ఐఏఎస్ టాపర్ సెకండ్ మ్యారేజ్.. మతాంతర వివాహం ఫ్లాప్.. 13ఏళ్ల సీనియర్‌తో మళ్లీ పెళ్లి
Publish Date:Mar 29, 2022
Advertisement
ఐఏఎస్ అధికారులు ప్రేమించుకోరా? ఐఏఎస్‌లు మతాంతర వివాహం చేసుకోరా? ఐఏఎస్ దంపతులు గొడవలు పడరా? ఐఏఎస్‌లు విడాకులు తీసుకోరా? ఐఏఎస్ అయితే మళ్లీ పెళ్లి చేసుకోరా? ఐఏఎస్ అయినంత మాత్రాన తనకంటే 13 ఏళ్ల పెద్దవారిని పెళ్లి చేసుకోరా? అవుతాయి. ఇవన్నీ జరుగుతాయి. జరిగాయి కూడా. అదికూడా ఒక్క ఐఏఎస్ అధికారిణి జీవితంలోనే ఇవన్నీ జరగడం మరింత ఆసక్తికరం. అందులోనూ ఆమె ఒకప్పటి సివిల్స్ టాపర్ కావడం విశేషం. ఆమే టీనా దాబి. ఒకప్పుడు తన మతం కాకున్నా.. బ్యాచ్‌మేట్‌ను లవ్ మ్యారేజ్ చేసుకొని సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలివగా.. రెండేళ్లలోనే అతనితో విడాకులు తీసుకొని మరింత షాక్ ఇచ్చారు. ఇప్పుడు తనకంటే 13 ఏళ్లు పెద్దవాడైన, సీనియర్ ఐఏఎస్‌తో సెకండ్ మ్యారేజ్‌కు రెడీ అవుతూ మీడియాలో వైరల్ అవుతున్నారు. ఢిల్లీలోని లేడీ శ్రీ రామ్ కాలేజీలో గ్రాడ్యుయేట్ అయిన టీనా దబీ.. 2015లో సివిల్స్ టాపర్‌గా ఆమె పేరు మారుమోగిపోయింది. మొదటి ప్రయత్నంలోనే ఫస్ట్ ర్యాంక్ సాధించిన తొలి దళిత యువతిగా సత్తా చాటారు. సివిల్స్ సెకండ్ ర్యాంకర్‌గా నిలిచిన కశ్మీర్‌కు చెందిన అధర్ అమిర్ ఖాన్‌తో.. ట్రైనింగ్ సమయంలో ప్రేమలో పడింది. వాళ్లిద్దరూ 2018లో పెళ్లి చేసుకున్నారు. హిందూ-ముస్లిం.. మతాంతర వివాహం కావడంతో అప్పట్లో వారి పెళ్లి అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ జంట పెళ్లికి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, అప్పటి కేంద్రమంత్రులు, లోక్‌సభ మాజీ స్పీకర్ సుమిత్రా మహజన్ వంటి ప్రముఖులు హాజరయ్యారు. అయితే, ఎంత ఐఏఎస్‌లు అయితేనేం.. పెళ్లి చేసుకున్న రెండేళ్లకే ఆ జంట విడిపోయింది. మనస్పర్థలతో గతేడాది వాళ్లిద్దరూ విడాకులు తీసుకున్నారు. సింగిల్‌గా మారిన టీనా దాబి.. మళ్లీ పెళ్లి చేసుకోబోతున్నారు. తన కంటే రెండేళ్లు సీనియర్ అయిన 2013 బ్యాచ్ ఐఏఎస్ అధికారి ప్రదీప్ గవాండేను టీనా త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారు. కేడర్‌లో రెండేళ్లే సీనియర్ అయినా కూడా.. వయసులో మాత్రం ఆమె కంటే అతను 13 ఏళ్లు పెద్దవాడు కావడం ఆసక్తికరం. వీరిద్దరూ ప్రస్తుతం రాజస్థాన్ క్యాడర్‌లో విధులు నిర్వహిస్తున్నారు. మహారాష్ట్రకు చెందిన ప్రదీప్.. రాజస్థాన్‌లో పురాతత్వ, మ్యూజియం శాఖకు డైరెక్టర్‌గా ఉన్నారు. ఇటీవలే టీనా-ప్రదీప్ నిశ్చితార్థం జరిగింది. ఆ ఫొటోలను టీనా ఇన్‌స్టాలో షేర్ చేశారు. ఆమె ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను 14 లక్షల మంది ఫాలో అవుతుండటంతో ఆ ఫోటోలు బాగా వైరల్ అవుతున్నాయి.
http://www.teluguone.com/news/content/ias-tina-dabi-second-marriage-25-133663.html





