రాహుల్ ప్రధాని కావడానికి జేసీ చెప్పిన సలహా
Publish Date:Jul 5, 2018
Advertisement
జేసీ దివాకరరెడ్డి, వేదిక ఏదైనా కానీ ఆయన మనస్సుకి ఏది అనిపిస్తే అది మాట్లాడతారు అనే పేరుంది.. తాజాగా విశాఖకు ప్రత్యేక రైల్వే జోన్ కావాలని డిమాండ్ చేస్తూ టీడీపీ నేతలు ఒక రోజు నిరాహార దీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే.. ఈ కార్యక్రమానికి హాజరైన జేసీ, కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసారు.. కేంద్ర ప్రభుత్వంపై ఎన్ని రకాల పోరాటాలు చేసినా దున్నపోతుపై వాన పడినట్టుగానే ఉందని అన్నారు.. ఐదు కోట్ల మంది బీజేపీపై వ్యతిరేకంగా ఉన్నారన్న ఇంటిలిజెన్స్ నివేదిక మోడీకి అందలేదా అని ఆయన ప్రశ్నించారు.. విభజన హామీలు పూర్తి స్థాయిలో నెరవేర్చితేనే ఆంధ్రప్రదేశ్ స్వరూపం మారుతుందని అన్నారు.. రాష్ట్రాన్ని విభజించిన పాపానికి కాంగ్రెస్ భారీ మూల్యం చెల్లించుకుందని, విభజన హామీలను అమలు చేయకపోతే బీజేపీకీ అదే గతి పడుతుందని హెచ్చరించారు.. రెండు రాష్ర్టాలుగా విడదీస్తే.. టీఆర్ ఎస్, వైసీపీతో దోస్తీ చేసి ఢిల్లీలో అధికారంలోకి రావచ్చని సోనియాగాంధీ భావించారని జేసీ వెల్లడించారు.. అధికారాన్ని తిరిగి నిలబెట్టుకోవడం, తన కుమారుడు రాహుల్ గాంధీని పీఎం చేసే లక్ష్యంతో సోనియాగాంధీ రాష్ట్ర విభజన చేశారని అన్నారు.. ఈ సందర్భంగా తను గతంలో సోనియాకు ఇచ్చిన సలహాను జేసీ గుర్తుచేశారు.. 'దేశ రాజకీయాల్లో ఉత్తరప్రదేశ్ ది కీలక పాత్ర.. ఆ రాష్ట్రంలో బ్రాహ్మణుల సంఖ్య ఎక్కువ.. వారి మనసు గెలుచుకోవాలంటే యూపీ బ్రాహ్మణ మహిళను రాహుల్ వివాహం చేసుకోవాలి.. అప్పుడే ఆయన ప్రధాని కాగలుగుతారు అని సోనియాగాంధీకి చెప్పాను.. అయతే ఆమె నవ్వి ఊరుకున్నారే తప్ప.. నా మాటను ఆచరణలో పెట్టలేదు' అని జేసీ ఆసక్తికరమై అంశాన్ని పంచుకున్నారు.
http://www.teluguone.com/news/content/if-rahul-marries-brahmin-girl-he-will-become-pm-39-82261.html





