మంకీపాక్స్ వైరస్ కు వ్యాక్సిన్ తయారీకి ఐసీఎమ్ఆర్ పిలుపు

Publish Date:Jul 28, 2022

Advertisement

ఒక దాని వెంట ఒకటి.. ఒకదానితో కలిసి మరొకటి అన్నట్లుగా ప్రపంచాన్ని వైరస్ లు చుట్టేస్తున్నాయి. దాదాపు రెండు సంవత్సరాల పాటు ప్రపంచాన్ని వణికించిన కరోనా మహమ్మారి ముప్పు ఇంకా పూర్తిగా తొలగనే లేదు. కరోనా ప్రొటోకాల్ పాటించి తీరాల్సిందేనని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఒక వైపు హెచ్చరికలు జారీ చేస్తూనే ఉంది. అంతలోనే ఉరుములేని పిడుగులా మరో వైరస్ ప్రపంచాన్ని చుట్టేస్తోంది. ఆ వైరస్ పేరే మంకీ పాక్స్.

దేశ వ్యాప్తంగా 71కి పైగా దేశాలలో ఈ వ్యాధి ఇప్పటికే విస్తరించింది. నెలల వ్యవథిలోనే ప్రపంచ వ్యాప్తంగా16వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. భారత్ కు మంకీ పాక్స్  వైరస్ ముప్పులేదంటూ చెబుతూ వచ్చిన కేంద్ర ఆరోగ్య శాఖ ఇప్పుడు అదీ  దేశంలో ఒక మంకీ పాక్స్ వైరస్ కేసు నిర్ధారణ అయ్యి, మరో అరడజను అనుమానిత కేసులు నమోదు అయిన తరువాత అప్రమత్తమైంది.ప్రపంచ వ్యాప్తంగా కేసులు అధికమవుతున్న నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ    గ్లోబల్‌ హెల్త్‌ ఎమర్జెన్సీ  ప్రకటించింది.

దేశంలో మంకీపాక్స్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం అప్రమత్తమైంది. కరోనా వ్యాధి దేశంలోకి ప్రవేశించిన తర్వాత దీన్ని నియంత్రించేందుకు వ్యాక్సిన్ తయారు చేసినట్లుగానే, ఇప్పుడు మంకీపాక్స్ వ్యాధికి కూడా వ్యాక్సిన్ తయారు చేయాలని కేంద్రం భావిస్తోంది. దీనికోసం దేశంలోనే అత్యున్నత వైద్య పరిశోధనా సంస్థ అయిన ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎమ్ఆర్) ప్రయత్నాలు ప్రారంభించింది.

మంకీపాక్స్ వైరస్‌ను అడ్డుకునే వ్యాక్సిన్ తయారీకి కంపెనీలను ఆహ్వానించింది. అలాగే వ్యాధిని త్వరగా గుర్తించే విట్రో డయాగ్నస్టిక్ కిట్లు కూడా తయారు చేయాలని కంపెనీలను కోరింది. మంకీపాక్స్ వైరస్ వ  జంతువుల నుంచి మనుషులకు, మనుషుల నుంచి మనుషులకు సోకుతుంది.  జ్వరం, తలనొప్పి, వెన్ను నొప్పి, కండరాల నొప్పి, నీరసం వంటి లక్షణాలు మంకీపాక్స్ వైరస్ బారిన పడిన వ్యక్తిలో కనిపిస్తాయి.  

ప్రస్తుతం అర్హత కలిగిన కంపెనీల నుంచి ఐసీఎమ్ఆర్ వ్యాక్సిన్ తయారీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. వారానికి కనీసం లక్ష డోసుల వ్యాక్సిన్లైనా తయారు చేయగలిగే సామర్ధ్యం ఉండాలని ఐసీఎంఆర్ అంటోంది. కోవిడ్ సందర్భంగా దేశంలో అత్యవసర వినియోగానికి కొవాగ్జిన్ రూపొందించినట్లుగానే ఈ వ్యాక్సిన్ కూడా తయారు చేయాల్సి ఉంటుంది. ప్రభుత్వం ఈ కంపెనీలకు రాయితీ కూడా కల్పిస్తుంది. నిపుణుల సహకారాన్ని కూడా ప్రభుత్వం అందిస్తుంది.
 

By
en-us Political News

  
మోడీకి  జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వారిలో లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, తెలుగుదేశం అధినేత, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేష్ తదితరులు  ఉన్నారు.  ప్రధాని నరేంద్ర మోదీజీకి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయన మంచి ఆరోగ్యంతో, దీర్ఘాయుష్షుతో ఉండాలని కోరుకుంటున్నానంటూ రాహుల్ గాంధీ తన సందేశంలో పేర్కొన్నారు.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు వన్‌సైడ్ విక్టరీ వచ్చేలా పార్టీ శ్రేణులు పనిచేయాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు.
కేసీఆర్ కుటుంబ సభ్యులు, సన్నిహిత బంధువులపేర్ల మీద అధికారికంగా నమోదై ఉన్న భూముల వివరాలను అసెంబ్లీ వేదికగానే  రేవంత్ రెడ్డి బయటపెట్టారు.  
వైసీపీ నుంచి బయటకు వచ్చి, ఆ పార్టీ ద్వారా వచ్చిన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి రాజకీయ సన్యాసం ప్రకటించిన విజయసాయి, ఇటీవల సొంత పార్టీ అంటూ మళ్లీ క్రియాశీల రాజకీయాలలోకి ప్రవేశించారు. 
బినెట్ నుంచి ఉద్వాసనకు గురైన కొండా సురేఖకు కేబినెట్ హోదాతో కీలక పదవిని అప్పగించే అవకాశాలున్నాయన్న ప్రచారం జరుగుతోంది.  ఈ విషయమై కొండా సురేఖకు పార్టీ హైకమాండ్ నుంచి స్పష్టమైన హామీ లభించినట్లు చెబుతున్నారు.
బీసీలపై కపట ప్రేమ ఎందుకు? కేసీఆర్‌ను నిలదీసిన పీసీసీ చీఫ్..!
మాజీ మంత్రి కొండా సురేఖకు మద్దతుగా అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో వరంగల్‌కు తరలివచ్చారు.
తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారిన కొండా సురేఖ ఉదంతంలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
ఎర్రవల్లి ఘటన నుండి ఫ్లాష్ సర్వే వరకు..బయటపడ్డ అసలు నిజాలు..?
చంద్రబాబు అక్రమ అరెస్ట్ మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల వద్ద,  పార్టీ కార్యాలయాల్లో యాభై మూడు దీపాలను వెలిగించాలని  కోరారు.
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై అనుచిత, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో అరెస్టయిన ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు నాంపల్లి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది
టీడీపీ కేంద్ర కార్యాలయంలో రెండో రోజు నిర్వహిస్తున్న లీడర్‌షిప్ కాంక్లేవ్‌లో పొలిటికల్ కమ్యూనికేషన్ అండ్ పబ్లిక్ ఓరియంటేషన్ అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ మాట్లాడారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.