సీనియర్ అధికారులపై నిఘా! సీఎస్ పై తిరుగుబాటు మొదలైందా? 

Publish Date:Dec 18, 2020

Advertisement

తెలంగాణ సచివాలయంలో కోల్డ్ వార్ నడుస్తోందా? ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో సీనియర్ అధికారులు ఢీ అంటే ఢీ అంటున్నారా? ఐఏఎస్ ల మధ్య కొట్లాటతో పాలన పడకేసిందా? తెలంగాణ సచివాలయంలో జరుగుతున్న పరిణామాలతో అందరికి ఇవే అనుమానాలు వస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ పాలనకు కేంద్రం సచివాలయం. అలాంటి సచివాలయంలో ప్రస్తుతం యుద్ధ వాతావరణం కనిపిస్తోందని చెబుతున్నారు. సీఎస్ సోమేష్ కుమార్ కు సీనియర్ ఐఏఎస్ లకు మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొందని తెలుస్తోంది.  సీఎం కేసీఆర్ సచివాలయం రాక పోవడంతో సీఎస్ ఇష్టారీతిన వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. సీఎం తరహాలోనే సీఎస్ సచివాలయంలో సమాంతర వ్యవస్థను సాగిస్తున్నట్లు చెబుతున్నారు. ఇది నచ్చని కొందరు అధికారులు ఆయన్ను ప్రశ్నించారని, దీంతో విభేదాలు పెరిగిపోయాయని తెలుస్తోంది. 

 

సీనియర్లు అధికారులు తనకు సహకరించకపోవడంతో వారిపై సీఎస్ సోమేష్ కుమార్ నిఘా పెట్టారనే చర్చ జరుగుతోంది. సీనియర్ అధికారుల  కదలికలను పసిగట్టే బాధ్యత తనకు అనుకూలంగా ఉండే అధికారులకు సీఎస్  అప్పగించారని సమాచారం. ఈ విషయం తెలిసి  ఇప్పుడు సచివాలయంలో చాలా మంది అధికారులు ప్రైవేట్​ అంశాలను కూడా ఫోన్లలో మాట్లాడుకోవడం లేదని చెబుతున్నారు. నిఘా ఉందని తెలియడంతో ఉన్నతాధికారులు సీఎస్​ తో బహిరంగంగానే వివాదాలకు దిగుతున్నారట. సచివాలయంలో ప్రస్తుతం అందరి నోటా ఇదే మాట వినిపిస్తోంది. సీఎస్​ కాకముందు తాము చూసిన సోమేశ్​ కుమార్​కు, ఇప్పటి సోమేశ్ కుమార్‌కు చాలా వ్యత్యాసం ఉందని బహిరంగంగానే చర్చించుకుంటున్నారట అధికారులు. 
 

సీఎస్ సోమేష్ కుమార్ తీరుపై పై చాలా మంది ఐఏఎస్ అధికారులు ఆగ్రహంగా ఉన్నట్లు ఎప్పటి నుంచో ప్రచారం ఉంది. చిన్న చిన్న అంశాలు, సాధారణ, పరిపాలనా విషయాలలోనూ ఆయన​ జోక్యం పెరిగిపోయిందని  గతంలో కొందరు అధికారులు సీఎం కేసీఆర్ కు ఫిర్యాదు చేశారు. కలెక్టర్లు కూడా సీఎస్​పై ఆగ్రహంతో ఉన్నట్లు చెబుతున్నారు. ఇటీవల కొందరు ఐఏఎస్​ల వ్యవహారంలో సీఎస్​ తీసుకున్న నిర్ణయాలు వివాదాస్పదమయ్యాయి. రిజిస్ట్రేషన్ల​ శాఖలో సీఎస్​పై వ్యతిరేకత తారస్థాయికి చేరిందని తెలుస్తోంది. ఆ శాఖలోని చిన్న ఉద్యోగి నుంచి మొదలుకుని ఉన్నతాధికారుల వరకు మండిపడుతున్నారు. తమ శాఖను సీఎం ముందు పని లేని విభాగంగా మార్చేందుకు సీఎస్​ ప్రయత్నాలు చేశారనే కోపం వారిలో ఉంది. సీఎస్​ నివేదిక ఆధారంగానే సీఎం కూడా రిజిస్ట్రేషన్​ శాఖను పూర్తిగా రెవెన్యూలో విలీనం చేసేందుకు సిద్ధమయ్యారని వాళ్లు భావిస్తున్నారట. 

 

నిజానికి సోమేశ్ ఏపీ కేడర్ అయినప్పటికీ  ఇక్కడే విధులు నిర్వర్తిస్తున్నారు. ఆయన కన్నా సీనియర్లు రాష్ట్రంలో చాలా మంది ఉన్నా నమ్మకంతో సీఎస్ బాధ్యతలను ఆయనకు అప్పగించారు కేసీఆర్. సోమేష్ కుమార్ తీసుకున్న నిర్ణయాలు చాలా వరకు కలిసి రాలేదు. ప్రభుత్వానికి కోర్టుల్లో ఎదురుదెబ్బలు తగిలాయి. ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన ధరణి, ఎల్​ఆర్​ఎస్​ వంటి స్కీంలు జనాగ్రహానికి కారణమయ్యాయి. ఈ రెండు పథకాల ప్రతిపాదనలు సోమేష్ కుమార్ తెచ్చినవే.  జీహెచ్​ఎంసీ ఎన్నికలలో అధికార పార్టీ ఓటమికి ఇది కూడా కారణమంటూ సీఎం కేసీఆర్​కు నివేదిక అందిందని, సీఎస్ ను కేసీఆర్ సీరియస్​గా మందలించినట్లు ప్రచారం జరిగింది. సీఎస్ ను మార్చతారని కూడా చర్చ జరిగింది.  అయితే తనకు వ్యతిరేకంగా ఉన్న వర్గమే ఇలాంటి ప్రచారం చేసిందని సోమేష్ కుమార్ భావిస్తున్నారని చెబుతున్నారు.

By
en-us Political News

  
ఇటీవలి కాలంలో ఆయన బీజేపీకి దూరంగా జరుగుతున్నారనీ, అదే సమయంలో ఇండియా కూటమికి దగ్గరౌతున్నారనీ వార్తలు వినవస్తున్న నేపథ్యంలో... కేంద్రంలోని ఎన్డీయే కూటమి పార్లమెంటులో డీ లిమిటేషన్ బిల్లును ప్రవేశపెట్టడానికి సమాయత్తమైన తరుణంలో ఆయన మద్దతు ఇస్తారా ఇవ్వరా అన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది.
తెలుగు వన్ న్యూస్ నిర్వహించిన ప్రత్యేక ముఖాముఖి కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్ డీఎన్ ప్రసాద్ అడిగిన ప్రశ్నలకు టీపీసీసీ చీఫ్ పలు కీలక అంశాలపై సమాధానాలిచ్చారు.
జగన్ ఆలయ సంరక్షకుడిగా ఎప్పుడు మారారు అంటూ నెటిజనులు సెటైర్లు గుప్పిస్తున్నారు.  జగన్ హయాంలో ఆత్రేయపురం రథం దగ్ధం సహా పలు ఆలయాలలో జరిగిన అరాచకాలను గుర్తు చేస్తూ నిలదీస్తున్నారు. 
నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ బిల్లు వంటి కీలక అంశాలు తెరమీదకు వచ్చిన నేపథ్యంలో శరద్ పవార్ పొలిటికల్ యాక్టివిటీస్ ప్రాధాన్యత సంతరించుకున్నాయి. లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన తమ రాజకీయ భవిష్యత్తుపై ఎలాంటి ప్రభావం చూపుతుందనే ఆందోళన ఇప్పటికే పలువురు నేతలలో కనిపిస్తోంది.
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (TPCC) అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తనదైన శైలిలో చేసిన సంచలన వ్యాఖ్యలతో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు తెరలేపారు.
దక్షిణాది సినిమా రంగంలో సినీ తారలు రాజకీయాల్లోకి రావడం, అభిమాన సంఘాలు సేవా కార్యక్రమాలు చేపట్టడం   కొత్తేమీ కాదు. ముఖ్యంగా తమిళనాడు రాజకీయాల్లో సినీ నేపథ్యం, ప్రజాకర్షణ కలిగిన వ్యక్తుల చుట్టూ చర్చలు ఎప్పుడూ ప్రత్యేక దృష్టిని ఆకర్షిస్తుంటాయి. ఈ నేపథ్యంలో త్రిష అభిమానుల బృందం చేపట్టిన ఈ అడుగు సర్వత్రా ఆసక్తిని చూరగొంది.
కరీంనగర్ గడ్డపై బీజేపీ కాషాయ దళం కదం తొక్కింది.
ఈ చర్చల్లో భాగంగానే.. రేవంత్ కేబినెట్ లో ఇప్పుడు ఉపముఖ్యమంత్రిగా ఉన్న భట్టి విక్రమార్క కు తోడుగా మరో ఉపముఖ్యమంత్రిని కూడా నియమించే అవకాశాలున్నాయన్న చర్చ జోరందుకుంది. 
రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత   ప్రతి జిల్లాలోనూ పెట్టుబడులు, పరిశ్రమలు వస్తున్నాయని ఆయన సవివరంగా పేర్కొన్నారు. ఈ విషయంలో ఎక్కడైనా, ఎప్పుడైనా చర్చకు సిద్ధమని సవాల్ చేశారు.
పంచాయతీ ఎన్నికలకు పొత్త ధర్మం వర్తించదని ఆ ప్రకటన పేర్కొంది.   గ్రామాభివృద్ధి, స్వేచ్ఛాయుత పాలన, మహాత్మాగాంధీ ఆశయాల సాకారం గ్రామీణ స్థాయి నుంచే సాధ్యమవుతాయని పేర్కొంది.   
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేయడం వల్లే గత అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి రాగలిగిందని బి.ఎం. సందీప్ కుమార్ పేర్కొన్నారు.
సాధారణంగా   నాయకులు, తాము ప్రజలకు చేయగల పనుల విషయంలో వాస్తవికత వదిలేసి అతిశయోక్తులతో, అతి అంచనాలతో గొప్పలు చెప్పుకుంటుంటారు.
మొత్తం 28 జడ్పీ అధ్యక్ష, ఉపాధ్యక్ష స్థానాలకు జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి 27 చోట్ల విజయం సాధించి తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించింది.  
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.