెల్యేగా ఫ్యాన్ పార్టీ హవా లో గెలిచిన ఆమె ఆ తర్వాత అనుకూలమైన పరిస్థితుల్లో కీలకమైన వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా అవకాశం పొందారు. మొదటి నుంచీ ఆమె వ్యవహార శైలి పార్టీలోని చాలా మందికి మింగుడు పడలేదు. ప్రధానంగా ఫ్యాన్ పార్టీలోని కొన్ని వర్గాలు ఆమెను చాలా సందర్భాల్లో ఒంటరి చేశారు. ఫ్యాన్ పార్టీ అధికారిక మీడియాలో కూడా అప్పటి మంత్రి రోజాకు ఇచ్చిన ప్రాధాన్యత విడదల రజినీకి ఇవ్వలేదన్న అసంతృప్తి ఆమెలో చాలా వరకు ఉంది.

అలాగే వైద్య ఆరోగ్యశాఖ మంత్రిగా ఉన్నప్పటికీ బదిలీలు, నియామకాల విషయాల్లో ఉన్నతాధికారులు ఆమెకు సహకరించ లేదు. ప్రతి అంశాన్ని సీఎం దృష్టికి తీసుకువెళ్లాలని అధికారులు దాట వేసిన సందర్భాలు ఎన్నో.  అప్పటి వైద్య ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ కృష్ణబాబు తో పాటు డి ఏం ఈ స్థాయి అధికారులు కూడా ఆమె సిఫార్సులను చాలా సందర్భాల్లో అమలు చేయలేదు. ఎన్నికలు దగ్గర పడుతున్న దశలో ఆమె జరుగుతున్న పరిణామాలను అధినాయకుడు జగన్ దృష్టికి తీసుకువెళ్లాలని ప్రయత్నించారు. అప్పటికే సమయం దాటిపోవడంతో టికెట్ల కేటాయింపులో జగన్మోహన్ రెడ్డి మూడో కన్ను సర్వేల్లో ఆమె చిలకలూరిపేటలో గెలవడానికి అవకాశాలు తక్కువని తేలింది. దీంతో ఆమెను విశాఖ ఎంపీగా పోటీ చేయాలన్న ప్రతిపాదన జగన్మోహన్ రెడ్డి తీసుకువచ్చారట. అప్పటికి విశాఖ సిట్టింగ్ ఎంపీ ఎంవీవి సత్యనారాయణ మరోసారి ఎంపీగా పోటీ చేయనని విశాఖ తూర్పు ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని కసరత్తు ప్రారంభించారు విశాఖలో ఎంపీ స్థాయి అభ్యర్థి లేకపోవడం, అలాగే ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారిని ఆదరించే పరిస్థితి విశాఖలో ఉండడంతో..  జగన్మోహన్ రెడ్డి విశాఖ ఎంపీ గా పోటీ చేసే అవకాశాన్ని విడదల రజనీకి ఇచ్చారు.

కానీ తన భర్త_ మామ సంబంధించిన వ్యవహారాలన్నీ గుంటూరు జిల్లా చుట్టూ ఉన్నాయనీ,  అక్కడి నుంచే పోటీ చేస్తానని రజనీ చెప్పి, తనకున్న  బలంతో గుంటూరు వెస్ట్ సమన్వయకర్తగా ప్రకటన చేయించుకున్నారు. కానీ ఫ్యాన్ పార్టీ కూటమి గాలికి కొట్టుకు పోవడంతో విడదల రజిని కూడా గల్లంతయ్యారు. అదే సమయంలో ఆమె సొంత పార్టీ నాయకులతో పాటు,  కూటమి నాయకులు ఆమెపై    దృష్టి పెట్టారు  దీంతో ప్రస్తుతం ఏసీబీ కేసు కూడా ఆమె పై నమోదయింది నిజంగా ఆమె ఎన్నికలకు ఏడాది ముందే విశాఖ ఎంపీగా మకాం మార్చినట్లయితే ఇన్ని కష్టాలు ఉండేవి కాదని ఆమె అనుచరులు అంటున్నారు. విశాఖ నగరం చరిత్ర చూస్తే స్థానికేతరులే ఎమ్మెల్యే లు ఎంపీలు అయినా సందర్భాలు ఉన్నాయి. టి సుబ్బరామి రెడ్డి, నేదురుమల్లి  జనార్దన్ రెడ్డి,  పురందేశ్వరి ఇలా ఎందరో ఎంపీలు స్థానికేతరులే. 

విశాఖ ఇన్చార్జ్ మంత్రిగా విడదల రజిని రెండేళ్లలో విశాఖ వాసులకు ఒకింత పరిచయం కూడా అయ్యారు.  జగన్మోహన్ రెడ్డి పాలనలో వైద్య ఆరోగ్య శాఖకు కొంత ప్రాధాన్యత ఉండడం,  అందుకు తగ్గట్టు విశాఖలోని కింగ్ జార్జ్ ఆసుపత్రి విక్టోరియా ఆసుపత్రి అంటువ్యాధుల ఆసుపత్రి ఇలా ఎన్నో వైద్య పరమైన అభివృద్ధి పనులు విడదల రజిని చేతుల మీదుగా ప్రారంభం అయ్యాయి. చివరికి పాడేరు అరకు లాంటి ప్రాంతాల్లో కూడా వైద్య ఆరోగ్య శాఖ అభివృద్ధి పనులు ఆమె చేతుల మీదుగా, ఆమె హయాంలోనే జరిగాయి. సికిల్ సెల్ ఎనీమియా వ్యాధి పరీక్షలకు కోట్లాది రూపాయలు ఆమె హయాంలోని మన్యానికి కేటాయించారు. పాడేరు మెడికల్ కాలేజ్ ను కూడా ఆమె ప్రారంభించాల్సిన పరిస్థితుల్లో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది. ఆ రకంగా ఉమ్మడి విశాఖ జిల్లాలో ఆమె ఏదో మేరకు ప్రజలకు దగ్గరయ్యారు. అందుకే గత ఎన్నికలలో  జగన్ సూచించినట్లు  ఆమె వైసీపీ అభ్యర్థిగా   విశాఖ ఎంపీగా పోటీ చేసినట్లయితే గెలవడం మాట ఎలా ఉన్నా గుంటూరు లాంటి స్థానిక విభేదాల నుంచి ఆమె గట్టెక్కే పరిస్థితి ఉండేదని ఆమె అనుచరులు అనుకుంటున్నారు. అందుకే అంటారు ఒక ఐడియా మాత్రమే కాదు ఓ నిర్ణయం కూడా జీవితాన్ని మార్చేస్తుందని.

By
en-us Political News

  
వివిధ రాష్ట్రాలకు కొత్త ఇన్‌ఛార్జీలను ప్రకటించిన కాషాయ పార్టీ..!
అక్టోబరా, నవంబరా, లేదా తరువాతా అన్న ఉత్కంఠకు తెరదించుతూ మంత్రి నారా లోకేష్ వచ్చే నెలలోనే అంటే అక్టోబర్ లోనే స్థానిక సమరం ఉంటుందన్న స్పష్టత ఇచ్చారు.
వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గమైన పులివెందుల పరిధిలోని లింగాల మండలం నుంచి  జెడ్పీటీసీ స్థానానికి పోటీ చేయాల్సిందిగా  వైఎస్ సునీతను లోకేష్ కోరినట్లు  ప్రచారం జరుగుతోంది. కేవలం పోటీ చేయడమే కాకుండా, ఆ ఎన్నికలో విజయం సాధిస్తే..  జిల్లా పరిషత్ చైర్ పర్సన్ పదవి  కట్టబెడతామని స్పష్టమైన హామీ ఇచ్చినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది.
యువనేత లోకేష్ రాప్తాడు రావడం పార్టీ కేడర్‌కు పండుగ రోజు.
తన కుమార్తె వివాహాన్ని అడ్డుపెట్టుకుని జగన్ తో సయోధ్య కోసం తెరవెనుక ప్రయత్నాలు చేస్తున్నారంటూ తనపై వచ్చిన ఆరోపణలను ఆమె నిర్ద్వంద్వంగా ఖండించారు.  
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది.
రాజకీయ నేతలను లక్ష్యంగా చేసుకుని అనుచిత వ్యాఖ్యలు చేయడం వంటి తీవ్రమైన అభియోగాలపై ఆంధ్రప్రదేశ్ పోలీసులు అతడిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పోలీసుల విచారణలో భాగంగా వెలుగుచూసిన పరిణామాలు, అతడు వ్యక్తం చేసిన పశ్చాత్తాపం డిజిటల్ మీడియాలో ఇష్టారీతిగా వ్యాఖ్యలు చేసే వారందరికీ నిస్సందేహంగా ఒక హెచ్చరిక అని చెప్పవచ్చు. 
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.
భీమిలి అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్తగా (ఇన్ చార్జ్) బొత్స అనూషను ఆ పార్టీ అధినేత జగన్ నియమించారు. ఈ మేరకు   పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి  ఉత్తర్వులు వెలువడ్డాయి. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆదేశాల మేరకే ఈ నియామకం జరిగినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.  
స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో జగన్ విదేశీ పర్యటన పెట్టుకోవడాన్ని ప్రస్తావిస్తూ రాజకీయ పరిశీలకులు షర్మిల కుమార్తె వివాహానికి హాజరు కాకుండా తప్పించేకునేందుకే జగన్ ఈ నిర్ణయం తీసుకుని ఉండొచ్చంటూ విశ్లేషిస్తున్నారు.  ఈ నేపథ్యంలోనే షర్మిల తన అన్న నివాసానికి వెళ్లి వివాహ ఆహ్వానపత్రిక అందిస్తారా? అందిస్తే జగన్ ఆ వివాహానికి హాజరౌతారా? అన్న అనుమానాలు పరిశీలకులలో వ్యక్తమౌతున్నాయి.
విదేశీ పర్యటనలో ఉన్నంతకాలం  అందుబాటులో ఉండే కాంటాక్ట్ ఫోన్ నంబరుతో పాటు అధికారిక ఈ-మెయిల్ అడ్రస్ కూడా సీబీఐ అధికారులకు కచ్చితంగా అందించాలి. ఇక విదేశీ పర్యటన ముగిసిన వెంటనే   కోర్టు విచారణ ప్రక్రియకు హాజరు కావాలని కోర్టు ఆదేశించింది.
చీఫ్ జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్, జస్టిస్ జి.ఎం. మొహిద్దీన్ కూడిన ధర్మాసనం స్పీకర్ తీర్పును పక్కనపెట్టి దానం నాగేందర్ అనర్హతను ఖాయం చేసింది. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.