ఐటీ కారిడార్‌లో వేయి కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని కాపాడిన హైడ్రా

Publish Date:Jun 25, 2026

Advertisement

రంగారెడ్డి జిల్లా శేర్లింగంపల్లి మండలం  ఖానామెట్ విలేజ్ సర్వే నంబర్ 42లో ఉన్న సుమారు 5 ఎకరాల ప్రభుత్వ భూమిని హైడ్రా ఆక్రమణదారుల నుంచి రక్షించింది. ఈ భూమి మెటల్ చార్మినార్ నుండి హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్ కు వెళ్లే ప్రధాన మార్గంలో, ఐటీ కారిడార్‌లో ఉండటంతో దీని విలువ దాదాపు రూ వేయి కోట్ల రూపాయల వరకూ ఉంటుందన్నది అధికారుల అంచనా.

 కొందరు వ్యక్తులు అత్యంత విలువైన ఈ భూమిని కాజేయాలని ప్రయత్నిస్తున్నారు. తమ సొంత ఆస్తిగా చూపిస్తూ ఎన్నో సంవత్సరాలుగా ఇతరులను అక్కడికి రానీయకుండా అడ్డుకుంటున్నట్లు రెవెన్యూ శాఖ గుర్తించింది. అంతే కాకుండా కబ్జాదారులు ఆ భూమిలో రెండు తాత్కాలిక షెడ్లు నిర్మించడంతో పాటు ఒక గదిని కూడా ఏర్పాటు చేశారు. అంతే కాకుండా మొత్తం 5 ఎకరాల భూమి చుట్టూ రేకుల షీట్లతో ప్రహరీ   పనులు  చేపట్టారు.

దీంతో  రెవెన్యూ   అధికారులు హైడ్రాను ఆశ్రయించారు. శేరిలింగంపల్లి రెవెన్యూ అధికారుల విజ్ఞప్తి మేరకు హైడ్రా బృందాలు   రంగంలోకి దిగి సంఘటనా స్థలంలో అక్రమంగా నిర్మించిన రెండు షెడ్లు, గదిని కూల్చివేయడంతో పాటు ఆక్రమణదారులు ఏర్పాటు చేసిన ఫెన్సింగ్‌ను పూర్తిగా తొలగించారు. ఆక్రమణలను పూర్తిగా తొలగించిన అనంతరం, భవిష్యత్తులో మళ్లీ ఎలాంటి ఆక్రమణలు జరగకుండా ఉండేందుకు హైడ్రా స్వయంగా ఆ 5 ఎకరాల ప్రభుత్వ భూమి చుట్టూ కొత్త ఫెన్సింగ్ ఏర్పాటు చేసింది. అలాగే ఇది ప్రభుత్వ భూమి అని స్పష్టంగా తెలియజేస్తూ హెచ్చరిక బోర్డులను కూడా ఏర్పాటు చేసింది. ఈ చర్యతో హైదరాబాద్ ఐటీ కారిడార్‌లో అత్యంత విలువైన ప్రభుత్వ భూమిని కాపాడటంలో హైడ్రా కీలక చర్య తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.

By
en-us Political News

  
ఫిఫా వరల్డ్ కప్ 2026 లో ఉరుగ్వేపై 1 0 తేడాతో స్పెయిన్ ఘన విజయం. అలెక్స్ బేనా సంచలన గోల్‌తో స్పెయిన్ నాకౌట్ దశకు చేరుకోగా, రెండు సార్లు ఛాంపియన్ ఉరుగ్వే టోర్నమెంట్ నుండి నిష్క్రమించింది.
చిన్న పిల్లల సురక్షిత టీవీ వీక్షణ కోసం హైసెన్స్ సరికొత్త సేఫ్ స్ట్రీమింగ్ మ్యాజిక్ రిమోట్‌ను పరిచయం చేసింది. 50,000 పైగా చైల్డ్-సేఫ్ ఎపిసోడ్‌లతో కూడిన ఈ సరికొత్త టెక్నాలజీ వివరాలు ఇవే!
మేడ్చల్–మల్కాజగిరి జిల్లా బాలానగర్ మండలం హస్మత్‌పేటలో శనివారం హైడ్రా మరోసారి భారీ ఆపరేషన్ చేపట్టి కబ్జాదారులకు షాక్ ఇచ్చింది.
ఐర్లాండ్ టీ20 సిరీస్‌లో యంగ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ అరంగేట్రం ఆలస్యం కావడంపై రవిచంద్రన్ అశ్విన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సచిన్ టెండూల్కర్‌తో పోలుస్తూ టీమ్ మేనేజ్‌మెంట్ నిర్ణయాన్ని ఎందుకు సమర్థించారో పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
సరికొత్త GMKtec K13 మినీ పీసీపై అమెజాన్ ప్రైమ్ డే సేల్‌లో ఏకంగా 43 శాతం భారీ డిస్కౌంట్ లభిస్తోంది. ఇంటెల్ అల్ట్రా 7 ప్రాసెసర్, 115 TOPS AI సామర్థ్యం మరియు 16TB వరకు పెంచుకోదగిన స్టోరేజ్ ఫీచర్లతో వచ్చిన ఈ పీసీ పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
సరికొత్త ఫీచర్లు, స్మార్ట్ డిస్‌ప్లే కేస్ మరియు 60 గంటల భారీ బ్యాటరీ లైఫ్‌తో విడుదలైన క్లియర్ ఆర్క్ 5 ఓపెన్ ఇయర్‌బడ్స్ పూర్తి రివ్యూ, ధర మరియు స్పెసిఫికేషన్స్ ఇక్కడ చూడండి.
ఫిఫా వరల్డ్ కప్ 2026లో కుండపోత వర్షంలోనూ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంది నెదర్లాండ్స్. గ్రూప్ఎఫ్ చివరి లీగ్ మ్యాచ్‌లో ట్యునీషియాపై 3 1 తేడాతో గెలిచి నాకౌట్ చేరడంతో పాటు గ్రూప్ టాపర్‌గా నిలిచిన డచ్ జట్టు పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
ఐర్లాండ్‌తో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో భారత యువ బ్యాటర్ అభిషేక్ శర్మ 19 బంతుల్లోనే హాఫ్ సెంచరీ బాది సరికొత్త ప్రపంచ రికార్డు సృష్టించాడు. యువరాజ్ సింగ్, డేవిడ్ వార్నర్ వంటి దిగ్గజాల రికార్డులను బ్రేక్ చేసిన పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
ఫిఫా వరల్డ్ కప్ 2026 గ్రూప్ హెచ్ సంచలన మ్యాచ్‌లో ఉరుగ్వేను 1-0తో ఓడించి స్పెయిన్ నాకౌట్ చేరింది. అలెక్స్ బేనా సంచలన గోల్ వివరాలు, మ్యాచ్ హైలైట్స్ ఇక్కడ చూడండి.
అంతర్జాతీయ MSME దినోత్సవం 2026 సందర్భంగా చిన్న వ్యాపారులకు ఇన్‌స్టంట్ లోన్లు, సబ్సిడీలు మరియు రూ. 5 కోట్ల వరకు తాకట్టు లేని రుణాల వివరాలు.
నైరుతి రుతుపవనాల ప్రభావంతో తెలంగాణలో రానున్న ఏడు రోజుల పాటు భారీ వర్షాలు
తెలంగాణలోని నల్గొండ జిల్లా కేంద్రంలో ఇటీవల సంచలనం సృష్టించిన ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతి కేసు మిస్టరీ
ప్రముఖ కమెడియన్ లారీ డేవిడ్ సరికొత్త అమెరికన్ హిస్టరీ కామెడీ షో లైఫ్, లారీ అండ్ ది పర్స్యూట్ ఆఫ్ అన్‌హ్యాపినెస్ విశేషాలు మరియు దీనిని ఆన్‌లైన్‌లో ఎలా చూడాలో ఇక్కడ తెలుసుకోండి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.