హైడ్రా కమిషనర్ కు తెలంగాణ హైకోర్టు బిగ్ షాక్.. సుమోటోగా కోర్టు ధిక్కరణ చర్యలు.!

Publish Date:Aug 12, 2026

Advertisement

హైడ్రా కమిషనర్ రంగనాథ్ కు తెలంగాణ హైకోర్టు బిగ్ షాక్ ఇచ్చింది.   కోర్టు స్టే   అమల్లో ఉన్నప్పటికీ ప్రైవేటు ఆస్తుల డిమోలిషన్ పై అసంతృప్తి వ్యక్తం చేసిన హైకోర్టు ధర్మాసనం..  ఆయనపై సుమోటోగా కోర్టు ధిక్కరణ చర్యలు ప్రారంభించింది. ఈ వ్యవహారంలో పూర్తి స్థాయి వివరణ ఇవ్వాల్సిందిగా ఆదేశిస్తూ కమిషనర్ రంగనాథ్‌కు  నోటీసులు జారీ చేసింది.  మల్కాజిగిరి మండలంలో ఉన్న వాణి కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ స్థలాల విషయంలో గతంలోనే న్యాయస్థానం స్టే మంజూరు చేసింది. అయినప్పటికీ.. ఆ స్టే ఉత్తర్వులను బేఖాతరు చేస్తూ.. కూల్చివేతలు చేపట్టారంటూ దాఖలైన పిటిషన్‌పై జస్టిస్ ఎన్వీ శ్రవణ్‌కుమార్ నేతృత్వంలోని హైకోర్టు ధర్మాసనం  విచారణ చేపట్టింది. ఈ విచారణ సందర్భంగా కేసు తీవ్రతను పరిగణనలోకి తీసుకున్న కోర్టు..  సంబంధిత అధికారులను వ్యక్తిగతంగా హాజరుకావాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.

ధర్మాసనం ఆదేశాల మేరకు మేడ్చల్ జిల్లా కలెక్టర్‌,  మల్కాజిగిరి, తిరుమలగిరి మండలాల తహసీల్దార్లు కోర్టుకు   హాజరయ్యారు. విచారణ సమయంలో జిల్లా కలెక్టర్ స్పందిస్తూ కీలక విషయాలను న్యాయస్థానానికి వివరించారు. మేడ్చల్ జిల్లా పరిధిలో జరిగిన సదరు కూల్చివేతలకు రెవెన్యూ యంత్రాంగం ఎలాంటి అనుమతులు,  ఉత్తర్వులు ఇవ్వలేదనీ,   తమ శాఖ సమ్మతి లేకుండానే జిల్లా వ్యాప్తంగా దాదాపు నలభై ప్రదేశాల్లో హైడ్రా బలగాలు కూల్చివేతలు సాగించాయని కలెక్టర్ హైకోర్టు ధర్మాసనం ముందు వెల్లడించారు. 

దీనిపై హైడ్రా తరఫు న్యాయవాది స్పందిస్తూ..  ప్రభుత్వ భూములను, చెరువులను కాపాడటమే లక్ష్యంగా రెవెన్యూ శాఖ అందించిన ప్రాథమిక సమాచారం, జీఎల్ఆర్ సూచనల మేరకే చర్యలు తీసుకున్నామన్నారు. అయితే ఈ వాదనలతో ధర్మాసనం  ఏకీభవించలేదు. క్షేత్రస్థాయి రికార్డులను, న్యాయపరమైన ఉత్తర్వులను సమగ్రంగా పరిశీలించకుండా ఏకపక్షంగా కూల్చివేతలు చేపట్టడం రాజ్యాంగ విరుద్ధమని, అది ఏమాత్రం ఆమోదయోగ్యం కాదనీ పేర్కొంది.   ఈ సంఘటనలను తీవ్రంగా పరిగణించిన హై కోర్టు.. భవిష్యత్తులో ఇలాంటి పొరపాట్లు పునరావృతం కాకుండా ఉండటానికి  మార్గదర్శకాలను జారీ చేసింది. హైడ్రా పరిధిలోకి వచ్చే అన్ని జిల్లాల కలెక్టర్లు తమ తమ జిల్లాల్లో  అమల్లో ఉన్న కోర్టు స్టే ఉత్తర్వుల సమగ్ర వివరాలను తక్షణమే హైడ్రా యంత్రాంగానికి లేఖ ద్వారా తెలియజేయాలని ఆదేశించింది. అలాగే హైడ్రా కమిషనర్ కు కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేసి.. రెండు వారాల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశిస్తూ..ఈ కేసు తదుపరి విచారణను ఈ నెల 27కి వాయిదా వేసింది.  

HYDRA Commissioner Ranganath, Telangana High Court, Contempt of court notices, Illegal demolitions, Medchal Collector  report

By
en-us Political News

  
ఇటీవలే   బిడ్డకు జన్మనిచ్చిన కరోలిన్ లెవిట్..  తన పిల్లలు కుటుంబ సభ్యులతోనూ ఎక్కువ సమయం గడిపేందుకు ప్రెస్ సెక్రటరీ పదవి నుంచి వైదొలగాలని స్వచ్ఛందంగా నిర్ణయించుకున్నట్లు ఆ వర్గాలు తెలిపాయి.
వెలుగును చంద్రుడు పూర్తిగా అడ్డుకోవడంతో భూమిపైకి సూర్యకాంతి కనిపించకుండా పోయింది.  గ్రీన్‌లాండ్, ఐస్‌లాండ్, ఉత్తర రష్యా, స్పెయిన్, పోర్చుగల్ దేశాల్లో  ప్రాంతాల్లో ఈ సంపూర్ణ సూర్యగ్రహణం స్పష్టంగా దర్శనమిచ్చింది. ఈ ప్రాంతాల్లో ఏకంగా 2 నిమిషాల 18 సెకన్ల పాటు   అక్కడి ప్రజలు పట్టపగలే చిమ్మ చీకట్లు అలుముకున్న అద్భుతాన్ని ఆస్వాదించారు.  
అమెరికా సైనిక సామర్థ్యాలను దగ్గరుండి పరిశీలించే అవకాశం దక్కిందన్న ఆయన తాము ఊహించిన దాని కంటే.. అమెరికా సైన్యం చాలా బలహీనంగా ఉందన్నారు.
గత విచారణల సందర్భంగా మాజీ సీఎం కేసీఆర్‌కు పంపిన నోటీసులు ఆయనకు అందలేదని తేలడంపై న్యాయమూర్తి.. ఈసారి ఎలాంటి సాంకేతిక విఘాతాలు లేదా డెలివరీ సమస్యలు తలెత్తకుండా పక్కాగా నోటీసులు అందజేయాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు.
సాంకేతిక పరిజ్ఞానం, పాలనా సంస్కరణలు, మౌలిక వసతుల విస్తరణ వంటి కీలక రంగాల్లో చంద్రబాబు చూపుతున్న చొరవ, ఆయన దార్శనికత ఏపీని అభివృద్ధి పథం వైపు పరుగులు పెట్టిస్తోందన్నారు. 
ఒకవైపు పార్టీ మొత్తం అసెంబ్లీ సమావేశాలను బహిష్కరిస్తే.. మరొ వైపు అదే పార్టీకి చెందిన ఎమ్మెల్సీ అనంత బాబు మాత్రం ప్రజా సమస్యల సభలో గళమెత్తుతానంటూ బెయిల్ పిటిషన్ దాఖలు చేయడం నెట్టింట తెగ ట్రోల్ అవుతోంది.
13 మందిపై 20,000 పేజీల భారీ సీబీఐ ఛార్జ్‌షీట్..!
సిట్ కోర్టుకు సమర్పించిన వివరాల ప్రకారం, ఏపీపీఎస్సీ ప్రాథమిక నియమావళికి  విరుద్ధంగా ఒకే జవాబు పత్రాలను  మూడు విడతలుగా మూల్యాంకనం చేసినట్లు అధికారులు శాస్త్రీయంగా నిర్ధారించారు. డిజిటల్ విధానం, హైలాండ్ రిసార్ట్, అలాగే  విజయవాడ కేంద్రంగా మూడు వేర్వేరు దశల్లో ఈ మూల్యాంకన   సాగిందని నివేదిక పేర్కొంది.
ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ విధానంపై ప్రస్తుతం తీవ్రస్థాయిలో రాజకీయ చర్చ నడుస్తోంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సుదీర్ఘకాలం పాటు పదవుల కంటే పార్టీ సిద్ధాంతాలకు, ప్రజాసేవకే ప్రాధాన్యమిచ్చే నాయకులు అరుదుగా కనిపిస్తారు
రాజకీయ విభేదాల నేపథ్యంలో తనను కులం పేరుతో దూషించి, అవమానించారని ఆరోపిస్తూ ఓ రాజకీయ నాయకుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కాంగ్రెస్ నేత జక్కిడి ప్రభాకర్‌రెడ్డిపై ఎల్‌బీనగర్ పోలీసులు కేసు నమోదు
 భార్య బస్సు క్లీనర్‌తో వెళ్లిపోయిందని సీసీటీవీ ఫుటేజ్‌ను విడుదల చేశాడు ఇన్‌ఫ్లుయెన్సర్ అఖిల్ ..!
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.