విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని కూల్చివేతలకు హైడ్రా వెనకడగు
Publish Date:Aug 28, 2024
Advertisement
సలకం చెరువు ఎఫ్ టి ఎల్ పరిధిలో ఉండటంతో ఫాతిమా కాలేజి కూల్చివేతకు రంగం సిద్దమైనప్పటికీ హైడ్రా వెనకడుగు వేసినట్టు తెలుస్తోంది. చెరువు మధ్యలో ఫామిమా కాలేజి ఉందని బిజెపి కార్పోరేటర్లు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. నాగార్జున ఎన్ కన్వెన్షన్ సెంటర్ ను కూల్చి వేయడంతో రంగనాథ్ మీద నమ్మం పెరిగింది. ఆ నమ్మకంతోనే ఒవైసీ బ్రదర్స్ పేరిట ఉన్న ఫాతిమా కాలేజిని కూల్చేయాలని బిజెపి కార్పోరేటర్లు డిమాండ్ చేస్తున్నారు. నిన్నటివరకు కాన్ఫిడెంట్ గా ఉండే రంగనాథ్ ఇవ్వాళ మాత్రం వెనకడుగు వేసినట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కమీషనర్ రంగనాథ్ కు స్వేచ్చ ఇచ్చినప్పటికీ ఒవైసీ కాలేజిని కూల్చడానికి హైడ్రా దూకుడు తగ్గింది. వందలాది మంది విద్యార్థులు చదువుకుంటున్న ఈ కాలేజి కూల్చివేతకు ఆచి తూచి వ్యవహరించాలని రంగనాథ్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. మల్లారెడ్డి కాలేజి, పల్లె రాజేశ్వర్ రెడ్డి కాలేజి విషయంలో కూడా విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని కూల్చలేమని హైడ్రా చెబుతుంది. ఎఫ్ టిఎల్, బఫర్ జోన్లలో ఉంటే తమంతామే కూల్చేసుకోవాలని, ఒకవేళ అలా కూల్చని పక్షంలో తాము కూలుస్తామన్నారు. ఫాతిమా కాలేజి విషయంలో కూడా ఇదే వైఖరి ఉంటుందని రంగనాథ్ చెబుతున్నారు కాంగ్రెస్ అధిష్టానం నుంచి రేవంత్ రెడ్డికి ఫోన్ రావడంతో ఫాతిమా కాలేజి విషయంలో ఆచితూచి వ్యవహరించాలని కాంగ్రెస్ సర్కార్ భావిస్తోంది అని సమాచారం. సీనియర్ నేత వి. హన్మంత్ రావు కూడా ఫాతిమా కాలేజి చెరువులో ఉందని వస్తున్న వార్తలను కొట్టి పారేశారు. కర్ర విరగదు పాము చావదు అనే టైపులో సమాధానమిచ్చారు. నేను సలకం చెరువులోకి వెళ్లి చూడలేదు. ఇరిగేషన్ శాఖ నివేదిక నా దగ్గర లేదు. ఆక్రమణ జరిగిందని నేను ఎలా చెప్పగలను. అందరి మాదిరిగా నేను మాట్లాడలేను అని అన్నారు.
http://www.teluguone.com/news/content/hydra-will-be-behind-the-demolition-of-owaisi-college-25-183779.html





