హైడ్రా కమిషనర్ రంగనాథ్ సంతకం ఫోర్జరీతో నకిలీ ఎన్ఓసీలు.!

Publish Date:Aug 5, 2026

Advertisement

హైడ్రా కమిషనర్‌ ఏవీ రంగనాథ్‌ సంతకాన్ని ఫోర్జరీ చేసి, నకిలీ ఫైర్‌ ఎన్‌ఓసీలను సృష్టించి ఇంటర్మీడియట్‌ బోర్డుకు సమర్పించిన వ్యవహారం కలకలం రేపుతోంది. మొత్తం 76 జూనియర్‌ కాలేజీలు ఫైర్‌ ఎన్‌ఓసీలను సమర్పించగా, వాటిలో ఎనిమిది కాలేజీలు నకిలీ, ఫోర్జ్డ్‌ ఎన్‌ఓసీలను సమర్పించినట్లు అధికారులు గుర్తించారు. ఈ వ్యవహారంపై హైడ్రా అడిషనల్‌ డైరెక్టర్‌ ఫిర్యాదు మేరకు లేక్‌ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది.

ఫైర్‌ ఎన్‌ఓసీలు జారీ చేసే అధికారం హైడ్రాకు ఉన్నప్పటికీ..  సంబంధిత కాలేజీలకు హైడ్రా నుంచి ఎలాంటి ఎన్‌ఓసీలు జారీ కాలేదని అధికారులు గుర్తించారు.  హైడ్రా పేరుతో నకిలీ పత్రాలను తయారు చేసి, వాటిపై కమిషనర్‌ రంగనాథ్‌ సంతకాన్ని ఫోర్జరీ చేసి ఇంటర్మీడియట్‌ బోర్డుకు సమర్పించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. పత్రాల పరిశీలన సందర్భంగా ఈ నకిలీ ఎన్‌ఓసీల వ్యవహారం బయటపడినట్లు సమాచారం.

నకిలీ ఎన్‌ఓసీలు సమర్పించినట్లు గుర్తించిన కాలేజీల్లో బర్కత్‌పురలోని హైందవి జూనియర్‌ కాలేజీ, ఎస్‌ఆర్‌ నగర్‌లోని రెజొనెన్స్‌ జూనియర్‌ కాలేజీ, మెహదీపట్నంలోని ప్రియాంక జూనియర్‌ కాలేజీ ఫర్‌ గర్ల్స్‌, విద్యానగర్‌లోని మదర్స్‌ గర్ల్స్‌ జూనియర్‌ కాలేజీ, చాంద్రాయణగుట్టలోని శ్రీ చంద్ర జూనియర్‌ కాలేజీ, చిక్కడపల్లిలోని న్యూ ఎరా జూనియర్‌ కాలేజీ, శివరాంపల్లిలోని షాహీన్‌ జూనియర్‌ కాలేజీ, సంగారెడ్డి జిల్లా ఆర్‌సీ పురం పరిధిలోని తెల్లాపూర్‌లో ఉన్న వశిష్ట జూనియర్‌ కాలేజీలు ఉన్నాయి. 

ఈ వ్యవహారంపై హైడ్రా అధికారులు లేక్‌ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నకిలీ ఎన్‌ఓసీలను ఎవరు రూపొందించారు, వాటిపై కమిషనర్‌ సంతకాన్ని ఎలా ఫోర్జరీ చేశారు, కాలేజీల యాజమాన్యాలకు ఈ వ్యవహారంలో ఎంతవరకు సంబంధం ఉంది, నకిలీ పత్రాలను ఇంటర్మీడియట్‌ బోర్డుకు ఎవరు సమర్పించారు అనే అంశాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నకిలీ ఫైర్‌ ఎన్‌ఓసీలు సమర్పించినట్లు గుర్తించిన ఈ ఎనిమిది కాలేజీల గుర్తింపును రద్దు చేయాలని సంబంధిత అధికారులను హైడ్రా కోరినట్లు సమాచారం.  

hydra commissioner sign Forgery, Fak, Nocs, Lake, police, case

By
en-us Political News

  
విశాఖ ఎకనమిక్ రీజియన్ సమగ్రాభివృద్ధికి సూక్ష్మ స్థాయి ప్రణాళికలను రూపొందించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు.
విశాఖ ఎకనమిక్ రీజియన్ సమగ్రాభివృద్ధికి సూక్ష్మ స్థాయి ప్రణాళికలను రూపొందించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు.
దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రతిరోజూ అత్యంత బిజీ షెడ్యూల్‌తో గడుపుతుంటారు.
పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ఆగస్టు 16వ తేదీ నుంచి 18వ తేదీ వరకు, మొత్తం 3 రోజుల పాటు పార్లమెంట్‌ను ప్రత్యేకంగా సమావేశపరచాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది
సెప్టెంబర్ 18లోగా పాస్‌పోర్ట్ ఇవ్వాలి.. కోర్టు ఆదేశాలు..!
డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో ప్రత్యక్షమైన ఈ కంటెంట్‌ను నీచమైన, నిందాపూర్వకమైనదిగా  పేర్కొంది. ఇలాంటి హానికరమైన, అసత్యపూరితమైన పోస్టులకు బహిరంగ వేదికలలో ఏమాత్రం స్థానం ఉండకూడదని స్పష్టం చేసింది.
దిల్‌సుఖ్‌నగర్‌లో తెలంగాణ టైగర్ రేవంత్ రెడ్డి కారు పేరుతో కలకలం..!
వాహన యజమానులు   సామాజిక, చట్టబద్ధమైన బాధ్యతను గుర్తించేలా చేయడం,  దురదృష్టవశాత్తు రహదారి ప్రమాదాలు జరిగిన సమయంలో బాధితులకు తగిన ఆర్థిక పరిహారం సకాలంలో అందేలా చూడటమే ఈ ప్రతిపాదిత మార్గదర్శకాల వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశమని పేర్కొంది. 
మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు తనపై వస్తున్న ఆరోపణలను తీవ్రంగా ఖండించారు.
భారత క్రీడారంగంలో స్వర్ణాక్షరాలతో లిఖించదగిన అద్భుతమైన ఘట్టం సాగర తీర నగరం విశాఖపట్నంలో ఆవిష్కృతమైంది.
ట్రైనీ మహిళా అధికారిపై లైంగిక వేధింపులకు పాల్పడిన కేసులో అరెస్టయి ప్రస్తుతం చంచల్‌గూడా జైలులో ఉన్న ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి విచారణలో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి
ఇప్పటివరకు పోలీస్‌ అత్యవసర సేవల కోసం వినియోగిస్తున్న డయల్‌ 100 స్థానంలో 112 నంబర్‌ ను అమలు చేయనున్నారు.  పోలీస్‌, అంబు లెన్స్‌, అగ్నిమాపక సేవల ను ఒకే ఎమర్జెన్సీ నంబర్‌ పరిధిలోకి తీసుకురావడం ఈ కొత్త వ్యవస్థలో  ప్రత్యేకత. 112కు ఫోన్‌ చేస్తే కేవలం పోలీస్‌ సహాయం మాత్రమే కాదు.. పరిస్థితిని బట్టి అంబులెన్స్‌, ఫైర్‌ సర్వీసులను కూడా సమన్వయం చేసేలా వ్యవస్థను రూపొందించారు. 
గతంలో వైజాగ్ మధురవాడలోని ఐటీ సెజ్ హిల్ నెంబర్ 3లో ఐబీఎం క్యాంపస్ నడిచేది. అయితే నాటి పరిస్థితుల కారణంగా కార్యకలాపాలు నిలిచిపోయిన నేపథ్యంలో.. ఇప్పుడు ప్రభుత్వం తీసుకుంటున్న ప్రత్యేక చొరవతో ఐబీఎం తిరిగి విశాఖకు వచ్చింది. ఇది నిస్సందేహంగా మంత్రి నారాలోకేష్ విజయమని పరిశీలకులు అంటున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.